25, అక్టోబర్ 2017, బుధవారం

Europe యూరప్

Europe యూరప్
Nomula Prabhakar Goud యూరోపియన్ యూనియన్ జాతి రాజ్యాలపై ఆధారపడి ఉన్న కూటమి. జాతి రాజ్యాలపై ఆధారపడటమూ అంటే, విధానాల అమలు కోసం మాత్రమే కాదు. దీనివల్ల చట్టబద్ధత లభిస్తుంది. జాతి రాజ్యాల ప్రాతిపదిక మీదనే అందులోని సభ్య దేశాలు నడుస్తున్నాయి,యూరోపియన్ యూనియన్ కూడా నడుస్తున్నది. కానీ ఇటీవలి కాలంలో ఈ సభ్య దేశాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. ఈ సంక్షోభం ఒక్క స్పెయిన్‌కే పరిమితం కాలేదు. ఇతరదేశాలు కూడా అంతర్గత ఘర్షణల మూలంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. యూరప్ దేశాలలో ఈయూను వ్యతిరేకించే పార్టీలు అధికారం చేపట్టే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఈ రాజకీయ ధోరణులు ఈయూ భవితవ్యానికి మంచిది కాదు. యూరోపియన్ యూనియన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఈ దేశాలలో లేదు. కానీ యూరోపియన్ యూనియన్ పట్ల ఎటువంటి ఎవరికీ పట్టింపు లేదు. ప్రతి దేశంలో ఎవరికి వారు అంతర్గత సంక్షోభంలో మునిగి తేలుతున్నారు. ఈ గొడవలో ఈయూ మనుగడ అనేది వారికి పట్టకుండా పోయింది. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడం మినహా గత్యంతరం లేదనే వాదన ఆర్థిక సంక్షోభ కాలంలో వినబడింది. ఇంకా అదే వాదనతో నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. నాలుగు నెలల కిందట ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్‌కు మద్దతు దారైన ఇమాన్యూల్ మాక్రాన్ ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్ మూలంగా యూరోపియన్ యూనియన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మాక్రాన్ ఎన్నిక ఊరట కలిగించింది. ఇక యూరప్ యూనియన్ నిలబడాలని కోరుకునే వారు భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుందని భావించారు. కానీ అంతలోనే స్పెయిన్ నుంచి విడిపోవాలని క్యాటలోనియా ప్రజలు ఉద్యమం ప్రారంభించారు. క్యాటలోనియా రాజధాని బార్సెలోనాలో స్వాతంత్య్ర ప్రదర్శనలు యూరోపియన్ యూనియన్ సంక్షోభం నుంచి బయట పడలేదని హెచ్చరికలను పంపించాయి. క్యాటలోనియాలోని స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వం స్వాతంత్య్రంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని స్పెయిన్ ప్రభుత్వం నిరంకుశంగా అణచివేయ ప్రయత్నించింది. ఇం దుకు ప్రతిగా నిరసనలు భగ్గుమన్నాయి. క్యాటలోనియా ప్రజలు స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు. స్పెయిన్ ఆంతరంగిక సంక్షోభం పెచ్చరిల్లే కొద్దీ యూరప్ సంక్షోభం లో కూరుకుపోవడం అనివార్యం అనిపిస్తున్నది. స్పెయిన్‌లో క్షేత్రస్థాయి లో ఏమి జరుగుతున్నదనేది గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతున్నది. యూరప్ ఆర్థికంగా బలపడుతున్నది. అయితే ఈయూ సాఫల్యతకు కూడా పరిమితి ఉన్నది. క్యాటలోనియా సంక్షోభం తలెత్తినప్పటికీ, ఫైనాన్షియల్ మార్కెట్ పెద్దగా స్పందించలేదు. దీనిని బట్టి యూరోపియన్ యూనియన్ ఆర్థికంగా ఎంత మెరుగుపడ్డదో తెలుస్తున్నది. ఇటువంటి పరిస్థితే గనుక కొన్నేండ్ల కింద తలెత్తితే స్పెయిన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయేది. కానీ ఇప్పుడు మార్కెట్లు రాజకీయ అనిశ్చితిని అధిగమిస్తున్నాయి. మొత్తం యూరోజోన్ ఆర్థిక రంగం గౌరవప్రదమైన స్థాయి లో పెరుగుతున్నది. యూరోజోన్ సగటు కన్నా కూడా స్పెయిన్ ఆర్థిక రంగం పురోభివృద్ధిలో ఉన్నది. విదేశీ పద్దులలో మిగులు చూపించుకోగలుగుతున్నది. స్పెయిన్ ఆర్థిక వ్యవస్థ దేశీయ డిమాండ్ మీద కాకుం డా, ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నది. గతంలో ఆర్థిక సంక్షోభానికి ముందు భవన నిర్మాణ రంగంలో బూమ్ ఏర్పడినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. యూరోపియన్ యూనియన్ సభ్య రాజ్యాలు లేదా బ్యాంకులు తాత్కాలిక సంకటాన్ని ఎదుర్కొన్నట్టయితే ఆదుకోవడానికి యూరోజోన్ వ్యవస్థలు ఉండనే ఉన్నాయి. అందువల్లనే స్పెయన్ రాజకీయ సంక్షోభంలో పడిపోయినా ఫైనాన్షియల్ మార్కెట్‌లో కుదుపులు సంభవించలేదు. క్యాటలోనియా సంక్షోభం ప్రభావం ఈయూపై పడనప్పటికీ, ఒక వాస్తవాన్ని గుర్తించాలె. యూరోపియన్ యూనియన్ సమైక్యతా నమూనాలోనే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ యూనియన్ అంతిమంగా జాతి రాజ్యాల పునాదులపై ఏర్పడిందనేది గ్రహించాలె. ఇది అంతర్- ప్రభుత్వ నమూనా కాదు. పరోక్ష అమలు విధానం ప్రాతిపదికగా ఏర్పడ్డది. ఈయూ నిర్ణయాలు తీసుకుంటే వాటి అమలు బాధ్యత మాత్రం జాతీయ ప్రభుత్వాలది, అక్కడి పాలనా యంత్రాంగాలది. ద్రవ్య విధానంలో ఈ వైవిధ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు. ప్రభుత్వాలు చర్చించుకొని ఉమ్మడిగా ఈ నిర్ణయాలు తీసుకోవడం లేదు. యూరోపియన్ సెం ట్రల్ బ్యాంకు పాలక మండలి మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ అమలు అనేది పరోక్ష విధానంలో ఉంటుంది. ఈ సెం ట్రల్ బ్యాంకు నిర్ణయాలను జాతీయ సెంట్రల్ బ్యాంకులు అమలు చేయాలె. ఇక్కడే చిక్కులు తలెత్తుతున్నాయి. బాండ్ల కొనుగోలు కార్యకలాపాలను సాధారణంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చేపడుతుం ది. కానీ సొంత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసే జాతీయ సెంట్రల్ బ్యాంకులే ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తాయి. లగ్జెంబర్గ్‌లోని యూరోపియన్ న్యాయస్థానం ఎంతో ప్రాముఖ్యం గలది. ఈ వ్యవస్థ కూడా ప్రభుత్వాల మధ్య సమన్వయంతో నడిచేది కాదు. కేంద్రీకృతమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ దీనిలోని న్యాయమూర్తులను జాతీయ ప్రభుత్వా లు, జాతీయ న్యాయస్థానాలు నియమిస్తాయి. ఈ న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయవలసింది మాత్రం జాతీయ ప్రభుత్వాలు. అమెరికాలోని వ్యవస్థలతో పోల్చినప్పుడు, ఈయూలోని బలహీనత అర్థమవుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వుకు కూడా ప్రాంతీయ నిర్మాణ స్వరూపం ఉన్నది. కానీ డిస్ట్రిక్ట్ రిజర్వు బ్యాంకులు ఎన్నో రాష్ర్టాలకు విస్తరించి ఉంటాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వంతోనో, ఒక సంస్థతోనో అనుబంధమై ఉండవు. ఇదే విధంగా అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించవు. కేంద్రీయ వ్యవస్థ ద్వారానే నియామకాలు జరుగుతాయి. అధ్యక్షుడు నియమించిన వారిని సెనేట్ ఆమోదించవలసి ఉంటుంది. చరిత్రలో యూరోపియన్ రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగా యి. ఈ దేశాల మధ్య పరస్పర అపనమ్మకాలు, వైషమ్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వ్యవస్థలను సభ్య దేశాలు ఉమ్మడిగా నిర్మించినప్పుడే సమైక్యత బలపడుతుంది. నిర్ణయాల అమలు కోసం మాత్రమే కాదు, న్యాయబద్ధత కోసం సభ్య దేశాల మీద ఆధారపడక తప్పదు. దీనివల్ల జాతీయ ప్రభుత్వాల మాదిరిగా, కేంద్రీయ పాలన సజావుగా సాగుతుంది. అయితే దీనికి కూడా పరిమితులు ఉన్నాయనేదే గుర్తించవలసి ఉన్నది. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అ పరిమితులకు చేరుకున్నది. గ్రీస్‌లో పరిపాలనా, న్యాయ వ్యవస్థలు బలహీనంగా ఉం డటం వల్ల ఆర్థిక పునరుజ్జీవనం వీలు కాలేదు. పొలాండ్, హంగరీ దేశాలలో ఉదారవాద ప్రభుత్వాలు ఉండక పోవడం వల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటున్నది. స్పెయిన్‌లో రాజకీయ వ్యవస్థ స్వయం నిర్ణయాధికారం కోరుతున్న క్యాటలోనియా ప్రాంతీయ ప్రభుత్వానికి, స్వతంత్రం గురించి కనీసం చర్చ జరుపడమే రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మధ్య వైరుధ్యాన్ని పరిష్కరించలేకపోయింది. జర్మనీ కూడా అంతర్గత రాజకీయ సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ఇటీవలి ఎన్నికల్లో చాన్సలర్ ఏంజిలా మెర్కెల్ ఐదోవంతు ఓటర్లను కోల్పోయారు. ఎటూ పొసగని మూడు పార్టీల కూటమితో ఆమె నెట్టుకు రావలసి వస్తున్నది. మెర్కెల్ నాలుగవ సారి అధికారం చేపట్టగలిగారు. ఇదే ఆమె చివరి ఎన్నిక కావచ్చు. ఇటలీలో అభిప్రాయ సేకరణ ద్వారా వెల్లడైన ఫలితాలను గమనిస్తే- ఎక్కువ మందికి యూరోపియన్ పట్ల వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తున్నది. యూరప్ దేశాలలో ఈయూను వ్యతిరేకించే పార్టీలు అధికారం చేపట్టే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఈ రాజకీయ ధోరణులు ఈయూ భవితవ్యానికి మంచిది కాదు. యూరోపియన్ యూనియన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఈ దేశాలలో లేదు. కానీ యూరోపియన్ యూనియన్ పట్ల ఎటువంటి ఎవరికీ పట్టింపు లేదు. ప్రతి దేశంలో ఎవరికి వారు అంతర్గత సంక్షోభంలో మునిగి తేలుతున్నారు. ఈ గొడవలో ఈయూ మనుగడ అనేది వారికి పట్టకుండా పోయింది. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడం మినహా గత్యంతరం లేదనే వాదన ఆర్థిక సంక్షోభ కాలంలో వినబడింది. ఇంకా అదే వాదనతో నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. ఈయూకు మొదటి కొన్నేండ్ల పాటు కనిపించిన ఆమోదం ఇప్పుడు లేదు. ఈయూ బం ధాన్ని మరింత పటిష్ఠం చేయాలంటే, యూరప్ దేశాల నాయకులు పౌరుల ఆసక్తిని పెంచే కొత్త నమూనాను ఆవిష్కరించవలసి ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...