25, అక్టోబర్ 2017, బుధవారం

Aadhar-bank account integration ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం

*ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం చేయకపోతే మూసేస్తారు***
బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం తప్పనిసరేనని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) శనివారం స్పష్టం చేసింది. శుక్రవారం ప్రచారమైన మీడియా కథనాలపై స్పందిస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఓ సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానమిచ్చిన ఆర్బీఐ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యల అనుసంధానం తప్పనిసరి అని పేర్కొనే ఆదేశాలను జారీ చేయలేదని తెలిపింది. ఈ విషయాన్ని మీడియా శుక్రవారం ప్రసారం చేసింది. దీంతో ఆర్బీఐ ఈ వివరణను జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక (రికార్డుల నిర్వహణ) రెండవ సవరణ నిబంధనలు, 2017 ప్రకారం బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని తెలిపింది. అయితే బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్య అనుసంధానం చేయడం తప్పనిసరి అని పేర్కొంటూ ఇప్పటి వరకు తాను ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదని వివరించింది. జూన్ 1 నుంచి మనీలాండరింగ్ నిరోధక (రికార్డుల నిర్వహణ) రెండవ సవరణ నిబంధనలు, 2017 అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ నిబంధనలు వర్తించే కేసుల్లో ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం తప్పనిసరి అని తెలిపింది. ఈ నిబంధనలు చట్టపరమైనవని, బ్యాంకులు వీటిని అమలు చేసేందుకు తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూడనక్కర్లేదని పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం డిసెంబరు 31లోగా ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. లేనిపక్షంలో బ్యాంకు ఖాతాలు లావాదేవీల నిర్వహణకు తగినవి కాదని ప్రకటిస్తారు.

1 కామెంట్‌:

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...