2, అక్టోబర్ 2017, సోమవారం

యుద్ధం War

యుద్ధం కొత్త గవర్నర్ల ఎంపికలో గతంలో గవర్నర్లు అంటే రాజకీయ నిరుద్యోగులు,, రాష్ట్రాలను గుప్పిట్లో ఉంచుకునే వాచ్ డాగ్ లు,, ఇప్పుడు పద్థతి మారింది: నేడు గవర్నర్లుగా దేశానికి విశిష్ట సేవలు అందించిన సర్వీస్ ఛీఫ్ లు...
కొత్త గవర్నర్ల పేర్లను ఖరారు చేస్తూ రాష్ట్రపతి కోవింద్ సంతకాలు చేశాడు… అయితే #అండమాన్ కు ఎవరీ #దేవేంద్రకుమార్_జోషి….?? ఆయన పేరు పక్కన VSM, PVSM, AVSM, YSM, NM, ADC అని ఉంటాయి…. ఇవేవీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావు…. మరేమిటీ ఇవి..? కాస్త ఇంట్రస్టింగే…. ఎందుకంటే....?? హిందూ మహాసముద్రంలో చైనా నిర్వాకాలు మరీ అధికమవుతున్న నేపథ్యంలో… అత్యంత కీలకమైన అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ పదవికి ఈయన ఎంపిక కాస్త విశేషం, ఆలోచనాత్మకం, వ్యూహాత్మకం… ఈయన పేరు పక్కన PVSM, AVSM, YSM, NM, VSM, ADC …. అని ఉంటాయ్… అంటే ఏమిటవి..? ఓసారి చూద్దాం…. పీవీఎస్ఎం అంటే పరమ విశిష్ట సేవా మెడల్…. ఏవీఎస్ఎం అంటే అతి విశిష్ట సేవా మెడల్…. వైసీఎం అంటే యుద్ధసేవా మెడల్… ఎన్ఎం అంటే నవ్‌సేనా మెడల్…. వీఎస్ఎం అంటే విశిష్ట సేవా మెడల్…. ఇలాంటి మెడల్స్ మెడలో ఉన్న ప్రముఖుడు…. నేవీలో గానీ, ఆర్మీలో గానీ, ఎయిర్‌ఫోర్స్‌లో గానీ ఇలాంటి మెడల్స్ ఉన్నవారు అత్యున్నత స్థాయి వ్యక్తులు…. ఈయనకు ఇలాంటి మెడల్స్ చాలా ఉన్నాయ్…. వోకే, వోకే… కానీ చివరో ఆ ఏడీసీ ఏంటీ..? అదీ ఓసారి చూద్దాం… ఇది కూడా ఓ విశిష్ట హోదాయే… దీని ఫుల్ ఫారమ్…. aide-de-camp…. భారత రాష్ట్రపతి ఓవరాల్‌గా త్రివిధ దళాలకు చీఫ్ తెలుసు కదా… ఆయన దగ్గర ఓ టీమ్ ఉంటుంది… అందులో ఐదుగురు ఉంటారు… ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ నుంచి ఒకరు, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒకరు…. ఈ అయిదుగురు సభ్యుల బృందం సంప్రదాయిక విన్యాసాలు, ఉత్సవాలు, ప్రొటోకాల్‌లో పాల్గొంటారు… అయితే కేవలం ఇదేదో నామమాత్రపు, లాంఛనప్రాయపు టీం కాదు… సైన్యం, రక్షణ వంటి విషయాల్లో రాష్ట్రపతికి సహకరించే అల్టిమేట్ టీం… ఓ అత్యున్నత స్థాయి ఇది… అయితే ఎందుకు ఈయన్ని అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు..? గతంలో నేవీ చీఫ్‌గా, అనేకానేక కీలక స్థానాల్లో పనిచేసిన ఈయన ఎంపిక ఎందుకంటే…? దక్షిణ చైనా సముద్రంలో చైనా వర్సెస్ ఇతర దేశాల ఘర్షణలు పెరుగుతున్నాయి… భారత్‌ను చక్రబంధంలో ఇరికించేలా చైనా ముత్యాలసరం ప్రాజెక్టును మరింత అగ్రెసివ్‌గా అమలులోకి తెస్తున్నది… హిందూ మహాసముద్రంలో చైనా సబ్‌మెరయిన్లు తిరుగుతూ ఉన్నాయి… ప్రత్యేకించి అత్యంత కీలకమైన మలక్కా జలసంధి దగ్గర చైనా దూకుడు పెరుగుతున్నది… ఈ స్థితిలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ మంచి హ్యాండ్ అవసరం… ఇప్పటికే అక్కడ యూనిఫైడ్ కమాండ్ ఉంది… అంటే నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్త దళాలు… దానికో చీఫ్ ఉన్నాడు… ఇదే సమయంలో మరో మంచి సీనియర్ హ్యాండ్‌ను కీలకాధికార పోస్టులో ఉంచాలనేది మోడీ ప్లాన్… దీని వెనుక ఉన్నది #అజిత్_ధోవల్… సో, ఈయన్ని అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు… అదీ అసలు కథ… అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడు చైనా వర్సెస్ ఇండియా ఘర్షణల నేపథ్యంలో కీలకమైన ప్రాంతం… అందుకే అక్కడ ఒక మాజీ బ్రిగేడియర్‌ను గవర్నర్‌గా నియమించారు… ఆయనే బీడీ శర్మ… మిగతా గవర్నర్ల ఎంపికలో బీజేపీ సీనియర్లను అకామిడేట్ చేయడం లక్ష్యం కాగా…. అండమాన్, నికోబార్……….. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల ఎంపిక మాత్రం పూర్తిగా దేశ భద్రత, రక్షణ ప్రయోజనాల కోణంలో సాగింది… #ప్రభాకర్ గౌడ్_నోముల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...