30, అక్టోబర్ 2017, సోమవారం

Fish చేపల చెరువు

రాజావారి చేపల చెరువు :P Only for academic discussion…
నేను అభివృద్ధికి, భారీ ప్రాజెక్టులకు గుడ్డి వ్యతిరేకిని కాదు. సామాజిక, పర్యావరణ పర్యవసానాలపై సరైన అధ్యయనం వుండాలని కోరుకునే వాడిని మాత్రమే. ఆయా పార్టీలకు, ఆయా ప్రభుత్వాలకు, ఆయా నాయకులకు దీనిని ముడిపెట్టి.. రాజకీయ పోస్టుగా మార్చకండి.... హైదరాబాద్ శివార్లలో నాకు బాగా నచ్చే చెరువుల్లో ఒకటి.. నాగార్జునసాగర్ రోడ్డులోని ఇబ్రహీంపట్నం చెరువు. సింగిల్ రోడ్డు వున్నప్పుడు, ఆ కట్టమీదుగా ప్రయాణం చేస్తుంటే భయపడేవాడిని. పొరపాటున అందులో పడిపోతే మన గతేంటని భయమేసేది. అంత పెద్ద చెరువు. అది ఎండిపోవడాన్ని ఏనాడూ చూడలేదు. కానీ.. 35సంవత్సరాల తర్వాత ఎండిపోయింది. ఎన్నో కరువులు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు వచ్చినా మూడున్నర దశాబ్దాల కాలంలో ఈ చెరువు ఎండలేదు. కానీ.. ఎండిపోయింది. గూగుల్ ఎర్త్ ద్వారా సంబంధిత ఫోటోల ద్వారా ఈ విషయాన్ని వివరించడానికి, నా సందేహాలు వెలిబుచ్చడానికి ప్రయత్నిస్తాను. 2003లో చెరువు ఫుల్లుగానే వుంది. 2004నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వానలు బ్రహ్మాండంగా కురిశాయి. కానీ.. తర్వాత కాలంలో చెరువు ఎండిపోవడం మొదలైంది. 2008నాటికి నీటిచుక్క లేకుండా పోయింది. హైదరాబాద్ లో అనేక ప్రాంతాలలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. నీటి పారుదల మార్గాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. అయినా ఆయా చెరువుల్లో అంతో ఇంతో నీళ్లు కనిపిస్తాయి. కానీ, ఇబ్రహీంపట్నం చెరువేవీ ఆక్రమణలకు గురవలేదు. హటాత్తుగా ఎండిపోయింది. 2014లో మాత్రమే.. కొద్దిపాటి నీళ్లు చేరాయి. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోవడాన్ని గమనించవచ్చు. ఒక్క ఇబ్రహీంపట్నం చెరువేకాదు, రావిర్యాల చెరువు, ఈ పరిసర ప్రాంతాల్లోని ఇంకా అనేక పెద్ద చెరువులు ఎండిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలోనే శంషాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు పొడవునా.. అన్ని ప్రాంతాల్లోనూ చెరువుల పరిస్థితి ఇలాగే అయిందా లేదా అనే విషయం నాకు తెలియదు. నేను గమనించిన విషయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను. ఏదో నేటి తరాల అవసరాన్ని, ఇప్పటి రద్దీని మాత్రమే దృష్టిలో వుంచుకోకుండా, భావితరాల అవసరాలను దృష్టిలో వుంచుకుని విశాలమైన రహదారులు, విమానాశ్రయాలు, ప్రయాణ సదుపాయాలు వుండడం చాలా అవసరం. నేను ఆ ప్రాజెక్టులను పూర్తిగా సమర్ధిస్తాను. నా పాయింటు ఏమిటంటే.. ఈ ప్రాజెక్టుల కారణంగా జలవనరులు అంతరించాయా లేదా అనేదానిపై శాస్త్రీయ అధ్యయనం సాగాలని. శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత, విమానం కనుచూపు మేరలో ఎగురుతుండగా చూడగలిగే ప్రాంతాలలో వానలు కురవడం కూడా తగ్గాయని చాలా మంది నాతో అన్నారు. ఉదాహరణకు షాద్ నగర్ ప్రాంతం. వారి అభిప్రాయంలో శాస్త్రీయత వుందని నేను అనుకోవడం లేదు. ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం తర్వాత సమీప ప్రాంతాల్లో వర్షపాతంలో వచ్చిన మార్పులతో బేరీజు వేసుకుంటే కానీ దీనిపై ఒక నిర్ణయానికి రాలేము. కానీ.. ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోవడానికి మాత్రం ప్రధాన కారణం ఔటర్ రింగ్ రోడ్డు అయివుంటుందని నా అనుమానం. ఈ చెరువుకి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోని ఔటర్ రింగ్ రోడ్డు బొంగుళూరు జంక్షన్ చిత్రాలను, అలాగే 2004నాటి శంషాబాద్ చిత్రాలను జతపరుస్తున్నాను. ప్రతి చిత్రానికి ఆయా సంవత్సరం వివరాలు కూడా జోడిస్తున్నాను. కేవలం అకడమిక్ డిస్కషన్ కోసం నా అనుమానాలనే కాదు.. అనేకమంది అనుమానాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఎవరినైనా ప్రోత్సహిస్తుందని ఈ పోస్టు.

28, అక్టోబర్ 2017, శనివారం

Land భూమి

భూమికి సంబంధించిన రికార్డుల్లో ని పదాల్లో కొన్ని మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉన్నవి కాగా... ఎక్కువ మాత్రం నైజాం కాలం నాటివి.
మన రాష్ట్రం లో భూ రికార్డుల ప్రక్షాళన నేటి నుండి ప్రారంభం అయిన నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల్లో ఉండే పదాలు వాటి అర్థాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రోజు మొదటిభాగం లో కొన్ని పదాలకు అర్థం తెలుసుకుందాం... 1.అడంగల్‌/పహాణీ.. గ్రామంలోసాగు భూమి వివరాలను నమోదు చేసే రిజిస్టర్‌. దీనిని ఆంధ్రా ప్రాంతంలో అడంగల్, తెలంగాణ ప్రాంతంలో పహాణీ అని పిలుస్తారు. ఈ రిజిస్టర్‌నే గ్రామ లెక్కల నంబర్‌–3 రిజిస్టర్‌ అని కూడా అంటారు. ఈ రిజిస్టర్‌లో గ్రామంలోని అన్ని భూముల వివరాలు ప్రతి సంవత్సరం నమోదుచేస్తారు. 2.పట్టాదారుపాసుపుస్తకాలు: భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు. గ్రామంలో ఎవరెవరికి ఎంతెంత భూమి ఉంది. ఏ సర్వే నంబర్‌లో ఉంది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనే వివరాలతో పట్టాదారుల ఫోటోలు అతికించి 1-బి రిజిస్టర్ను తయారు చేసి దానిని బట్టి తహసీల్దారు పట్టాదారు పాసు పుస్తకాలు జారీచేస్తారు. ఈ 1-బి రిజిస్టర్ ను పూర్వం 10 (1) ఖాతాల రిజిస్టర్ అనేవారు. 3.పంచరాయి.. గ్రామంలో పశువుల మేతకోసం కేటాయించబడిన ప్రబుత్వ భూమిని పంచరాయి అంటారు. గ్రామానికి దూరంగా అందరి పశువులకు మేతకోసం ఉపయోగించుకుంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి దీనిపై ఎవరికీ అధికారాలు ఉండవు. 4.బందోబస్తు.. : వ్యవసాయ భూముల సర్వే, వర్గీ కరణ. 4a)బంజరు భూమి : ఖాళీగా, వ్యర్థంగా ఉన్న ప్రభుత్వ భూమి. 4b)బీఘా.. : బీఘా అంటే 30గుంటల భూమి. 36.30 చదరపు గజాలతో సమానం.. 4c)బిల్‌ మక్తా.. : సాధారణ శిస్తుకంటే తక్కువ శిస్తు నిర్ణయించిన భూమి లేదా గ్రామాన్ని బిల్‌ మక్తా అంటారు. 5.చలానా.. ఇర్సాలు నామా అంటే గ్రామం లెక్క నంబర్‌–7. దీనినే చలానా అంటారు. దీనిద్వారా ప్రభుత్వానికి చెల్లించిన భూమి శిస్తు, వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. 6.ఎండార్స్‌మెంట్‌ : గ్రామంలో ప్రజలు....ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియ చేసేవిధానం. 7.ఇజారా : ప్రభుత్వానికి చెందిన భంజరు భూములను వ్యవసాయానికి కానీ, నివాసం ఉండటానికానీ కొంత నిర్థిష్టమైన పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకు ఇవ్వడాన్ని ‘ఇజారా’అంటారు. 8.ఫసలీ : ప్రతి సంవత్సరం జులై,1 తరువాత నుంచి తరవాత సంవత్సరం జూన్‌30 వరకు ఉన్న 12నెల్ల కాలాన్ని ‘ఫసలీ’ అంటారు. ఈ పదం మొఘల్ కాలం నుంచి వాడుకలో ఉంది. 9.ఎఫ్‌ఎంబీ టిప్పన్‌ : ఇది గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఒకటి. గ్రా మంలోని అన్ని సర్వే నెంబర్ల పటాలు ఇందులో ఉంటాయి. వాటి కొలతలు కూడా ఉంటాయి. 10.చల్కా.. మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్నది. సాధారణంగా ఈ భూముల్లో నీరు తక్కువగా అవసరం ఉండే పంటలు పండిస్తుంటారు. 10a).ఖుష్కి : వర్షాధారపు భూమిని ఖుష్కి అంటారు. దీనినే మెట్టభూమి అనికూడా అంటారు. 10b).తరి : నీటి సౌకర్యం గల భూమిని తరి అంటారు. దీనినే మాగాణి అంటారు.

25, అక్టోబర్ 2017, బుధవారం

Their history ఎరుకల వారి చరిత్ర

Their history ఎరుకల వారి చరిత్ర
ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు రాజుదే తొట్టతొలి తెలుగు (కలమళ్ళ) శాసనం. ఇది క్రీ.శ.575వ సంవత్సరం నాటిది. పూర్వ బ్రాహ్మీ లిపి (క్రీ.పూ.3వ శతాబ్దం కంటే ముందు) కాలం నుంచే తెలుగుదేశంలో కనిపిస్తున్న గుహచిత్రాల్లో (కేవ్ పెయింటింగ్స్‌లో) తెలుగు లిపి మూలాలున్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తే తెలుగు లిపి/ భాష మూలాలతో పాటు ఎరుకల లిపి/ భాష మూలాలు కూడా వెలికి వచ్చే అవకాశం మొండుగా ఉంది. ప్రాచీన సాహిత్యం, శాసనాలు సమకూర్చే సమాచారా న్ని ఎరుకల ప్రజలు పాటిస్తున్న ఆచార సంప్రదాయాల్లోని ప్రాచీనతతో పోల్చి సమన్వయం చూస్తే వీరిది భారతదేశంలో ఒక అనాది తెగ అని స్పష్టంగా అర్థమవుతుంది. మహా భారతం ఇతిహాసంలో కనిపించే ఏకలవ్యున్ని ఎరుకలు తమ కులాధిపతిగా చెప్పుకుంటున్నారు. కానీ హరివంశం పురా ణం (34, 93-99 అధ్యాయాలు) ప్రకారం ఏకలవ్యుడు గిరిజనుడు కాదు, క్షత్రియుడు. మధ్య భారతదేశంలోని కేకయ రాష్ర్టాన్ని పాలించే రాజుకు-అతని రెండవ భార్య శృతదేవకు పుట్టినవాడు. శృతదేవ శ్రీకృష్ణుడికి మేనత్త. కాబట్టి ఏకలవ్యుడు కృష్ణుడికి బావమరిది. కృష్ణుడి మేనమామ కంసుడి మామ జరాసంధునికి సర్వసైన్యాధిపతిగా ఏకలవ్యుడు పనిచేశాడు. కృష్ణుడు కంసున్ని చంపినందుకు ప్రతీకారంగా జరాసంధుడు కృష్ణ-బలరాములచే రక్షించబడి, మధురా పట్టణంపైన 18 సార్లు దాడి చేశాడు. ఆ దాడుల్లో భాగంగా ఏకలవ్యుడు బలరామునితో భీకరమైన ధనుర్యుద్ధాలు, గదాయుద్ధాలు చేశాడు. కానీ కృష్ణుడు చివరికి ఏకలవ్యున్ని చంపాడు. పై చరిత్రలో ఏకలవ్యుడు క్షత్రియుడు ఏకలవ్యున్ని (తమ గిరిజన) మూల పురుషునిగా ఎందుకు భావిస్తారు అనే ప్రశ్నకు రెండు సమాధానాలున్నాయి. ఒకటి, కేకయరాజు (ఏకలవ్యుడి తండ్రి) తాత బ్రహ్మణ స్త్రీని పెండ్లి చేసుకున్నందున క్షత్రియుల్లో తక్కువ జాతి అయిన సూత జాతికి (రథకారులు) చెందినవారుగా కేకయ వంశీయులు గుర్తించబడ్డా రు. రెండు, కేకయ రాజ్యంలో గిరిజనులే ఎక్కువమంది నివసించడం, అలాంటి గిరిజనులైన భిల్లులు, ఎరుకలు ఏకలవ్యున్ని తమ మూల పురుషుడిగా చెప్పుకోనారంభించారు. ఆయన జనరంజక పాలనకు గుర్తుగా ఇక ఇప్పటివరకు లభిస్తున్న ఆధారాలు ఏకలవ్యుడు భిల్లులకే ఎక్కువ దగ్గరివాడని సూచిస్తున్నాయి. అంటే బంగారు బాణం కలవాడు అని అర్థం. అతని పెద్ద కొడుకు పేరు బాణుడు. కీచకుడు అనే మరో పేరు గల ఇతడు ఏకలవ్యుని అన్న. భిల్లులు అనే పదం విల్లులు అనే పద భవం. అంటే బాణాలు ధరించేవారనేగా! కాబట్టి ఏకలవ్యుని తండ్రి, అన్నల వారసులుగా ధనుర్విద్యా విశారధుడైన ఏకలవ్యుని వారసులుగా కూడా చెప్పవ చ్చు. రెండవ కారణమమేమంటే, భిల్లులు ఇప్పటికే ఏకలవ్యుని దేశమైన కేకయ ప్రాంతం (మధ్యప్రదేశ్)లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. ఆ కాలం లో ఎరుకలు కూడా ఆ ప్రాంతంలో నివసించేవారేమో! అందుకే ఏకలవ్యున్ని తమ మూల పురుషునిగా చెప్పుకుంటున్నారేమో! ఇంకా ఆధారా లు వెతుకాలి. ఎరుకల స్త్రీలు తాము చెప్పే సోదే (భవిష్యత్ దర్శనం)కు శక్తినిచ్చేది గా రేణుకా ఎల్లమ్మను ప్రధానంగా తలుస్తారు. రేణుకా ఎల్లమ్మ కొడుకు పరశురాముడు పడమటి సముద్రాన్నుంచి భూమిని, రాజ్యాన్ని ఏర్పరిచి సుసంపన్నం చేశాడని ప్రాచీన భారత సాహిత్యం విశదం చేస్తుంది. అతని వారసులైన భృగువులు విజ్ఞానాన్ని.. ప్రత్యేకించి అధర్వణ వేదాన్ని సంకలనం చేశారని అల్లాడి పద్మనాభయ్య రాశారు. (ఏన్సియెంట్ భృగుస్ అనే గ్రంథంలో) అధర్వణ వేదంలో కనిపించే మూలికా వైద్య విధానాలు ఎరుకలలో కన్పిస్తాయి. కాబట్టి ఎరుకల వారిని ఎల్లమ్మ-పరశురాముల వారసులా అనే విషయాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. ఎరుకలవారు ఎక్కువగా కృష్ణానదీ తీర ప్రాంతాల్లో కనిపిస్తారు. కృష్ణానదిని వీరు ఏరు అంటారు. ప్రాచీనకాలంలో ఏరువనాడు అనే ఒక ప్రాంతం ఉండేది. దాని పరిపాలనా కేంద్రం ఏలేశ్వరం నల్గొండ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఏటి ఒడ్డున ఆ పట్టణం ఉంది కాబట్టి దాని మొదటిపేరు ఏఱేశ్వరం అయి ఉంటుంది, క్రమంగా ఏలేశ్వరం అయి ఉంటుందని పలువురు స్థానిక సాహిత్య-చరిత్రకారులు భావించారు. కృష్ణా నది తీరప్రాంతంలోనే నల్లమల అడవుల్లో ఉన్న సరేశ్వరం శాసనాలు, సాహి త్య గ్రంథాల ప్రస్తావనలకు భిన్నంగా జన నానుడిలో సలేశ్వరంకావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపవచ్చు. క్రీ.శ.5వ శతాబ్దం ప్రాంతంలో ఏరువనాడులో కొంత అధికారం నెరపినవారు కనీసం మూడు దిక్కులకు వలసలు పోయి రాజ్యాలు స్థాపించినట్లు శాసనాలు, స్థల చరిత్రలు సూచిస్తున్నాయి. అలాంటివారిలో మొదటిశాఖ కర్ణాటకలోని బాదామి కేంద్రంగా క్రీ.శ. 540-750 మధ్య దక్కను రాష్ర్టాలను పాలించారు. రెండవ శాఖ కర్నూలు-కడప మండలం లో క్రీ.శ.6వ శతాబ్దంలో రేనాటి చోళులుగా స్థిరపడ్డారు. మూడవ శాఖకు చెందిన అనుమడు, కొండడు రాజ్యాన్ని స్థాపించారని తెలుస్తుంది. అలంపూరు-సంగమేశ్వరం దగ్గరి తుంబెయనూరులో లభించిన 1400ల ఏండ్ల కిందటి రెండో పులకేశి (చాళుక్య రాజు) రాగి శాసనం చాళుక్యుల జన్మస్థానం (విషయం) ఇదేనని సూచిస్తున్నది. ఈ రాజుల అధికార చిహ్నం వరాహం (పంది) అది వారి శిల్పాలు, నాణేలపై కనిపిస్తుంది. పైసలను కూడా వరహం అనేవారు. వరాహ విషయం కూడా తెలుగు దేశంలోనే ఉండేది.వరాహాలను (పందులను) పెంచడం ఎరుకల ముఖ్య వృత్తి. తొలుత చాళుక్యుల సామంతులై తదనంతరం స్వతంత్రులైన కాకతీయులు కూడా వరాహ లాంఛనులే. ఎరుకల నాంచారి గుళ్లు వారి కాలంలో పేరొందా యి. ఈ చారిత్రక విషయాలను నిగ్గుతేలిస్తే ఎరుకల పూర్వ చరిత్ర విశదమవుతుంది. ఇప్పటివరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు రాజుదే తొట్టతొలి తెలుగు (కలమళ్ళ) శాసనం. ఇది క్రీ.శ.575వ సంవత్సరం నాటిది. పూర్వ బ్రాహ్మీ లిపి (క్రీ.పూ.3వ శతాబ్దం కంటే ముందు) కాలం నుంచే తెలుగుదేశంలో కనిపిస్తున్న గుహచిత్రాల్లో (కేవ్ పెయింటింగ్స్‌లో) తెలుగు లిపి మూలాలున్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తే తెలుగు లిపి/ భాష మూలాలతో పాటు ఎరుకల లిపి/ భాష మూలాలు కూడా వెలికి వచ్చే అవకాశం మొండుగా ఉంది.తెలుగు అంటే తెలియు అనే అర్థం కూడా మూల ద్రావిడ భాషా పదా ల్లో కనిపిస్తుంది. కాబట్టి తెలిపేవారు అనే అర్థం కలిగిన ఎరుకలవారి భాషలో కచ్చితంగా తెలుగు భాషా మూలాలు ఉంటాయి. నిజ నిర్ధారణ కోసం చేయవలసింది అధ్యయనం.

Godavari గోదావరి

Godavari గోదావరి
గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నీటి విడుదలపై స్పష్టత యాసంగికి సాగునీరివ్వాలని సీఎం నిర్ణయం నీటిని పొదుపుగా వాడుకోవాలి.. వచ్చే ఏడాదికి కాళేశ్వరం నీళ్లు సిద్ధం ఆలోగా కాల్వల నిర్మాణం పూర్తికావాలి.. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి వివాదాలకు తావు ఇవ్వొద్దు.. ఎల్లంపల్లి నుంచి మరో ఎత్తిపోతల.. రామగుండంలో 20వేల ఎకరాలకు నీళ్లు ఎస్సారెస్పీ నీటి విడుదల భేటీలో అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి ఆయకట్టులో రెండోపంటకు నీళ్లివ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరుడ్యాం, సింగూరు, ఘనపూర్ ఆనికట్, గుత్ప, అలీసాగర్, లక్ష్మీ కాల్వల ద్వారా రెండోపంటకు సాగునీరు అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ ద్వారా నీటి విడుదల, వినియోగానికి సంబంధించి పాత కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథకు కావాల్సిన నీటి అవసరాలుపోను మిగిలిన నీటిని పంటపొలాలకు మళ్లించాలని సీఎం సూచించారు. ఈ నీటితో రెండోపంట పండించుకోవాలని, ఎక్కడా వివాదాలకు తావులేకుండా ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొలాలకు తరలించుకోవాలన్నారు. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సీఎం సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నిరకాల చెరువులను గోదావరి నీటితో నింపుకొనే విధంగా కాల్వలు సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి వస్తున్నందున ఈలోపుగానే కాల్వల పనులు పూర్తికావాలని, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నీటిపారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతోపాటు తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకొనేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున.. ఎంత వీలైతే అంతవరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని పొలాలదాకా నీరు పారించి, పంటలు పండించడంపై శ్రద్ధ చూపించాలని చెప్పారు. ఇందుకోసం అధికారుల వెంటపడి అవసరమైన పనులు చేయించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న పాత కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందే విధంగా ఏర్పాటు జరుగాలని సీఎం స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల.. రామగుండం ప్రాంతంలో 20వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్ నిర్మించి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలన్నారు. ఈ రెండింటికి అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్సారెస్పీ సామర్థ్యం పెంచాలని, అన్నిరకాల కాల్వల మరమ్మతులు చేయాలని చెప్పారు. ఎస్సారెస్పీలో తొలి, చివరి ఆయకట్టు అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేలా ప్రణాళికను అమలుచేయాలని సూచించారు. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బరాజ్ నిర్మిస్తున్నం. అక్కడ సగటున 1700టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని సీఎం అన్నారు. ఈ నీటిని వాడుకోవడానికి అవసరమైన బరాజ్‌లు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. గోదావరి, కృష్ణా నదీబేసిన్లలో చెరువుల ద్వారా 265 టీఎంసీల నీటి వాటా ఉన్నదని 1974లో బచావత్ ట్రిబ్యునల్ తేల్చిందని, కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు ధ్వంసం కావడం వల్ల అంత మొత్తంలో నీటిని వాడుకోలేకపోయామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల చెరువుల్లో నీటి లభ్యత ఉంటుందని, ఇందుకుగాను అన్ని చెరువులు నింపుకొనేలా కార్యాచరణ అమలుపరుచాలని సీఎం సూచించారు.

Aadhar-bank account integration ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం

*ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం చేయకపోతే మూసేస్తారు***
బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం తప్పనిసరేనని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) శనివారం స్పష్టం చేసింది. శుక్రవారం ప్రచారమైన మీడియా కథనాలపై స్పందిస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఓ సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానమిచ్చిన ఆర్బీఐ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యల అనుసంధానం తప్పనిసరి అని పేర్కొనే ఆదేశాలను జారీ చేయలేదని తెలిపింది. ఈ విషయాన్ని మీడియా శుక్రవారం ప్రసారం చేసింది. దీంతో ఆర్బీఐ ఈ వివరణను జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక (రికార్డుల నిర్వహణ) రెండవ సవరణ నిబంధనలు, 2017 ప్రకారం బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని తెలిపింది. అయితే బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్య అనుసంధానం చేయడం తప్పనిసరి అని పేర్కొంటూ ఇప్పటి వరకు తాను ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదని వివరించింది. జూన్ 1 నుంచి మనీలాండరింగ్ నిరోధక (రికార్డుల నిర్వహణ) రెండవ సవరణ నిబంధనలు, 2017 అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ నిబంధనలు వర్తించే కేసుల్లో ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం తప్పనిసరి అని తెలిపింది. ఈ నిబంధనలు చట్టపరమైనవని, బ్యాంకులు వీటిని అమలు చేసేందుకు తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూడనక్కర్లేదని పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం డిసెంబరు 31లోగా ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. లేనిపక్షంలో బ్యాంకు ఖాతాలు లావాదేవీల నిర్వహణకు తగినవి కాదని ప్రకటిస్తారు.

Metro మెట్రోరైలు

Metro మెట్రోరైలు మెట్రోరైలు మొదటిదశ ప్రారంభంతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
మెట్రోరైలు ప్రారంభంతో నగర ప్రయాణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. మొదటి దశ ప్రారంభం కానున్న నాగోల్ నుంచి మియాపూర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ప్రస్తుతం రెండు నుంచి రెండున్నర గంటలు పడుతున్నది. వర్షం పడితే ట్రాఫిక్ జామ్ సమయం అదనం. అదే మెట్రోరైలులో ఈ 30 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. నవంబర్ నెలాఖరున ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రాజెక్టు మొదటిదశ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రోరైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు ప్రయాణపు అంచనాలు తయారుచేశారు. ఐదు నిమిషాలకో రైలు మెట్రో ఆపరేషన్స్‌లో ఒక్కో రైలు మధ్య వ్యవధి 3-5 నిమిషాలు ఉండనున్నది. ప్రారంభంలో మియాపూర్- అమీర్‌పేట మధ్య 7 నిమిషాలకు ఒక్కటి చొప్పున ప్రతిరోజు 8 రైళ్లు నడుస్తాయి. అమీర్‌పేట-నాగోల్ మధ్య 10 నుంచి 12 నిమిషాలకు ఒకరైలు చొప్పున 10 రైళ్లను నడిపిస్తారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా వీటిని పెంచుతారు. 30 కిలోమీటర్ల మెట్రో మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉన్నాయి. రైలు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు చేరడానికి ఒకటిన్నర నుంచి రెండు నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నది. మొదట్లో ప్రయాణ సమయం గంట వరకు ఉంటుందని, కొన్నాళ్ల తర్వాత 45 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రతిరోజు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉన్నదన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు అనుసంధానంగా.. నాగోల్-మియాపూర్ మార్గంలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేస్తూ మెట్రో ఆపరేషన్స్ చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను నగరంలోని గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు, నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు అనుసంధానంగా ఉన్న జేబీఎస్, రైల్వే ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అనుసంధానిస్తూ సమీప మెట్రో స్టేషన్ల నుంచి బస్సులు నడుపనున్నారు. నాగోల్ - మియాపూర్ దూరం: 30 కిలోమీటర్లు స్టేషన్లు: 24 ప్రయాణ సమయం: 45-60 నిమిషాలు సామర్థ్యం: 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ప్రస్తుతం రైళ్ల ఫ్రీక్వెన్సీ: మియాపూర్- అమీర్‌పేట: 7 నిమిషాలు, అమీర్‌పేట- నాగోల్: 10- 12 నిమిషాలు నడిపే రైళ్లు: మియాపూర్-అమీర్‌పేట మార్గంలో 8, అమీర్‌పేట- నాగోల్ మార్గంలో 10 ప్రతిరోజు ... మరే మెట్రో సాటిరాదు.. దేశంలోని మరే మెట్రోరైలు హైదరాబాద్‌కు సాటిరాదని కేటీఆర్ చెప్పారు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో పీపీపీలో ఇంత పెద్ద ప్రాజెక్టును ప్రపంచంలోని ఏ దేశంలో నిర్మించలేదని అన్నారు. విదేశీ నిర్మాణ సంస్థలు కాకుండా స్వదేశీ కంపెనీ ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఒలిఫెంటా వంతెన నిర్మాణం సంక్లిష్టమైనదని, ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ నియంత్రించినా రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడకుండా వంతెనను బిగించిన ఎల్‌అండ్‌టీకి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ స్టీలు బ్రిడ్జి వెరీవెరీ యునిక్ అని అభివర్ణించారు. రోడ్డు మధ్యలో హైట్ చేస్తున్నా ఇబ్బందేమీ ఉండదని, పబ్లిక్ ఫ్రీ మూమెంట్ ఉండేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రతి స్టేషన్‌లో స్టెయిర్‌కేస్‌లు, ఎస్కలేటర్లు ఉన్నాయని, స్టేషన్‌కు ఆనుకుని ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు కూడా నిర్మిస్తామని తెలిపారు. ప్రయాణికులు మెట్రోకారిడార్లకు అనుసంధానంగా ఏర్పాటు చేసే స్కైవాక్‌ల ద్వారా తమకు అవసరమైన చోటులో దిగి పోయే విధంగా ఏర్పాట్లు ఉంటాయని అన్నారు. నాగోల్-మియాపూర్ ప్రారంభమైతే 72 కిలో మీటర్ల ఈ ప్రాజెక్టులో 40 నుంచి 42 శాతం అందుబాటులోకి వచ్చినట్లేనని తెలిపారు. ప్రస్తుతం 34 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించామని, జీహెచ్‌ఎంసీ తోపాటు ప్రైవేటు పార్కింగ్‌ను కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు స్కైవేలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌నుంచి ప్రయాణికులు స్కైవేల ద్వారా నేరుగా మెట్రోరైలు స్టేషన్‌కు చేరుకోవచ్చని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ స్టేషన్లతో స్కైవేలను అనుసంధానం చేస్తున్నామన్నారు. మెట్రోరైలు నిర్మాణం, ఆపరేషన్‌లో స్మార్ట్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. స్టేషన్ల నుంచి కాలనీలకు చేర్చేందుకు ఎలక్ట్రికల్ వాహనాలు,15 నుంచి 20 సీట్ల సామర్ధ్యం గల మినీ వ్యాన్లను ఉపయోగిస్తామని చెప్పారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని 3,4 కిలోమీటర్లలోపు ప్రయాణికుల రాకపోకలకు వీటిని ఉపయోగిస్తామన్నారు. ఎంఎంటీఎస్, ఆర్టీసీ, మెట్రోరైలు టికెట్ల కోసం కామన్ కార్డు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఓలా, ఉబెర్ సంస్థలను కూడా దీనికిందకే తెచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎల్ అండ్‌టీ స్మార్ట్‌యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రెండోదశపై అధ్యయనం పూర్తి ఓల్డ్ సిటీ ప్రాజెక్టు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించి స్పష్టమైన ప్రణాళికతో దాన్ని చేపడుతామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఎంపీ దీనికి సానుకూలంగా ఉన్నారన్నారు. రెండవదశ మెట్రోరైలు నిర్మాణం కోసం టోక్యో వెళ్లివచ్చామని, వివిధ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఆర్థిక పరమైన అంశాలు, అంచనా వ్యయం, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టతకు వచ్చామని, దీనిపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దశలవారీగా ప్రారంభిస్తూ వచ్చే సంవత్సరం నవంబర్ 2018 నాటికి పూర్తి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామన్నారు.

Europe యూరప్

Europe యూరప్
Nomula Prabhakar Goud యూరోపియన్ యూనియన్ జాతి రాజ్యాలపై ఆధారపడి ఉన్న కూటమి. జాతి రాజ్యాలపై ఆధారపడటమూ అంటే, విధానాల అమలు కోసం మాత్రమే కాదు. దీనివల్ల చట్టబద్ధత లభిస్తుంది. జాతి రాజ్యాల ప్రాతిపదిక మీదనే అందులోని సభ్య దేశాలు నడుస్తున్నాయి,యూరోపియన్ యూనియన్ కూడా నడుస్తున్నది. కానీ ఇటీవలి కాలంలో ఈ సభ్య దేశాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. ఈ సంక్షోభం ఒక్క స్పెయిన్‌కే పరిమితం కాలేదు. ఇతరదేశాలు కూడా అంతర్గత ఘర్షణల మూలంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. యూరప్ దేశాలలో ఈయూను వ్యతిరేకించే పార్టీలు అధికారం చేపట్టే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఈ రాజకీయ ధోరణులు ఈయూ భవితవ్యానికి మంచిది కాదు. యూరోపియన్ యూనియన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఈ దేశాలలో లేదు. కానీ యూరోపియన్ యూనియన్ పట్ల ఎటువంటి ఎవరికీ పట్టింపు లేదు. ప్రతి దేశంలో ఎవరికి వారు అంతర్గత సంక్షోభంలో మునిగి తేలుతున్నారు. ఈ గొడవలో ఈయూ మనుగడ అనేది వారికి పట్టకుండా పోయింది. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడం మినహా గత్యంతరం లేదనే వాదన ఆర్థిక సంక్షోభ కాలంలో వినబడింది. ఇంకా అదే వాదనతో నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. నాలుగు నెలల కిందట ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్‌కు మద్దతు దారైన ఇమాన్యూల్ మాక్రాన్ ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్ మూలంగా యూరోపియన్ యూనియన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మాక్రాన్ ఎన్నిక ఊరట కలిగించింది. ఇక యూరప్ యూనియన్ నిలబడాలని కోరుకునే వారు భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుందని భావించారు. కానీ అంతలోనే స్పెయిన్ నుంచి విడిపోవాలని క్యాటలోనియా ప్రజలు ఉద్యమం ప్రారంభించారు. క్యాటలోనియా రాజధాని బార్సెలోనాలో స్వాతంత్య్ర ప్రదర్శనలు యూరోపియన్ యూనియన్ సంక్షోభం నుంచి బయట పడలేదని హెచ్చరికలను పంపించాయి. క్యాటలోనియాలోని స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వం స్వాతంత్య్రంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని స్పెయిన్ ప్రభుత్వం నిరంకుశంగా అణచివేయ ప్రయత్నించింది. ఇం దుకు ప్రతిగా నిరసనలు భగ్గుమన్నాయి. క్యాటలోనియా ప్రజలు స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు. స్పెయిన్ ఆంతరంగిక సంక్షోభం పెచ్చరిల్లే కొద్దీ యూరప్ సంక్షోభం లో కూరుకుపోవడం అనివార్యం అనిపిస్తున్నది. స్పెయిన్‌లో క్షేత్రస్థాయి లో ఏమి జరుగుతున్నదనేది గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతున్నది. యూరప్ ఆర్థికంగా బలపడుతున్నది. అయితే ఈయూ సాఫల్యతకు కూడా పరిమితి ఉన్నది. క్యాటలోనియా సంక్షోభం తలెత్తినప్పటికీ, ఫైనాన్షియల్ మార్కెట్ పెద్దగా స్పందించలేదు. దీనిని బట్టి యూరోపియన్ యూనియన్ ఆర్థికంగా ఎంత మెరుగుపడ్డదో తెలుస్తున్నది. ఇటువంటి పరిస్థితే గనుక కొన్నేండ్ల కింద తలెత్తితే స్పెయిన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయేది. కానీ ఇప్పుడు మార్కెట్లు రాజకీయ అనిశ్చితిని అధిగమిస్తున్నాయి. మొత్తం యూరోజోన్ ఆర్థిక రంగం గౌరవప్రదమైన స్థాయి లో పెరుగుతున్నది. యూరోజోన్ సగటు కన్నా కూడా స్పెయిన్ ఆర్థిక రంగం పురోభివృద్ధిలో ఉన్నది. విదేశీ పద్దులలో మిగులు చూపించుకోగలుగుతున్నది. స్పెయిన్ ఆర్థిక వ్యవస్థ దేశీయ డిమాండ్ మీద కాకుం డా, ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నది. గతంలో ఆర్థిక సంక్షోభానికి ముందు భవన నిర్మాణ రంగంలో బూమ్ ఏర్పడినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. యూరోపియన్ యూనియన్ సభ్య రాజ్యాలు లేదా బ్యాంకులు తాత్కాలిక సంకటాన్ని ఎదుర్కొన్నట్టయితే ఆదుకోవడానికి యూరోజోన్ వ్యవస్థలు ఉండనే ఉన్నాయి. అందువల్లనే స్పెయన్ రాజకీయ సంక్షోభంలో పడిపోయినా ఫైనాన్షియల్ మార్కెట్‌లో కుదుపులు సంభవించలేదు. క్యాటలోనియా సంక్షోభం ప్రభావం ఈయూపై పడనప్పటికీ, ఒక వాస్తవాన్ని గుర్తించాలె. యూరోపియన్ యూనియన్ సమైక్యతా నమూనాలోనే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ యూనియన్ అంతిమంగా జాతి రాజ్యాల పునాదులపై ఏర్పడిందనేది గ్రహించాలె. ఇది అంతర్- ప్రభుత్వ నమూనా కాదు. పరోక్ష అమలు విధానం ప్రాతిపదికగా ఏర్పడ్డది. ఈయూ నిర్ణయాలు తీసుకుంటే వాటి అమలు బాధ్యత మాత్రం జాతీయ ప్రభుత్వాలది, అక్కడి పాలనా యంత్రాంగాలది. ద్రవ్య విధానంలో ఈ వైవిధ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు. ప్రభుత్వాలు చర్చించుకొని ఉమ్మడిగా ఈ నిర్ణయాలు తీసుకోవడం లేదు. యూరోపియన్ సెం ట్రల్ బ్యాంకు పాలక మండలి మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ అమలు అనేది పరోక్ష విధానంలో ఉంటుంది. ఈ సెం ట్రల్ బ్యాంకు నిర్ణయాలను జాతీయ సెంట్రల్ బ్యాంకులు అమలు చేయాలె. ఇక్కడే చిక్కులు తలెత్తుతున్నాయి. బాండ్ల కొనుగోలు కార్యకలాపాలను సాధారణంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చేపడుతుం ది. కానీ సొంత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసే జాతీయ సెంట్రల్ బ్యాంకులే ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తాయి. లగ్జెంబర్గ్‌లోని యూరోపియన్ న్యాయస్థానం ఎంతో ప్రాముఖ్యం గలది. ఈ వ్యవస్థ కూడా ప్రభుత్వాల మధ్య సమన్వయంతో నడిచేది కాదు. కేంద్రీకృతమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ దీనిలోని న్యాయమూర్తులను జాతీయ ప్రభుత్వా లు, జాతీయ న్యాయస్థానాలు నియమిస్తాయి. ఈ న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయవలసింది మాత్రం జాతీయ ప్రభుత్వాలు. అమెరికాలోని వ్యవస్థలతో పోల్చినప్పుడు, ఈయూలోని బలహీనత అర్థమవుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వుకు కూడా ప్రాంతీయ నిర్మాణ స్వరూపం ఉన్నది. కానీ డిస్ట్రిక్ట్ రిజర్వు బ్యాంకులు ఎన్నో రాష్ర్టాలకు విస్తరించి ఉంటాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వంతోనో, ఒక సంస్థతోనో అనుబంధమై ఉండవు. ఇదే విధంగా అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించవు. కేంద్రీయ వ్యవస్థ ద్వారానే నియామకాలు జరుగుతాయి. అధ్యక్షుడు నియమించిన వారిని సెనేట్ ఆమోదించవలసి ఉంటుంది. చరిత్రలో యూరోపియన్ రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగా యి. ఈ దేశాల మధ్య పరస్పర అపనమ్మకాలు, వైషమ్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వ్యవస్థలను సభ్య దేశాలు ఉమ్మడిగా నిర్మించినప్పుడే సమైక్యత బలపడుతుంది. నిర్ణయాల అమలు కోసం మాత్రమే కాదు, న్యాయబద్ధత కోసం సభ్య దేశాల మీద ఆధారపడక తప్పదు. దీనివల్ల జాతీయ ప్రభుత్వాల మాదిరిగా, కేంద్రీయ పాలన సజావుగా సాగుతుంది. అయితే దీనికి కూడా పరిమితులు ఉన్నాయనేదే గుర్తించవలసి ఉన్నది. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అ పరిమితులకు చేరుకున్నది. గ్రీస్‌లో పరిపాలనా, న్యాయ వ్యవస్థలు బలహీనంగా ఉం డటం వల్ల ఆర్థిక పునరుజ్జీవనం వీలు కాలేదు. పొలాండ్, హంగరీ దేశాలలో ఉదారవాద ప్రభుత్వాలు ఉండక పోవడం వల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటున్నది. స్పెయిన్‌లో రాజకీయ వ్యవస్థ స్వయం నిర్ణయాధికారం కోరుతున్న క్యాటలోనియా ప్రాంతీయ ప్రభుత్వానికి, స్వతంత్రం గురించి కనీసం చర్చ జరుపడమే రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మధ్య వైరుధ్యాన్ని పరిష్కరించలేకపోయింది. జర్మనీ కూడా అంతర్గత రాజకీయ సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ఇటీవలి ఎన్నికల్లో చాన్సలర్ ఏంజిలా మెర్కెల్ ఐదోవంతు ఓటర్లను కోల్పోయారు. ఎటూ పొసగని మూడు పార్టీల కూటమితో ఆమె నెట్టుకు రావలసి వస్తున్నది. మెర్కెల్ నాలుగవ సారి అధికారం చేపట్టగలిగారు. ఇదే ఆమె చివరి ఎన్నిక కావచ్చు. ఇటలీలో అభిప్రాయ సేకరణ ద్వారా వెల్లడైన ఫలితాలను గమనిస్తే- ఎక్కువ మందికి యూరోపియన్ పట్ల వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తున్నది. యూరప్ దేశాలలో ఈయూను వ్యతిరేకించే పార్టీలు అధికారం చేపట్టే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఈ రాజకీయ ధోరణులు ఈయూ భవితవ్యానికి మంచిది కాదు. యూరోపియన్ యూనియన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఈ దేశాలలో లేదు. కానీ యూరోపియన్ యూనియన్ పట్ల ఎటువంటి ఎవరికీ పట్టింపు లేదు. ప్రతి దేశంలో ఎవరికి వారు అంతర్గత సంక్షోభంలో మునిగి తేలుతున్నారు. ఈ గొడవలో ఈయూ మనుగడ అనేది వారికి పట్టకుండా పోయింది. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడం మినహా గత్యంతరం లేదనే వాదన ఆర్థిక సంక్షోభ కాలంలో వినబడింది. ఇంకా అదే వాదనతో నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. ఈయూకు మొదటి కొన్నేండ్ల పాటు కనిపించిన ఆమోదం ఇప్పుడు లేదు. ఈయూ బం ధాన్ని మరింత పటిష్ఠం చేయాలంటే, యూరప్ దేశాల నాయకులు పౌరుల ఆసక్తిని పెంచే కొత్త నమూనాను ఆవిష్కరించవలసి ఉంటుంది.

24, అక్టోబర్ 2017, మంగళవారం

Vishwakarma విశ్వకర్మ

విశ్వకర్మ భగవానుడు మనిషి పుట్టకనుంచి కాటికి చేరేదాక విశ్వకర్మ నే అన్ని కర్మలకు బాధ్యుడు...... మనిషి పుట్టినప్పుడు బోడ్డును కత్తిరించడానికి కత్తి చేసిన వాడు.అతని జీవకర్మలకు పలుగు,పార,ఇంకా సమాజంలో అన్ని వృత్తులకు సంబంధించిన ఎన్నో పనిముట్లను చేసినవాడు కమ్మరి విశ్వకర్మ...... ఆ మనిషికి జీవనాధారమైన ఆహారాన్ని వండుకోవడానికి వంట పాత్రలు ఇంకా ఎన్నో అవసరాలకు సంబంధించిన పాత్రలు తయారు చేసినవాడు కంచరి విశ్వకర్మ........ మనిషి పుట్టిన తర్వాత నడవడానికి చిన్న బండినుంచి వుండడానికి ఇల్లు వ్యవసాయం చేయడానికి నాగలి గుంటుక ఇంకా ఎన్నో కర్ర వస్తువులను తయారుచేసినవాడు వడ్రంగి విశ్వకర్మ... మనిషికి ఒక దైవం అంటే ఇ రూపాలలో వుంటారు అని కృష్ణుడు రాముడు ఇంకా అనేక దైవాల రూపాలను చెక్కినవాడు శిల్పి విశ్వకర్మ........ దేవుడు సృష్టించిన మనిషిని అందంగా కన్పించేటట్టు ఆభరణాలను తయారు చేసి అందమంటే ఇలా ఉంటది అని చూయించినవాడు కంసాలి విశ్వకర్మ.. విశ్వకర్మ లేనిదే విశ్వంబు లేదు అని అనాటి చరిత్ర చెప్పతుంది.
విశ్వకర్మలందరు ఎక్కడ ఏ దీన స్థితిలో ఉన్నారో కూడ మాకు తెలవదు అని నేటి సమాజం చెప్పతుంది. సృష్టికర్త మన విశ్వకర్మ అని గౌరవంగా ఆరోజుల్లో చెప్పకున్నాము ఇప్పడు సృష్టిలో విశ్వకర్మల దుస్థితిని చూసే వారే లేరు. నేటి సమాజంలో సృషికర్తలయైన ఐదు కులవృత్త్రుల వారు ( వడ్రంగి, కమ్మరి, కాంస్య, స్వర్ణ, శిల్పలు ) ఎవరికీ నేటి సమాజంలో సరైన గుర్తింపు లేదు.రెడిమేడ్ షాపుల వల్ల , ధరలు సరిగా లేక, చేసిన వస్తువులు, కళారూపలు కోనేవారు లేక, జీవన ఉపాది కష్టామై చాలా ఇబ్బందులు పడుతున్నారు.మన కులవృత్తుల వారు అందరు కలిసి పోరాడితే మనకు రావల్సిన పించన్లు, పథకాలు, సబ్సడీలు,కమ్యూనిటిహలు ,సదుపాయాలు మనం రాబట్టుకోలేమ . మన సాటి చేతివృత్తుల కార్మికులయైన గీతకార్మికులు, చేనేత కార్మికులు ముదిరాజ్ లు వారి వారి ఇబ్బందులను ప్రభుత్వనికీ తెలియజేసి పించన్ లను, పథకాలను, కమ్యూనిటిహల్ ను వారికి రావల్సిన సదుపాయాలను వారు పోందుతున్నారు. మనం ఎందుకు మన ఆర్థిక ఇబ్బందుల గురించి పోరాడకుండా ఉంటున్నాము. కలిసి కట్టుగా మన విశ్వకర్మలందరు కలిసి పోరాడితేనే మన విశ్వకర్మల భవిష్యత్తు బాగుపడుతుంది. రాజకీయ నాయకులందరికీ మా విశ్వకర్మలందరి తరుపున విజ్ఞాప్తి విశ్వకర్మలను కూడా గుర్తించి మాకు రావల్సిన సదుపాయాలను, మాకు అందవలిసిన పథకాలు, కమ్యానిటిహల్ ల గురించి మేము అడగక ముందే విశ్వకర్మల గురించి మీరు ఆలోంచిస్తారు అనుకున్నాము. ఇప్పడు నాయకులయైన విశ్వకర్మ పెద్దలు యైన విశ్వకర భవిష్యత్తు ఎప్పుటికీ ఇలానే ఉంటుది అనే స్థితి తీసుకరాకండి. ఇకనైనా విశ్వకర్మలందరికి మేము ఉన్నాము మీము రావల్సిన ప్రతి సదుపాయాల గురించి పోరాడుతాము అనే నమ్మకాన్ని మాఅందరికీ కలిగీస్తారు అని ఆశిస్తున్నాము

The Hindu హిందూ

The Hindu హిందూ పాము తన గుడ్లను తానే తింటుంది అనేది సామెత *సర్పాలలో తాను వాసుకి అని శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు*
*23.10.2017 ,కార్తీక సోమవారం* మరియు కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి నాగ పంచమి, నాగుల చవితి వస్తోందంటే చాలు, హిందూ సంప్రదాయాలు మూఢనమ్మకాలు, పాములు పాలు త్రాగుతాయ? వీళ్ళు పాములను హింసిస్తున్నారు, ఆదిమానవుడి కాలపు అలవాట్లను పాటిస్తున్నారు అంటూ మీడియా ఎంతసేపు దాడి చేసి, ధర్మాన్ని కించపరచాలని చూస్తోందే కానీ, నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఆచరణలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంప్రదాయాన్ని తప్పుగా అర్దం చేసుకున్నారా? ఒకవేళ పొరబడి ఉంటే, దాన్ని ఎలా సరిజేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయదు. ఆంగ్లేయులు భారత్ మీదకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావం బాగా పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే ఎంతో విశాలమైన భాష అయిన సంస్కృతాన్ని, దాని నుండి వచ్చిన భారతీయ భాషలలోని పదాలకు ఇంగ్లీష్‌లో అర్దం వెతుక్కునే స్థితికి చేరుపోయాము. అది ఇంకా దిగజారి ఏకంగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తూ, దాని అర్దాలనే సంస్కృతపదాలకు అంటగడుతున్నాము. విషయంలోకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళకు Snake అనే పదం ఒక్కటే ఉంది. --------------------------------------- కానీ మన ధర్మంలో *నాగులు, సర్పాలు అని రెండు ఉన్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు*. --------------------------------------- *భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి* 🍀 ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్| ..........ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః|| 10-28 || నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మదుడిని, సర్పాలలో తాను వాసుకి అని చెబుతున్నాడు. వాసుకి శివుని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేసారు దేవదానవులు. వాసుకి కద్రువ తనయుడు. 🍀 అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్| .......పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్|| 10-29 || నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పీత్రులలో ఆర్యముడిని, సంయమవంతులలో నిగ్రహాన్ని. •ఈ శ్లోకంలో *శ్రీకృష్ణుడు తాను నాగులలో అనంతుడనని చెబుతున్నాడు* అనంతుడు అనగా ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, రెండవ వాడు వాసుకి. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు. బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారం లో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా. ఇప్పుడు మనకు ఒక సందేహం రాక మానదు. పైన సర్పాలలో వాసుకి తానన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడనంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి తేడా? కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు . సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహరం, అనగా అవి గాలిని స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలకు కప్పలు మొదలైన జీవరాశులు ఆహారం. నాగుల్లో మళ్ళీ 9 జాతులు ఉంటాయి. అట్లాగే సర్పాల్లో కూడా దేవతాసర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది. కానీ ఇవి మానవసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు. అలా చిక్కుతాయి అనుకోవడం సినిమాల ప్రభావం మాత్రమే. పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కనుక వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నం. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటారు, ఆరోగ్యాన్ని, సంతనాన్ని అనుగ్రహిస్తారు. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయి. అవి కూడా పాలు త్రాగుతాయి. ఈ నాగపంచమి మొదలైన నాగదేవతారాధన తిధులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవారు. అప్పటి మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. ఆ రోజులు వేరు. కనుక అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందు వలే మర్త్యలోకంలో సశరీరంతో సంచరించడం మానేశారు. విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి, పూజించినవారికి సత్ఫలితాలను ఇస్తున్నారు. అలాగే దేవతాసర్పాలు కూడా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగడం మానేశాయి. ఒక 75 ఏళ్ళ క్రితం వరకు దేవతసర్పాలను చూసి, పూజించి, వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబసభ్యులకు ఇప్పటికి ఆ విషయాలు స్మరణలో ఉంటాయి. కానీ ఇప్పుడు సదాచారం, శౌచం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారు, ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉన్నా, సక్రమంగా పాటించడం తక్కువ. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. ఆలయాల్లో వాటికి జరిగిన అపరాధం కారణంగా కొన్ని శరీరం విడిచిపెట్టాయి. ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేము. చాలామటుకు ఏదో మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. #నాగపంచమి, #నాగులచవితి కి నాగదేవతలకు పూజలు చేయాలి. కానీ పైన చెప్పుకున్న విషయాలు అర్దంకాక ప్రజలందరూ మాములు పాములకు పాలు పోస్తున్నారు, పసుపు కుంకుమలు వేస్తున్నారు. మామూలు పాములు పాలు త్రాగవు, వాటికి పసుపుకుంకుమలు పడవు. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది.. నాగపంచమి, నాగులు చవితి మూఢనమ్మకలు కాదు, నాగదేవతలనుఋ. ల పూజించి, సంతానం పొందిన దంపతులు కోకొల్లలు. ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవాతానుగ్రహంతో కలిగిన సంతానంలో నాగదేవతల యొక్క వరప్రభావం, అంశను తల్లిదండ్రులు పసిగట్టగలుగుతారు. కానీ అలా సంతానం కోసం పూజించవలసింది నాగులనే కానీ మామూలు పాములను కాదు. ఈశ్వర సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది. సాధారణ సర్పాలు జీవవైవిధ్యంలో, ఆహారచక్రంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. వాటి మనుగడతోనే మానవమనుగడ సాధ్యమవుతుంది. మామూలు పాముల జోలికి వెళ్ళకుండా ఉండడం, వాటి మానాన వాటిని వదిలేయడం, వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చు. సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు. కనీసం ఇప్పటికైనా హిందూసమాజం సంప్రదాయంలోని అసలు విషయాన్ని గమనించాలి. విషయాన్ని సగం సగం చెప్పి, మూఢనమ్మకమంటూ కొట్టిపారేయకుండా, అసలు విషయాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పేందుకు మీడియా కూడా ముందురావాలి. ఈ విషయాన్ని ఎక్కువగా షేర్ చేసి, అందరికి తెలియపరచండి, హిందూసమాజాన్ని జాగృతం చేయండి. హిందూ ధర్మచక్రం.☀

21, అక్టోబర్ 2017, శనివారం

Meals భోజనం

Meals భోజనం
జీవిత ఉపయెాగాలు 1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి జ. గోరు వెచ్చనివి. 2.నీరు త్రాగేవిధానము జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి. 3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి జ.32 సార్లు. 4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి జ. ఉదయం. 5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు. 6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి జ. ఫల రసాలు(fruit juice). 7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి జ. లస్సీ, మజ్జిగ. 8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి జ. పాలు. 9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు జ. రాత్రి. 10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి జ. ఎప్పుడూ తినకూడదు. 11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను జ. గంట తర్వాత. 12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink ) జ. త్రాగకూడదు. 13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి జ. 40 ని. 14.రాత్రి పూట ఎంత తినాలి జ. చాలా తక్కువగా, అసలు తిననట్టు. 15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి జ. సూర్యాస్తమయం లోపు. 16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి జ. 48 ని. 17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా జ. త్రాగకూడదు. 18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి జ. పని. 19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి జ. విశ్రాంతి తీసుకోవాలి. 20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి జ. 500 అడుగులు నడవాలి. 21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి జ. వజ్రాసనం వేయాలి. 22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి జ. 5 - 10 ని. 23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి జ. లాలాజలం,( saliva ). 24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి జ. 9 - 10 గం. 25. 3 విషముల పేర్లు జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు. 26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి జ. వాము. 27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా జ. తినరాదు. 28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి . 29. విదేశీ వస్తువులను కోనవచ్చునా జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .‌ 30. టీ ఎప్పుడు త్రాగాలి జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు. 31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి జ. పసుపు. 32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది. 33. ఏ చికిత్సా విధానం మంచిది జ. ఆయుర్వేదం. 34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో). 35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో). 36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో). 37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి జ. సుమారు 2,3 గ్లాసులు. 38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి జ. సూర్యోదయాని 1.30 ముందుగా.

Mango మాంగో

Mango మాంగో మ్యూజింగ్స్
నిరుడు ఎండల కాలంలో మా దగ్గరి మిత్రుని నాన్న మెదడు సంబంధిత అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అవి మంచి మామిడిపండ్లు దొరికే రోజులు కావటంతో బాటు ఆయనకు మధుమేహం వంటి ఇతర ఇబ్బందులు లేకపోవటంతో ఆసుపత్రిలో తాను అన్నం వద్దన్నప్పుడల్లా నూజివీడు చిన్న రసాలు మొదలు బంగినపల్లి వరకు పలు రకాల మామిడి పండ్లు తినిపించేవాళ్ళం. డిశ్చార్జ్ అయిన తర్వాతా ఈ అలవాటు కొనసాగింది. కొన్నాళ్ళకు నేరుగా పండ్లు తినటం తగ్గించారు. దీంతో పెరుగన్నంలో మామిడిగుజ్జు కలిపి పెడుతూ వచ్చాం. మన అలవాట్లు, అవసరాలతో ఋతువులకు నిమిత్తం ఉండదుగా.. చూస్తుండగానే తొలకరి వచ్చింది. వానలు కురిశాక పురుగు కారణంగా మామిడి పండ్లు తినరు. కొనేవారు ఉండరు గనుక అమ్మకానికి కూడా పెట్టటం తక్కువే. అయినా మొజంజాహి మార్కెట్, కోఠీ, చేవెళ్ల వంటి చోట దొరికిన వాటితో ఆగస్టు వరకూ నెట్టుకొచ్చాం. కనిగిరి దగ్గర సాగు చేస్తున్న మా అన్నయ్య ఒకాయనకు సంగతి తెలిసి అక్కడినుంచి చిన్నకాయాలు 50 తెస్తే సెప్టెంబర్ కూడా గడిచింది. ఇక ఇక్కడ దొరక్క వేరే రాష్ట్రాల్లో ఎక్కడన్నా దొరకొచ్చని తెలిసిన వారి ద్వారా ఆరాం తీసాం. మహారాష్ట్ర అహ్మద్ నగర్ ప్రాంతంలో వినాయక చవితి వరకు చిన్న సైజు కాయలుంటాయని తెలిసి ఫోన్ (టైమ్స్ అఫ్ ఇండియా వారి పాత కథనం లో ఇచ్చిన నంబరు) చేసాం. ఉన్నవన్నీ కోసినా 7-8 కిలోలు కావచ్చనీ, అవీ కాస్త పుల్లగా ఉంటాయనీ, కావాలంటే నేరుగా వచ్చి తీసుకెళ్లమని ఆ పెద్దాయన చెప్పుకొచ్చారు. పోస్టులో పంపగలరా అని అడిగితే తనకు వయసైపోయిందనీ, కదలలేననీ అన్నారు. అంత దూరం వెళ్లాలా వద్దా? తీరా వెళ్ళాక లేకపోతే? అనుకొంటుండగానే ముంబై లో ఉండే మా బావ ఫోన్ చేస్తే ఈ సంగతి చెప్పుకొచ్చా. ఆయన అక్కడ ఊరిమీదబడి తిరగ్గా తిరగ్గా అతికష్టం మీద 10 పెద్ద పండ్లు దొరికాయి. దసరాకి వస్తూ తెచ్చిన ఆ పండ్లలో సగం పెట్టె తెరిచిన 2 రోజుల్లోనే పాడైపోగా మిగిలినవే, మొత్తం మీద మిగిలిన 5 పండ్లతో మరో వారం నెట్టుకొచ్చాం. ఇక ఇప్పుడేం చేయాలి? ఈ నెల మొదటి వారం రోజులు చారులో చక్కెర వేసి పెట్టటం, బెల్లం చారు వంటివాటితో మేనేజ్ చేసాం. ఇంకెక్కడా మామిడి పండ్లు దొరికే ఛాన్స్ లేదనీ ఈ నాలుగు నెలలూ ఇలానే చేయాలని మా అమ్మతో చెప్పి ఇక మామిడి గుజ్జు కోసం ఇంటర్నెట్ లో గాలిస్తున్నా. ట్రై చేసి చూద్దాం అని ఏడాదిపొడవునా దొరికే మామిడి, మాన్సూన్ మంగోస్, మంగోస్ ఆల్ ఓవర్ ది ఇయర్, ఐ వాంట్ మంగోస్ నౌ, మంగోస్ ఇన్ వింటర్ వంటి కీ వర్డ్స్ టైపు చేసి చూసా. ఇక వార్తల వరద మొదలయింది. 15 రోజులు రోజుకు 3 గంటలు ఇదే పని. ముందుగా సాక్షి పత్రిక పాత జిల్లా ఎడిషన్ లో వార్త... నాంచారిమడూర్: గ్రామము మండలం: తొర్రూర్ జిల్లా:వరంగల్ మా ఇంటి ముందున్న మామిడి చెట్టు గురించి. కానీ ఆయన వివరాలేమీ లేకపోవటంతో అయ్యో అనుకున్నా. ఈలోపు పాత హిందూలో తమిళనాడులోని పీ.అల్లిముత్తు (రాశిపురం తాలూకా, మినకల్ పోస్ట్, నామక్కల్ జిల్లా, మొబైల్- 94435-11253, 94422-64273) తోటలో సీజన్లకతీతంగా విచ్చలవిడిగా కాస్తున్న మామిడి గురించి చదివి ఫోన్ చేశా. ఆ పేరు చూసాక ఆయన, ఆమె తేడా కూడా తెలీదు. అయినా ఫోన్ చేశా. ముందొక ఉషా ఊతుప్ లైన్లోకి వచ్చి నేను చెప్పేది అర్ధం కాకపోయినా తనకు తెలిసినవన్నీ చెప్పింది. చాలా సేపటి తర్వాత వాళ్ళాయనకిచ్చి పోయింది. ఆ తర్వాత అల్లిముత్తు గారు వస్తే (అయన కొద్దిగా ఇంగ్లీష్ అర్థం చేసుకొంటున్నట్లు ఉంది) విష్యం చెప్పా. అన్నీ విని చివరికి 'ఇల్లె' అంటూ పెట్టేసారు. తర్వాత ఉత్తర భారతానికి మళ్ళా. అక్బర్ చక్రవర్తి నేటి యూపీ, బీహార్ లలో పెంచిన లక్షలాది మామిడి మొక్కల సంగతి గుర్తొచ్చి మాన్సూన్ మాంగోస్ ఇన్ బీహార్ అంటూ టైపు చేయగానే గూగుల్ తల్లి బీహార్లోని ముజఫర్ పూర్ లోని జపాహా ఫార్మ్స్ ఆసామి భోలానాథ్ ఝా గారి మామిడి సాగు కథనం చూపింది. ఆరా తీస్తే పచ్చడికి తప్ప తినేవి దొరకలేదు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లా మామిడి అభివృద్ధి, పరిశోధన సంస్థ వారు శీతాకాలంలో కాసే రకాలు పెంచుతున్నారని తెలిస్తే ఫోన్ చేసాం. మమతా బెనర్జీ పాలనలో ఉన్న రాజ్యం కాబట్టి ఏదో ఒక ఉపయోగం ఉండవచ్చనిపించింది. ఫోన్ చేసి వివరాలు చెబితే వాళ్ళు ' రామ్ గోపాల్ వర్మ సినిమా చూసిగానీ ఫోన్ చేసావా? అని మర్యాదగా విసుక్కొన్నారు. మళ్ళీ చేస్తే పేపర్ లో వచ్చేవన్నీ నిజమనుకొంటే ఎలా? అంటూ చిరాకు పడ్డారు. ఎంతైనా బెంగాలీలు కదా.. ఇంకా దుర్గాపూజ మూడ్ నుంచి బయటు రాలేదేమో అనుకొన్నా. ఆ పక్కనే బంగ్లాదేశ్ లో భాగమైన 'చాపై నవాబ్ గంజ్' లోని హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం సాధించిన అద్భుత మామిడి సాగు వివరాల కథనం మరోటి చూసా. వారికీ ఫోన్ చేద్దాం అనుకున్నా. కానీ జాకీర్ నాయక్ అనుచరుడనో, ప్రాణ భయంతో తలోదిక్కు పారిపోతున్న రోహింగ్యా మద్దతు దారంటారో అని భయం వేసి ఊరుకున్నా. మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్.. అన్న గిరీశం మాటలు గుర్తుకొచ్చి ఇక్కడ లాభం లేదు.. ఏదైనా సీమ సరుకు సీమ సరుకే అనుకొని బయట చూద్దామని సెర్చ్ మొదలెట్టా. అప్పుడే 'హోమ థెరపీ ఇంటర్నేషనల్' వారి అదిరిపోయే సైట్ చూసా. రోజూ హోమం చేసే చోట ఏడాదిపొడవునా మామిడి కాస్తుందని చెబుతున్న సైట్ అది. గొప్ప గర్వంతో సైట్ వివరాలు చూస్తే (http://www.homatherapy.org/…/mango-trees-give-fruit-all-yea…). వాళ్ళు కేవలం పరిశోధనలే చేస్తారు తప్ప పెద్దగా పంటా పాడూ పండించరని. ఇదీ రాలే బేరం కాదనుకొనగానే ది మాంగో ఫ్యాక్టరీ https://www.themangofactory.com అనే సైట్ కనిపించింది . అందులోని మనుషులూ, ఆ కాయలు చూసి'రాంగ్ టర్న్' సినిమా పాత్రలు గుర్తుకొచ్చాయి. వెన్ను జలదరించి ఆ రోజుకు ఊరుకున్నా. మరుసటి రోజు మళ్ళీ సెర్చ్ మొదలు పెట్టగానే 15 జనవరి 2016న విడుదలైన 'మాన్సూన్ మాంగోస్" ( అభి వర్గీస్ - దర్శకత్వం) వెక్కిరించింది. ఆ తర్వాతే జపాన్ దేశంలోని ఓ బుల్లి ద్వీపమైన ఇషిగాకి ద్వీపంలో సాగవుతున్న మామిడి వివరాలు చూసా. (http://www.eenadu.net/…/sunday-m…/sunday-magazineinner.aspx…). కాయలు దొరికేలా లేకపోయినా ఆర్టికల్ చదివి బాగుందనుకొన్నా. ఇంతలో.. ఆఫీసులో నా పక్క సీటు అమ్మాయి (తను డాక్టర్)కి నేను కొన్ని రోజులుగా సీరియస్ గా పనిచేయటం చూసి భయపడిందేమో? అంతా బాగుందా? అని పరామర్శించింది. ( అప్రైజల్ సమయం కదా.. తనకి డౌట్ వచ్చిండొచ్చు) మామిడి గా(బా)ధలు చెప్పుకొచ్చా. ఓ ఇంతేనా.. అంటూ ఓ నవ్వు నవ్వి తన సొంతరాష్ట్రం జార్ఖండ్ లో మామిడి జూన్ లో కాపుకొస్తుందనీ, ఎంత లేదన్నా 3 నెలలు కాయలు ఉంటాయనీ చెప్పుకొచ్చింది. కోటికాంతులతో 18 చేతులూ అభయ ముద్రలోనే ఉన్న కనక దుర్గ కనిపించినంత రిలీఫ్ దొరికింది. అనవసరంగా గూగుల్ ని ఇబ్బంది పెట్టాననుకొని ఆ తల్లికి మనసులోనే క్షమాపణ చెప్పుకొన్నా. అప్పటికప్పుడే నా ముందే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రాంచీలో ఉన్న ఆయన మిత్రులైన పెద్ద ఎగుమతిదారులు పేర్లు చెప్పి కనుక్కొని ఏ సంగతీ చెప్పమంది. ఉంటే ఫ్లైట్ పార్సిల్ సర్వీస్ లో కోల్ కతా పంపితే మా బ్రాంచ్ ఉద్యోగి వచ్చి తీసుకొంటాడని చెబితే ..రేపే మామిడి పళ్ళు వస్తున్న ఫీలింగ్. ఆ నవ్వులో కాన్ఫిడెన్స్ చూసి ఆరోజు హాయిగా ఇంటికి పొయ్యా. మర్నాడు తీరిగ్గా 10 గంటలకి వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగి పని చేస్తున్నట్టు నటించి అసలు సంగతి చల్లగా చెప్పుకొచ్చింది. ఈ ఏడాది వానలకి ముందే పంటంతా తుడిచిపెట్టుకు పోయిందనీ, అసలు సీజన్లోనే మంచి కాయలు దొరకలేదని, మామిడి రైతులు అప్పుల పాలయ్యారని..ఇంకేదో చెప్పుకొచ్చింది. అయినా కంగారు లేదు.. అమెజాన్ ఉందిగా.. కూల్ అంది. అందులో పల్ప్ వివరాలు చూసి ఇక ఆర్డర్ చేద్దామని డౌటొచ్చి కింద ప్రోడక్ట్ రివ్యూలు చూసా. ఒక్కక్కడూ తిట్టిన బండబూతులు ఆసాంతం చదివి తెలివితక్కువ వెధవలు.. రివ్యూ చదివి కొనుక్కోకూడదూ? అనుకోని నవ్వుకున్నా. ఇలా అక్టోబర్ 10 కూడా అయిపొయింది. 11న ఉదయాన్నే ఆఫీసుకు వచ్చి లుంగీ కట్టుకొన్న ఒక పెద్దాయన సోఫాలో కూర్చొని శ్రద్ధగా.. పద్దతిగా.. గోడకట్టినట్లు కన్ను చెదిరే మామిడి పండ్లు మట్టసంగా కోస్తున్నాడు. ఫోటో చూసే నోరూరింది. ఆపై డౌటొచ్చింది. (చేదు అనుభవాల వల్ల). పాత ఫోటో, పోస్ట్ కావచ్చని డౌటొచ్చి.. గుండమ్మ కథలో సావిత్రి కాలి పుట్టుమచ్చమీద పారాణి సీనులో డిటెక్టివ్ వేషం కట్టిన ఏఎన్నార్ చూసినట్లు చూసి మొత్తం చదివా. యురేకా... అని పెద్దగా కేక వేద్దామనుకొన్నా. కార్పొరేట్ ఆఫీసు కదా.. పర్సనల్ ఎమోషన్స్ చూపకూడదని గుర్తొచ్చింది. (అసలే అప్రైజల్ సమయం). వెంటనే విష్యం చెబుతూ ఫోన్ న్యూబర్ కోసం రిక్వెస్ట్ పెట్టా. మొత్తం ఇస్తానని చెప్పా. డబ్బు తీసుకోనని ఖండితంగా చెబుతూ ఫోన్ నెంబర్ పంపించారు. అడగాలా వద్దా అనుకొంటూ ఫోన్ చేశా. గంభీరమైన గొంతు. అమ్మో అనుకొన్నా. పండ్ల ఆరా విషయంలో నా కొలీగ్ (రాంచీ అమ్మాయి) అనుభవం మట్టుకు చెప్పా. గట్టిగా మనసారా నవ్వారు. అప్పుడు ఇంకాస్త ధైర్యం చేసి మరో 2 మాటలు మాట్లాడితే సాగర్ రోడ్, హైదరాబాద్ లో ఉంటానన్నారు. వెంటనే మా తమ్ముడు ఆ పక్కనే ఉంటాడనీ, తాను రావటం సులువని చెబితే ఫోన్ నంబర్ ఇచ్చి మాట్లాడమన్నారు. మా వాడు ఆ రోజు క్లాసుల వల్ల పగలు పోలేకపోయి పొద్దుగూకినాక వెళ్లినా, ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. టార్చ్ వెలుతురులో 2 డజన్ల కాయలు కోసి ఇచ్చి పంపారు. ఇంటిమనుషుల్లా సాగనంపారు వాడిని. ఆ తర్వాత ఆ ఇంటివాతావరణం, వాళ్ళ పద్దతులు, కాయల గురించి మావాడు ఓ గంటసేపు సంతోషంగా చెప్పుకొచ్చాడు. కాయల గుజ్జు ఎలా నిల్వ చేయాలో వారి సహచరి చెప్పిన ఆదరపూర్వక సలహాలూ చెప్పి మురిసిపోయాడు. 'నీ మాట ప్రకారం పగలు వెళితే ఇంకా పండ్లు దొరికేవ'ని వాపోయాడు. భలే పండ్లు భలే పండ్లు అంటూ వీడియో కాలింగ్ చేసి మరీ చూపెట్టాడు. అలా.. ఆ రాత్రికే నాకంటే ముందు పండ్లు మా ఊరికి చేరాయి. నవనవలాడే తియ్యని పండ్లు. రుచి ఎంతో బాగుందన్నారు మా నాన్న. ఇరుగూ పొరుగూ వచ్చి చూసి ఈ ఆకాలంలో ఇంత కండగల కాయలా అంటూ చూసి దవళ్లు నొక్కుకొన్నారు. మొత్తానికి సమస్య తీరింది. ఇంకో నెలరోజులు దిగులు లేదు. ఇంతకీ మామిడిపళ్ళనిచ్చిన ఆసామి పేరు చెప్పలేదు కదా.. వారే శ్రీ వాసిరెడ్డి వేణుగోపాల్ గారు. విఖ్యాత పాత్రికేయులు. 'సార్.. నేనెవరో తెలీకపోయినా తక్షణం స్పందించి గొప్ప సాయం చేశారు. మీ, మీ సహచరి పెద్దమనసుకు, చూపిన ఆదరానికి, సౌజన్యానికి కోటి కోటి కృతఙ్ఞతలు. వీలుంటే 'మాయమై పోతున్నడమ్మా .. మనిషన్నవాడు' లాంటి పిచ్చి పాటలు రాయొద్దని గోరెటి వెంకన్నకు గట్టిగా చెప్తా అనుకోని నవ్వుకున్నా సార్. మీవల్ల నాకు గొప్ప మేలు జరగటమే గాక గొప్ప మనుషులూ దొరికారు. మీకు రుణపడి ఉన్నా. అలాగే నోముల ప్రభాకర్ గౌడ్ గారికీ. ఇప్పటికి సెలవు సార్.. నమస్తే

20, అక్టోబర్ 2017, శుక్రవారం

INDIA భారత దేశం

INDIA భారత దేశం
ప్రతీ భారతీయుడు తెలుసుకోదగిన విషయం... "నా దేశం-దేశభక్తుల దేశం" మీరు గమనించినట్లయితే భారత్ ఓ ప్రాచీన దేశం.అది ఎంత? అమెరికా వయస్సు 500సం...అంతక ముందు అమెరికా లేదు...కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ఇజ్రాయేల్ వయస్సు 2000సం...అంతక ముందు ఇజ్రాయేల్ లేదు...జీసస్ తెలిపాడు ప్రపంచానికి చైనా వయసు 5000సం...అంతకముందు చైనా లేదు...బోధి ధర్ముడు తెలిపాడు ప్రంపంచానికి మరీ నీ దేశం-నీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ఇతర దేశాలకు భిన్నంగా ప్రపంచ చరిత్ర కారుల,పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు #ఇదీ_నా_భారత్_గొప్పతనం . ప్రపంచ తత్వవేత్త,పురావస్తు శాస్త్రవేత్త,జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" శోధన ప్రకారం.... ప్రపంచంలోని 28ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారత దేశం హిందూ సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" నేడు లేదు.కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీ " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే.అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా...సుమేరియా...బాబిలోనా...మెసపటోనియా...ఇలా 27 దేశాలు ఎన్ని సంస్కృతులు నాశనమయినా తన సంస్కృతి ఉనికి ని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" . . ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా... !? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...!? ఉంది.చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" . . ఈజీప్ట్ మీద పాలస్తీనా,అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది.నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు.ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరీ మన సంస్కృతి పై జరిగిన దాడులు ఎన్ని..!? శకులు,తుష్కరులు,మొఘలులు,సుల్తానులు,నవాబులు,షేక్ లు,పఠాన్ లు,పోర్చుగీస్ వారు,ఫ్రెంచ్ వారు,డచ్ వారు,బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు.కానీ ఏంటి లాభం!? ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం" . . మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలి దానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా...!? అక్షరాల మూడు లక్షల యాభై వేలకు పై మంది వీరు కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా...ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని,,నా దేశాన్ని విమర్శిస్తారు. జై భారత్ మాత జై హిందూ'స్థాన్

18, అక్టోబర్ 2017, బుధవారం

Cancer disease కాన్సర్ వ్యాధి

భయంకరమైన కాన్సర్ వ్యాధికి 300 రూపాయలతో చికిత్స.. చెట్ల యొక్క బెరడు , వేర్ల నుండి అనేక జబ్బులను నయం చేస్తున్న ఒక వైద్య నారాయణుడి గురించి మీకు తెలుసా...........? క్యాన్సర్ ఏ స్థితిలో ఉన్నా కూడా వేలాది మందికి నయం చేశారనే విషయం మీకు తెలుసా...........? అయితే ఒక్కసారి చదవండి. అందరికీ తెలియజేయండి. ఆ వైద్య నారాయణుడి పేరు శ్రీ N.S.నారాయణ మూర్తి గారు, శ్రీ ఆ హాస్పిటల్ పేరు : N.S.NARAYANA MURTHY CANCER TREATMENT CENTER NARSIPURA, GOUTAM PURA POST, SAGAR ROAD, SHIMOGA KARNATAKA, PHONE NO: 08183-258033 క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చు శ్రీ N.S.నారాయణ మూర్తి గారు హిందీ, కన్నడ, భాషలలో మాట్లాడుతారు. తెలుగు మాట్లాడితే అర్ధం చేసుకొంటారు. రిపోర్ట్స్ లేకపోతే పేషంట్ ను చూసి మందు ఇస్తారు.స్కానింగ్ రిపోర్ట్స్ వుంటే మంచిది. ఒక్క క్యాన్సర్ కే కాకుండా చాలా రోగాలకు మందును ఇస్తారు. మందు వాడే విధానము కరపత్రము రూపములో ఇస్తారు. ఫోన్ నంబర్ వున్నది అది 08183-258033 , కానీ వ్యక్తిగతముగా కలిస్తేనే మంచిది. అపాయింట్మెంట్ అనేది లేదు, Q లో ఎవరు ముందుగా వుంటే వారికి మందు ఇవ్వటం జరుగుతుంది. చాలా సీరియస్ స్థితిలో వున్న పేషంట్ కు ప్రత్యేకముగా Q ను ఆపి చూసి మందు ఇచ్చి పంపుతారు. 18 రకాల క్యాన్సర్లకు మందు ఇస్తారు, ఎటువంటి స్టేజి లో వున్నా వారు చూసి నిర్దారణ చేసి మందు ఇస్తారు. పేషంట్ పోవాల్సిన అవసరంలేదు రిపోర్ట్స్ తీసుకొని పేషంట్ స్థితి తెలిసినవారు ఒక్కరు పోతే చాలు పేషంట్ వెళ్ళగలిగే స్థితిలో ఉంటే అభ్యంతరము లేదు, పేషంటును వారు చూస్తారు ఇతర దేశాలనుండి కూడా చాలామంది వస్తున్నారు గురువారము, ఆదివారము ఈ రెండురోజులు మాత్రమే ఉదయము 8:00 గం ల నుండి అందరిని చూసి మందులు ఇచ్చిగాని వెళ్లరు అర్దరాత్రి అయిన సరే ............. గురువారము మందు పొందాలి అంటే బుధవారము పొద్దుటినుండే Q మొదలవుతుంది ఆదివారము మందు పొందాలి అంటే శనివారము పొద్దుటినుండే Q మొదలవుతుంది కోటీశ్వరుడు అయినా పేదవాడు అయినా అందరూ అక్కడ సమానమే షిమోగలో లాడ్జింగ్,హోటల్స్, ట్యాక్సీ, సౌకర్యము వుంది. షిమోగా నుండి నర్సిపుర కు 60 Km డైరెక్ట్ హాస్పిటల్ కు ప్రేవేట్ బస్స్ సౌకర్యము వుంది.

17, అక్టోబర్ 2017, మంగళవారం

Diwali దీపావళి

మమల్ని మా పండుగల నుంచి దూరం చేయడాని మీరు ఎవరు? బరాబర్ దీపావళి జరుపుకుంటాం,
ఇది మా పండుగ, మా పెద్దలు మాకు ఇచ్చిన సంస్కృతి. మన భారతదేశం , మన సంస్కృతి, మన పండుగలు, మన కుటుంబం... పొల్యూషన్ ఆపాలంటున్నారు ఒకే ...కానీ ముందు నీ కార్ అమ్మేసి - సైకిల్ కొనుక్కో, నీ బైక్ అమ్మేసి - నడుచుకుంటూ పో, షాపింగ్కెళ్లి - బట్టలు చేతిలో పట్టుకొని ఇంటికి రా క్యారీబాగ్ వద్దు, సెల్ ఫోన్ వాడకండి - పిట్టలు సచ్చిపోతున్నాయ్, బల్బు వాడకండి - పురుగులు సచ్చిపోతాయ్, సచ్చినప్పుడు శవం ముందు,పెళ్ళైనప్పుడు జంట ముందు టపాసులు పేల్చకండి, అవే డబ్బులతో పేదవారికి సహాయం చేయమంటావా????? అయితే నీ బర్త్డే పార్టీ డబ్బులు ఇచ్చెయ్, పిజ్జా ఎందుకు అన్నం తింటావ్ గా ఆ డబ్బులిచ్చేయ్... ఫ్యాన్ ఉందిగా ఏసి ఎందుకు???ఆ డబ్బులిచ్చేయ్... కుండ ఉందిగా ఫ్రిజ్ ఎందుకు???అది అమ్మి ఇచ్చేయ్... అప్పుడు నేను మానేస్తా! అప్పటి దాకా బారబర్ దీపావళి జరుపుకుంటా. ఇది ఒక్కే రోజు కాలుష్యం మనిషి అవసరాలు నిత్య కాలుష్యం. "విజ్ఞాన ప్రదర్శనలొద్దు" దీపావళి అంటే దీపాల పండుగ అని మళ్ళీ అందరం పర్యవణాన్ని కపాడటానికి ఎంతో కొంత మాత్రమే టపాసులు కాలుస్తున్నాం అయినా మన పండుగలను అపండి అని చెప్పే పరాయి దేశపు తొత్తుల్లారా దీపావళి నాడు నా భారతీయులు కాల్చే శాతం ఎంతా?? మన భారతదేశం , మన సంస్కృతి, మన పండుగలు, మన కుటుంబం ... సరేలే ... మానవ్వంతో భాణసంచ కాలుష్యం... అందరం పర్యవణాన్ని కాపాడటానికి కాల్చే ఆలోచన విరమించి దీపాల దివ్యేలనే ఇంటి చుట్టు వెలిగిస్తాను. కానీ ప్రపంచం మొత్తం #డిసెంబర్ నెలలో చివరి వారంలో కాల్చే భాణసంచను ఆపండి వెంటనే ... అయినా నాలాగే ఆలోచనలు బుద్ది మీకు ఎప్పటికి వచ్చునో... ఎందుకంటే మీరు వెదవలన్న మాట ...

14, అక్టోబర్ 2017, శనివారం

Nagarjuna sagar నాగార్జున సాగర్

Nagarjuna sagar నాగార్జున సాగర్
శ్రీశైలం రిజర్వాయర్ కు భారీ వరద ప్రవాహం వస్తోంది. ఉదయం పది గంటల సమయానికి రెండు లక్షల ఐదు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఐదు రెేడియల్ క్రెస్ట్ గేట్లు, జల విద్యుత్కేంద్రాల ద్వారా 1,90.000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఇది రోజుకు 18 టిఎంసీలతో సమానం. ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలానికి 1,68.000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా నాలుగు గంటలలోనే రెండు లక్షల ఐదు వేలకు చేరింది. సాగర్ కు ఉదయం 1,13,745 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా సాయంత్రానికి లక్షా 90 వేలకు చేరుకోనుంది. శ్రీశైలం ఎగువన వరద ప్రవాహం కొంత తగ్గినా మరో పది రోజుల పాటు లక్ష క్యూసెక్కులకు తగ్గకుండా ఇన్ ఫ్లో ఉంటంది. సాగర్ నిండటానికి ఈ వరద సరిపోతుంది. మరో పక్క తుంగభద్ర కూడా దాదాపు నిండటానికి సిద్ధమవుతోంది. దీనితో కృష్ణ, తుంగభద్ర, భీమానదులపై ఉన్న రిజర్వాయర్ లు నిండినట్టవుతాయి. హైదరాబాద్ కు మంచి నీటి వనరు కోసం మంజీరానదిపై ఉన్న సింగూరు రిజర్వాయర్ కు భారీగా ఇన్ ఫ్లోలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి రోజుకు రెండు టీఎంసీలు దిగువన ఉన్న నిజాం సాగర్ కు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతుల టెన్షన్ తీరినట్టే. నిజామాబాద్ జిల్లాలో గోదావరి రాష్ట్రంలోకి ప్రవేశించాక గోదావరిపై ఉన్న మొదటి ప్రాజెక్టు 90 టిఎంసీల శ్రీరాంసాగర్ (పోచంపాడ్) కు రోజుకు మూడు టిఎంసీల వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ నీటి నిల్వ 48 టిఎంసీలకు చేరింది. నిర్మల్ జిల్లాలో గోదావరి ఉపనది కడెం నదిపై ఉన్న కడెం డ్యాం నిండింది. ఏపీలోని పెన్నా బేసిన్ లో పదేళ్ల కోసారి మాత్రమే నిండే సోమశిల ప్రాజెక్టుకు(నెల్లూరు జిల్లా) 78,500 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 78 టిఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న సోమశిలలో నీటి నిల్వ 40 టిఎంసీలకు చేరింది. కర్నూలు జిల్లాలోని 17 టిఎంసీల వెలుగోడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ (పోతిరెడ్డి పాడు) కూడా నిండే దశకు చేరింది. Ippudu ninde Nagarjuna sagar 300TMC, Srishailam project 200TMC, Sriram Sagar project 90TMC, kadem project 7TMC, yellampally 20 TMC, Musi 5TMC, Singur 29 TMC, mid mannair 24 TMC, Devadula 50 TMC lift, bheema, kalvakurthy, nettempadu, koyalsagar etc.. Ela projects anni nindu kunda talapistunai.. Evvi anni gatha palakulu kattainave.

12, అక్టోబర్ 2017, గురువారం

Child labor బాల కార్మిక వ్యవస్థ

బాల కార్మిక వ్యవస్థ...
నా చిన్నప్పుడు ఏ కొట్టుకెళ్లినా.. మా షాపులో బాల కార్మికులు లేరు.. అని పలకమీద రాసి వుండేది. అదేమిటో నాకు అర్ధమయ్యేది కాదు. లేబర్ డిపార్టుమెంటు వాళ్లు బాల కార్మిక సాకుతో దాడులు చేసి మహా మేత మేస్తుంటారని తర్వాత తెలిసింది. మన ప్రభుత్వాలు ఇలాంటి అఘాయిత్యాలను అస్సలు సహించవు కదా! అందుకని.. బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించేందుకు మరింత కఠినమైన చట్టాలను తీసుకొచ్చాయి. బాల కార్మికుడు కనిపిస్తే యజమానిని షూట్ ఎట్ సైట్ ఆర్డరులాంటి చట్టాన్ని తీసుకొచ్చాయి. దానివల్ల ఎన్ని కుటీర పరిశ్రమలు కూలబడ్డాయో, ఎన్ని వేల, లక్షల కుటుంబాలు కునారిల్లిపోయాయో మనకు అనవసరం. మనకు మంచి చట్టం.. ప్రపంచానికే ఆదర్శప్రాయమైన చట్టం వుండడం ముఖ్యం. అన్నట్టు... మార్వాడీలు, గుజరాతీలు తమ పిల్లలను చదువు సంధ్యా లేకుండా తమ కొట్లో పని చేయించుకోవచ్చు. అది వ్యాపార వారసత్వం కిందనే లెక్కవుతుంది కానీ బాల కార్మిక వ్యవస్థ కిందకు రాదు. చట్టంలో ఈ మినహాయింపు వుంది. సామాజిక అభ్యుదయ సంస్థలు ఇలాంటి మినహాయింపులపై మాత్రం నోరు మెదపవు.

Measurement కొలతలు

గిద్దె, సోల, మానికలు ఇనుముతో వృత్తాకారంలో వుండే కొలత సాధనాలు. నాలుగు గిద్దెలు ఒక సోల. రెండు సోలలు ఒక తవ్వ. నాలుగు సోలలు ఒక మానిక. ఇలాంటి కొలతలు గుర్తొచ్చాయి.
ఊళ్లోని కోమటి కొట్టుకి వెళ్లినప్పుడు.. మన సోల, మన మానిక తీసుకెళ్లి కొలత వేయించుకోవడం గుర్తొచ్చింది. ఈ చిత్రంలోని మానికతో పోల్చితే.. మా ప్రాంతంలో మానిక వెడల్పు తక్కువ వుండి, ఎత్తు ఎక్కువ వుంటుంది. ధాన్యాన్ని.. అనగా ఘనపదార్ధాల్ని కొలిచేటప్పుడు.. ‘తలకొట్టి’, తలకొట్టకుండా అనే పదాలు వుంటాయి. మానికలో నిండుగా ధాన్యాన్ని నింపితే.. ఎగువన పిరమిడ్ షేప్ వస్తుంది. అది తలకొట్టకుండా తూయడం. అంచువరకూ అరచేతితే సరిచేస్తే తలకొట్టి తూయడం. ఈ కొలత సాధనాల్లో ధాన్యాన్నే కాదు, ద్రవాలను కూడా కొలుస్తారు. అయితే తలకొట్టకుండా తూయడం అనేది వుండదు. తలవరకే ద్రవం నిలుస్తుంది. గిద్దెడు నెయ్యి, అరసోల నూనె.. ఇలా... తలకొట్టిన కొలతల్లో గొప్ప ఫిజిక్స్, జామెట్రీ వుంటుంది. చతురస్రం, దీర్ఘ చతురస్రాల్లో ఆ మూలనుంచి ఈ మూలకి ఒక గీత గీస్తే కర్ణం అంటారు. అదే కర్ణం వృత్తాకారాలకూ వుంటుంది. కర్ణానికి అవతల, ఇవతల సమాన స్థలం వుంటుంది. అవతల వాక్యూమ్ వుంటే, ఇవతల మ్యాటర్ వుంటుంది. తలకొట్టిన సోలలోని బియ్యం, పంచదార.. ఏదయినా కానీ.. నెమ్మదిగా వంచుతూ.. అడుగు భాగపు పై మూల, వంచుతున్న మూల.. ఒక కర్ణంగా ఏర్పడితే.. అది సరిగ్గా అరసోల కింద, అరభాగం కింద లెక్క. ఆ లెక్కలో కొలిస్తే.. ఒక్క చుక్క నెయ్యి కూడా తేడాలేకుండా కొలత తేలుతుంది. ఇవన్నీ న్యూటన్లు, పైథాగరస్ లు.. ఇలాంటి దివ్యమైన శాస్త్రవేత్తలు కనిపెట్టకముందే.. ప్రజలు కనిపెట్టుకున్నారు. మనం బళ్లలో చదువుకోవడానికి ‘థియరీ’ అనే కొరుకుడుపడని పదజాలాన్ని మాత్రమే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ... నెయ్యి ప్రస్తావన చాలాసార్లు రావడంతో.. నెయ్యితో నా అనుభవాలు కొన్ని పంచుకుంటాను. ఇది మా తాతలు తాగిన నేతుల వాసన మూతి తుడుచుకుంటూ చెప్పడంలేదు. మా నాయన నెయ్యి వ్యాపారి. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో.. కావిడి భుజానికేసుకుని ఊరూరూ తిరిగి వెన్న సేకరించి, దానిని కరిగించి డబ్బాల్లో ప్యాక్ చేసి గుంటూరు పంపేవాడు. అయితే.. ఆ రకరకాల వెన్నతో మరిగించిన నెయ్యిని మాకు వేయడానికి మా అమ్మ ఇష్టపడేది కాదు. ఇరుగుపొరుగు వాళ్ల గేదెలనుంచి వచ్చిన పాలతో చేసిన తాజా నెయ్యిని కొనేది. ఓసారి ఇలాగే అరసోల నెయ్యి తెచ్చింది. ఏదో పొలంపనిమీద బయటికెళ్లింది. నాకేమో ఆకలేసింది. బాగా బుడ్డోడిని. ఎంత బుడ్డోడిని అంటే.. అది చారో, నెయ్యో తెలియనంత బుడ్డోడిని. ఒక బొచ్చెలో అన్నం వేసుకుని, ఆ నెయ్యంతా వేసుకుని తినడం మొదలెట్టాను. అంతలోనే వచ్చిన మా అమ్మ లబోదిబో... అంత నెయ్యి పోసుకున్నందుకు లబోదిబో అని వుండదు. అంత నెయ్యిని.. చిల్లుల బొచ్చెలో పోసుకున్నందుకు, నేలంతా పారబోసినందుకు, ఒళ్లంతా పూసుకున్నందుకు లబోదిబో అన్నది.బాల్యపు జ్ఞాపకాలు ముసురుకున్నాయి. పూర్వం ఒక వ్యాపారి తన కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాడు. తన కోడలు మంచి వ్యాపారదక్షత కలదైతే కొడుక్కి అండగా ఉంటుందనుకున్నాడు. తన వర్కరు ఒకడిని పిలిచి నువ్వులు ఇచ్చాడు. వాటికొలతకు సరిపడ నూనె కావాలి అని అన్ని గ్రామాల్లో వీధుల్లో చాటింపు వేస్తూ తిరగమన్నాడు. పనివాడు అనేక గ్రామాలు తిరిగాడు. ఎవరూ నూనె ఇవ్వటానికి ముందుకు రాలేదు. పైగా. ఏమయ్యా? నువ్వులు గానుగ ఆడితే సగం నూనె మాత్రమే వస్తుంది. లాభం వేసుకోక పోయినా నీకు నూనె ఇవ్వాలంటే సగం కొలత మాత్రమే ఎవడైనా ఇవ్వగలడు. ఎందుకు వృధా ప్రయాస - ఇంటికిపో ... అన్నారు. ఎగతాళి చేశారు. వాడు మాత్రం మా అయ్యగారు చెప్పారు. నూనె తీసుకునే పోతానని మరిన్ని గ్రామాలు తిరిగాడు. ఒక గ్రామంలో ఒక దుకాణం ముందునుంచి పోతుండగా వాడిని ఒక యువతి ఆపింది. తండ్రి పనిమీద పోతే అతడి దుకాణంలో ఆమె కూర్చుని బేరాలు చూస్తోంది. వీడు ఆమె వద్దకు వెళ్లి యజమాని చెప్పిన మాటే చెప్పాడు. ‘‘ఓస్ అంతే కదా. న్యాయంగానే అడిగావు. నేను నీకు సరికి సరి నూనె ఇస్తా ఆ నువ్వుల మూట దింపు’’ అంది. వాడు సంతోషించి మూట దింపాడు. ఆమె లోనికి వెళ్లి చాలా వెడల్పాటి పళ్లెం తీసుకు వచ్చింది. దానిలో నువ్వులను గోపురంలా నింపుకుంది. ఆ నువ్వులు తను తీసుకుని పళ్లెంలో నిండుగా పొంగేలా అప్పుడే ఆడిన నువ్వుల నూనె పోసింది. మరి కాస్త కొసరు కూడా అడగకముందే పోసింది. ‘‘ సంతోషమేనా?’’ అని అడిగింది. వాడు చాలా సంతోషమమ్మా అని ఆనందంగా వెళ్లి తన యజమానికి నూనె ఇచ్చి జరిగిందంతా చెప్పాడు. యజమాని వెంటనే మేళ తాళాలతో ఆ ఇంటికి వెళ్లి ఆ పిల్లను తనకు కోడలిగా ఇమ్మని వేడుకున్నాడు. పాత కాలం కొలతల గురించి పోస్టితే గుర్తు వచ్చిన కధ.

Halal హలాల్

Halal హలాల్
ఏ మతస్థుడైనా మనిషన్నవాడు ఏ మూగజీవాన్నైనా చంపే అధికారం కలిగి ఉన్నాడా ? ఉంటే జీవాన్ని కోసేముంది ముస్లిమ్స్ చేసే ప్రార్ధన /సూక్తులు /హలాల్ చేసిన ప్రాణిని తింటే పాపం తగలదా ? ఇది మూఢనమ్మకమా ?ఆచరమా ?సాంప్రదాయమా ? ఓ సారి ఆలోచిద్దాం , మన హిందువులకు నిజంగా ఏది నమ్మాలి!.. ఏది నమ్మకూడదు అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.... ఎందుకంటే ఏది వాడుకలో ఉంటే అదే ఎక్కువగా నమ్మే స్వభావం గనుక ! మన హిందువులలో కూడా ఇప్పటికీ అక్కడక్కడా ఆర్య కటికలు /ఆరె కట్టికోళ్లు అనీ ఉండేవారు ,ఉండవచ్చుకూడా ... ఏ జంతువునైనా హిందూ సాంప్రదాయప్రకారం కోసేముందు,వాళ్ళు నమ్ముకున్న గ్రామదేవతలకు మ్రొక్కి కోయబోయి జీవాలకు ముందుగా ప్రణమిల్లి వాటికి కూడా మ్రొక్కి ... నీళ్లు ,కళ్ళు ఇలాంటి ద్రవపానీయాలు కొద్దిగా త్రాగిపించి కోసేవారు.మ్రొక్కులో ఓ భగవంతుడా ఈ ప్రాణిని నీకు సమర్పణగా నీకు ఆహారముగా మాత్రమే చేస్తున్నాను ,నేను నిమిత్తమాత్రుడను అనీ అర్ధమట !ఇది నాలాగే చాలామంది చూసుంటారు . మన వైదిక సంప్రదాయంలో శైవం జంతు బలులకి వ్యతిరేకం. కానీ కాపాలికులు , వీర శైవులకి జంతుబలులు, నరబలులు అనేది ఆచార విధానం. శాస్త్రం ఆ నకారాత్మక పూజ విధానాన్ని సమర్ధించదు. ఎందుకంటే అది రాక్షసుల ప్రక్రియ. ఇది కలియుగం. ఇందులో మనిషిలో దైవత్వం కంటే రాక్షసత్వం పాళ్లు ఎక్కువగా ఉంటుంది. రాక్షస గుణాల్ని ఎదిరించి పోరాడే వాడు ధన్య జీవి. ఇక ముస్లిం లు చేసే హలాల్ గురించి చూద్దాం ... ******************************************* హలాల్ - Halal) ఇది అరబ్బీ మూలం, అర్థం : అనుమతించబడినది, ధర్మబద్ధమైనది. .... ప్రపంచంలోని దాదాపు ముస్లింలు ఈ ధర్మబద్ధ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ హలాల్ ఆహారపదార్థాల వాణిజ్యమార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా ఉందనీ ఒక అంచనా ... హలాల్ కు వ్యతిరేక పదం "హరామ్"దీని అర్థం : నిషేధింపబడినది, అధర్మమైనది మరియు అనైతికమైనది. హలాల్ చేయువారు ముస్లిమ్స్ ఎక్కువగా అల్లాహ్ నామమున అనీ 'Bismillah' "in the name of God".ఖురాన్ లో చెప్పబడిన Sura 16:115 చదువుతారు సాధారణంగా ఆహారపదార్థాల ఉపయోగ సంబంధమైన పదము. ఆహారపదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సాంప్రదాయం ముస్లిం ప్రపంచంలో సాధారణం. జంతువుల మాంసాలను, హలాల్ (జుబహ్) చేసిన తరువాత మాత్రమే భుజించుట ఆచరణీయము. హలాల్ అనగా ముస్లింలు ఒక జీవి ప్రాణం తీసేటప్పుడు వారియొక్క దైవాన్ని ఇలా ప్రార్థిస్తారు. 1) ఓ అల్లాహ్ ఈ జీవిని ఆహారం కోసం లేదా వృత్తి కోసం మేం ప్రాణం తీస్తున్నాం.ఈ చర్యలో మాకు ఎటువంటి పాపము అంటకుండా మమ్మల్ని రక్షించు. 2)ఈ జీవికి ఏ నొప్పిగాని బాధగానీ రాకుండా నువ్వే ఈశరీర బాధని తొలగించు. అనీ స్మరిస్తారు. మంత్రం చదివి కొస్తే హలాల్,,,,,అలా కాకుండా మనం కోసుకుంటే హారామ్....@ జీవాన్ని కోసేముందు దాని తలను ఉత్తరం దిశగా ఉంచి ,మీద భాగంలోకాకుండా మెడయొక్క క్రిందిభాగంలో నాళాలు తెగిపోయే విధంగా మాత్రమే సగం వరకు ముందుగా కోస్తారు గమనించండి ,దేనికంటే రక్తం మొత్తవెళ్లిపోవాలనీ ,లేదా మాంసం రోచిగా ఉండదు అనీ చెబుతారు ,కానీ దానికి వేరే అర్థముంది . మొత్తంగా ఒకేసారి మీద నరికితే /కొస్తే ,కోసినవారు ఏకంగా నరకానికి పోతారని వారి విశ్వాసం ప్రకారమే అలా చేస్తారు 1) ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనందరిని, మనకు తెలియకుండానే వాళ్ళు ఏ ప్రాణినైనా అల్లాహ్ కోసం వారి ప్రార్ధనతో అర్పించిన తర్వాతే జీవాన్ని మనకు మాంసంగా అమ్ముతున్నారు అంటే ఓ రకముగా మన భాషలో చెప్పాలంటే ఎంగిలి అని అర్ధం ! 2) మన హిందూ ఆచారం సాంప్రదాయం ప్రకారం మన దేవీదేవతలు ఏదైనా పదార్ధం తినుబండారాలు నైవేద్యం గాదేవుళ్ళకు పెట్టేముందు మనం రుచి చూడటం /ఎంగిలి చేయడం చేస్తామా ? 3) ఇదే పద్దతిని కొందరు క్రిష్టియన్ లు కూడా హిందూ దేవుళ్ళకు పెట్టిన ప్రసాదాలు తినరు . 4) అంతెందుకు ముస్లిం సోదరులు కూడా చాలామంది మన ఆర్య కటికలు కోసిన మేక ,కోడి ఇలాంటి మాంసాన్ని అస్సలు ముట్టరు . కావాలంటే వారినే అడిగి చుడండి . 5) ఈ విషయంలో ఒకందుకు సిక్కులను మనం గౌరవించాలి వాళ్ళు హలాల్ చేసిన ఏ ప్రాణినైనా తినరు . అదీ నిబద్ధత అంటే . 6) ఆఖరకు మన పెద్దలకు పెట్టరామాసకు /పితృదినాలలో పెట్టె నైవేద్యం కూడా వీళ్ళు హలాల్ చేసిందే అంటే దేవునికి అర్పించినదే అల్లాహ్ ఎంగిలి పెడుతున్నామంటే ఇక అర్ధం చేసుకోండి మనం ఇంతపెద్ద తప్పు చేస్తున్నామో సోదరులారా ! 7) వాళ్ళ కంటే ఎక్కువ మనోళ్లే పాటిస్తున్నారు హలాల్ చికెన్ సెంటర్లో అయితే వాళ్లకు జీతమిచ్చి మరి పెట్టుకుంటున్నారు... మైసమ్మకు మేకను కొస్తే హలాల్ చేస్తేనే పొత్తులో ఉంటాం అని అంటుంటారు ... మనోళ్ళకు నిజంగా ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే దానిపై స్పష్టత లేదు.... దీనిని మనోళ్లు అందరూ వ్యతిరేకించాలి ఈ విషయం సరిగ్గా తెలియక మనవాళ్ళు ఎగబడి హాలాల్ చేసిన మాంసాన్ని వాళ్ళ కొట్టుకెళ్ళి కొంటారు,పాపాన్ని మూటగట్టుకుంటున్నారు నిజానికి ఈ వృత్తి చేసేవారు చాలామంది రాత్రి సంసార సంబంధ కార్యక్రమాలు చేసుకొని,అలాగే లేచి స్నానాదులు చేయకుండా పొద్దున్నే 3,4 గంటలకు లేచి పశువధ శాలకు వెళ్లి మాంసం తెచ్చి వారి అపరిశుభ్ర మరకల దేహాలతో /బట్టలతో అమ్ముతూ దర్శనమిస్తూ ఉంటారు . అదే తోపుడు బండ్లపై ఇడ్లీ వడ దోస లాంటివి అమ్మేవాళ్ళని చుడండి ఎంత శుభ్రంగా మొహానికి బొట్టుతో కనిపిస్తారో ! 1800 ఏళ్ళ క్రితం మన భారతదేశంలో ముస్లిమ్స్ లేరు అనీ చరిత్ర చెబుతుంది కదా అప్పుడు మూగజీవాలైన మేక ,గొఱ్ఱె ,కోడీలను ఎవరు వధించారు ? మన ఆర్యకటికలే కానీ ,,,ముస్లిం లు భారత దేశానికి వచ్చినతరువాతే ఊచకోతలు ,దేవాలయాల విధ్వంసాలు ,హిందూ మతవిద్వేషాలు పెచ్చుమీరి నాశనం చేసేశారు . చాలామంది బలవంతముగా మతం మార్చారు .అంతకుముందు దేవుళ్ళకు పానకం వడపప్పు బెల్లం లాంటి ఆహారపదార్ధాలను పెట్టేవారిని నాశనం చేసేసి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనీ చెబుతూ దేవుళ్ళకు మద్యం మాంసం పెట్టడం అలవాటుగా చేసేసారు అని మా తాత చెబుతుండేవారు . ఇది ఎంతవరకు నిజమో చరిత్ర చదివితేనే అర్ధమవుతుంది . సనాతన ధర్మాన్ని పాటించేవారు మాంసాహారులుగా ఉండకూడదు . అనే నిజానిజాలు పక్కనబెడితే.మనిషికి దేవుడు తేలికపాటి ఆహారాన్ని నమిలి జీర్ణం చేసుకోగల చిన్న నోరు చిన్న పళ్లు ఇచ్చాడు. క్రూర మృగాలకీ మాత్రమే మాంసాహారాన్ని తినే వీలుగా అంత కొఱలులాంటి వాడియైన పళ్ళు /దంతాలు ఇచ్చాడు.మనం క్రూర మృగాల ఆహారం తింటే మన ఆలోచనలు కూడా క్రూరంగా తయారవుతాయి.మెదడు మొద్దు బారుతుంది . అందుకే గీతలో భగవానుడు వీటి గురించి వివరంగా చెప్పాడు.పాలు పెరుగు వెన్న నెయ్యి పప్పు దినుసులు కూరగాయలు పళ్ళు సాత్వికాహారం. హలాల్ లో ఏమి అంటూ కొస్తారు అనే కంటే, ఎలా కోయాలి, ఎక్కడ కోయాలి అనే దాన్ని మరింత వివరంగా గమనించండి. Its a very painful death to the animal, which die due to excessive bleeding at the neck. జంతు బలులు నిషేధించిన మన దేశంలో ఇంకా పోతురాజులు, బక్రీదులు యధేచ్చగానే జరుగుతూనే ఉన్నాయి. ఇది మన రాజ్యాంగానికి ఉన్న ఫవర్. మన ఖర్మ. ....@హిందువులారా జాగ్రత్త,..నిజానికి మనం హలాల్ నిషేదించాలి...దీనిని మనోళ్లు అందరూ వ్యతిరేకించాలి (ఇక్కడ నేను రాసినవన్నీ నామనసులోని అభిప్రాయాలు నేను కొందరితో ముఖాముఖిగా తెలుసుకున్న విషయాలే ,ఎవరినీ కించపరచాలని నా భావన కాదు ! తప్పుగా రాసివుంటే /తప్పులాగా అనిపితే మన్నించండి ) జై భారత్ !! జై హింద్ !!మీ నోముల ప్రభాకర్ గౌడ్ .

Rape అత్యాచారం

ఎదవ లాజిక్కులు.. ఎదవ తీర్పులు... మా ఊళ్లో రావిచెట్టుకింద రచ్చబండమీద కూర్చునే పెద్దలు ఇంతకన్నా విలువైన తీర్పు ఇవ్వగలరు.
మన డబ్బుతో పార్లమెంటులో మేపే గుడ్డి గుర్రాలకన్నా హీనంగా వుంది సుప్రీంకోర్టు జడ్జీల ఆలోచన. పార్లమెంటు గుడ్డిగుర్రాలు అనేక గుడ్డి చట్టాలను.. సామాజిక పర్యవసానాలు ఆలోచించకుండానే గుడ్డిగా ఆమోదిస్తుంటాయి. కానీ.. అది సర్వోన్నత న్యాయస్థానం కదా! సర్వోత్తమ న్యాయస్థానం కదా!! ది సుప్రీం కోర్టు కదా!!! ఇంత ముఖ్యమైన విషయంపై.. ఇంత ముఖ్యమైన, ఇంత చారిత్రక తీర్పు ఇచ్చిన రాజ్యాంగ బెంచిలో కనీసం ఒక మహిళా జడ్జి కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇలాంటి నేలవిడిచి సాము రాజ్యాంగ తీర్పుల వల్ల ఇప్పటికే భారతీయులు పడరాని పాట్లు పడుతున్నారు. బాలికా సంరక్షణ పేరిట ఇచ్చిన ఈ తీర్పు.. భారతీయ బాలికలకు ఏ మాత్రం మేలు చేసేది కాదు. ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో తీర్పు అంటే.. మీ చేతికి మట్టి అంటకుండా తీర్పు ఇవ్వడం కాదు. 1860నాటి భారత శిక్షాస్మృతిలో.. 15-18ఏళ్ల లోపు భార్యతో కలయిక అత్యాచారం కిందకు రాదని వుంది. దానిని ఎవడో ఇండిపెండెంట్ థాట్ అనే ఎన్జీవో సవాలు చేసింది. ఆడపిల్లలకు అన్ని విషయాల్లో 18 ఏళ్లు అనేది ప్రామాణికం అయినప్పుడు లైంగిక చర్య విషయంలో.. భార్య విషయంలో ఈ మినహాయింపు వుండడం గురించి పిటిషన్ వేసింది ఆ సంస్థ. కేసు పరిధిలో వున్న అంశం వరకే తీర్పు ఇచ్చి.. చేతులు దులుపుకోవడం కాదు. బాల్య వివాహంగా పరిగణించడానికి చట్టం వుంది. పురుషుడికి 21 సంవత్సరాలు, స్త్రీకి 18 సంవత్సరాలు. ఈ వయసు లోపు వివాహాలు బాల్య వివాహాల కింద లెక్క. ఈ ప్రమాణాలకు విరుద్ధమైన ప్రతి వివాహాన్ని రద్దయిన వివాహంగా న్యాయస్థానాలు సూమోటోగా ప్రకటించవచ్చు కదా! ఆ పని చేయవు. అసలు ప్యూబర్టీ, గర్భధారణ వయసు.. ఇత్యాది విషయాల్లో WHO నివేదికలు ఏం చెబుతున్నాయో పరిగణనలోకి తీసుకున్నారా? పౌష్టికాహారం, జీవన విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా లైంగిక జీవన విధానంలో వచ్చిన మార్పుల విషయం పరిగణనలోకి తీసుకున్నారా? అది బాల్య వివాహమో, వయోజన వివాహమో.. మరొకటో.. భార్యాభర్తల లైంగిక జీవితంలోకి టీవీ నైన్ లాగా రోతగా తొంగిచూసి తీర్పులిచ్చే అధికారం సుప్రీంకోర్టుకి ఎలా దఖలుపడింది? పద్దెనిమిది ఏళ్లలోపు యువతి ఐచ్ఛికంగా, ఇష్టపూర్వకంగా తన భర్తతో లైంగిక చర్యలో పాల్గొంటే.. భర్త చేసినది అత్యాచారం అనే ముద్రవేసి, కేసు నమోదు చేసి, బొక్కలో తోసే సర్వోన్నత అధికారం సుప్రీంకోర్టుకి ఎలా దఖలుపడింది?. ఇకనుంచి శోభనాలకు న్యాయస్థానాలనుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలా? వయోజన వయస్సుకి సంబంధించి ఈ ఒక్కదానికీ ఈ మినహాయింపు ఏమిటని ఏదో దిక్కుమాలిన స్వచ్ఛంద సంస్థ మిమ్మల్ని అడిగింది. సర్వోన్నతులైన మీరు మీ మకిలి బుర్రలను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించి అద్భుతమైన, చారిత్రకమైన తీర్పు ఇచ్చారు. పిల్లి గుడ్డిదయితే.. ఎలుకలు ఎకసెక్కాలాడతాయని సామెత. ఈ భారతదేశంలోని నూటా పాతికకోట్ల మందీ గుడ్డి జనాభా అని మీకు గట్టి నమ్మకం. అందుకే ఇలాంటి తీర్పులు ఇవ్వగలుగుతున్నారు. మి లార్డ్.. ఆ గబ్బిలాల కోట్లు వదిలేసి ఆలోచించండి. ఇంత చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన మీ దగ్గరకే.. అదే గబ్బిలాల గబ్బుకంపుతో, అదే స్వచ్ఛంద సంస్థ ఇంకో పిటిషన్ వేస్తుంది. ఆనందంగా స్వీకరించండి. సార్వజనీన వయోజన వయసు స్త్రీలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు. అన్ని విషయాల్లోనూ ఈ సూత్రం అమలు అవుతోంది. ఆ ఒక్క విషయంలోనే కదా మీ తీర్పు... కానీ ఓటు హక్కు విషయంలో అమలు కావడంలేదు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 సంవత్సరాలనుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. పురుషుడికి అన్ని వయోజన హక్కులు 21 సంవత్సరాలకు వస్తాయి. కానీ ఓటు హక్కు 18 ఏళ్లకే వస్తుంది. ఈ విషయాన్ని కొచెన్ చేస్తే కూడా ఇలాంటి తీర్పులే వస్తాయా?. ఆపండిక.. ఈ బ్యాండ్ మేళం తీర్పులు... సెడ్డ సిరాకేస్తోంది... ఈ చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన బ్యాండు మేళంలో కనీసం ఒక్కరంటే ఒక్కరు మహిళా జడ్జి వుండి వుంటే.. మినిమం 50 శాతం వివాహాలు బాల్యవివాహాలు అందులో చాల వరకూ ఆ పిల్ల ఇష్టాలతో ప్రమేయం లేకుండా జరిపేవి. అదెంత నరకమో మగవాళ్ళు మీకెలా తెలుస్తుంది ... ఆ పసిపిల్ల లతో మాట్లాడితే తెలుస్తుంది. ఎంతో మంది బాల్యవివాహాలు చేసుకున్న పిల్లలని కలిసాం ఓ ngo లో వర్క్ చేస్తున్నప్పుడు. కళ్ళలో నీళ్లు ఆగవు. మనిషిగా పుట్టినందుకు ఒక్కక్షణం అసహ్యం వేసి చచ్చిపోవాలి అనిపిస్తుంది. సామాజిక కోణాలు ఆర్ధిక కోణాలు తొక్కా తోలూ అంటూ సమర్ధించే ప్రయ్నతాలు చేయడం కాదు పెంచే స్థోమత లేనప్పుడు ఎందుకు కనడం పందులూ కంటాయి వాటికీ మనకీ తేడాలేదూ. ..మగపిల్లల కోసం హిందువుల్లో. అల్లాహ్ శపిస్తాడు అని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే అని ముస్లిం లూ సంతానం పెంచుకుంటూ పోవడం . తర్వాత పోషించే స్తోమత లేక ..వదిలించుకోడం. ఎలా సమర్ధిస్తాం ఇంత చెత్తని .ఇలాంటి తీర్పులు ఆలోచింపచేస్తాయి. మెంటల్ గా అలోచించి ..నిర్ణయాలు తీసుకునే వయసూ 18 ఏళ్ళకి వస్తుంది కనుక ఓటు హక్కు ,, పెళ్లి చేసుకొని ఆ తర్వాత పిల్లనీ సంరక్షించుకునే వయసూ వారిని చూసుకొని శారీరక శక్తి 21 ఏళ్ళకి వస్తుంది కనుక అలా రెండూ ఒకటే ఎందుకుండాలి. మార్పు కోసం జరిగే ప్రక్రియలో ఇలాంటివి అన్నీ ఉపయోగపడతాయి. ఇష్టప్రకారం జరిగితే ఆమె కోర్ట్ కి వెళ్ళదు కదా ..అలా జరగనప్పుడు భరించలేనప్పుడు ఎవరి సహాయంతో నైనా కోర్ట్ గడప తొక్కి బయటపడాలి అనుకున్నప్పుడు ..ఇలాంటి తీర్పులు ఆమెకి సహాయపడతాయి. ఆమె ఇష్టాయిష్టాలతో సంభధం లేకుండా పసిపిల్లను రమిచ్చేవాడు బతికినా చచ్చిన శవంతో సమానం ఆలాంటి వెధవలు నుండీ ఆమె కి రక్షణ అక్కర్లేదా ?.అంటారు. అది ఒక సామాజిక సమస్య మీద కేసు కాదు. అది ఒక సామాజిక సమస్యమీద బాధ్యతాయుత తీర్పు కాదు. కేవలం టెక్నికల్ కేసు. అన్ని విషయాల్లో స్త్రీల వయోజన వయసు 18 అయినప్పుడు.. ఆ ఒక్క విషయంలో 15-18 మినహాయింపు ఎందుకనే టెక్నికల్ అంశంపై కేసు. అసలు బాల్య వివాహమే చట్టవిరుద్ధం. బాల్యవివాహం కోర్టు దృష్టికి వచ్చినప్పుడు శిక్షలు వేయడం కాదు. ఆ వివాహాన్నే రద్దు చేయాలి.వివాహాాన్ని రద్దు చేయకుండా ఈ శిక్షలు ఏమిటి? వివాహం రద్దు కానంతవరకూ బాల్య వివాహాలు జరుగుతూనే వుంటాయి. మీరన్నట్టు 50 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు.. సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులు వాస్తవ పరిస్థితికి అనుగుణంగా, బాధ్యతాయుతంగా వుండాలి. పురుషుడినైన నా వయసు 18 ఏళ్లు... :P నేనొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ.. అది బాల్య వివాహం కింద లెక్కగట్టి.. పోలీసు స్టేషనులో రెండు చెంపలు వాయించి ఇంటికి పంపారు. పెళ్లయితే అయింది కానీ.. ఒక అచ్చటా ముచ్చటా లేకుండా.. 21వ ఏడాది వచ్చేదాకా ఎదురుచూపులతోనే సరిపోయింది.. ఈలోగా మా ఊళ్లో జమిలి ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యే ఎన్నిక, ఎంపీ ఎన్నికలు. పద్దెనిమిదేళ్ల పోరగాడినైన నాకు ఓటు హక్కు కూడా వచ్చింది. ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని ప్రత్యక్ష పద్ధతిలో.. తద్వారా ఒక రాష్ట్రపతిని, రాజ్యసభ సభ్యులను పరోక్షంగా గెలిపించుకునే అవకాశం నాకు పద్దెనిమిదేళ్ల పోరగాడిగా వున్నప్పుడే వచ్చింది. కానీ.. నా భార్యతో సంసారం చేసే అవకాశం మాత్రం దక్కలేదు. ఎందుకంటే నేను మైనర్ని. 21 ఏళ్లు రాకుండా పెళ్లే చేసుకోకూడదు. ఏదో దొంగచాటు పెళ్లి చేసుకున్నాం. కానీ 21 ఏళ్లు రాకుండా కాపురం చేయకూడదు. అది మన చట్టాలకు విరుద్ధం. మన దేశాన్నేలే ఎమ్మెల్యేలు, ఎంపీలను, మనకోసం చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలను మనం 18 ఏళ్లకే ఎన్నుకోవచ్చు. కానీ మనం గుట్టుగా సంసారం చేసుకోవడానికి 21ఏళ్లు రావాలి. మనకు ఓటు హక్కు వుంటుంది కానీ లైంగిక హక్కులు వుండవు. సామాజిక అభ్యుదయ సంస్థలకు ధిమాక్ ఖరాబ్ అయిందా? నేను.. 18 ఏళ్లకు వయోజన ఓటరుగా నా ఎమ్మెల్యేని, నా ఎంపీని.. నా దేశ నాయకుడిని ఓటు వేసి ఎన్నుకుంటున్నాను. కానీ.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25ఏళ్ల వయసు మినిమం వుండాలి. ఎంపీగా పోటీ చేసే వాడికి మినిమం 30 ఏళ్లు వుండాలి. ఈ వైరుధ్యాలేమీ మనకు కనిపించవా? దిమాఖ్ ఖరాబ్ స్వచ్ఛంద సంస్థలకు కొంత ఇంగితం వుండాలి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అవడానికి వుండాల్సిన కనీస వయసుతో పోల్చినప్పుడు.. ఓటేయడానికి వుండే వాడి కనీస వయసు ఎంత వుండాలి? ఇవన్నీ మనకు ఓకే.. యాక్సెప్టెడ్... స్త్రీజనోద్ధరణ పేరిట.. మరిన్ని క్రూర చట్టాలను మా మీద రుద్దమాకండి. మేము బాగానే వున్నాం. మమ్మల్ని బాగా వుండనివ్వండి. విన్ స్టన్ చర్చిల్ ఊరికే అనలేదు.. వీళ్లకు సొతంత్రం ఇస్తే వీళ్లను వీళ్లు పాలించుకోలేరు అని .

Reservation రిజర్వేషన్

Reservation ల పై చర్చలు జరగాలి.
లేదు అంటే రాబోవు కాలం లో reservation లకు వ్యతిరేఖంగా దేశ వ్యాప్తంగా పార్టీ స్థాపించవల్సి వస్తుంది ఇప్పుడు ఉన్న reservation లకు 50% ఉన్న BC లలో చాలా మంది వ్యతిరేఖంగా ఉన్నారు. OC జనాభా దాదాపు 20 % పై మాటే SC ST లలో ఉన్న పేద వారికి ఎలాగూ న్యాయం జరగడం లేదు వారు కూడా కలిస్తే పాలకుల పీటలు కదులుతాయి లేనిచో జరగబోవు నష్టానికి పాలకులు భాద్యులు అవుతారు. ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టినట్లు ఉన్నది ! ఉద్యమాలు ఇక ఉండవు అని చెప్పిన వారే ఉద్యమ తీవ్రతకు కారణం అవుతున్నారు ఉక్కుపాదం తో ఉద్యమాన్ని అణచి వేయాలి అని చూస్తే ఉప్పెనలా పెరుగుతుంది. ముస్లిం లకు reservation కల్పిస్తాం అని , మిగిలిన వారికి కూడా కొంత resevation లు పెంచుతాం. అని చెప్పి OC లలో ఉన్న పేద వారిని మరిచి పోయిన ప్రభుత్వం కు మేము కూడా ఉన్నాం అని గుర్తు చేస్తూ మాకు కూడా RESERVATION కావాలి అని అడుగుతున్న REDDY సామాజిక వర్గం వారు permission తీసుకొని శాంతియుతంగా ర్యాలీ గా వెళ్తూ ఉన్న వారి పై POLICE లు లాఠీ ఛార్జ్ చేసి ముఖ్య నాయకులను అక్రమ అరెస్ట్ చేశారు. అయ్యా ఇప్పటికి అయిన వాస్తవాలు గమనించి అందరికి తగిన న్యాయం చేయండి ! అన్ని కులాలల్లో పేద వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న reservation వ్యవస్థ వలన లాభ పడిన కుటుంబాలు మాత్రమే మళ్ళీ మళ్ళీ లాభ పడుతూ పేద వారికి అన్యాయం చేస్తున్నారు.

11, అక్టోబర్ 2017, బుధవారం

Color కలర్ Chemical కెమికల్

ఏంటన్నయ్యా.. తలకు వుండాల్సిన రంగు మొహానికి, మొహానికి వుండాల్సిన రంగు తలకు వచ్చింది ఒకరి చాలా విలువైన కామెంటు. .....
మొన్నామధ్య టీవీ చూస్తున్నప్పుడు.. చిక్ ఎగ్ షాంపూ అనే ప్రకటన చూశాను. MNC కార్పొరేట్ సంస్థ ప్రకటన. .... అరవైలలో పుట్టి, ఎనభైలలో యంగేజ్ లోకి ప్రవేశించిన వాళ్లకు చిక్ షాంపూ సుపరిచితం. తమిళ సినిమాల్లాగే.. తమిళ తీరపు ఇన్నోవేటివ్ ఉత్పత్తులు కొన్ని వుంటాయి. అందులో చిక్ ఎగ్ షాంపూ ఒకటి. అంగుళం పరిమాణంలో వుంటుంది. నాటి యువతరపు తలంటు సాధనం. అప్పటిదాకా షాంపూ అనేది ఎగువ మధ్యతరగతి వినియోగ వస్తువు. ఏ రెండొందలో మూడొందలో పెడితే కానీ ఓ డబ్బాడు షాంపూ వుండేది కాదు. పూర్తిగా సంపన్నవర్గపు వినియోగ వస్తువుగా వుండేది. చిక్ షాంపూ వచ్చాక పరిస్థితి తారుమారయింది. కూలినాలి జనంకూడా చిక్ షాంపూతో తలంటుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత.. మల్టీ నేషనల్ కంపెనీలు భారతీయ రూరల్ మార్కెట్ పై దృష్టి సారించాయి. పావలాకు, పది పైసలకు షాంపూలు అమ్మడం మొదలెట్టాయి. సర్ఫ్... సర్ఫ్ అనేది బ్రాండ్ పేరు. కానీ ఒక డిటర్జెంట్ పౌడర్ పేరు జనం మదిలో సర్ఫ్ అయిపోయింది. సర్ఫతో బట్టలు ఉతుక్కోవడం అనేది ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలు మాత్రమే చేసుకోగల ఖరీదైన పని. నిర్మా వచ్చాక.. ఆ పటాటోపాలన్నీ మాయం అయ్యాయి. ఒక డిటర్జంట్ వాషింగ్.. ఒక కెమికల్ క్లీనింగ్ తో మనం మన తలలు, ఒళ్లు, గుడ్డలు ఉతుక్కోవడం చాలా ఖర్చుతక్కువ వ్యవహారంగా మారింది. చాలా ఈజీ ప్రాసెస్ గా మారిపోయింది. ... మనం.. కెమికల్ ప్రాసెస్ అయిన ఆహార పదార్ధాల గురించి, వాటివల్ల వచ్చే అనర్ధాల గురించి బోలెడంత గాబరా పడుతుంటాం. కానీ.. నిత్యం మనం కెమికల్ ప్రాసెస్ లో వుంటాం. ద్రాక్షపళ్లను రసాయనాల్లో ముంచి తీస్తారట అని బోలెడ్ హాచ్చర్యపోతాం. కానీ.. మనను మనం నిరంతరం రసాయనాల్లో ముంచెత్తుకోవడం మర్చిపోతాం. కనీసం ఏడాదికోసారైనా కుంకుడురసం స్నానం చేయం, సునిపిండితో ఒళ్లు రుద్దుకోం. కుంకుడురసం.. మనకొక విష రసాయనం. ..... వ్యక్తిగతంగా నేను పాతికేళ్ల క్రితం చిక్ షాంపూని.. దేవుడిచ్చిన వరం అనుకున్నాను. కుంకుడుకాయలతో తలంటుకుని, కళ్లు మంటలు మండే దరిద్రం తప్పింది. గడచిన పాతికేళ్లలో తలకు చమురు రాయడం కూడా మానేశాను. తలకు చమురు రాయడం అనాగరికం. అన్ సైంటిఫిక్ అయిపోయింది. మనం సైన్సుని ఫాలో అవ్వాలి కదా! ... నేనివాళ పొద్దున్నే ఎంచగ్గా రెండు ఇడ్డెన్లు తిన్నాను అని చెప్పుకోలేకపోతున్నాను. ఫలానా బ్రాండ్ హోటల్లో తిన్నానని మాత్రమే చెప్పుకోగలుగుతున్నాను. ... మొన్నామధ్య వానల్లో.. వాహనం మోకాలులోతు దిగింది. ఆగిపోయింది. ఎలాగోలా స్టార్ట్ అయింది. కానీ బ్రేకులు వేసినా వేయకపోయినా కర్రుకర్రుమని సౌండ్ వస్తోంది. ముదిమి వయసుకు చేరకుండానే వస్తున్న మోకాళ్ల, కీళ్ల నొప్పుల సౌండ్ వినిపించింది. టీవీ చానళ్లలో మధ్యాహ్నం వినిపించే రణగొణ డాక్టర్ల సొద కనిపించింది. ... మనిషి.. యంత్రంకంటే గొప్ప. యంత్రానికి కందెన తైలాలు (Lubricants అంటారు) ఎంత ముఖ్యమో.. మనిషికి కందెన తైలాలు అంతకన్నా ముఖ్యం. నూనె వాడండి. నెయ్యి వాడండి. వెన్న వాడండి. ఆముదం వాడండి... వాడితే పోయేదేమీ లేదు.. మీ అనారోగ్యం తప్ప..

10, అక్టోబర్ 2017, మంగళవారం

Exercise వ్యాయామం

Exercise వ్యాయామం
*"లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజీవ్. ఆ డాక్టర్ అదో టైపు.* . *సంజీవ్* :- సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా? . *డాక్టర్:*- ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే !! . *సంజీవ్:*- వేపుళ్ళు మంచివి కావంటుంటారు.. . *డాక్టర్:*- ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది? . *సంజీవ్:*- వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు. . *డాక్టర్:*- అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు? *సంజీవ్:*- పోనీ మద్యం మానేయాలంటారా? *డాక్టర్:*- ఎవరయ్యా నీ బుర్ర పాడు చేసింది? వైన్ వచ్చేది పళ్ళ నుంచి కాదా ? బీరు బార్లీ నుంచే కదా! దర్జాగా తాగు. పళ్ళు తిన్నంత ఆరోగ్యం. *సంజీవ్:*- మరి ఐస్‌క్రీమ్‌స్, చాక్‌లెట్లు.. *డాక్టర్:*- లాభం లేదయ్యా! నేను చెప్పేది నీకు అర్ధం కావట్ళేదు. అవీ పాలు, కూరగాయల బై ప్రోడక్ట్సే కదా! *సంజీవ్:*- వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బ్రతుకుతారంటారు. నిజమేనా? *డాక్టర్:*-ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుస్షు ఎలాపెరుగుతుందయ్యా.ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువ కాలం ఉంటుందన్నట్లుంది !! *సంజీవ్:*- అది కాదు. సిట్ అప్స్ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు .. *డాక్టర్:*- చూడు.. వ్యాయామం చేయిస్తే చేతికండరాలు పెరుగుతాయి కదా. అలాంటాప్పుడు సిట్ అప్స్ చేస్తే పొట్ట పెరగదా? కోరి కోరి లావు అవుతానంటావేమయ్యా! *సంజీవ్:*- పోనీ మంచి ఫిగర్ కోసం ఈత కొట్టొచ్చా? . *డాక్టర్:*- ఈత కొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం. అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు? . *సంజీవ్:*- మరి బాడీకి ఓ షేప్ ఎలా వస్తుందో చెప్పండి? . *డాక్టర్:*- రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది? . *సంజీవ్:*- ???????😃😃 ...

Telangana History తెలంగాణ చరిత్ర

తెలంగాణ చరిత్ర
వికీపీడియా నుండి తెలంగాణ - Telangana రాజముద్ర శ్రీశైలం, కాళేశ్వరం, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగంను కాకతీయులు పాలీంచిన ఏరియా త్రిలింగ దేశం కాలగమనం లో "తెలంగాణ" అనే పదం గా మారింది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు (శ్రీనగర్-కన్యాకుమారి) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 కన్యాకుమారి-వారణాసి మరియు జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 నిజామాబాదు-జగదల్‌పూర్ హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-నిజామాబాదు-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీసీతారామాలయం, బాసరలో జ్ఞానసరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి.[2] దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించగా, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.[3] 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.[4][5] సంఖ్యా జాబితా అంశం విషయ సూచిక [దాచు] 1 జిల్లాలు-మండలాలు 2 భౌగోళిక స్వరూపం 3 చరిత్ర 4 తెలంగాణ పర్యాటక ప్రదేశాలు 5 ఆర్థిక పరిస్థితి 6 రవాణా సౌకర్యాలు 7 తెలంగాణ రాజకీయాలు 8 తెలంగాణ ప్రముఖులు 9 జనాభా 10 తెలంగాణ సాహిత్యం 11 తెలంగాణ సంస్కృతి 12 వ్యవసాయం 13 విద్యాసంస్థలు 14 కళలు 15 రాష్ట్ర చిహ్నాలు 16 ఆధునిక తెలంగాణ- కాలరేఖ 17 ఇవి కూడా చూడండి 18 మూలాలు 19 ఇతర పఠనాలు జిల్లాలు-మండలాలు[మూలపాఠ్యాన్ని సవరించు] 1.ఆదిలాబాద్ జిల్లా (18 మండలాలు) ఆదిలాబాద్ అర్బన్ (కొత్త మండలం), ఆదిలాబాద్ రూరల్, మావల (కొత్త), గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, బేల, బోథ్, జైనథ్, తాంసి, భీంపూర్ (కొత్త), తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ (కొత్త), ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ (కొత్త), ఊట్నూర్ 2. మంచిర్యాల జిల్లా (18) చెన్నూర్, జైపూర్, భీమారం (కొత్త), కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్ (కొత్త), హాజీపూర్ (కొత్త), మందమర్రి, దండేపల్లి, జన్నారం, కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, తాండూరు, భీమిని, కన్నెపల్లి 3. నిర్మల్ జిల్లా (18) నిర్మల్ రూరల్, నిర్మల్ అర్బన్ (కొత్త), సోన్ (కొత్త), దిలావర్‌పూర్, నర్సాపూర్-జి (కొత్త), కడెంపెద్దూర్, దస్తూరాబాద్ (కొత్త), ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సారంగపూర్, కుభీర్, కుంటాల, భైంసా, ముథోల్, బాసర (కొత్త), లోకేశ్వరం, తానూర్. 4. ఆసిఫాబాద్ (కొమురంభీం జిల్లా) (15) కాగజ్‌నగర్, సిర్పూర్-టి, దహెగాం, కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి (కొత్త), పెంచికల్‌పేట (కొత్త), ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, తిర్యాణి 5. కరీంనగర్ జిల్లా (16) కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, మానకొండూర్, తిమ్మాపూర్, వడ్లూరు బేగంపేట (బెజ్జంకి), గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, వీణవంక, వి.సైదాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట 6. జగిత్యాల జిల్లా (18) # జగిత్యాల, జగిత్యాల రూరల్, రాయికల్, సారంగపూర్, బీర్‌పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్ సంఖ్యా జాబితా అంశం 7. పెద్దపల్లి జిల్లా (14) పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్, కమాన్‌పూర్, రత్నాపూర్, మంథని, ముత్తారం 8. సిరిసిల్ల (రాజన్న జిల్లా) (13) సిరిసిల్ల, సిరిసిల్ల రూరల్ (కొత్త), వేములవాడ, వేములవాడ రూరల్ (కొత్త), చందుర్తి, రుద్రంగి (కొత్త), కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, బోయినపల్లి, వీర్నపల్లి (కొత్త) 9. మహబూబ్‌నగర్ జిల్లా (21) మూసాపేట, భూత్పూరు, హాన్వాడ, కోయల్‌కొండ, మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్ రూరల్, నవాబ్‌పేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, గండేడ్, దేవరకద్ర, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, దౌల్తాబాద్, కొస్గి, మద్దూర్, ఉట్కూరు, నర్వ 10. వనపర్తి జిల్లా (17) వనపర్తి, గోపాలపేట, పెద్దమందడి, ఘన్‌పూర్, కొత్తకోట, వీపనగండ్ల, పానగల్, పెబ్బేరు, చిన్న చింతకుంట, ఆత్మకూర్, అమరచింత, మదనపూర్, కోడేరు, అడ్డాకుల, ఏదుల 11. నాగర్‌కర్నూలు (22) బిజినేపల్లి, నాగర్‌కర్నూలు, పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, గొల్లాపూర్, చిన్నంబావి, పెంటవెల్లి, కల్వకుర్తి, మిడ్జిల్, ఉరుకొండ, వెల్దండ, వంగూర్, చారుకొండ, అచ్చంపేట, అమ్రాబాద్, పదిర, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, సిద్ధాపూర్ 12. గద్వాల (జోగులాంబ) జిల్లా (12) గద్వాల, ధరూర్, గట్టు, కె.టి.దొడ్డి (కొత్త), మల్దకల్, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ, రాజోలి (కొత్త), ఉండవెల్లి (కొత్త), అలంపూర్ 13. వరంగల్ అర్బన్ జిల్లా (12) వరంగల్, ఖిలా వరంగల్ (కొత్త), హన్మకొండ, కాజీపేట (కొత్త), హసన్‌పర్తి, ఐనవోలు (కొత్త), ధర్మసాగర్, వేలేరు (కొత్త), భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, ఇల్లంతకుంట (కొత్త) 14. వరంగల్ రూరల్ (కాకతీయ) జిల్లా (14) వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, శాయంపేట, పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపూర్, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ 15. భూపాలపల్లి (జయశంకర్) జిల్లా (19) భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, ఘణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం (కొత్త), మంగపేట, కాటారం, మల్హర్‌రావు, మహాముత్తారం, మహదేవపూర్, వెంకటాపురం (ఖమ్మం), వాజేడు 16. మహబూబాబాద్ జిల్లా (16) మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం, చిన్నగూడురు (కొత్త), దంతాలపల్లి (కొత్త), పెద్దవంగర (కొత్త), గంగారం (కొత్త) 17. జనగాం జిల్లా (13) జనగాం, లింగాల ఘన్‌పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట్ట, తరిగొప్పుల (కొత్త), రఘునాథ్‌పల్లి, గుండాల, స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూరు (కొత్త), జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల 18. సిద్దిపేట జిల్లా (22) సిద్దిపేట, సిద్దిపేట రూరల్, నంగునూర్, చిన్నకోడూరు, తొగుట, దౌలతాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, హుస్నాబాద్, కోహెడ, శనిగరం, హుస్నాబాద్ రూరల్ (అంతక్కపేట), గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోల్, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి 19. మెదక్ జిల్లా (20) మెదక్, హవేలీ ఘన్‌పూర్, పాపన్నపేట, శంకరంపేట రూరల్, శంకరంపేట (ఏ), టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడు, రామాయంపేట, నిజాంపేట, ఎల్దుర్తి, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, నార్సింగి, నర్సాపూర్, శివంపేట, కోడిపల్లి, కుల్చారం, చిల్పిచేడ్ 20. సంగారెడ్డి జిల్లా (26) సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపూర్, జిన్నారం, గుమ్మడిదల, పుల్కల్, ఆందోల్, వట్‌పల్లి, మునిపల్లి, హత్నూర, జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాలకల్, ఝరాసంఘం, కోహిర్, రాయ్‌కోడ్, నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, మనూర్, నాగిల్‌గిద్ద 21. నిజామాబాద్ జిల్లా (26) నిజామాబాద్, నందిపేట, మాక్లూర్, నవీపేట, రెంజల్, ఎడపల్లి, బోధన్, వర్ని, రుద్రూరు (కొత్త), కోటగిరి, డిచ్‌పల్లి, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వేల్పూరు, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, భీంగల్, సిరికొండ, ధర్పల్లి, మెండోరా (కొత్త), ఇందల్వాయి (కొత్త), ఆలూరు (కొత్త), ముగ్పల్ (కొత్త), నిజామాబాద్ ఉత్తరం (కొత్త), నిజామాబాద్ రూరల్ (కొత్త) 22. కామారెడ్డి జిల్లా (19) కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, గాంధారి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, బాన్సువాడ, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, మద్నూరు, బీర్కూరు, ఎల్లారెడ్డి, బిచ్కుంద, సదాశివనగర్, రామారెడ్డి (కొత్త), రాజంపేట (కొత్త) 23. నల్లగొండ జిల్లా (31) చండూరు, చిట్యాల, కనగల్, కట్టంగూరు, * మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, నార్కట్‌పల్లి, తిప్పర్తి, కేతేపల్లి, శాలిగౌరారం, గట్టుప్పల, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల, నిడమనూరు, పెదవూర, త్రిపురారం, మాడ్గులపల్లి, తిరుమలగిరి సాగర్, చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి (డిండి), గుర్రంపోడు, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పెద్ద అడిశర్లపల్లి, నేరేడుగొమ్ము 24. సూర్యాపేట జిల్లా (23) ఆత్మకూరు (ఎస్), చివ్వెంల, జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), నూతనకల్, పెన్‌పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరేడుచర్ల, నాగారం, చిలుకూరు, హుజూర్‌నగర్, కోదాడ, మఠంపల్లి, మేళ్లచెరువు, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి. మద్దిరాల, పాలకీడు, చింతలపాలెంయ (మల్లారెడ్డిగూడెం) 25. యాదాద్రి జిల్లా (15) ఆలేరు, రాజాపేట, మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మల రామారం, ఆత్మకూరు (ఎం), భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్, అడ్డగూడూరు, నారాయణపూర్ 26. ఖమ్మం జిల్లా (21) ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, బోనకల్, చింతకాని, మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, కామేపల్లి, రఘునాథపాలెం (కొత్త), కారేపల్లి, సింగరేణి 27. కొత్తగూడెం (భద్రాద్రి) జిల్లా (24) చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, భద్రాచలం, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక, సుజాతానగర్, చెంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కరకుగూడెం, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు 28. వికారాబాద్ జిల్లా (17) వికారాబాద్, మోమిన్‌పేట్, మర్పల్లి, పూడూరు, ధారూర్, బంట్వారం, కోట్‌పల్లి, నవాబ్‌పేట్, కుల్కచర్ల, దోమ, పరిగి, తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, బొంరాసిపేట్, కొడంగల్ 29. శంషాబాద్ (రంగారెడ్డి) జిల్లా (26) మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, కొందుర్గు, షాబాద్, చౌదరిగూడ, శేరిలింగంపల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, కొత్తూరు, షాద్‌నగర్, కేశంపేట్, గండిపేట్, కందుకూరు, మహేశ్వరం, ఆమన్‌గల్, కడ్తాల్, తలకొండపల్లి, సరూర్‌నగర్, బాలాపూర్, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల 30. మేడ్చల్ జిల్లా (14) మల్కాజిగిరి, మేడ్చల్, బాలానగర్, కుత్బుల్లాపూర్, దుండిగల్, నిజాంపేట్, కూకట్‌పల్లి, అల్వాల్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, ఉప్పల్, జవహర్‌నగర్, మేడిపల్లి, కాప్రా 31. హైదరాబాద్ జిల్లా (16) అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, బండ్లగూడ, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, నాంపల్లి, సైదాబాద్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, షేక్‌పేట్, తిరుమలగిరి, మారేడుపల్లి భౌగోళిక స్వరూపం[మూలపాఠ్యాన్ని సవరించు] తెలంగాణ భౌతిక పటము తెలంగాణా జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రం దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉంది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి ఆగ్నేయానికి వాలి ఉంది. ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. తెలంగాణకు సముద్రతీరం లేదు. ఈ రాష్ట్రం కృష్ణా మరియు గోదావరి నదుల పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది. తెలంగాణా నదులు నదులు: గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమానది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీనది రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. అడవులు: ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్ జిల్లాలలోఅడవులు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అగ్నేయప్రాంతం మరియు నల్గొండ జిల్లా నైరుతి ప్రాంతంలో విస్తరించియున్న అమ్రాబాదు పులుల అభయారణ్యం దేశంలోనే పెద్దది.[6] మెదక్, నిజామాబాదు జిల్లాలలో, నల్గొండ ఆగ్నేయ భాగంలోని దేవరకొండ డివిజన్‌లో కూడా అడవులు ఉన్నాయి. నల్లమల అటవీ రక్షిత ప్రాంతం, మంజీరా అభయారణ్యం, కిన్నెరసాని అభయారణ్యం, కవ్వాల్ అభయారణ్యం ఈ ప్రాంతంలోని ప్రముఖ రక్షిత అరణ్యాలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. 1948లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడే నాటికి 8 జిల్లాలు ఉండగా, 1956లో ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు 1978లో రంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో ఆదిలాబాదు జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. దక్షిణమున మహబూబ్ నగర్ జిల్లా, ఆగ్నేయమున నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతి తూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాదు. కర్ణాటక సరిహద్దుగా 3 జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దుగా 3 జిల్లాలు, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుగా 2 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా 3 జిల్లాలు ఉన్నాయి. చరిత్ర[మూలపాఠ్యాన్ని సవరించు] క్రీ.శ.1150 నాటికి తెలంగాణలో పాలించే రాజ్యాలు పురాతన రాతియుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఉనికిని కలిగియుంది. పూర్వ రాతియుగం కాలం నాటి ఆవాసస్థలాలు వేములపల్లి, ఏటూరునాగారం, బాసర, బోథ్, హాలియా, క్యాతూర్ తదితర ప్రాంతాలలో బయటపడ్డాయి. వాడపల్లి, వెల్టూరు, పోచంపాడు, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాలలో బృహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు.[7] షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి మంజీరా నది పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది.[8] ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది.[9] విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి మంజీరా నది పరీవాహక ప్రాంతం).[10] షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. మౌర్యుల కాలం:మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ (కరీంనగర్), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్, ఫణిగిరి, కొండాపురం, కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనది.[11] ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.[12] మెగస్తనీసు ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్ఠాన రాజ్యమే అయి ఉంటుందని ప్రముఖ చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.[13] శాతవాహనుల కాలం:శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్ఠానపురం మరియు ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల మరియు దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్రస్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు.[14] శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. విజయపురి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు.[15] ఇంద్రపాలనగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్‌నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి. ఆలంపూర్‌లో బాదామి చాళుక్యుల నిర్మించిన దేవాలయాలు బాదామి చాళుక్య కాలం: బాదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలోఉండేది.ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి-మొదటి భాగం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలంపూర్‌లో పలు సంఖ్యలో వీరి రాతిశాసనాలు ఉన్నాయి.తెలంగాణ శాసనాలు, మొదటి భాగంహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు.షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి మంజీరా నది పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది.[8] ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది.[9] విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి మంజీరా నది పరీవాహక ప్రాంతం).[16] షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. మౌర్యుల కాలం:మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ (కరీంనగర్), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్, ఫణిగిరి, కొండాపురం, కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనది.[17] ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.[18] మెగస్తనీసు ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్ఠాన రాజ్యమే అయి ఉంటుందని ప్రముఖ చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.[19] శాతవాహనుల కాలం:బొద్దు పాఠ్యం శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్ఠానపురం మరియు ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల మరియు దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్రస్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు.[20] శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. విజయపురి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు.[21] ఇంద్రపాలనగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్‌నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి. ఆలంపూర్‌లో బాదామి చాళుక్యుల నిర్మించిన దేవాలయాలు బాదామి చాళుక్య కాలం: బాదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలోఉండేది.[22] అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలంపూర్‌లో పలు సంఖ్యలో వీరి రాతిశాసనాలు ఉన్నాయి.[23] మొదటి పులకేశి యొక్క శాసనం నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో లభ్యమైంది. భవభూతి ఈ కాలం నాటి ప్రముఖ తెలంగాణ కవి. రాష్ట్రకూటుల కాలం: రెండో కీర్తివర్మతో చాళుక్యవంశం అంతంకాగా మాన్యఖేతం రాజధానిగా రాష్ట్రకూటులు పాలన సాగించారు. దంతిదుర్గుని కాలంలో తెలంగాణ మొత్తం రాష్ట్రకూటుల పాలనలో ఉండేది. తెలంగాణలో తొలి గద్యశాసనం "కొరివి శాసనం" ఈ కాలం నాటిదే. రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న వేములవాడ చాళుక్యులు బోధన్, వేములవాడలలో స్వతంత్ర పాలన చేశారు. కళ్యాణి చాళుక్యకాలం: రాష్ట్రకూట రాజు రెండోకర్కరాజును ఓడించి రెండో తైలపుడు కళ్యాణి చాళుక్యరాజ్యం స్థాపించాడు. ప్రముఖ కవి రన్నడు ఇతని ఆస్థాన కవి.[24] మహబూబ్‌నగర్ జిల్లా గంగాపురంలోని చెన్నకేశ్వస్వామి ఆలయాన్ని ఈ కాలంలోనే నిర్మించబడింది. ఈ ప్రాంతంలోవీరి పలు శాసనాలున్నాయి. ఇదే కాలంలో ఖమ్మం ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు పాలించారు. పాలమూరు జిల్లా మద్యభాగంలో కందూరి చోడుల పాలన కిందకు ఉండేది. కందూరి చోడులు: క్రమక్రమంగా కందూరు చోళరాజ్యం విస్తరించింది. తొలి కాకతీయుల కాలం నాటికి ఇది కాకతీయ రాజ్యం కంటే పెద్ద రాజ్యంగా విలసిల్లింది.[25] కందూరు, మగతల (నేటి మక్తల్), వర్థమానపురం (నేటి నంది వడ్డెమాన్), గంగాపురం, అమరాబాద్, భువనగిరి, వాడపల్లి, కొలనుపాక ఈ కాలంలో పెద్ద పట్టణాలుగా విలసిల్లాయి. విక్రమాదియుని కుమారుడు తైలపుని కాలంలో రాజ్యాన్ని రెండుగా చేసి ఇద్దరు కుమారులను రాజులుగా చేశాడు. దానితో ఇప్పటి నల్గొండ, పాలమూరు జిల్లా ప్రాంతాలలోవేర్వేరు పాలన సాగింది. గోకర్ణుడు తన రాజధానిని పానగల్లు నుంచి వర్థమాన పురానికి తరలించాడు. కందూరు చోడుల శాసనం ఒకటి మామిళ్ళపల్లిలో కూడా లభ్యమైంది. ఇదే కాలంలో వరంగల్ ప్రాంతంలో పొలవాస పాలకులు రాజ్యం చేశారు. అనుమకొండ (నేటి హన్మకొండ ప్రాంతం) మాత్రం కొలనుపాక రాజధానిగా కళ్యాణి చాళుక్యులే పాలించారు. కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు శిలాతోరణం కాకతీయ కాలం: తొలి కాకతీయుల కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఉత్తర తెలంగాణకే పరిమితమై ఉండగా రుద్రదేవుని కందూరు చోడరాజ్యంపై దండెత్తి వర్థమానపురాన్ని నాశనం చేసి తన సామంతులను పీఠం అధిష్టింపచేశాడు. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్ధారెడ్డి ఈ కాలం వాడే. ఈయన సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవియిత్రిగా ఖ్యాతిచెందింది. క్రీ.శ.1323లో ఢిల్లీ సుల్తానుల దాడితో కాకతీయ సామ్రాజ్యం అంతంకాగా తెలంగాణ ప్రాంతం సుల్తానుల వశమైంది. అయితే కొంతకాలానికే ప్రతాపరుద్రుని సేనానిగా పనిచేసిన రేచర్ల సింగమ నాయకుడు స్వతంత్రించి పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ఇది దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పాలన సాగించగా, ముసునూరి పాలకులు ఈశాన్య తెలంగాణలో కొంతవరకు పాలించారు. ఆ తర్వాత కృష్ణానదికి దక్షిణభాగం ఉన్న తెలంగాణ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. ఉత్తర భాగం మాత్రం గోల్కొండ సుల్తానుల అధీనంలో ఉండేది. కుతుబ్‌షాహీల కాలం: క్రీ.శ.1565లో విజయనగర సామ్రాజ్యం అంతం కాగా, దక్షిణ తెలంగాణ ప్రాంతం కుతుబ్‌షాహీల పాలనలోకి వచ్చింది. ఉత్తర ప్రాంతంలో అంతకు క్రితమే బహమనీలు పాలించారు. బహమనీ సామ్రాజ్యం ఐదు ముక్కలు అయిన పిదప గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్‌షాహీలు రాజ్యమేలారు. కుతుబ్‌షాహీల ఉచ్ఛదశలో కూడా కృష్ణానదికి దక్షిణాన ఉన్న తెలంగాణ ప్రాంతం (రాయచూర్ డోబ్‌లోని నడిగడ్డ ప్రాంతం) ఆదిల్‌షాహీల పాలన కిందకు ఉండేది. అయితే ఇది తరచుగా చేతులు మారింది. 1687లో ఈ ప్రాంతం మొఘలుల వశమైంది. ఆసఫ్‌జాహీల కాలం: క్రీ.శ.1724 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీలు పాలించారు. రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూ ప్రవేశపెట్టారు.[26] స్థానిక ప్రజలను అణకద్రొక్కి ఢిల్లీనుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది. క్రమక్రమంగా ప్రజలలో తలెత్తిన స్వేచ్ఛా భావనలతో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి 1925లో గోల్కొండ పత్రికను స్థాపించడం, 1930 నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు బూర్గుల రామకృష్ణారావు, పులిజాల వెంకటరావు, కొండా వెంకట రంగారెడ్డి, మాడపాటి హన్మంతరావు, మందుముల నరసింగరావు, రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావు తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రధాన వ్యాసం: తెలంగాణ విమోచనోద్యమం పాలమూరు పట్టణంలో విమోచనోద్యమానికి గుర్తుగా ఉన్న తూర్పుకమాన్ తెలంగాణ విమోచనోద్యమం: 1947, ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినను తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత పోలీసు చర్య ద్వారా 1948, సెప్టెంబరు 17ఇది భారతదేశంలో కలపబడింది. ఈ పోరాటంలో (తెలంగాణ విమోచనోద్యమం, తెలంగాణా సాయుధ పోరాటం) నాటి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించింది. 1948 నుంచి హైదరాబాదు రాష్ట్రంగా కొనసాగింది. వెల్లోడి మరియు బూర్గుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగావ్యవహరించారు. 1956 తర్వాత: 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరుగగా హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు మరియు ఆంధ్రరాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం, దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో 11 లోకసభ స్థానలలో విజయం సాధించింది. 1979లో హైదరాబాదు జిల్లా గ్రామీణ ప్రాంతాన్ని వేరుచేసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేశారు. 2001, ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం "ఐక్య కార్యాచరణ సమితి" చేతుల్లోకి వెళ్ళడంతో విద్యార్థులు, ఉద్యోగసంఘాలు చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటిని నియమించగా ఆ కమిటి 6 ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014 జూన్ 2నాడు దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ పర్యాటక ప్రదేశాలు[మూలపాఠ్యాన్ని సవరించు] పిల్లల మర్రి వృక్షం తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక, అధ్యాత్మిక, సాంస్కృతిక తదితర పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. ఆలంపూర్‌లో అష్టాదశ శక్తిపీఠం, బాసరలో జ్ఞానసరస్వతి దేవాలయం, భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం, నిజామాబాద్ సారంగపూర్ హనుమాన్ మందిరం (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), ఆర్మూర్ సిద్దులగుట్ట, నిజామాబాద్ ఖిల్లారఘునాధ ఆలయం (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), డిచ్ పల్లి ఖిల్లా రామాలయం, ( కేస్లాపూర్‌లో నాగోబా దేవాలయం, సిరిచెల్మలో సోమేశ్వరాలయం, జైనాథ్‌లో పల్లవుల కాలం నాటి ఆలయం, గంగాపూర్‌లో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చెన్నకేశ్వస్వామి ఆలయం, కదిలిలో పాపహరేశ్వరాలయం, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం,[27] కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయం, కాళేశ్వరంలో కాళేశ్వర-ముక్తేశ్వర ఆలయం, అచ్చంపేట సమీపంలో ఉమామహేశ్వర ఆలయం, నారాయణపేట సమీపంలో ఔదుంబరేశ్వరాలయం, సిర్సనగండ్లలో సీతారామాలయం, మన్యంకొండలో శ్రీవెంకటేశ్వరాలయం, మామిళ్ళపల్లిలో నృసింహక్షేత్రం, బీచుపల్లిలో పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం[28][29], మెదక్‌లో పెద్ద చర్చి, ఏడుపాయలలో భావాని మందిరం, కొత్లాపూర్‌లో ఎల్లమ్మ ఆలయం, ఝురాసంగంలో కేతకీ ఆలయం, కొల్చారంలో జైనమందిరం, నాచగిరిలోనృసింహాలయం, బొంతపల్లిలో వీరభద్ర ఆలయం, వరంగల్‌లో వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, నిజామాబాద్ జిల్ల లింబాద్రిగుట్టపై లక్ష్మీనృసింహస్వామి ఆలయం, బోధన్ ఏకచక్రేశ్వర ఆలయం, తాండూరులో భద్రేశ్వరస్వామి ఆలయం, అనంతగిరిలో పద్మనాభస్వామి ఆలయం, కీసరలో రామలింగేశ్వరస్వామి ఆలయం, చేవెళ్ళలో వెంకటేశ్వరస్వామి ఆలయం, చిలుకూరులో బాలాజీ ఆలయం, పాంబండలో రామాయణం కాలం నాటి శివాలయం, దామగుండంలో రామలింగేశ్వరాలయం, పాలంపేటలో రామప్పదేవాలయం, కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి ఆలయం, మేడారంలో సమ్మక్క-సారక్క గద్దె ఉన్నాయి.వరంగల్ జిల్లా మేడారానికి 20 కిలోమీటర్ దూరంలో బ్రిటిష్ కాలానికి చెందిన అద్భుతమైన మరో ప్రకృతి వనం అందులోనూ కొలకత్తా హౌరా బ్రిడ్జి నమూనా రెండు వేరు వేరు దీవులను ఏకం చేస్తూ కట్టిన మరో అద్భుతం లక్నవరపు సరస్సు. రామోజీ పిల్మ్ సిటి ఆదిలాబాదు జిల్లాలో ఎత్తయిన కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, కవ్వాల్ అభయారణ్యం, బత్తీస్‌ఘఢ్ కోట, హైదరాబాదులో బిర్లామందిరం, బిర్లా ప్లానెటోరియం, చార్మినార్, గోల్కొండ కోట, నెహ్రూ జూపార్క్, రామోజీ ఫిలిం సిటి, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లుంబినీ పార్క్, ఎన్టీయార్ గార్డెన్, సంఘీనగర్ వెంకటేశ్వరాలయం, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఖిల్లా, ఎలగందల్, రామగిరిఖిల్లా, ఖమ్మం జిల్లాలో రామాయణం కాలం నాటి పర్ణశాల, పాపికొండలు, కిన్నెరసాని అభయారణ్యం, నేలకొండపల్లి బౌద్ధస్తూపం, ఖమ్మం ఖిల్లా, పాలమూరు జిల్లాలో పిల్లలమర్రి వృక్షం, గద్వాల కోట, ఖిల్లాఘనపురం కోట, అంకాళమ్మ కోట, కోయిలకొండ కోట, పానగల్ కోట, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, వరహాబాదు వ్యూపాయింట్, మల్లెలతీర్థం, నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు, భువనగిరి కోట, దేవరకొండ దుర్గం, నిజామాబాదు జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అలీసాగర్ ప్రాజెక్టు, దోమకొండ కోట,నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజామాబాద్ కందకుర్తి త్రివేణి సంగమం (గోదావరి, మంజీరా, హరిద్రా నదులు కలిసే స్థలం) మరియు రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్రీ కేశవరావ్ హెగ్డేవార్ జన్మస్థలం, రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, కోట్‌పల్లి ప్రాజెక్టు, గండిపేట, శామీర్‌పేట చెరువు, వరంగల్ జిల్లాలో ఓరుగల్లు కోట, పాకాల చెరువు, మెదక్ జిల్లాలో మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యం, మంజీరా అభయారణ్యం, కొండాపూర్ మ్యూజియం, తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి[మూలపాఠ్యాన్ని సవరించు] హైటెక్ సిటి తెలంగాణలో హైదరాబాదు జిల్లా ఆర్థికంగా ముందంజలో ఉండగా ఆదిలాబాదు జిల్లా వెనుకబడి ఉంది. రాష్ట్రంలోని మొత్తం జీడిపిలో సేవారంగం వాటా 59.01% ఉంది. వ్యవసాయరంగంలో 55.7% మంది పనిచేస్తుండగా, సేవారంగంలో 32.6%, పారిశ్రామిక రంగంలో 11% పనిచేస్తున్నారు.[30] హైదరాబాదు జిల్లా నుంచి సేవారంగంలో సింహభాగం వాటా లభిస్తుండగా, పారిశ్రామిక రంగం నుంచి హైదరాబాదు పరిసరాలలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతం నుంచి, మెదక్ జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం నుంచి మరియు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు ప్రాంతం నుంచి లభిస్తుంది. తలసరి ఆదాయం:తెలంగాణ ప్రాంతపు ప్రజల తలసరి ఆదాయం రూ.36082గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే, హైదరాబాదులో అత్యధికంగా ఉండగా ఆదిలాబాదు, మహబూబ్ నగర్ జిల్లాల తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది. ఖనిజాలు: తెలంగాణలో అనేక ఖనిజ నిక్షిప్తమై ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మరియు ఆదిలాబాదు జిల్లాలలో బొగ్గు గనులు, ఆదిలాబాదు, నిజామాబాద్ మరియు వరంగల్ ప్రాంతాలలో ముడి ఇనుము, ఖమ్మం మరియు మహబూబ్‌నగర్ జిల్లాలలో ముగ్గు రాయి, రంగారెడ్డి మరియు నల్గొండ జిల్లాలలో సున్నపురాయి నిక్షేపాలు విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. పరిశ్రమలు: హైదరాబాదు మరియు పరిసరాలలో అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు లో, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో పారిశ్రామికవాడ ఉంది. మెదక్ జిల్లా పటాన్‌చెరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. బోధన్ లో చక్కెర కర్మాగారం, సిర్పూర్‌లో కాగితం పరిశ్రమ, కొత్తగూడెంలో ఎరువుల పరిశ్రమ ఉంది. విద్యుత్ కేంద్రాలు: 1921లో హుస్సేన్‌సాహర్ విద్యుత్ కేంద్రం స్థాపించబడింది. 1930లో నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం స్థాపితమైంది. 1956లో నాగార్జున సాగర్ నిర్మించిన పిదప విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1983లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయానికి ప్రాజెక్టుగా మార్చి జలవిద్యుత్ కేంద్రంగా మార్చారు. 2011లో ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టులో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్తగూడెంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. గట్టు ప్రాంతంలో భారీ సౌరవిద్యుత్ కేంద్రం స్థాపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వ్యవసాయం: ప్రాచీన కాలంలో ముఖ్యంగా కాకతీయుల కాలంలో తెలంగాణ ప్రాంతం వ్యవసాయికంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయాభివృద్ధి కోసం కాకతీయులు నిర్మించిన పలుచెరువులు నేటికీ కనిపిస్తున్నాయి. రెండొబేతరాజు కేసరి సముద్రం నిర్మించగా, గణపతిదేవుడు దేశం (తెలంగాణ) నలుమూలలా పలు భారీ చెరువులను నిర్మించాడు. గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు ప్రఖ్యాతిగాంచిన రామప్ప చెరువును త్రవ్వించాడు. తెలంగాణ ప్రాంతంలో సువాసనలువెదజల్లే బియ్యం పండుతున్నట్లు అప్పట్లోనే సాహితీవేత్తలు పేర్కొన్నారు.[31] కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల కాలంలో కూడా ఈ ప్రాంతం వ్యవసాయంలో పేరుగాంచింది. 1914లో వ్యవసాయాభివృద్ధి కోసం సహకార వ్యవస్థను ఏర్పాటుచేశారు. నిజాంసాగర్ (1935)జలాశయం, అలీసాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల నిర్మాణం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానము (1935) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో వరి, జొన్నలు, కందులు, ఆదిలాబాదు జిల్లాలో ప్రత్తి, నిజామాబాదు జిల్లాలో వరి, చెరుకు, మొక్కజొన్న, కరీంనగర్ జిల్లాలో వరి, ప్రత్తి, మెదక్ జిల్లాలో వరి, మొక్కజొన్న, వరంగల్ జిల్లాలో ప్రత్తి, వరి, నల్గొండ జిల్లాలో వరి, ప్రత్తి, రంగారెడ్డి జిల్లాలో వరి, కందులు అధికంగా పండుతాయి. రవాణా సౌకర్యాలు[మూలపాఠ్యాన్ని సవరించు] తెలంగాణ రాష్ట్ర రహదారుల జాబితా చూడండి కాచిగూడ రైల్వే స్టేషను వాయు రవాణా: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు మరియు విదేశాలకు వెళ్ళడానికి సదుపాయం ఉంది. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విమానాశ్రయంగా పలుసార్లు అవార్డులు పొందినది. విమానాశ్రయ ఏర్పాటుకు ముందు బేగంపేటలో డొమెస్టిక్ విమానాశ్రయం ఉండేది. వరంగల్, నిజామాబాదు, రామగుండంలలో కూడా విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన ఉంది. రైలు రవాణా: సికింద్రాబాదు మరియు కాజీపేటలు తెలంగాణలోని ప్రముఖ రైల్వేజంక్షన్లు. సికింద్రాబాదు దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము మరియు డివిజన్ కేంద్రము . హైదరాబాదు/సికింద్రాబాదు నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు రైళ్ళు ఉన్నాయి. నిజాంల కాలంలో 1874లో వాడి నుండి హైదరాబాదుకు రైలుమార్గం వేయబడింది. సికింద్రాబాదు-విజయవాడ మార్గం 1886లో పూర్తయింది. కాచిగూడ నుండి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, ఔరంగబాద్ ల మీదుగా మన్మాడ్ వరకు గోదావరి వ్యాలీ రైలు మార్గం 1899లో మొదలు పెట్టి 1901లో ప్రారంభమైంది. సికింద్రాబాదు నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా బెంగుళూరుకు, స్వాతంత్ర్యానంతరం బీబీనగర్ నుంచి నడికుడికి మార్గాలు వేశారు. నూతనంగా గద్వాల నుంచి రాయచూర్ మార్గం 2013, అక్టోబరు 12 న[32] ప్రారంభమైంది. దేవరకద్ర నుంచి రాయచూరు, నిజామాబాద్ నుంచి పెద్దపల్లితో సహా పలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి. తెలంగాణలో గ్రామాలను నగరాలను కలిపే ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు రోడ్డు రవాణా: దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా ఉత్తర-దక్షిణంగా వెళ్ళుచున్నది. పూనా-విజయవాడలను కలిపే 9వ నెంబరు జాతీయ రహదారి తూర్పు-పడమరలుగా మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాల మీదుగా పోతుంది. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళే జాతీయ రహదారి 16వ (కొత్త నంబరు 63) నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు జిల్లాల మీదుగా వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి భూపాలపట్నం వెళ్ళు జాతీయ రహదారి హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వెళ్తుంది. తెలంగాణ రాజకీయాలు[మూలపాఠ్యాన్ని సవరించు] తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014) చూడండి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు మరియు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 1948 వరకు ఈ ప్రాంతం హైదరాబాదు రాజ్యంలో భాగంగా ఉండుటచే ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేకుండేది. హైదరాబాదు రాజ్య విమోచనం అనంతరం 1952లో తొలిసారిగా ఈ ప్రాంతంలో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు మరియు తొలి లోకసభకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండేవి. తొలి లోకసభ ఎన్నికలలో కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటితో విజయం సాధించారు. హైదరాబాదు శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు లభించడంతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందినారు. 1956 నవంబరులో ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. 1969లో తెలంగాణ ఉద్యమం తలెత్తింది. 1971 లోకసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి పార్టీ 11 స్థానాలకు గాను పదింటిలో విజయం సాధించింది.[33] 1971-73 కాలంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందినారు. 11 నెలల రాష్ట్రపతి పాలన అనంతరం 1973 డిసెంబరు నుంచి 1978 మార్చి వరకు ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజాసమితి పార్టీ నాయకుడైన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి 1978 మార్చి నుంచి 1980 అక్టోబరు వరకు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. ఆ తర్వాత 1980 అక్టోబరు నుంచి మెదక్ జిల్లాకు చెందిన టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి పదవి పొంది 1982 ఫిబ్రవరి వరకు పనిచేశారు. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో 1983 ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లభించింది. 1989 డిసెంబరు నుంచి 1990 డిసెంబరు వరకు మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణకు చెందినవారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందలేరు. 2011లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన పిదప దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. 2001 ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వల్ల తెలంగాణ రాజకీయంగా చాలా మార్పులను లోనైంది. 2004 లోకసభ ఎన్నికలలో తెరాస కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 26 శాసనసభ స్థానాలు, 5 లోకసభ స్థానాలలో విజయం సాధించింది. 2009 లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 12, తెలుగుదేశం పార్టీ 2, తెరాస 2, ఎంఐఎం 1 స్థానాలలో విజయం సాధించాయి. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ ప్రాంతంలోని 119 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందినది. 2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి మెజారిటీ స్థానాలు సాధించి తెలంగాణ రాష్ట్రపు తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. తెలంగాణ ప్రముఖులు[మూలపాఠ్యాన్ని సవరించు] కోదండరాం హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరుపొందిన భాగ్యరెడ్డివర్మ, తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్దారెడ్డి,[34] సహజకవి బమ్మెరపోతన, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్, ప్రముఖ కవి, విమోచనోద్యమకారుడు దాశరథి రంగాచార్యులు, కవయిత్రి సరోజినీ నాయుడు, కవి పండితుడు వానమామలై వరదాచార్యులు, ఒగ్గు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మిద్దె రాములు, ప్రముఖ విమోచనోద్యమకారుడు, నిజాంపైబాంబులు విసిరిన నారాయణరావు పవార్, ప్రముఖ చిత్రకళాకారుడు కొండపల్లి శేషగిరి రావు, ప్రముఖ తెలంగాణవాది, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రముఖ సాహితీవేత్త జువ్వాడి గౌతంరావు, సుమతీ శతక కర్త బద్దెన, తొలి తెలుగు పురాణ అనువాదకుడు, మార్కండేయ పురాణం రచించిన మారన, భూమి కోసం, భుక్తి కోసం సాయుధపోరాటం చేసిన దొడ్డి కొమరయ్య, ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి రామానుజరావు, తెలంగాణ కాటన్‌గా ప్రసిద్ధి చెందిన నవాబ్ అలీ నవాబ్‌జంగ్ బహదూర్, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు, ప్రముఖ సంకీర్తనాచార్యుడు ముష్టిపల్లి వేంకటభూపాలుడు,[35] ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి సుబ్బారావు, నిజాం కాలంలో కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి,[36] సాయుధపోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ప్రముఖకవి వేములవాడ భీమకవి, సమరయోధుడు రాధాకిషన్ మోదాని, జానపద సాహిత్య సృష్టికర్త బిరుదురాజు రామరాజు, తెలంగాణ సాహితీమూర్తి లక్ష్మీ నరసింహశర్మ, ప్రముఖ సమరయోధుడు పులిజాల వెంకటరంగారావు, 13వ శతాబ్దికి చెందిన శివకవి పాల్కురికి సోమనాథుడు, కమ్యూనిస్ట్ నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం, తెలంగాణ సాయుధ పోరాట సేనాని రాజ్ బహదూర్ గౌర్, నిజాంపై తిరగబడిన షోబుల్లాఖాన్, గద్వాల కోటను నిర్మించిన పెద సోమభూపాలుడు,[37] సమరయోధుడు జమలాపురం కేశవరావు, ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల రెడ్డి, ప్రముఖ కవి సామల సదాశివ, సాహితీ వేత్త కూరెళ్ల విఠలాచార్య, సమరయోధుడు, సంఘసంస్కర్త పల్లెర్ల హనుమంతరావు,[38] ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక రూపు తీసుకువచ్చిన కొత్తపల్లి జయశంకర్, అడవి బిడ్డలకు అండగానిలిచిన రాంజీ గోండు, కుతుబ్‌షాహీల నాటి కవి మరింగంటి సింగనాచార్యులు, తెలంగాణ ఉద్యమకారిణి టి.ఎస్.సదాలక్ష్మి, తొలితరం తెలుగు కవి కొరవి గోపరాజు, నటుడు కత్తి కాంతారావు, విమోచనోద్యమకారుడు విశ్వనాథ్ సూరి, దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళాపాలకురాలు రుద్రమదేవి, హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య, సాహితీవేత్త కృష్ణస్వామి ముదియార్, తెలంగాణభాషలో కవితలద్దిన కాళోజీ నారాయణరావు, కవి మల్లినాథ సూరి, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, కవి, కళాకారుడు సుద్దాల హనుమంతు, బహుముఖ ప్రజ్ఞాశాలి వట్టికోట ఆళ్వారుస్వామి, తెలంగాణ రైతాంగపోరాటయోధుడు బందగి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణరెడ్డి, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు, సమరయోధుడు మందుముల నరసింగరావు, కళాకారుడు, కవి పల్లెర్ల రామ్మోహనరావు,[39] గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి, తెలంగాణలో కవులే లేరని హేళన చేయగా "గోల్కొండకవుల చరిత్ర"తో నోరుమూయించిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రముఖ కవి మరియు చరిత్ర పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి, తొలితెలుగు కవయిత్రి కుప్పాంబిక, ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ, తెలంగాణ ఉద్యమనేత బొజ్జం నరసింహులు, నిజాం పాలనను ఎదిరించి ప్రజలలో చైతన్యం తెచ్చిన[40] అనభేరి ప్రభాకరరావు, 15వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి చరిగొండ ధర్మన్న, మొఘల్ పాలనను అడ్డుకున్న సర్వాయి పాపన్న, కూచిపూడి నృత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిచెందిన రాజారాధారెడ్డి దంపతులు, ఆర్యసమాజ్ ప్రముఖుడు పండిత్ నరేంద్రజీ, విమోచనోద్యమకారుడు పాగ పుల్లారెడ్డి, నిజాంపై తిరగబడిన ఆదివాసి కొమురం భీమ్, ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కె.చంద్రశేఖర రావు, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కథా రచయిత అల్లం రాజయ్య, ప్రముఖ వాగ్గేయకారుడు రాకమచర్ల వేంకటదాసు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న కోదండరాం, విమోచనొద్యమకారుడు వెల్దుర్తి మాణిక్యరావు, ప్రముఖ విద్యావేత్త జి.రాంరెడ్డి, ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం, శాసనసభ స్పీకరుగా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాద రావు, చేనేత వస్త్ర పరిశోధకుడు నల్ల పరంధాములు, ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి, కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్న సి.హెచ్.విద్యాసాగర్ రావు, ప్రముఖ చరిత్ర పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు, విమోచనోద్యమకారిణి ఆరుట్ల కమలాదేవి, విప్లవకవి గద్దర్, ప్రముఖ రచయిత జ్వాలాముఖి, విమోచనొద్యమకారుడు మగ్దూం మొహియుద్దీన్, ప్రస్తుత కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన కొండా వెంకట రంగారెడ్డి,తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నిరాహారదీక్ష కీలక ఘట్టం అయితే.....స్వరాస్ట్రం కోసం అసువులు బాసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి.కణకణలాడే నిప్పును ముద్దాడి తన శ్వాస ఆశ ఆశయం తెలంగాణ రాష్ట్రం అంటూ ఉద్యమ సాక్షిగా మంటల్లో మాడి మసి అయిన విద్యార్థి శ్రీకాంతాచారి, 2009 డిసెంబరు 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు[41]. ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులలో కొందరు. జనాభా[మూలపాఠ్యాన్ని సవరించు] 2001 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,09,87,271 కాగా[42], 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతపు జనాభా 3,52,88,768 గా ఉంది. రంగారెడ్డి జిల్లా 52.96 లక్షల జనాభాతో ప్రథమస్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా 40.42 లక్షలతో రెండో స్థానంలో, హైదరాబాదు జిల్లా 40.10 లక్షల జనాభాతో మూడవ స్థానంలో ఉంది. నిజామాబాదు జిల్లా చివరి స్థానంలో ఉంది. జిల్లాల వారీగా జనాభా క్రింది విధంగా ఉన్నది [దాచు]జిల్లా పేరు 2001 ప్రకారం జనాభా 2001 ప్రకారం స్థానం 2011 ప్రకారం జనాభా 2011 ప్రకారం స్థానం ఆదిలాబాదు జిల్లా 2488003 9 2737738 9 కరీంనగర్ జిల్లా 3491822 4 3811738 4 నిజామాబాదు జిల్లా 2345685 10 2552073 10 వరంగల్ జిల్లా 3246004 6 3522644 5 ఖమ్మం జిల్లా 2578927 8 2798214 8 మెదక్ జిల్లా 2670097 7 3031877 7 రంగారెడ్డి జిల్లా 3575064 2 5296396 1 హైదరాబాదు జిల్లా 3829753 1 4010238 3 మహబూబ్ నగర్ జిల్లా 3513934 3 4042191 2 నల్గొండ జిల్లా 3247982 5 3483648 6 తెలంగాణ సాహిత్యం[మూలపాఠ్యాన్ని సవరించు] తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి ప్రాచీనకాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం విలసిల్లింది. ఆలంపూర్‌కు చెందిన మంథాన భైరవుడు 10వశతాబ్దంలోనే ప్రసిద్ధ "భైరవతంత్రం"అనే సంస్కృత గ్రంథం రచించాడు.[43] 13వ శతాబ్దిలో గోన బుద్ధారెడ్డి "రంగనాథ రామాయణం" ద్విపద ఛందస్సులో రచించాడు. ఇది తొలి తెలుగు రామాయణంగా ప్రసిద్ధి చెందినది. గోన బుద్ధారెడ్డి సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి పొందింది. ఈమె వేయించిన బూదపురం శాసనం నేటి భూత్పూర్‌లోని దేవాలయంలో ఉంది. తెలంగాణ సాహిత్యంలో కాకతీయ యుగం స్వర్ణయుగంగా భావించబడుతుంది. గణపతిదేవుని బావమరిది జాయపసేనాని నృత్యరత్నావళిని రచించాడు. తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కుర్కి సోమనాథుడు తెలుగు సాహిత్యంలోనే ఆదికవిగా నిలిచాడు.[44] వేములవాడ భీమకవి ఈ కాలం నాటివాడే. 13వ శతాబ్దికే చెందిన బద్దెన కాకతీయుల కాలంలో సుమతీ శతకము రచించాడు. తొలి పురాణ అనువాద మహాకవి మారన ఇదే కాలానికి చెందినవాడు. ప్రతాపరుద్రుని ఆస్థానకవి విద్యానాథుడు రచించిన పలు గ్రంథాలలో ప్రతాపరుద్ర యశోభూషణం ప్రఖ్యాతిచెందింది. మూడు తరాల కాకతీయ చక్రవర్తుల వద్ద మంత్రిగా పనిచేసిన శివదేవయ్య కూడా మహాకవి. 14వ శతాబ్దికి చెందిన కాచ-విఠలులు తొలి తెలుగు జంటకవులుగా ప్రసిద్ధి చెందారు. చమత్కార చంద్రిక రచించిన విశ్వేశ్వరుడు కూడా 14వ శతాబ్దికి చెందిన కవి. తెలుగులో తొలి యక్షగాన రచయిత సర్వజ్ఞ సింగభూపాలుడు కూడా ఇదే కాలానికి చెందినవాడు. అనపోత నాయకుని కుమారుడు రెండో సింగభూపాలుడు స్వయంగా కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయనగర రాజు బుక్కరాయల కోడలైన గంగాదేవి కాకతీయుల ఆడబిడ్డ, ఈమె కవయిత్రిగా పేరుపొందింది.[45] తొలి తెలుగు వచనకర్త కృష్ణమాచార్యులు కూడా 14వ శతాబ్దికి చెందినవాడు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు స్వయంగా కవి అయి శివయోగసారం లాంటి పలు రచనలు చేశాడు. సింహాసన ద్వాత్రింశిక రచించిన కొరవి గోపరాజు కూడా ఇదే కాలానికి చెందినవారు. సిగ్మండ్ ప్రాయిడ్ కంటే ముందే మానసిక సమస్యలు విశ్లేషించిన వాడిగా గోపరాజు ప్రఖ్యాతిచెందారు. చిత్రవిచిత్రాలతో కూడిన "చిత్రభారతం" రచయిత చరిగొండ ధర్మన్న 15-16వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి. జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణలో తెలుగు సాహిత్య ప్రభ తగ్గిననూ మరింగంటి సింగరాచార్యులు తన కవిత్వంతో ఇబ్రహీం కుతుబ్‌షానే మెప్పించి అగ్రహారాన్ని పొందాడు. అప్పటి కవులు ఇతనిని మల్కిభరాముడని అభివర్ణించారు. ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థానకవి అద్దంకి గంగాధరుడు ప్రతిభావంతుడైన కవి. ఇతను రచించిన తపతి సంవర్ణోపాఖ్యానం ప్రఖ్యాతిచెందింది. పొన్నెగంటి తెలగనాచార్యుడు 16వ శతాబ్దికి చెందినకవి. కులీకుతుబ్‌షా ఫారసీ కవులను ఆదరించాడు. ఇతని కాలంలో ఫారసీ, ఉర్దూలలో పలు రచనలువెలువడ్డాయి. కులీకుతుబ్‌షా సంస్కృత "శుకసప్తతి"ని "యాతినామా" పేరుతో ఫారసీలోకి అనువాదం చేయించాడు. ఈ కాలంలోనే దోమకొండ సంస్థానం సాహిత్యానికి పేరుగాంచింది. 1600 ప్రాంతానికి చెందిన కాసె సర్వప్ప "సిద్దేశ్వర చరిత్ర" రచించాడు. సురభి మాధవరాయల ఆస్థానకవి ఎలకూచి బాలసరస్వతి తెలుగులోనే మొట్టమొదటి మహామహోపాధ్యాయ కవిగా గణతికెక్కాడు. కొందరు గుంటూరు జిల్లా కవిగా భావించే కాకునూరి అప్పకవి తెలంగాణ వాడేనని బూర్గుల నిరూపించాడు. తానీషా వద్ద పనిచేసే అక్కన్న-మాదన్నల మేనల్లుడు కంచెర్ల గోపన్న (భక్తరామదాసు) కీర్తనలు తెలుగువారికి శతాబ్దాల నుంచి సుపరిచితమే. తెలంగాణ భాషలో కవితలద్దిన కాళోజీ ఆసఫ్‌జాహీల కాలంలో (1724-1948) తెలంగాణ సాహిత్యం కుంటుపడింది. తెలుగుభాషను అణగద్రొక్కి బలవంతంగా ప్రజలపై ఉర్దూభాష రుద్దడం, తెలుగు కవులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో కాకతీయుల కాలంలో వెలుగులు విరజిమ్మిన తెలంగాణ సాహిత్యం ఆసఫ్‌జాహీలకాలంలో దారుణంగా దెబ్బతిన్నది. అక్కడక్కడా తెలుగులో రచించిన గ్రంథాలు కూడా వెలుగులోకి రాకుండా చేశారు. ఈ కాలంలో స్థానిక స్థల మహాత్మ్యాలు, దేవాలయ చరిత్రల విశేషాలు రచించినవి తర్వాతి కాలంలో బయటపడ్డాయి. భజనకీర్తనలు కూడా ఈ కాలంలో వ్రాయబడ్డాయి. మన్నెంకొండ హనుమద్దాసు, రాకమచర్ల వేంకటదాసు, వేపూరు హనుమద్దాసు ఈ కాలంలోని సంకీర్తన త్రిమూర్తులుగా పరిగణించబడతారు. రాజవోలు ప్రభువు ముష్టిపల్లి వేంకటభూపాలుడు వేలాది సంకీర్తనలు రచించాడు. ఆసఫ్‌జాహీలు స్వయంగా కవిపండితులకు ఆదరణ ఇవ్వకున్ననూ స్వతంత్రంగా పాలన కొనసాగించిన సంస్థానాలలో మాత్రం సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆధునిక కాలంలో కవిపండితులకు నిలయమైన గద్వాల సంస్థానం ప్రత్యేకతను కలిగియుంది. సాహితీవేత్తలు ఈ సంస్థానాన్ని విద్వత్గద్వాలగా అభివర్ణించేవారు. గద్వాల సంస్థానాధీశూలు కూడా స్వయంగా కవులుగా ఉండి పలు రచనలు చేశారు. తరుచుగా కవితాగోష్టులు నిర్వహించేవారు. గద్వాల సంస్థానాధీశులు కవులను ఎంతగా అభిమానించేవారంటే, వారి కోసం ఒక ప్రత్యేక ద్వారాన్నే ఏర్పాటు చేసి, వారు నడిచే మార్గంలో తెల్లటి వస్త్రాన్ని పరిచి, కవిపండితుల పాదధూళిని భరిణెలో భద్రపర్చి వాటిని తిలకంగా నుదుటికి పెట్టుకొనేవారు. గద్వాల సంస్థానంతో పాటు పరిసర సంస్థానాలైన వనపర్తి సంస్థానం, జటప్రోలు సంస్థానాధీశూలు కూడా గద్వాల సంస్థానంతో పోటీపడ్డారు. వీరి మధ్య తరుచుగా కవితా గోష్టులు జరిగేవి. తిరుపతి వేంకటకవులను కూడా ఓడించిన ఘనత వనపర్తి సంస్థాన కవులకు దక్కింది. 1920 తర్వాత తెలంగాణలో నీలగిరి, గోల్కొండ పత్రిక లాంటి తెలుగు పత్రికలు రాకతో సాహిత్యం మరింత అభివృద్ధి చెందింది. అదివరకు వెలుగులోకి రాని కవులు, వారి రచనలను సురవరం ప్రతాపరెడ్డి తన గోల్కొండ పత్రికలోనే, దానికి అనుబంధమైన సుజాత సాహిత్య పత్రికలోనూ ప్రచురించేవారు. తెలంగాణలో కవులే లేరనే ఒక ఆంధ్రుడి సవాలును తీసుకొని 356 కవుల చరిత్ర, వారి రచనలతో "గోల్కొండ కవుల సంచిక" పేరుతోఒక గ్రంథాన్నే ప్రజల ముందుకు ఉంచిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలుగులో తొలి సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇతనికే లభించింది. గ్రంథాలయోద్యమం సమయంలో ప్రతి ప్రాంతంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, సాహిత్య గ్రంథాలు ఉంచడంతో సాహితీ అభిమానులు కూడా అధికమయ్యారు. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య లాంటి కవులు నిజాం దురాగతాలను ఎలగెత్తడానికి పద్యాలనే ఆధారం చేసుకోగా, కాళోజీ నారాయణరావు తెలంగాణ భాషలోనే కవితలు చేసి ప్రజలను జాగృతం చేశారు. వట్టికోట ఆళ్వారుస్వామి, మందుముల నరసింగరావు, బూర్గుల రామకృష్ణారావు లాంటి వారు విమోచనోద్యమ కాలంలోనే సాహిత్య రచన చేశారు. సామల సదాశివ బహుభాషావేత్త, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి ఆధునిక తెలుగు సాహితీవేత్తలలోనే అగ్రగణ్యులుగా ప్రసిద్ధి చెందారు. నందిని సిద్ధారెడ్డి, అందెశ్రీ, గోరటి వెంకన్నలు తెలంగాణపై కవితలు రచించారు. తెలంగాణ సంస్కృతి[మూలపాఠ్యాన్ని సవరించు] ప్రధాన వ్యాసం: తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఉత్సవం పండుగలు: బోనాల ఉత్సవాలు మరియు బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇవి కాకుండా మిగితా తెలుగు ప్రజలు జరుపుకొనే సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, రంజాన్ తదితర ముఖ్య పండుగులను ఇక్కడి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2014 జూన్ 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలును రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వు జారీచేసింది.[46] భాష: తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల భాష తెలుగు. సంపూర్ణ తెలంగాణావారు మాట్లాడే తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా కలుస్తాయి. ఆదిలాబాదు జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండటంతో ఆ జిల్లాలో మరాఠి భాష ప్రభావం కొంత ఉంది. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాదు జిల్లాల కర్ణాటక సరిహద్దు గ్రామాలలో కన్నడ భాష ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతపు గ్రామీణ తెలుగు భాష యాసలో మిగితా ప్రాంతపు తెలుగు భాషకు కొద్దిగా వైరుధ్యం కనిపిస్తుంది. తెలంగాణాలోని ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కొద్దిగా స్వచ్ఛమైన తెలుగు వినిపిస్తుంది. వస్త్రధారణ: తెలంగాణ ప్రాంతము ఉత్తర-దక్షిణ భారతదేశానికి వారధిగా ఉండటం మరియుకొన్ని శతాబ్దాల నుంచి ఈ ప్రాంతంపై దండయాత్రలుచేసి పాలించడం, ఇతర ప్రాంతాల వారు వచ్చి నివాసం ఏర్పర్చుకోవడంతో ఇక్కడ మిశ్రమ వస్త్రధారణ ఉంది. అలాగే మారుతున్న ధోరణులు, సినిమా-అంతర్జాలం-అంతర్జాతీయీకరణ తదితరాల వల్ల కూడా ఇక్కడి వస్త్రధారణ పట్టణ ప్రాంతాలలో చాలా మార్పుచెందింది. అయిననూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పురుషులు మోకాళ్లపైకి ఉండే ధోవతి, మహిళలు చీరలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంది. గిరిజన ప్రాంతాల మహిళలు మాత్రం వారి సంప్రదాయక దుస్తులు ధరిస్తారు. వ్యవసాయం[మూలపాఠ్యాన్ని సవరించు] తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి. రెండో ప్రధాన పంట జొన్నలు. ప్రాజెక్టులు, నదులు, కాలువలు ఉన్న ప్రాంతాలలో వరి అధికంగా పండుతుంది. జొన్నల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాదు జిల్లాలు తొలి మూడు స్థానాలలో ఉన్నాయి. కందుల ఉత్పత్తికి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం మరియు రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం పేరుగాంచాయి. మొక్కజొన్న ప్రధానంగా మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్ జిల్లాలో పండుతుంది. పెసర్ల పంటలో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. నూనెగింజల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా నిజామాబాదు జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. చెరుకు ఉత్పత్తిలో మెదక్ జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో ఉంది. మిరపపంటలో ఖమ్మం జిల్లా అగ్రస్థానం పొందగా, పత్తి ఉత్పత్తిలో ఆదిలాబాదు జిల్లా ముందంజలో ఉంది. పొగాకు, ఉల్లి సాగులో మహబూబ్ నగర్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. మొత్తం సాగుభూమి విస్తీర్ణంలో భౌగోళికంగా పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్ అగ్రస్థానంలో ఉండగా పూర్తిగా నగర ప్రాంతమైన హైదరాబాదు జిల్లాలో ఎలాంటి సాగుభూమి లేదు. విద్యాసంస్థలు[మూలపాఠ్యాన్ని సవరించు] ప్రధాన వ్యాసం: తెలంగాణాలోని విశ్వవిద్యాలయాల జాబితా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం 1959లో వరంగల్లో నిట్ (NIT) జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం స్థాపించబడింది.1919లో హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1964లో ఎన్.జీ.రంగా విశ్వవిద్యాలయం, జే.ఎన్.టి.యూ, 1974లో హైదరాబాదు విశ్వవిద్యాలయం, 1976లో వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రారంభించబడినవి. 2000 తర్వాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నిజామాబాదులో తెలంగాణ విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్‌లో పాలమూరు విశ్వవిద్యాలయం, కరీంనగర్‌ లో శాతవాహన విశ్వవిద్యాలయ, నల్గొండలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రారంభించబడ్డాయి. హైదరాబాదులో టటా ఇంస్టిట్యుట్ ఆఫ్ సొశ్యల్ సైంసెస్, కళలు[మూలపాఠ్యాన్ని సవరించు] తెలంగాణలోని పలు ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందినవి. ఆదిలాబాదు జిల్లా నిర్మల్ కొయ్యబొమ్మలకు పేరుగాంచగా, వరంగల్ జిల్లా పెంబర్తి ఇత్తడి సామానుల తయారికి ప్రసిద్ధి చెందింది.[47] ఆదిలాబాదు జిల్లా కేంద్రం రంజన్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. నారాయణపేట జరీచీరల తయారీకి పేరుపొందింది. రాష్ట్ర చిహ్నాలు[మూలపాఠ్యాన్ని సవరించు] తెలంగాణ రాష్ట్ర వృక్షంగా-జమ్మిచెట్టు, రాష్ట్ర పండు-మామిడి పండు, రాష్ట్ర గీతం-జయ జయహే తెలంగాణ, రాష్ట్ర చిహ్నం-తెలంగాణ అధికారిక చిహ్నం, రాష్ట్ర భాష-తెలుగు, రాష్ట్ర జంతువు-జింక, రాష్ట్ర పక్షిగా-పాలపిట్ట, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు, రాష్ట్ర చేప-కొర్రమట్ట (కొర్రమీను)[48], రాష్ట్ర క్రీడ-కబడ్డీ ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారుచేసింది.[49] ఆధునిక తెలంగాణ- కాలరేఖ[మూలపాఠ్యాన్ని సవరించు] తెలంగాణ తెలంగాణ వ్యాసం చూడండి తెలంగాణ అధికారిక చిహ్నం తెలంగాణ అధికారిక చిహ్నం [దాచు]కాలరేఖ 1948 నుండి 1948 సెప్టెంబరు 17: నిజాం కబందహస్తాల నుంచి విముక్తిపొందింది. 1948 ఆగస్టు 22: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు షోయబుల్లాఖాన్ హత్య జరిగింది. 1950 1953 ఆగస్టు 25 న తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి మరణించాడు. 1956 ఫిబ్రవరి 20 న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. 1956 నవంబరు 1 న తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. 1960 1961 ఫిబ్రవరి 6 న తెలంగాణకు చెందిన ప్రముఖ సమరయోధుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు. 1969 ఫిబ్రవరి 28 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ధ్యేయంగా యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు. 1969 మార్చి 29 న ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1970 1970 జూలై 24 న తెలంగాణ పితామహుడిగా పేరుపొందినకొండా వెంకట రంగారెడ్డి మరణించాడు. 1976 మార్చి 31 న ప్రముఖ తెలంగాణ సాయుధపోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి మరణించాడు. 1978 ఆగస్టు 15 న హైదరాబాదు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడింది. 1990 1990 జూన్ 21 న తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. 2000 2007 ఏప్రిల్ 16 న హైదరాబాదు నగరపాలక సంస్థ స్థానంలో "గ్రేటర్ హైదరాబాదు"(హైదరాబాదు మహానగరపాలక సంస్థ) ఏర్పడింది. 2009 నవంబరు 29 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది. 2009 డిసెంబరు 9 న భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు. 2010 2011 మార్చి 10 న ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ ఉద్యమం నిర్వహించబడింది. 2013 జూలై 30 న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది. 2013 అక్టోబరు 3 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2013 డిసెంబరు 5 న తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది. 2014 జనవరి 7 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 13 న తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడినది. 2014 ఫిబ్రవరి 18 న లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 20 న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014 మార్చి 1 న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. 2014 మార్చి 4 న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2014 జూన్ 2 న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం. v t e 1948, సెప్టెంబర్ 13 ఆపరేషన్ పోలో లో భాగంగా భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. 1948, సెప్టెంబరు 17: నిజాం కబందహస్తాల నుంచి విముక్తిపొందింది. 1948, ఆగస్టు 22: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు షోయబుల్లాఖాన్ హత్య జరిగింది. 1953, ఆగస్టు 25: తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి మరణించాడు. 1955, డిసెంబరు 10: నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. 1956, ఫిబ్రవరి 20: తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. 1956, నవంబరు 1: తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ లో భాగమైంది. 1961, ఫిబ్రవరి 6: తెలంగాణకు చెందిన ప్రముఖ సమరయోధుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు. 1963,జూలై 26: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1967, ఫిబ్రవరి 24: హైదరాబాదు రాజ్యపు చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ మరణించాడు. 1967, ఏప్రిల్ 11: హైదరాబాదులో ఈసీఐఎల్ స్థాపించబడింది. 1967, ఆగస్టు 4: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. 1969, ఫిబ్రవరి 28: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ధ్యేయంగా యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితిని స్థాపించారు. 1969, మార్చి 29: ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1970, జూలై 24: తెలంగాణ పితామహుడిగా పేరుపొందినకొండా వెంకట రంగారెడ్డి మరణించాడు. 1971, సెప్టెంబరు 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవి చేపట్టాడు. 1973, డిసెంబరు 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిలోకి వచ్చాడు. 1976, మార్చి 31: ప్రముఖ తెలంగాణ సాయుధపోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి మరణించాడు. 1976, సెప్టెంబరు 24: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు పండిత్ నరేంద్రజీ మరణించాడు. 1976, మే 12: ప్రముఖ సమరయోధుడు, రచయిత, రాజకీయ నాయకుడు మందుముల నరసింగరావు మరణించాడు. 1978: ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి పదవిలోకి వచ్చాడు. 1978, ఆగస్టు 15: హైదరాబాదు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడింది. 1991, జూన్ 21: తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. 2000, మార్చి 7: హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి నక్సలైట్ల దురాగతాలకు బలయ్యాడు. 2007, ఏప్రిల్ 16: హైదరాబాదు నగరపాలక సంస్థ స్థానంలో "గ్రేటర్ హైదరాబాదు" (హైదరాబాదు మహానగరపాలక సంస్థ) ఏర్పడింది. 2008, మార్చి 15: రంగారెడ్డి జిల్లా శంషాబాదులో అంతర్జాతీయ విమానాశయం ప్రారంభించబడింది. 2009, అక్టోబరు 19: దేశంలోనే అతిపొడవైన ఫైఓవర్ (పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే) హైదరాబాదులో ప్రారంభమైంది. 2009, నవంబరు 29: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది. 2009, డిసెంబరు 9: భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు. 2011, మార్చి 10: ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చి ఉద్యమం నిర్వహించబడింది. 2013, జూలై 30: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది. 2013, అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2013, డిసెంబరు 5: తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది. 2014, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2014, ఫిబ్రవరి 13: తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడింది. 2014, ఫిబ్రవరి 18: లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది. 2014, ఫిబ్రవరి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014, మార్చి 1: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. 2014, మార్చి 4: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ 2014 జూన్ 2 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2014, జూన్ 2: భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఇవి కూడా చూడండి[మూలపాఠ్యాన్ని సవరించు] ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు‎ తెలంగాణ విమోచనోద్యమం తెలంగాణా సాయుధ పోరాటం తెలంగాణ చరిత్ర (పుస్తకం) తెలంగాణ విశిష్ట దేవాలయాలు తెలంగాణ చిత్రకళలు తెలంగాణ కాలరేఖ తెలంగాణ ప్రముఖులు తెలంగాణ వ్యవసాయరంగం తెలంగాణ చరిత్ర తెలంగాణ అధికారిక చిహ్నం తెలంగాణ యాస తెలంగాణా బీసీ కులాల జాబితా తెలంగాణ ఆసరా ఫింఛను పథకం తెలంగాణ గ్రామజ్యోతి పథకం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ...

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...