25, సెప్టెంబర్ 2017, సోమవారం

కులం Caste B. R. Ambedkar

కులం Caste B. R. Ambedkar
Nomula Prabhakar Goud 944006 0852. కులాలు చరిత్ర - అంబేద్కర్ అంబెడ్కర్ గారు బ్రిటిష్ USA తెల్లవారు, వారి దుష్ట కపట కుట్రలతో మన కులాలు మన కులవ్యవస్థ ఇదీ అని వాళ్ళు దుర్మార్గంగా వక్రీకరించి మనకే చెబుతూ రాసిన రాతలనుంచి చదివి "కుల నిర్మూలన" అనే పత్రం ఎలా రాశారో చూశాము. మొదటగా వివరించాల్సిన అంశం ఏంటంటే నాగరికత అనేది నామమాత్రంగా అయినా లేని బ్రిటిష్, యూరోపియన్ ఆటవిక జాతులు సంస్కృతి, సభ్యత, సాంప్రదాయం అనేవి ఏమాత్రం లేని జాతినుంచి వచ్చి, బైబిల్ ప్రకారం సృష్టి మొదలై 6,000 ఏళ్ళు మాత్రమే అనే సందిగ్ధావాస్త నుంచి ఇప్పటికీ బయటకి రాలేకుండా ఉన్న మందమతులు అనంత కాల ప్రభావం, కాల పట్టిక, యుగాలు, మహాయుగలు, యుగసంధులు ఏమాత్రం తెలియని నాగరికులు మన సంస్కృతి, వర్ణాలు, కులాలు తమ దుష్ట బుద్ది కారణంగా వక్రీకరించి మనకే చెప్పడం. దానికి తగ్గట్టుగా మన శాస్త్ర, సాహిత్య, వేదాలు, మనుస్మృతి ని వక్రీకరించి మనకే నేర్పడం, దానిని చదివిన అంబెడ్కర్ లాంటి బుద్ది జీవులు ఎద్దుల్లా తలలూపి అవే నిజమనే మూర్ఖ భావజాలానికి బలి అవ్వడం మన దేశ దౌర్భాగ్యం. ప్రధానంగా అంబెడ్కర్ గారి రచనలు విదేశీ మేతావుల రచనలతో బాటుగా, రాసిన రచనల సారంగా "#HistoryOfCasteInIndia" అనే పుస్తకం ఆధారంగా మాత్రమే విద్వేష భావజాలానికి గురి అయ్యాయి. విదేశీయుల టేబుళ్లపై మిగిలిపోయిన బ్రెడ్డు ముక్కలు ఏరుకొచ్చి మన దేశంలో స్పెషల్ సేల్ పెట్టిన విధంగా, వాళ్ళు తమ స్వార్ధానికి, కుట్రపూరితంగా చేసిన మాయోపాయ మోసాలకి వక్రీకరించి రాసుకున్న ( అనంత ప్రపంచ చరిత్రను మొత్తం #6000 కాలానికి కుదించే దారుణ ప్రక్రియ) కులాలు, కులాల చరిత్ర, బ్రిటిష్ వాళ్ళు చేసిన ఈ కుట్ర రచనలన్నీ కూడా నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుసుకుని రాసిన అంబెడ్కర్ . 1916 మే 9న డాక్టర్ A.A. Goldenweiser వారి నరవర్గ శాస్త్ర సెమినార్ లో చదివిన "భారత్ దేశంలో కులాలు" అనే శీర్షిక గల పత్రంలో ముఖ్యాంశాలు విశ్లేషణ. దీనిలో అంబేద్కర్ గారి ప్రసంగ పాయింట్స్ క్రింద ఇచ్చి కాస్త వినిశితంగా విశ్లేషిస్తూ ఆయన ఎలాంటి బ్రిటిష్, పాశ్చాత్య చరిత్రకారులు, History Of Caste వంటి పుస్తకాలను, ఆధారంగా రాసిన అంబెడ్కర్ గారి "భారత దేశంలో కులాలు" వివరణ పేజీ 17 లో ఈ విధంగా ప్రస్తావించారు. 1. హిందూ సమాజం అన్ని సమాజాలలాగే వర్గాలతో ఏర్పడిందనే విషయాన్ని ముందు మనం గుర్తు ఉంచుకోవడం చాలా అవసరం. తొలుత తెలియవచ్చే వర్గాలు ఏమిటంటే i. బ్రాహ్మణులు లేదా పురోహిత వర్గం ii. క్షత్రియులు లేదా యోధ వర్గం iii. వైశ్యులు లేదా వాణిజ్య వర్గం iv. శూద్రులు లేదా చేతిపనివారు, సేవక వర్గం ఇది ప్రధానంగా వర్గ వ్యవస్థ. ఇందులోని వ్యక్తులు అర్హత గలిగిన వారైతే వర్గాలు మార్చుకోవచ్చూను. ఈవిధంగా వర్గాలు తమ సిబ్బందిని మార్చుకుంటూ ఉండేవారన్న వాస్తవం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి. వివరణ: #సనాతనధర్మం ప్రకారం #వర్ణవ్యవస్థ మాత్రమే ఆచరణీయమైనది, శాస్త్ర సమ్మతము. దాని ఆధారంగానే పైన ఇచ్చిన నాలుగు వర్ణాలు, ప్రజలు తాము ఏ కులంలో జన్మించినా తమ గుణ, కర్మ, విభాగాల అనుగుణంగానే వర్ణ ధర్మాన్ని స్వీకరించి ఆచరిస్తూ సమాజ పురోగతికి తోడ్పడే, పాలు పంచుకునే విధానం ఉండేది. అంబేద్కర్ గారు చెప్పినదీ అదే, ప్రజలు ఏ వర్ణాన్నైనా మార్చుకుంటూ ఉండేవారు. అంబేద్కర్ గారు పైన ఇచ్చిన ఈ ఒక్క పాయింటు ఆయన కులాలపై రాసిన ఇతర అన్ని విద్వేష పూరిత వక్రీకరణలను కూకటి వేళ్ళతో సహా చీల్చి చెండాడుతుంది. 2. #భారతదేశం లో కులం ఉన్నంత కాలం హిందువులు కులాంతర వివాహం చేసుకోరు, బయటివారితో అలాంటి సామాజిక సంబంధాలు పెట్టుకోరు. ప్రపంచంలో వేరే ప్రాంతాలలోకి హిందువులు వలసపోతే భారతీయ కులం ప్రపంచ సమస్య అవుతుంది. వివరణ: ఇలాంటి తప్పుడు వివరణ ఎప్పుడూ గాజుగదిలో నివసించేవారు విసిరే రాయి వంటిదే. బ్రిటిష్ వారి, తెల్లవారి జాత్యహంకారం, నల్లవారిపై బానిసతత్వం, భారతీయులపై వారి కుట్రపూరిత పైశాచికత్వం ఇవేవీ కనబడలేదు మరి అంబేద్కర్ గారికి. ప్రపంచంలో తెల్లవారు కాలు మోపిన ప్రతి చోటా మనుషులను, జాతులను బానిసల్లా మార్చి పీల్చి పిప్పి చేసిన వైనం ప్రపంచానికి తెలుసు. టూకీగా ఈ విద్వేషభరితమైన విషపు భావజాలానికి సమాధానం చెప్పాలి అంటే నేటి ప్రపంచపు స్థితిగతులనే చూసి చెప్పుకోవచ్చు. USA, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం, ఇలా ఏ మూల తీసుకున్నా భారతీయులు, ఉదాహరణగా కనబడుతున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్నారు. బయటివారితో సామాజిక సంబంధాలు పెట్టుకున్నారు. ప్రపంచంలో ఏమూల చూసినా భారతీయులు, హిందువులు, సనాతన ధర్ములు అందరూ వలస వెళ్లారు. 3. కులవ్యవస్థ పుట్టుక, ఏర్పాటు, వ్యాప్తి మాత్రమే చర్చిస్తాను. సుప్రసిద్ధ నరవర్గ శాస్త్రవేత్తల ప్రకారం భారత దేశ జనాభా ఆర్యుల, ద్రావిడుల, మంగోలుల, స్కిథియన్ల సంమిశ్రం. ఈ ప్రజల సముదాయాలన్నీ తెగల దశలో ఉన్నపుడు శతాబ్దాల క్రితం వివిధ దశల నుండి వివిధ సంస్కృతులతో భారతదేశంలోకి అడుగుపెట్టాయి. వారంతా ఈ దేశంలోకి తమకంటే ముందు వచ్చిన వారితో పోరాటం చేస్తూ, త్రోవ చేసుకుంటూ వచ్చారు. భారతదేశాన్ని రూపొందించిన వివిధ తెగల ప్రజలు పూర్తిగా సమ్మిళితం కాలేదనే మాట ఒప్పుకోవాల్సిందే. మానవవర్గ విశ్లేషణ ప్రకారం ప్రజలంతా #సంకరజాతి వారే. (ఇది కూడా శ్రీధర్ కేత్కర్ వ్రాసిన పుస్తక ఆధారమే) వివరణ: విలియం జోన్స్ (1746-1794) భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కలకత్తాలో పని చేసేవారు.ఇతను సంస్కృతానికీ, యూరపియన్ భాషలకూ గల సంబంధం కనుగొన్న తొలివ్యక్తి. ఇతనూ, మాక్స్‌ముల్లర్, ఈ "ఆర్య" అనే శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. 1784లో అప్పటి గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్ కి ఉత్తరం రాస్తూ విలియం జోన్స్ " మన మతాన్ని " ఎలా వ్యాపింపజేయాలి? రోముకు చెందిన ఏ చర్చి కూడా హిందువులను క్రిస్టియన్లుగా మార్చజాలదు.అందుకే బైబిల్ ను సంస్కృతంలోకి అనువదించి స్థానిక భారతీయ మేధావి వర్గంలో వ్యాపింపజేయాలి " అంటూ వ్రాశాడు. ఇక మాక్స్‌ముల్లర్ 1886 సంవత్సరంలో తన భార్యకు రాసిన ఉత్తరంలో "నేను ఈ వేదం అనువదించటంతో భారతదేశం తలరాత ' గొప్పగా ' మారబోతూ ఉంది. అది ఆ దేశంలోని అనేక కోట్లమంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఈ వేదం వారి మతానికి ఆధారమైన వేరు. అది వారికి చూపించి,5000 ఏళ్ళనాటి వారి నమ్మకాలను పెకలించివేస్తుంది. (Source : The Life and Letters of the Rt. Hon.Fredrich Max Muller, edited by his wife,1902, volume 1.p. 328) ఇలాంటి భావజాలాలు, విషాలు, విద్వేషాలు, అసత్యాలు, వక్రీకరణలు భారత జాతిలో, ప్రజల్లో చొప్పించిన మోసపూరిత, కుట్రల, దూరాగతాల బ్రిటిష్ అక్రమార్కుల రాతలు నిజమని నమ్మి అంబేద్కర్ రాసిన విద్వేష పూరిత రాతలు ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి. భారత దేశ జనాభా ఆర్యుల, ద్రావిడుల, మంగోలుల, స్కిథియన్ల సమ్మిశ్రం అనేది ఎంత బూతో బ్రిటిష్ కుక్కల ఆర్యన్ సిద్ధాంతాన్ని ప్రపంచ పురావస్తు శాఖ, చరిత్రకారులు నిర్ద్వందంగా త్రిప్పి కొట్టడమే చెబుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అనే మాట కూడా ఎక్కడా వినని అంబేద్కర్. 4. ఇదివరకే ఏకాజాతిగా రూపొందిన గుంపుల బృందాన్ని కులం చీలుస్తున్నది. కులవ్యవస్థ పుట్టుకను విశదీకరించటం అంటే ఈ చీలిక విధానాన్ని విశదీకరించటమే అవుతుంది. వివరణ: వర్ణ వ్యవస్థ అనేది కులాలు అనేవి మానవ నిర్మితం అలాగే మనిషి అహంకారానికి గీసుకున్న భారతీయ గ్రంధాలలో పేర్కొన్న వర్ణ వ్యవస్త ప్రధానమైనది. సామాజిక కట్టుబాట్లకి, పురోభివృద్ధికి రాచ బాట. ఒక సమాజం బలంగా ఉండాలంటే విద్యా, ఆర్దిక, సేవ, సైనిక రంగాలు గట్టి పునాదులతో ఉండాలి. అందులో భాగంగా బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు గా ప్రజలను విభజించారు. ఎవరికీ తెలిసిన విద్య వారు నిర్వర్తించే అవకాశం కల్పించింది హిందు ధార్మిక వ్యవస్థ. ఉదాహరణకు : జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణాం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిసువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం).వేదం నేర్చిన వారే విప్రులు,బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా "వేద విధులతో సంచరించక,దేవతలను పూజించక,వివేకములు లేక, కేవలం లౌకిక వాక్కులనాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు. ఇప్పుడు కుల వ్యవస్త లో అసలు కథ మొదలు అవుతుంది.... భారతీయ సమాజాన్ని దెబ్బ తీయాలి అంటే వృత్తులను విడగొట్టి ద్వేషం పుట్టించలి. ముఖ్యంగా విద్యాబుద్ధుల వ్యవస్త మరియు సేవా వృత్తుల వ్యవస్థ వీటి మద్య ద్వేషం రగిలితె మొత్తం హిందువులను ఇతర మతాలలోకి మార్చవచ్చు. అనుకున్నదే తఢువూ మేఖలేే వక్రేకరించిన పుస్తకాలను జనాలలోకి తీసుకు రావడం మొదలు పెట్టరు. సంస్కృత పండితులను నిజాలు చెప్పకుండా అడ్డుకున్నారు, చంపారు. అంతక ముందు తురక జాతుల దండ యాత్రలో బాగా దెబ్బ తిన్న వ్యవస్థలో కొద్దీ కొద్దీ గా దెబ్బ తిన్న ధార్మిక వర్ణ వ్యవస్థ బ్రిటిష్ కాలం లో కి వచ్చేపటికి పూర్తిగా భ్రస్టు పట్టి పోయింది. తురక పాలన లో జహంగీర్, ఔరంగజేబుల పాలన గురించి గొప్పగా చెప్పొచ్చు. ఒక్కొక్క హిందువుని చావబాది మతం మార్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. అగ్రవర్ణ , శూద్ర వర్ణ భేదాలు తారాస్తాయికి చేరాయి. బ్రిటిష్ పాలనలో కుల వృత్తులను వంశ పారం పర్యం గా చూపించారు. అంతక ముందు వర్ణ వ్యవస్థ లో గొడవలు జరిగిన సాక్ష్యాలు చాలా తక్కువ. 200 ఏళ్ల పాలన లో చాలా మటుకు గ్రంథ సంపదను వారికి అనుకూలంగా రాసుకున్నారు. వాటిని మన దేశం దేశం లో ఉన్న స్వార్ధ బుద్దులకి అందించారు. వారే మన కమ్యూనిస్ట్ మహా ఉత్తములు. 5. ఫ్రెంచ్ పండితుడు సేనార్ట్, నెస్ ఫీల్డ్, H. రైస్లే, వాల్టర్ బేగ్ హాట్ లు వర్ణించిన కులవ్యవస్థ, ఇది రెండు లక్షణాలు కలిగి ఉన్న ఒక సామాజిక బృందం. i. ఆ బృందంలో పుట్టిన సభ్యులకు మాత్రమే అందులో సభ్యత్వం ఉంటుంది. అలా పుట్టినవారందరూ అందులో సభ్యులు. ii. వెలుపలి వారిని పెళ్లి చేసుకోకుండా ఒక కఠోరమైన సామాజిక శాసనం ద్వారా సభ్యులను నిషేధిస్తారు. 6 లకు వివరణ: ఈ పైన పేర్కొన్న సేనార్ట్, నెస్ ఫీల్డ్, Sir H. రైస్లే, వాల్టర్ బేగ్ హాట్ లు, మాథ్యూ ఆర్నాల్డ్, Sir డేంజల్ ఇబ్బేట్సన్, గాబ్రియేల్ టార్డ్ అలాగే దేశీయ వక్రీకరణ రచయిత శ్రీధర్ v కేట్కార్ లు రాసిన అబద్ద వక్రీకరణ రాతలు అంబేద్కర్ గారు కుల నిర్మూలన, కులాల పుట్టుక ఇతర రచనలకు మూలాలు కావడం, ప్రపంచమంతా చెత్త బుట్టలో వేసిన ఆర్యన్ థియరీ, బైబిల్ ప్రేరిత ఆరువేల చరిత్ర, ప్రజల చరిత్ర, మహోన్నతమైన భారతీయ భూభాగంలో వలసవాదుల వలసలు లాంటి కల్పిత ఊహాజనిత వక్రీకరణ రాతలు ఇంకా ఇప్పటికీ కూడా అంబేద్కర్ వాదులు, వామపక్ష వాదులు పట్టుకుని వెళ్లాడటం ఎంతవరకు సమంజసం. మానవుడు అనే ప్రతి సంఘంలో ఉండే ఈ కట్టుబాట్లను దురుద్దేశపూరితంగా వేలెత్తి చూపడం దుర్మార్గమైనా, ఇటువంటి ఆచార వ్యవహారాలు సంఘ కట్టుబాట్లకు, ఆధ్యాత్మిక ఔన్నిత్యానికి సంబంధించినవి. ఇవేవీ కనబడని శ్రీధర్ గారి, అంబేద్కర్ గారి విద్వేషపూరిత భావజాలం పక్కన బెట్టి జవాబులు చూద్దాం. i. ముందుగా పైన ఒకటవ పాయింట్ లో వివరించినట్టు, వర్ణ వ్యవస్థ ప్రకారం సంఘంలో తమ తమ కర్మ, గుణ జీవితానుసారంగా తమతమ వర్ణాలని నిర్ణయించుకుని ఆచరించే flexible వ్యవస్థ సనాతన ధర్మానిది. భక్తి, జ్ఞ్యాన వైరాగ్య యోగాల్లో పరిణితి సాధించిన ఏ వర్ణాల్లో వారైనా సన్యాసులల్లో జేరడం దీనికి పెద్ద ఉదాహరణ. ii. కుటుంబంలో, సాంఘికంగా, సామాజికంగా ఎటువంటి స్థితులు ఉన్నా, ప్రతి వ్యక్తికి తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే వెసులుబాటు ఉన్న ఏకైక వ్యవస్థ సనాతన ధర్మానిది. తమ తమ పిల్లలకి అంబేద్కర్ గారైనా, శ్రీధర్ కేట్కర్ అయినా నేనైనా తమ పరిధిలో ఉన్న మంచి సంబంధం చూడటం అనేది, ప్రపంచంలోనే మన్నికైన తరాలుగా నిలచి ఉన్న ఏకైక హైందవ వివాహ వ్యవస్థ. కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు చేసుకొన్న అనేకమంది మన కళ్లెదురుగానే ఉన్నారు. - అంబేద్కర్ గారు iii. మాథ్యూ ఆర్నాల్డ్ చెప్పినట్టు ఇది పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా ఉన్నది. పైపై పొంగులే తప్ప అసలు పస లేదు ఇలాగా అంబేద్కర్ గారే వీళ్ళందరి కపోల కల్పిత సిద్ధాంతాలను నిర్ద్వందంగా కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించినట్టే ఇతర విదేశీ జనీత, శ్రీధర్ కేట్కర్ కపోల జనీత కులాల నిర్మాణం, కులచరిత్ర తదితర థియరీలు విద్వేషపూరిత కుటిల యత్నాలుగానే మనమూ తృణీకరించి చెత్తబుట్టలో విసిరివేయవలసిన సందర్భం సమయము ఇదే. 7. హిందూ సమాజం సాధారణ వ్యవహారాలలో ఎంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ భార్యా సంబంధంగా మూడు ప్రధానమైన ఆచారాలు బయటనుండి చూసేవారికి కూడా స్పష్టంగా కనబడతాయి. అవి i. మరణించిన భర్త చితి మీద అతని వితంతువును పెట్టి కాల్చటం. ii. వితంతువు తిరిగి వివాహం చేసుకోకుండా బలవంతంగా వైధవ్యాన్ని అమలు చేయడం. iii. బాలికా వివాహం. వివరణ: భార్యా సంబంధిత ఆచార వ్యవహారాలు సంఘ కట్టుబాట్లకు, ఆధ్యాత్మిక ఔన్నిత్యానికి సంబంధించినవి. ప్రపంచంలోనే అనేక మతాలు, నాగరికతలు కాల ప్రవాహంలో కొట్టుకుపోయినా, ప్రపంచం మొత్తంలో లక్షలాది సంవత్సరాలుగా, తర తరాలుగా భారతదేశంలో నిలచి ఉన్న ఏకైక నాగరికత మన సనాతన ధర్మం మాత్రమే. ఇవేవీ కనబడని విద్వేషపూరిత భావజాలం పక్కన బెట్టి జవాబులు చూద్దాం. i. చితి మీద భర్తతో బాటుగా సహగమనం అనేది భార్య అంగీకారంతో జరిగే ఆచారం. ప్రభుత్వం ఈ కాలంలో మన ప్రజాస్వామ్యంలో నిషేధించిన ఒకానొక ఆచారం. ii. వితంతు వివాహం అనేది సాంఘిక కట్టుబాటు. ప్రభుత్వం ఈ కాలంలో మన ప్రజాస్వామ్యంలో నిషేధించిన మరియొక ఆచారం. సమాజ పరంగా తమకు తాము విధించుకున్న ఇలాంటి నైతిక విలువలు అర్ధం కావాలంటే ధర్మం పాటించే సంస్కరణ మొదటగా మనలో ఉండాలి. iii. బాల్య వివాహం అనేది ముసల్మానుల అరాచక దుర్మార్గాలకు ప్రతిగా 1400 సంవత్సరాలలో ఏర్పరచుకున్న సామాజిక కట్టుబాటు. వివరాలు అప్రస్తుతం కానీ, హైందవ స్త్రీల అపహరణ, బలవంతపు మతమార్పిడి, మానభంగాది దూరాగతాల బారినుండి కాపాడుకున్న సాంఘిక ఆచారం. అలాగే ప్రభుత్వం ఈ కాలంలో మన ప్రజాస్వామ్యంలో నిషేధించిన మరియొక ఆచారం. అంబెడ్కర్ గారు ఆనాటి బ్రిటిష్, మెకాలే, వామపక్ష ప్రభావిత రచయితల రాతలే కాకుండా చదివిన ప్రభావితమైన వారు వీరే. 1. History of caste in India Evidence of the laws of Manu on the Social Conditions in India during the Third Century A.D. Interpreted and Explained with an appendix on "Radical Defects of Ethnology" Shridhar V. Ketkar - 1909. 2. Boston Public Library, other Libraries in Cornell, Columbia, Yale and Harward. 3. ఈ "భారత దేశంలో కులాలు" వరకు అంబెడ్కర్ గారు ప్రభావితమైన so called విదేశీ మేతావులు. మాథ్యూ ఆర్నాల్డ్ Sir డేంజల్ ఇబ్బేట్సన్, నెస్ ఫీల్డ్ సేవార్ట్ గాబ్రియేల్ టార్డ్ Sir H. రెస్లే లు Professor Lanman, Harward Professor Hopkins, Yale. వీళ్ళు రాసింది ఆయన శ్రద్ధగా విని తన పుస్తకాలు, పత్రాలు, తన అభిప్రాయాలు ఏర్పరచుకోవడం ఎలా ఉంటుంది అంటే..... ఒక 6,000 భూగోళ సృష్టిలో ఇరుక్కున్న ( బైబిల్ ప్రకారం) పాశ్చాత్య అనాగరిక వ్యక్తి నుంచి, ఒక అసందర్భ ప్రలాపి నుంచి, ఇవే ప్రపంచంలోని వాస్తవాలుగా నిర్ధారించి Brand చేసే ఒక వలసవాది నుంచి భారతీయ సంస్కృతి గురించి అతను చెప్పిన ఊహాకల్పిత, అవాస్తవ కథలను అంబేద్కర్ గారు కొనుక్కుని వాటినే భారతదేశంలో భారతీయులకు ఇదే మన భారతీయ సంస్కృతి అంటూ విక్రయించే వ్యాపారం మొదలు పెట్టారు. ఇదెలా ఉంటుందంటే, అందరికీ అర్ధమయ్యేలా మామూలు పరిభాషలో చెప్పాలంటే, భారతదేశంలో మార్కెట్లో ధరలను తగ్గించటానికి అనే అనైతిక కారణాలు చూపుతూ, ఐరోపా భోజన పట్టికలనుండి దళారులు యూరోపియన్ డైనింగ్ టేబుళ్లల్లో మిగిలిపోయిన తినుబండారాలను అతి తక్కువ ధరకు కొనుక్కుని, వాటినే మన భారతంలో అధిక ధరలుగా చూపిస్తూ విక్రయించే విధానం అని సారూప్యం గా చెప్పవచ్చూ. పంతొమ్మిదవ శతాబ్దంలో, పాశ్చాత్య స్కాలర్లు, స్కాలర్షిప్ అంటే హిందూమతం మరియు కుల వ్యవస్థ గురించి తమ తమ ప్రబలమైన వివరణ ఇవ్వడం అనేది ప్రధానాంశం అయిపోయింది. ఇప్పటివరకు అందరూ, రావణ్, కాన్షీరాం, మాయావతి తో సహా అందరు అంబేద్కర్ వాదులు, తాము పుట్టిన హిందూ మతం విద్వేషులుగా, నిల్చున్న కాళ్ళని నరుక్కునే , మాకు మతం లేదు, మేము హిందూ కాము, మాకు కులాలు వద్దు అంటూనే ఏమాత్రం వదలకుండా ఎలా సంస్కృతి వ్యతిరేకులుగా తయారు అయ్యారో, (దేవీ దేవతలను విమర్శించే అనేక నిదర్శనాలు కళ్లారా చూస్తూనే వింటూనే ఉన్నాము) తెలిపే అంబేద్కర్ గారి ప్రఖ్యాత వచనం ఇదుగో ఇదే. "ఈ హిందూ వ్యవస్థ ఒక నిజమైన దేశం మరియు సమాజం పురోగమించకుండా నిరోధిస్తుంది. భారతదేశం లో కుల వ్యవస్థను నిర్మూలించడానికి తప్పనిసరిగా దాని పునాదులను నిర్మూలించవలసి ఉంటుంది - అనగా దాన్ని నిర్మించిన మతాన్ని నిర్మూలించాలి; తత్ఫలితంగా, హిందూ మతం యొక్క నిర్మూలన సాధించాలంటే దాని కులాల నిర్మూలన చేయాలి". అంబేద్కర్ గారు కులవివక్షత అనే ఆనాటి దుర్మార్గపు సాంఘిక దూరాచారానికి బలి అయ్యారన్నది ఎంత నిర్వివాదాంశమో, ఆయనను జీవితంలో ప్రతి మలుపులోనూ సమాజంలో అందరూ అంతే విధంగా ఆయనకు సంఘీభావం తెలిపి, ఆదుకుని, ప్రోత్సాహమిఛ్చి, వెన్ను తట్టి పురోగతికి సహాయపడ్డారు అన్నది అంతే నిజం. సూటు టై వేసుకుని తిరగడం, విదేశాల్లో చదవడం అనేది సంస్కృతిగా గొప్పగా భావించే Narrow Mindedness ఎంత హాస్యాస్పదమో, మన మహోన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు వాటి వైభవం గుర్తించి ప్రపంచమంతా జైకొట్టి శ్లాఘిస్తున్నారో అంత గణనీయ తార్కాణం. ఈ దూరహంకారం నేటి ఆధునిక భారతాన్ని వీడినా ఎందుకు ఇంకా ఈ అంబేవాదులల్లోంచి పోవడం లేదో,ఈ జబ్బుకి కీలేరిగి వాత పెట్టి వ్యాధి నయం చేయవలసిన బాధ్యత మన అందరిదీ.

ఇస్లాం Musalaman

ఇస్లాం Musalaman
శతాబ్దాల నాడు ఈ దేశంలోని మూలవాసులైన ద్రావిడులమీద ఆధిపత్యం సంపాదించిన ఆర్యులు ద్రావిడుల్నంతా అంటరానివాళ్లని చేసి పారేశారు. నడుముకి తాటాకు కట్టి మీ అడుగుల గుర్తులు కూడా కనబడొద్దన్నారు. మూతికి ముంత కట్టి మీ ఉమ్మి కూడా నేలమీద పడొద్దన్నారు. ఊరి కి,కాటికీ, ఆఖరికి మంచి నీళ్లకూ దూరం చేశారు. వాళ్లొస్తుంటే చెప్పులు విడిచి చేత పట్టుకొని పక్కకు నిలబడాలి. తలకు రుమాల ఉంటే తీసిపట్టుకోవాలి. బడికీ,గుడికీ కూడా అంటరానివాళ్లను చేశారు. అలాంటి ఎన్నో అవమానాలు, హింస అనుభవిస్తూ వచ్చిన ఎంతో కాలానికి సూఫీ ప్రవక్తలు వచ్చి మమ్మల్ని అక్కున చేర్చుకున్నారు. వాడు అసుంట అసుంట అంటే సూఫీలు మాకు అలాయిబలాయి ఇచ్చారు. మా గుండెకు గుండెను కలిపారు. మేము తాగిన గిలాసుల్లో వాళ్లు నీళ్లు తాగారు. మాతోపాటు కూచొని బువ్వ తిన్నారు. అగ్రహారాల వీధుల నుంచి మా శవాల్ని కూడా తీసుకెళ నివ్వని దుష్ట సంస్కృతిని బద్దలు చేస్తూ మా వాళ్ళ శవానికి వాళ్లు భుజం పట్టారు. మేం మజీదుకు వెళ్తే భుజం భుజం కలిపి నమాజు చదివించారు, మా గుండెలు చెరవులయ్యాయి.. మా మనసులు సముద్రాలయ్యాయి.. మేం వాళ్లలో ఒకరమైనాం. మాకు కష్టమొస్తే, నష్టమొస్తే వాళ్లు మంచి మాటల్తో మమ్మల్ని ఓదార్చే, ఆదరించే ప్రవక్తలయ్యారు. మేం అందరం ముసల్మానులమైనాం. మేం ఈ దేశ మూలవాసులం. ద్రావిడులం. రెండు నుంచి మూడు శాతం ముస్లింలు మాత్రమే ఈ దేశంలో బైటి దేశాల నుంచి వచ్చినవారు. మిగతా 97 శాతం ఈ దేశవాసులే. అందులో 90 శాతంమంది ‘అంటబడనివ్వని’ (SC) కులాల నుంచీ, ‘వెనకబడేయబడ్డ’(BC) కులాల నుంచీ ఇస్లాం స్వీకరించినవారే. ఈ దేశ మూలవాసులు దేశంలో అత్యంత దుర్భరమైన జీవితాలతో కడగొట్టు పనులను చేస్తూ.. హీనమైన జీవితాలను ముస్లింలు గడుపుతున్నారు. దేశ స్వాతంవూత్యానంతరం సంపన్న, ఉన్నత వర్గాలకు చెందిన ముస్లింలు పాకిస్తాన్, లండన్ తదితర దేశాలకు వలస వెళ్లారు. మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన ముస్లింలు ఇక్కడే ఉండిపోయారు. వీరు భారతదేశ మూలవాసులు. అంతకంటే మించి దళితులు. గుడికి, బడికి దూరం చేయబడ్డవారు. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన సూఫీతత్వం తో కొందరు ఇస్లాంను, మరికొందరు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. మతాలు మారినంత మాత్రాన వీరి పేదరికం వెనుకబాటు తనం పోలేదు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా దళితులకన్నా ఇంకా వెనుకబడి ఉన్నారు. క్రీ.శ.632లో జన్మించిన మహమ్మద్ ప్రవక్త, తన అసాధారణ ప్రతిభా పాటవాలతో ప్రపంచా న్ని మరొక్కసారి ఒక కుదుపు కుదిపాడు.ఆయన మరణానంతరం మహమ్మద్ స్థాపించిన ఇస్లాం మతం తిరుగులేని రీతిలో వేగం పుంజుకుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించి ఆయా దేశాల రాజకీయ, సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక రంగాలను తీవ్రంగా ప్ర భావితం చేసింది. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ ప్రకారం ఇస్లాం జైత్రయాత్ర పశ్చిమాసియాలో ప్రారంభమైఉత్తర ఆఫ్రికా గుండా స్పెయిన్ దాకా సాగింది.ఈ పరిణామ క్రమంలో భాగంగానే క్రీ.శ. 712లో అరబ్బులు మన దేశంలోని సింధు రాష్ట్రాన్ని జయించారు. దీంతో భారతదేశంలో అరబ్బుల రాజకీయాధికారానికి పునాదులు పడ్డాయి. మరోవైపు పశ్చిమ తీరంలో అరబ్బుల చేత అనేక వ్యాపారకేంద్రాలు నెలకొల్పబడ్డాయి. ఈ దరిమిలా ఇస్లాం మతం భారతదేశమంతటా వ్యాపించినఫలితంగా సమాజంలోని అన్ని రంగాల రూపురేఖలు మారిపోయాయి. భాష, కళలు, ఆర్థిక, రాజకీయ, మత రంగాలలో కొత్త భావనలు ప్రభవించాయి.క్రీ.శ. 1000 సం.లో గజనీ మహమ్మద్, 12వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ దండయాత్రతో ముస్లిం రాజులు రాజకీయ అధికారాన్ని పూర్తిస్థాయిలో కైవసం చేసుకున్నారు. దరిమిలా ఇస్లాం మత సాంస్కృతిక ఆచార సంప్రదాయాలు భారత సంస్కృతిలో విడదీయరాని భాగమైపోయాయి. పైగా ఇస్లాంమతంలోని సమానత్వం, సౌభ్రాతృత్వం భావనలు సమాజంలోని కింది కులాలను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కారణంగా ఇస్లాం మతంలోకివలసలు నానాటికీ పెరుగుతూపోతున్న నేపథ్యంలో ఆ మతంలోని ఛాందసవాదులు(Conservatives) మత భ్రష్టత్వనెపంతో ఈ మార్పులను వ్యతిరేకించారు. ఫలితంగా మతాన్ని సరళీకరించి, దేవుణ్ణి సామాన్యునికి చేరువ చేసే ఒక ఉదారవాదవర్గం (Liberals) పుట్టకొచ్చింది. ఈ రకంగా మత నియమాలు పాటించకుండానే దేవుణ్ణి ఆరాధించవచ్చుననే ఒక నమ్మకాన్ని కలిగిస్తూ మతాన్ని మసీదు నుంచి దర్గాకు ట్రాన్స్‌ఫార్మ్చేశారు. ఈ బోధనలే సూఫీ మతంగా చరిత్రలో విలసిల్లుతున్నాయి. ఇలా సూఫీ మత ప్రవక్తల బోధనల ప్రభావంతో నాటికి అమల్లో ఉన్న కుల వ్యవస్థ దాని అరాచకత్వం, మనువాదుల కఠోర హింసా ప్రవృత్తి, దండనలతో విసిగిపోయిన కింది కులాలు (శూద్రులు,అంటరానివారు,గిరిజనులు) సూఫీ మతంలోని స్వేచ్ఛ, సమానత్వం, ఏకేశ్వోరాపాసన మానవత విలువలకు ఆకర్షింపబడి ఈ మతంలో చేరారు. వారిలో కొందరు ధీమంతులు అంటరానితనం, ఎగుడు దిగుడువ్యవస్థ , అసమానత, అవమానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ క్రమంలో కొందరు ప్రవక్తలుగా మారిపోయారు. నరజాతి (ఆంత్రొపాలజి) అధ్యయనాల ప్రకారం దళితులు భారతీయ ముస్లింలు ఒకే నర వర్గానికి చెందినవారు. వీరి కపాలాలు ముక్కులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మెజారిటీ దళితులు -ముస్లింలు ఆర్యులైన సవర్ణుల కంటే భిన్నంగా ఉంటారు. జవహర్‌లాల్‌ నెహ్రూ 1951-52 సంవత్సరాల్లో ప్రఖ్యాత ఉర్దూకవి జోష్‌ మలిహాబాదీని వల్లభాయ్‌ పటేల్‌ను కలువమని కోరినాడు. నెహ్రూ మాట కాదనలేక పటేల్‌ను కలిసిన సందర్భంలో ‘మీరు ముస్లింలను ఎందుకు ద్వేషిస్తారు?’ అని జోష్‌ అడి గారు. దానికి పటేల్‌ సమాధానం ‘మీలాంటి నవాబులను ద్వేషించను, ఎవరైతే నిన్నటిదాకా మాదిగ,మాల వాండ్లుగా, పాకి వాండ్లుగాపని చేసి ముస్లిం మతాన్ని పుచ్చుకొని నేడు సమాన హక్కులు కావా లంటున్నారో…వారిని మాత్రమే…’ అని అన్నారు. సాధారణ ముస్లిం ప్రజల పట్ల హిందూ సవర్ణుల ద్వేషం వెనుకనున్న చిదంబర రహస్యం వాండ్ల పూర్వీకులు దళితులు కావడమే. ఇది కూడా దళితులు-ముస్లింలు సోదరులు అనే రహస్యాన్ని ఛేదించినది.

యోని Yoni

యోని Yoni
అత్యంత విశిష్ట దేవాలయాలలో కామాఖ్య ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో యోని ఆకారంలో గల ప్రతిమను అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు. ఈ సృష్టి సకలం శక్తి మూలంగానే నడుస్తోంది. ఆ శక్తి లేనిదే పరమేశ్వరుడైనా ముందుకు సాగలేడు. శివా అంతే శివానీ అని అర్థం. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులు 'శివశ్శక్త్యాయుక్తో'... అంటూ తన సౌందర్యలహరిని ప్రారంభించాడు. మహాకవి కాళిదాసు కూడా ఆదిదంపతులను వాక్కు, అర్థంతో పోల్చాడు. శక్తి స్వరూపుణి వెలసిన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. ఇది అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైంది. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, నీలాచల పర్వతాలపై ఉంది. ఈ ఆలయంలో వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కానీ కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని క్షణాల్లో మార్చుకోవడం అని అర్థం. కామాఖ్యా దేవిని త్రిశక్తిదాయినిగా కొలుస్తారు. ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా మారే రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినిగా, పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా మారుతుంది. పరమేశ్వరుణ్ణి యాగానికి ఆహ్వానించకుండా దక్షుడు అవమానించాడు. అవమానాన్ని తట్టుకోలేక సచీదేవి యజ్ఞ గుండంలో దూకి ఆహుతవుతుంది. సతీ వియోగాన్ని భరించలేని శివుడు ఆగ్రహంతో వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయిస్తాడు. తనలో అర్థభాగమైన సతి మరణంతో పరమేశ్వరుడు సాధారణ మానవుడిలా విరాగిలా మారతాడు. సతి మృతదేహాన్ని ఈశ్వరుడు భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతుంటే శ్రీమహా విష్ణువు ఆమె దేహాన్ని తన సుదర్శనంతో ఖండించాడు. అలా ఖండించినప్సుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. అందులో అమ్మ వారి ప్రధానమైన యోనిభాగం నీలాచలంపై పడింది. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతే కాదు ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకూ ఆధార స్థానంగా భావిస్తారు. దీన్ని మహాయోగ స్థలమని పిలుస్తారు. నీలాచలంపై దేవి యోని భాగం పడి ఈ పర్వతం నీలంగా మారింది. ఈ రాతి యోనిలోనే కామాఖ్యదేవి నివాసం ఉంటుందని అంటారు. ఒక్కసారి నీలాచలాన్ని తాకితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకం ప్రాప్తించి, చివరిలో మోక్షాన్ని పొందుతారు. తనను మోపరవశుణ్ణి చేయడానికి వచ్చిన దేవతలు పంపగా వచ్చిన మన్మథుడుని ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్థం చేశాడు. సకల దేవతలూ పర్వతరూపంలో ఉంటూ అమ్మను సేవిస్తారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్ఠాన దేవత నీల పార్వతి.

Lajjagiri god లజ్జ గౌరి

ఆది దేవత, అనాది దేవత, ప్రపంచ ప్రజల ఆరాధ్య దేవత... లజ్జ గౌరి...
ప్రపంచంలో అన్ని సమాజాల్లోనూ ప్రజల ఆరాధనలు అందుకున్న ఈ దేవత విగ్రహాన్ని మొన్నీ మధ్య కర్నాటకలోని చాళుక్య రాజధాని నగరం బాదామిలో, పురావస్తు శాఖ మ్యూజియంలో దర్శించి తరించాను. ఈ విగ్రహాన్ని బీజాపూర్ జిల్లా నాగనాథకోలా లోని నాగనాధ ఆలయం నుంచి సేకరించారు. చాళుక్యులు పరిపాలించిన మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లోనూ ఈ విగ్రహం కనిపిస్తుంది. కర్నూలు జిల్లా కూడలి సంగమేశ్వర ఆలయం నుంచి సేకరించినది. ప్రపంచంలో ప్రతి సమాజంలోనూ ఇలాంటి దేవతా విగ్రహం వుండడం, ఇదే భంగిమలో వుండడం చాలా అరుదైన, ఆశ్చర్యం కలిగించే అంశం. క్రీస్తు పూర్వం చాలా శతాబ్దాలనుంచి కూడా లజ్జ గౌరిని ప్రజలు ఆరాధిస్తూ వచ్చారు. సంతానాన్ని ఇచ్చే దేవతగా లజ్జ గౌరిని కొలుస్తారు. హరప్పా, మొహంజదారో నాగరికతల్లో ఈ విగ్రహారాధన వుంది. అంతకు ముందూ వుంది. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, మొరాకో.. ఇలా అనేక చోట్ల ఇలాంటి విగ్రహాలు బయటపడ్డాయి. గుహల్లో చిత్రించిన బొమ్మల్లోనూ ఈ విగ్రహాలు వున్నాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ లజ్జ గౌరి ఆరాధన ఆచారం వుంది. భారతదేశంలో క్రీస్తు శకం ఆరునుంచి పన్నెండో శతాబ్దం వరకూ లజ్జ గౌరి ఆరాధన పతాక స్థాయిలో వున్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ముస్లిం దండయాత్రల తర్వాత.. విగ్రహారాధనను.. ముఖ్యంగా స్త్రీ విగ్రహారాధనను, అందునా నగ్నంగా వున్న స్త్రీ విగ్రహారాధనను నాటి పాలకులు నిరుత్సాహ పరిచారని తెలుస్తోంది. తర్వాత బ్రిటిష్ హయాంలో... నగ్న దేవతను ఆరాధించడం అనాగరిక, అశ్లీల చర్యగా పరిగణించారు. కాలక్రమంలో లజ్జ గౌరి ఆరాధన, ఆరాధకుల సంఖ్య తగ్గిపోయి వుండవచ్చు కానీ... పూర్తిగా ఏమీ మాసిపోలేదు. లజ్జ గౌరికి సంబంధించిన ప్రస్తావన తొలుత మనకు కనిపించేది రుగ్వేదంలో... అదితి పేరిట. అదితి అంటే ఆదిశక్తి. In the first age of the gods, existence was born from non-existence. The quarters of the sky were born from Her who crouched with legs spread. The earth was born from Her who crouched with legs spread, And from the earth the quarters of the sky were born.
Nomula Prabhakar Goud 944006 0852 Rig Veda, 10.72.3-4 .... .... Aditi is the sky Aditi is the air Aditi is all gods ... Aditi is the Mother, the Father, and Son Aditi is whatever shall be born. Rig Veda, I.89.10 విగ్రహ భంగిమను ప్రసవిస్తున్న స్త్రీ గా పరిగణిస్తారు. ఈ భంగిమను పలువురు చరిత్రకారులు పలు విధాలుగా నిర్వచించారు. ఎన్ని నిర్వచనాలు వున్నా... స్థూలంగా వాటి సారం ఒకటే. సంతానాన్ని, సంపదను, ధనధాన్యాదులను ప్రసాదించే శుభకర దేవత అని. ఈ దేవతను భారతదేశంలో రేణుక, మాతంగి, యల్లమ్మ అని కూడా పిలుచుకుంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా... పార్వతీదేవి ప్రతిరూపంగానే కొలుచుకుంటారు. లజ్జ గౌరికి సంబంధించి మరో ఆసక్తికర కథ కూడా ప్రచారంలో వుంది. నిమ్న కులానికి చెందిన రేణుక తలను అగ్రకులస్థుడొకడు నరికివేశాడు. అయితే రేణుక చనిపోలేదు. తల స్థానంలో కమలాన్ని మొలిపించుకొని జీవించింది, దేవత అయింది. లజ్జ గౌరి విగ్రహానికి తల వుండదు. తల స్థానంలో.. పరిపూర్ణంగా వికసించిన కమలం వుంటుంది. చేతిలో కమలం/తామర తూడులు వుంటాయి. ఆభరణాలు ధరించి వుంటుంది. వికసిత కమలం శక్తికి సంకేతం. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలు.. సహస్రార చక్రం ఉద్దీపనకు వికసిత కమలం సంకేతం. పవిత్ర మతాలు-విగ్రహాలు..నగ్నదేవతలు లజ్జాగౌరి – ఒక నగ్న స్త్రీమూర్తి. ఈ మూర్తి తన ఊరువులను పైకెత్తి, కాళ్ళను పైకి మడుచుకుని కూర్చున్నట్టుగా ఉంటుంది. ఎత్తైన చనుకట్టుతో ఈ మూర్తి, ప్రసవిస్తున్న స్త్రీ భంగిమను పోలి ఉండటం గమనించవచ్చు. ఈ విగ్రహానికి శిరస్సు లేదు. శిరస్సు స్థానంలో ఒక తామరపువ్వు, రెండు చేతులలో రెండు పద్మాలు కనిపిస్తాయి. కాలివ్రేళ్ళు కుంభాకారంలో కనిపిస్తాయి. నడుముపై ముడుతలు కూడా చూడవచ్చు. ఆధునికులకు కాస్త ఎబ్బెట్టుగా తోచగల ఈ స్త్రీమూర్తి ఒకానొక కాలంలో గ్రామీణ భారతంలో పలుప్రాంతాలలో పూజలందుకున్న దేవతామూర్తి! లజ్జా గౌరి అదృష్ట దేవత. సఫలతకు మారు పేరు. ఆమె శుభ ప్రదాయిని అంటారు. ఆమెను ఒక మాతృ దేవతగా పేర్కొంటారు. పార్వతికి మారుపేరుగానూ వర్ణితమయింది ఈమె. అలంపూర్‌లోని దేవతను రేణుక అంటారు. బాదామి దగ్గర ఉన్న మహాకూటలో పెద్ద లజ్జాగౌరి విగ్రహం ఉంది. అలాగే కుడవల్లి ప్రాంతంలో కూడా ఆమె విగ్రహం ఉంది. ఈ విగ్రహాలన్నీ చాళుక్యుల కాలంనాటివి. రాష్ట్రకూటుల కాలంలో కూడా లజ్జా గౌరి విగ్రహాలు ఎన్నో కనిపించాయి. లజ్జాగౌరి విగ్రహాలను నగమాత, కుంకణ, అదితి, అనంతదేవి, ఎలాబ, రేణుక, కొఠ్వి, పృథ్వి, కమల ముఖి, నగక బంధ, బేలం కలాచమ, కమల గౌరిమ, మహా కుందాలిని, ఆద్యశక్తి, జోగులాంబ, మాతంగి, శాకాంబరి, మాహురమ్మ వంటి అనేక పేర్లతో అనేక ప్రాంతాల్లో పిలుస్తున్నారని పండితుల అభిప్రాయం.ఈ పేర్లన్నీ స్త్రీ దేవతలను తెలియ చేస్తాయి.అంటే లజ్జా గౌరి కాల క్రమంలో అనేక గ్రామ దేవతలుగా పేర్కొనబడుతూ పూజలందుకుంటోందని పరిశోధకుల భావన.
చాళుక్యుల కాలం నాటి కొన్ని అవశేషాలను బాదామిలో ఒక సంగ్రహాలయంలో భద్రపరిచారు. ఆ మ్యూజియమ్ లోనికి ప్రవేశిస్తూనే ఒక వింత స్త్రీమూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం పేరు “లజ్జాగౌరి”. ఇదే విగ్రహాన్ని తెలంగాణాలో అలంపురం మ్యూజియమ్ లో చూడవచ్చు. లజ్జాగౌరి విగ్రహాలు బాదామిలోనే కాదు, కర్ణాటకలోని సిద్దనకొళ్ళ, మహాకూట, హొసపేట దగ్గరి వ్యాఘ్రేశ్వరి, నేటి తెలంగాణా-మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం, ఆంధ్రప్రదేశ్ దగ్గర నాగార్జునకొండ, తమిళనాడులో దశాసురమ్, మహారాష్ట్ర సతారా జిల్లలో వడగామ్, అజంతా గుహలలో ఒకానొక గుహలో, ఉస్మానాబాదులో తర అన్న గ్రామంలో, మాహోర్ఝరి, ఔరంగాబాదు దగ్గర భోగరదన్, ఉత్తరప్రదేశ్ లోని భీటా, ఒడిస్సాలో న్యువపద, ఇంకా దేశంలోని పలుప్రాంతాల్లో ఈ విగ్రహాలను గుర్తించారు. తద్వారా ఈ మూర్తి అర్చన భారతదేశంలోని పలుప్రాంతాల్లో కొనసాగినట్టు తెలుస్తూంది. బాదామిలో మ్యూజియమ్ పక్కగా మెట్లదారి వెంబడి పైకెక్కితే, కొండపై ఒక పాడుబడిన దేవాలయం కనిపిస్తుంది. ఆ దేవాలయం లజ్జాగౌరి దేవాలయమట. లజ్జాగౌరి ఆరాధన ఖచ్చితంగా భారతదేశంలో ఏర్పడిందో చెప్పగలిగే స్పష్టమైన ఆనవాళ్ళు లేవు.మౌఖిక సాహిత్యంలో తప్ప కావ్య సాహిత్యంలో స్పష్టంగా, విస్తృతంగా లజ్జాగౌరి ప్రస్తావనలు లేకపోవటమూ ఒక విచిత్రమైన విషయం. క్రీ.శ. పండ్రెండవ శతాబ్దం తర్వాత, అంటే రాష్ట్రకూటుల పాలన తర్వాత ఈ విగ్రహాలు మృగ్యమవటం వింతలో వింత. విజయనగరకాలపు శిల్పాలలో ఎక్కడా ఈ విగ్రహాలు కనిపించిన ఆనవాళ్ళు లేవు. బహుశా మహమ్మదీయ, క్రైస్తవ మత ప్రభావం వల్లనో, శాక్తేయ ఆరాధన తగ్గుముఖం పట్టటం వల్లనో, లేక నగ్నరూపమైన విగ్రహారాధన “తప్పు” అన్న భావం వ్యాపించటం వల్లనో, లేక పట్టణ ప్రభావం ప్రాంతాలపై ప్రసరించటం వలననో, శైవ వైష్ణవ మతాల ప్రాబల్యం, భక్తి ఉద్యమాల ఫలితంగానో సభ్య దేవతామూర్తులకు విభిన్నమైన లజ్జాగౌరి వంటి దేవతల ఉపాసన కనుమరుగై ఉండవచ్చు.
ఇంతకూ ఈ లజ్జాగౌరి ఎవరు? లజ్జాగౌరిని సంతాన సాఫల్యాన్ని ప్రసాదించే దేవతగా గ్రామీణులు పూజించేవారు. ఈశ్వరుని భార్య గౌరికి ఈమె ప్రతిరూపం. ఈమెయే భూదేవి అవతారమైన పరశురాముని తల్లి రేణుకాదేవి. పంటలను కాపాడి, సస్యాన్ని ప్రసాదించే శాకంబరీదేవి (బనశంకరీ దేవి). ఈ తల్లి యే ఎల్లమ్మ. అంటే ఎల్లరకూ అమ్మ. భారతదేశంలో త్రిమూర్తుల భార్యలలో సరస్వతి జ్ఞానరూపిణి. లక్ష్మి సంపదలకు ప్రతిరూపం. గౌరీదేవి శక్తికి నెలవు. ఈ గౌరీదేవి భూదేవికి ప్రతిరూపంగా శాకంబరీదేవి లేదా బనశంకరిగా గ్రామీణులు భావించుకున్నారు. తన దేహంపై పంటలను పండించి, సకల జీవరాశులకూ, దేవతలకూ, దేవుళ్ళకూ కూడా ఆకలి తీర్చే శక్తి రూపిణి ఈమె. బాదామికి గ్రామ శివార్లలో శాకంబరీదేవి దేవాలయం కూడా ఉన్నది. గౌరీదేవి దేహమే సంతానాన్ని ప్రసాదించగల శక్తికి ప్రతిరూపంగా లజ్జాగౌరి మూర్తిగా భావించారు. లజ్జాగౌరి విగ్రహాలన్నీ నదీ తటాక తీరాలలో దొరకడం గమనార్హం. ఇది యాదృచ్ఛికమో లేక సంతాన సంబంధమైన ఉపాసనలో నీటికి సంబంధించిన విషయమేదైనా ఉన్నదో స్పష్టంగా చెప్పగలిగే ఆనవాళ్ళు నేడు మనకు లేవు. ఈ స్త్రీ మూర్తి దేనికి ప్రతీక? ప్రకృతి కార్యమైన శృంగారానికా? లేదా సంతాన సాఫల్యతకా? అన్న విషయం మీద చారిత్రక పరిశోధకులు తర్జనభర్జన పడ్డారు. ముఖ్యంగా పాశ్చాత్య పరిశోధకులు. భారతీయ దేవాలయ కళారూపాలలో గోపుర కుడ్యాల మీద శృంగార భంగిమలు ఉండటం కద్దు. అయితే గర్భగుడిలో మూర్తిగా ఆరాధించే దేవతలను శృంగార దృష్టితో నిర్మించడం, అర్చించటం కానరాదు. లజ్జాగౌరి మూర్తి భంగిమ శృంగారపరమైనది కాదు, సృష్టిపరమైనది. ఈ మూర్తి సంతాన సాఫల్యాన్ని ప్రసాదించే మూర్తిగానే ఒప్పుకోవలసి వస్తుంది. బాదామికి కొంతదూరంలో, మలప్రభ నది ఒడ్డున “మహాకూటేశ్వర” క్షేత్రం ఉంది. స్కాందపురాణంలోని “శాకంబరీ మహాత్మ్యం” లో ఈ దేవాలయం గురించిన ఉటంకింపు ఇది. తటే మలాపహారిణ్యాః సంతి లింగాని కోటిశః| తాని సర్వాణి గదింతుం నాలం వర్షశతాన్యపి || బిల్వరాజీవనం చాత్ర విద్యతే సుమనోహరమ్ | శివయా సహితః శంభుర్విశ్ర్యామతి సుఖంత్విహ || విష్ణుపుష్కరిణీ తీరే మల్లికార్జున సన్నిధౌ | పాతాలేశం పినాకీశం లజ్జాగౌర్యాహ్వయం తథా || కోటిలింగ వైష్ణవేశం వీరభద్రేశ్వరం తథా | నారసింహం వామనాఖ్యం శృగాలేశ్వరమేవ చ|| ఏతాని నవలింగాని దురతఘ్నాని తాపసాః | పర్వతే కోటిలింగాని బిల్వచందన రాజితే || (శాకంబరీ మాహాత్మ్యం, 8.19 – 23) శక్తితో కూడిన శివుడు, లజ్జాగౌరితో కూడిన ఈశ్వరుడు అన్న పేర్లు గమనార్హం. లజ్జాగౌరి ఈ క్షేత్రపాలిక. ఆ దేవి విగ్రహం కూడా చాలా కాలం క్రితం ఇక్కడ ఉండేదట. ఇక్కడ ఈశ్వరుని తొమ్మిది రూపాలలో అర్చిస్తారని స్థలపురాణం. లజ్జాగౌరి ఉపాసన కొనసాగిన తెలంగాణాలోని అలంపురంలోనూ బాదామి చాళుక్యులు కట్టించిన నవబ్రహ్మేశ్వర దేవాలయాలు ఉండటం ఆసక్తికరమైన విషయం. అయితే అలంపురంలోని నవబ్రహ్మేశ్వరులు వరుసగా – తారక, స్వర్గ, పద్మ, బాల,విశ్వ, గరుడ, కుమార, అర్క, వీర నామధారులు. మహాకూట క్షేత్రపాలకుని పేరు మహాకూటేశ్వరుడు. ఈయననే ముకుటేశ్వరుడన్నారు. కూట శబ్దానికి “గూఢము”, “అబద్ధము” అన్న అర్థాలున్నాయి. లజ్జ అంటే సిగ్గు. లజ్జాగౌరి అంటే సిగ్గుతో కూడిన గౌరి. కర్ణాటకలో జానపదులు చెప్పుకునే మౌఖిక సాహిత్యపు కథలు రెండు ఉన్నవి. మొదటిది: ఒకానొకప్పుడు ఈశ్వరుడు, గౌరీదేవి భూలోకంలో విహరిస్తూ, శృంగారక్రీడలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ సమయంలో సప్తర్షులు పరమేశ్వర దర్శనార్థం విచ్చేశారు. తమలోకంలో ఉన్న ఆదిదంపతులు పరవశాన్ని వీడి సప్తర్షులను గమనించి సిగ్గుతో నీరైపోయారు. తమను గమనించనందుకు సప్తర్షులు కినిసి, శంకరుని లింగరూపంలో మాత్రమే పూజలు అందుకొంటాడని శపించారు. రెండవకథ: గౌరీశంకరులు ఒకానొక కొలనులో జలక్రీడలు సల్పుతున్నారు. ఆ సమయంలో ఒక భక్తుడు వారిని చూడటానికి వచ్చాడు. భక్తుని చూడగానే దంపతులకు సిగ్గు ముంచుకొచ్చింది. పరమేశ్వరుడు పరుగెత్తి గర్భగుడిలో లింగం వెనుక దాగాడు. గౌరీదేవి నీట మునిగి కనుమరుగయింది. చాలా ఎక్కువగా సిగ్గుపడ్డ కారణాన గౌరీదేవి “లజ్జాదేవి” గా పరిణమించింది.
లజ్జ – లంజ తెలుగులో, సంస్కృతంలో ఇతరత్రా భారతదేశ భాషల్లో వేశ్య, దేవదాసి అన్న అర్థాలలో “లంజ” అన్న శబ్దం ఉన్నది. ఇది నేడు ఒక తిట్టు. అశ్లీలమూ, అసభ్యమూ అయిన శబ్దం. కానీ ప్రాచీనకాలంలో, ముఖ్యంగా జనపదాలలో ఈ శబ్దానికి – నేటి కాలంలో ఉన్న క్షుద్రమైన అర్థం లేదని చూచాయగా తెలుసుకోవచ్చు. ఈ నాటికీ రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో ఈ మాటను సాధారణ రూపంలో ఉపయోగించటం ఉంది. ఈ అశ్లీలమైన శబ్దానికి మూల రూపం ఏమిటో తెలియదు. ద్రవిడ శబ్దాలు “ర”, “ల” తో మొదలవవు కాబట్టి ఇది ద్రవిడభాషాశబ్దం కాదు. (Information Courtesy: సురేష్ కొలిచాల గారు) సంస్కృతనాటకాలలో “హంజే, హంజికే” అన్న ప్రయోగాలు కనిపిస్తాయి. నాయిక చెలికత్తెలను సంబోధించే తీరు అది. “లంజ” శబ్దానికి అది పూర్వరూపమేమో తెలియదు. అలాగే – లజ్జా శబ్దానికి లంజ శబ్దానికి కొంత పోలిక, నేపథ్యమూ కనిపించటం విశేషం. పైన చెప్పుకున్న మహాకూట క్షేత్రానికి “నందికేశ్వరం” అన్న మరొక పేరు ఉంది. ఈ పేరు ఇప్పటికీ ఉంది. నందికేశ్వరం – ఇది అసలైన పేరు కాదు. ఈ పదబంధానికి మూలరూపం “లంజికేశ్వరం” లేదా “లంజిగేసరం”. దీనికి నిదర్శనాలు ఉన్నాయి. బాదామి చాళుక్యుల వంశంలో మూడవ రాజు మంగలేశుడు (క్రీ.శ 597 – 609) అక్కడి రెండవ గుహాలయంలో (విష్ణువు గుహ) రెండు దాన శాసనాలు చెక్కించాడు. ఆ రెండు శాసనాలలో “లంజిగేసరం” అన్న ఊరిని దానమిస్తున్నట్టుగా ఉంది. అందులో ఒక శాసనంcheck in the 2nd pic. క్రీ.శ. 598 లో చెక్కించిన ఆ కన్నడ శాసన పాఠం ఇది. “స్వస్తి శ్రీమత్ ప్రిథివి వల్లభ మంగలేసనా కల్మనె గె ఇత్తొదు లంజిగేసరం దేవక్కె పూనిఱువ మాలకారన్గె అర్దవిసది ఇత్తొదానఱెవోన్ పఞ్చ మహాపాతకనక్కుం ఏఱినెయా నరకదా పుఱుఅకుమ్” ఇదే గుహలో రెండవ శాసనంలోనూ “లంజికేశ్వరం” గ్రామాన్ని పదహారు మంది బ్రాహ్మణులకు నిత్యభోజనాల సంతర్పణ కోసం వ్రాసి ఇస్తున్నట్టుగా ఉంది. మహాకూట – అన్న క్షేత్రానికి అదివరకే అధిష్టాన దేవుడైన మహాకూటేశ్వరుని నామం ఉండగా, తిరిగి నందికేశ్వర నామం సంశయాత్మకమైనందునా, పైగా చాళుక్యప్రభువు మంగలేశుని దానశాసనంలో లంజికేసరం అన్న శబ్దం ప్రస్తావింపబడి ఉండటం మూలానా, ఆ క్షేత్రానికి లంజికేశ్వరమని పేరున్నట్టు అర్థమవుతుంది. అంటే లజ్జాగౌరి – లంజికేశ్వరి అన్న శబ్దాలు సమానార్థకాలని స్ఫురిస్తున్నది. దీని సంస్కార రూపమే నేటి నందికేశ్వరమయింది. లంజికేశ్వరంలోని లంజిక – అన్న శబ్దమే సంస్కృతీకరింపబడి లజ్జాగౌరి అన్న పేరుగా ఏర్పడిందని కన్నడ భాషాపండితుల ఉవాచ. అంటే గౌరీదేవి పేరే “లంజిక”. స్త్రీ మూర్తి విగ్రహం – నిర్లజ్జతకు నిదర్శనంగా ఉండటం మూలాన ఆ మూర్తికి శోభనమైన పేరు కూర్చవలసిన అవసరం ఏర్పడి – లంజిక అన్న శబ్దం లజ్జాగౌరిగా మార్చి ఉంటారని కొందరు దూరాన్వయాలు చేశారు. లజ్జాగౌరి – లజ్జ విడిచిన గౌరి లేదా లజ్జాహీనమైన గౌరి అని ఆంగ్లంలో కొందరు వ్యుత్పత్తి చేసి Shamelss Goddess అన్నారు. ఈ శబ్దం అంత ఒప్పుకోదగింది కాదు.
లజ్జా అంటే అమ్మవారి పేరు అని చెప్పడానికి మరొక నిదర్శనం బ్రహ్మాండపురాణంలో, లలితాసహస్రనామంలోని 142 వ శ్లోకం. “మిథ్యాజగదధిష్టానా ముక్తిదా ముక్తిరూపిణీ | లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా ||” లజ్జా అన్నది లలితాదేవి సహస్రనామాలలో ఒకటి. లలితాసహస్రనామాలలో మరొక శ్లోకం (35) లజ్జాగౌరి మూర్తికి దగ్గరగా ఉన్నది. “కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ” – కంఠం క్రిందు నుంచి కటి పర్యంతమూ కూటరూపంలో ఉన్న మూర్తి. ఇది లజ్జాగౌరి మూర్తితో పోలుతుంది. ఈ తథ్యామిథ్య అంతా క్రీ.శ. ఆరవ దశాబ్దం నేపథ్యంలో జరుగుతున్నదని గమనించగలరు. అప్పటికి కన్నడ/తెలుగు భాషల స్వరూపం వేరు. ఈ రోజు మనకు “లంజ” అన్న శబ్దం వినిగానే ఆ శబ్దం కలిగించే ఉలికిపాటు, అశ్లీలధ్వని, అమంగళమూ నాడు ఉండవలసిన అవసరం లేదని మనం తెలుసుకోగలగాలి. బహుశా లజ్జాగౌరి (లంజిక) విగ్రహ రూపం, నగ్నత్వం, తర్వాతి కాలంలో పట్టణ ప్రభావంతో లంజిక అన్న శబ్దం నీచత్వానికి ప్రతిరూపంగా మారి ఉండవచ్చు. అదితి ఉత్తానపద లజ్జాగౌరి ఉపాసన ఖచ్చితంగా ఏ కాలంలో ప్రారంభమయినది తెలియకుండా ఉన్నది కానీ నగ్న స్త్రీ ఉపాసన సింధునాగరికత, మెసపొటేమియా, గ్రీకు నాగరికతల లోనూ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. స్త్రీ మూర్తులలో లజ్జాగౌరిని పోలిన ప్రాచీనమైన మూర్తిని గురించి ఋగ్వేదంలో ఉటంకింపులు కనిపిస్తాయి. ఆ ఋగ్వేద మాత పేరు అదితి ఉత్తానపద. అదితి ఉత్తానపద: ఋగ్వేదంలోని అనేక ఋక్కులలో ఉటంకింపబడిన ఒకానొక దేవత పేరు అదితి. ఆమెనే “అదితి ఉత్తానపద” అన్నారు. ఈ దేవత జగత్తుకంతటికీ మాత. ఈ అదితియే జనయిత్రి, పృథ్వి, మహామాత కూడా. అదితిర్ ద్యౌరదితిర్ అన్తరిక్షమ్ అదితిర్ మాతా స పితా స పుత్రః | విశ్వే దేవా అదితిః పఞ్చ జనా అదితిర్ జాతమ్ అదితిర్ జనిత్వమ్ || (1-089-10) అదితియే ఆకాశము, అదితియే అంతరిక్షము, అదితియే తల్లి, తండ్రీ, పుత్రుడూ కూడాను. అదితియే పంచజనులైన విశ్వే దేవులు, పుట్టినది, పుట్టబోయేది కూడా అదితియే. దేవానాం యుగే ప్రథమే ऽసతః సద్ అజాయత | తద్ ఆశా అన్వ్ అజాయన్త తద్ ఉత్తానపదస్ పరి || 10-072-03 దేవతల మొదటి యుగంలో అసత్తు నుంచి సత్ అన్నది పుట్టింది. ఆపై ఆకాశపు అంచులు ఉత్తానపదం నుంచి పుట్టాయి. భూర్ జజ్ఞ ఉత్తానపదో భువ ఆశా అజాయన్త | అదితేర్ దక్షో అజాయత దక్షాద్ వ్ అదితిః పరి || 10-072-04 పాదాలను విడదీసిన ఆ మూర్తి నుంచి భూమి, భూమి నుంచి ఆకాశము పుట్టాయి. అదితిర్ హ్య్ అజనిష్ట దక్ష యా దుహితా తవ | తాం దేవా అన్వ్ అజాయన్త భద్రా అమృతబన్ధవః || 10-072-05 దక్ష! ఆ అదితియే నీ కూతురిగా పుట్టినది. అమృత బంధువులు, భద్రులైన దేవతలు ఆమె నుంచి ప్రభవించారు. దక్షప్రజాపతికి పదముగ్గురు కుమార్తెలు. వారిలో అదితి ఒకత్తె. వారందరినీ కశ్యప మహర్షి వివాహం చేసుకున్నాడు. ఆ పదముగ్గురి సంతానమే చరాచర జీవరాశులు. కశ్యప మహర్షికి అదితికి పుట్టిన వారు ఆదిత్యులు. వారే దేవతలు. ఈ అదితియే లజ్జాగౌరి, లేదా లజ్జాగౌరికి పూర్వరూపమని చారిత్రకులు, ఇండాలజిస్టులు భావిస్తున్నారు. హరప్పా నాగరికతలో తల దించుకున్న స్త్రీ మూర్తి, ఆమె యోని నుండీ ఒక తీవె వెలువడుతున్నట్టుగా చిహ్నాలున్న విగ్రహమొకటి బయటపడిందట. ఈమెయే ఆ అదితి అన్న మాతృదేవత గా భావించబడుతున్నది. స్త్రీ మూర్తి – మార్మికత లజ్జాగౌరి విగ్రహంలో మరొక చిత్రమైన విషయం గమనించదగినది. ఈ స్త్రీ మూర్తికి శిరోరహిత మూర్తి. తల స్థానంలో పద్మం ఉండటం ఒక చిత్రం. ఇది ఒక మార్మికమైన విషయం. స్త్రీమూర్తి ప్రకృతికి నిదర్శనం. పురుష మూర్తి మేధకు చిహ్నం. స్త్రీ హృదయమైతే – పురుషుడు ఆలోచన. స్త్రీ వామార్ధమైతే – పురుషుడు దక్షిణభాగం. స్త్రీ శరీరమైతే – పురుషుడు శిరస్సు. స్త్రీ క్షేత్రం – పురుషుడు బీజం. క్షేత్రభూతా స్మృతా నారీ, బీజభూతః స్మృతః పుమాన్ | క్షేత్రబీజసమాయోగాత్ సంభవః సర్వదేహినామ్ || (మనుస్మృతి 9 -33)
ప్రకృతి-పురుషుల సమగ్రరూపమే సృష్టి. అదే అర్ధనారీశ్వర తత్త్వం. వామభాగం (హృదయం ఉన్న భాగం) పార్వతిదైతే, దక్షిణభాగం ఈశ్వరునిది. మేధకు పరిమితి ఉంది. మేధ ఆలోచిస్తుంది కట్టడి చేయడానికి, నియమసహితమైన జీవనానికి మార్గాలు అన్వేషిస్తుంది. స్త్రీ శక్తికి పరిమితులూ, బాహ్యనియమాలు లేవు. ఆ శక్తి విలయానికి, జన్మకూ కూడా ఆదిభూతమైనది. విలయానికి మూలమైన శక్తి కాళీదేవి అయితే, సృజనకు మూలమైన శక్తి గౌరీదేవి. శిరోరహిత శరీరం స్వచ్ఛమైన స్త్రీత్వానికి, ప్రకృతికి, శక్తి రూపానికి నిదర్శనం. తామరపువ్వు సృజనకు సంకేతం. మహావిష్ణువు పద్మనాభుడు. పద్మం ద్వారా ఆయన సృష్ట్యాదిలో బ్రహ్మను పద్మంలో నిలిపినట్టు విష్ణుపురాణం. లజ్జాగౌరి శిరస్సు లుప్తమైనందున, శిరస్సు స్థానంలో పద్మం ఉండటం మూలానా, రెండు చేతులలో పద్మాలు ధరించటం మూలాన, ఈ మూర్తి సృజనకు మూలమైన ప్రకృతి శక్త్యాత్మకమైన గౌరీదేవికి ప్రతీక. కొన్ని ప్రాంతాలలో లభ్యమైన లజ్జాగౌరి విగ్రహాల పక్కన గోవు విగ్రహం కూడా కనిపిస్తుంది. గోవు – పృథివి స్వరూపం. భూమాతయే లజ్జాగౌరి. గ్రీకు బౌబో దేవత ప్రాచీన రోమనులు “బౌబో” (Baubo) అన్న పేరుతో ఒక స్త్రీమూర్తిని కొలిచే వారు. ఆమె కూడా సంతాన సాఫల్యం ప్రసాదించే స్త్రీ దేవత. ఈ మూర్తి అర్చన క్రీ.పూ. రెండవ శతాబ్దం నుండి దాదాపు క్రీ.శ. రెండవ శతాబ్దపు మధ్య కాలంలో విరివిగా సాగేదట. “ఆర్యుల దందయాత్ర” సిద్ధాంతాన్ని నమ్మే కొందరి అంచనా ప్రకారం, భారతదేశంలో లజ్జాగౌరి – గ్రీకుదేవత బౌబోకు ప్రతిరూపం. గ్రీకు దేవత భారతదేశంలో అడుగిడిన తర్వాత ఇక్కడి తాత్విక ధోరణులకు, సిద్ధాంతాలకు అనుగుణంగా రూపు మార్చుకుని, శిరోరహిత మూర్తిగా నెలకొందట.
ఈ ఊహలకు సరైన కారణాలు కానీ, ఆధారాలు కానీ కనబడవు. పాశ్చాత్యులకు భారతీయమైనదేదీ ఇక్కడిది కాదు, మరెక్కడి నుంచో సంక్రమించినదన్న సంకుచితమైన దృష్టి మెండు. గ్రీకులో ఇటువంటి ఆనవాళ్ళు ఒకవేళ దొరికి ఉండకపోతే వాళ్ళే ఈ దేశంలో మూర్తి ఆరాధన అసహ్యకరమైనదని, ఆటవికమైనదని నిర్ధారించి ఉండేవారు. గ్రీకు దేశంలో బౌబో ఉపాసన ఉండేది కాదు కాబట్టి నగ్న స్త్రీ ఉపాసనను గుర్తించి భారతదేశానికి పాకిందని కల్పించారు. ప్రాచీన కాలం నుంచే Iconography లోనూ, శిల్పశాస్త్రంలోనూ అత్యున్నత ప్రమాణాలు సాధించిన భారతదేశం గ్రీకు దేవత విగ్రహాన్ని అరువు తెచ్చుకుని మార్చుకునే అవసరం కనబడదు. లజ్జా గౌరి – గ్రామదేవత. గ్రీసు దేశం ద్వారా వచ్చిన బౌబో అన్న దేవత గ్రామీణ భారతంలో ఎందుకు నెలకొన్నదని స్పష్టంగా వివరించగలిగే ఆధారాలు కూడా లేవు. బహుశా వేదకాలంలోని అదితి ఉత్తానపద, రేణుక, లేదా మౌఖిక సాహిత్యపు గాథల్లోని స్త్రీ దేవతలకు గ్రామీణులు రూపం కల్పించుకుని ఉంటారు. భిన్న రూపాలలో, భిన్న నామాలతో ఈ స్త్రీమూర్తి ఉపాసన అనేక ప్రాంతాలకు పాకి ఉంటుంది. అందుకనే లజ్జాగౌరి అన్నపేరు అనేక నామాంతరాలతో కనిపిస్తుంది. అదితి, కోటవి, రేణుక, యల్లమ్మ, మాతంగి, నగ్నగాత్రి, ఆద్యశక్తి, శాకంబరి వంటి పేర్లు చాలా కనబడతాయి. కూటవి కూట్ట, కూటరా, కూటవి, కూటవై – ఇలా రకరకాల పేర్లు కలిగిన ఒక స్త్రీమూర్తి ప్రస్తావన ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ, మౌఖిక సాహిత్యంలోనూ, ప్రాకృత సాహిత్యపు మూలల్లోనూ కనిపిస్తుంది. శ్రీమద్భాగవతంలో బాణాసురుని తల్లి పేరు కూటరా దేవి. వివస్త్ర అయిన ఈ స్త్రీమూర్తి బహుశా తాంత్రిక దేవత కావచ్చు. ఈ స్త్రీమూర్తి ఉపాసకులను కూడా ఆ పేరుతోను పిలిచేవారు. వారు అగుపడితే అరిష్టమని భావించేవారు. లజ్జాగౌరి ఉపాసనతో ముడివడిన మరొక స్త్రీమూర్తి కూటవి. తమిళనాడులోనూ, ఇతర ప్రాచీన దేవాలయాలలోనూ సప్తమాతృకల విగ్రహాలు అక్కడక్కడా కనిపిస్తాయి. అదేవిధంగా దశమహావిద్యలలో “ఛిన్నమస్త” అన్న రూపం శిరో రహితంగా కనిపిస్తుంది. లజ్జాగౌరి ఉపాసన బహుశా తాంత్రిక ఉపాసనతో కూడా ముడివడి ఉండవచ్చుననిపిస్తుంది. భారతదేశం మహా విచిత్రమైన, మార్మికమైన, ఆధ్యాత్మికమైన భూమి. ఆధ్యాత్మికత, శిల్ప, చిత్రకళలూ, అనూచానమైన ఉపాసన, భక్తి విశ్వాసాలూ, సాహిత్యము, సాంప్రదాయము – ఇలా విభిన్నమైన విషయాలకు మధ్య ఒక అదృశ్యమైన తీవె యొక్క సమన్వయం కనిపిస్తుంది. లజ్జాగౌరి అన్న గ్రామదేవత మీద గత శతాబ్ద కాలంలో విస్తృతంగా పరిశోధన జరిగింది. ముఖ్యంగా పాశ్చాత్యులు ఈ మూర్తిని గురించి చాలా ఆసక్తి చూపారు. లజ్జాగౌరి మూర్తి విగ్రహాలను అమెరికాలో కొన్ని ప్రాంతాల మ్యూజియం లలోనూ నెలకొలిపినారు. అయితే పూర్తిగా భారతీయ నేపథ్యంలో, చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా కొనసాగిన పరిశోధనలు అరుదనే చెప్పాలి. తెలుగులో లజ్జాగౌరి మీద వ్యాసాలు కానీ సమాచారం కానీ ఎందుచేతనో అస్సలు లేదు.. చాలా విస్తృతమైన అంశాన్ని గురించి రేఖామాత్రంగా పరిచయం చేయటానికి చేసిన ప్రయత్నం ఈ వ్యాసం. Source : Nomula Prabhakar Goud 944006 0852 . Note: This post is only for the sake of Knowledge Sharing. నగ్న విగ్రహాల ప్రదర్శనతో మా మనోభావాలు దెబ్బతిన్నాయనే పవిత్ర మతాల మతిష్టుల కోసం మాత్రం కాదు ... Nomula Prabhakar Goud 944006 0852.

21, సెప్టెంబర్ 2017, గురువారం

ఆత్మ Spirit soul ...

గొప్ప నీతి కథ.. అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అం దుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని. దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. నలభై ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు. అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు. 🍃🍃🍃 అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది. నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, *'నేను వెళ్తున్నా'* అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతుకు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది. *నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా'* ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.💓 అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా! కంగారుగా అన్నాడు లక్ష్మీపతి. అవును! ప్రతిధ్వనించింది ఆత్మ. వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి. అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం ఒక రోగాల పుట్ట. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను? ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం? నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాసస్థలం. నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకూ సమస్యలే. నాకు రక్షణ లేదు. సుఖం లేదు. అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు .. డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా? నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు. ఇంకొకడిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేసావో గుర్తుకుతెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇక నేనుండలేను వెళ్తున్నా!' 👪 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువయ్యింది. దాంతో ఈ రోజు, ఈ క్షణాన్ని ఆనందించడం మరచిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో అర్ధం ఉందా? ...
.Nomula Prabhakar Goud

8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

సెప్టెంబర్‌ 17, 1948

సెప్టెంబర్‌ 17, 1948.
Nomula Prabhakar Goud చరిత్ర తెలియని వారికి ఈ తేదీ ప్రాధాన్యం పెద్దగా తెలియకపోవచ్చు, కానీ చరిత్ర తెలిసిన వారి మనసు భావోద్వేగంతో నిండిపోతుంది. ఆనాటి స్వాతంత్య్ర సమరం, పోరాట యోధులు, త్యాగధనులను తలచుకొని వారికి నివాళులర్పిస్తారు. అదే సమయంలో కొందరు ఈ తేదీ గురించి చెపితే ఉలిక్కిపడతారు. ఆత్మవంచన చేసుకుంటారు. ఈ తేదీకి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, మొండిగా వాదించే ప్రయత్నం చేస్తారు. 68 ఏళ్ల క్రితం అంటే సరిగ్గా ఇదే రోజున భారతదేశం నడిబొడ్డున ఒక సర్జరీ జరిగింది. క్యాన్సర్‌ లాంటి కణితిగడ్డ తొలగిపోయింది.. 1948 సెప్టెంబర్‌ 17 నాడు విజాతీయ, ఫ్యూడల్‌ భావాలు గల హైదరాబాద్‌ సంస్థానం కాలగర్భంలో కలిసింది. ఇక్కడి ప్రజలు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందారు. ఇది వాస్తవం. తెలంగాణ విమోచన ఉత్సవాలు ఎందుకు జరపరు? భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1947 ఆగస్టు 15కు ఎంత ప్రాధాన్యం ఉందో, తెలంగాణ విమోచనం జరిగిన 1948 సెప్టెంబర్‌ 17కూ అంతే ప్రాముఖ్యం ఉంది. ఈ రెండూ స్వాతంత్య్ర దినోత్స వాలే. దురదష్టవశాత్తు తెలంగాణ ప్రజలు ఏడు దశాబ్దాలుగా తెలంగాణ స్వాతంత్య్రదిన ఉత్సవాలకు నోచుకోలేక పోతున్నారు. 1956 నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. నిజాం నుండి విమోచన లభించిన హైదరాబాద్‌ సంస్థానంలోని తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోనూ, మరాఠ్వాడాను బొంబే స్టేట్‌ (మహారాష్ట్ర) లోనూ, కర్ణాటక ప్రాంతాన్ని మైసూర్‌ స్టేట్‌లోనూ విలీనం చేశారు. ప్రతి ఏటా 17 సెప్టెంబర్‌ నాడు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పాత హైదరాబాద్‌ భూభాగాల్లో విమోచన వేడుకలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. కానీ పాత హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రధాన భాగమైన తెలంగాణ మాత్రం ఈ అదష్టానికి దూరంగా ఉండిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఏనాడూ హైదరాబాద్‌ విమోచన వేడుకలను నిర్వహించిన పాపాన పోలేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మార్గంలో కొనసాగుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో కె.చంద్రశేఖరరావు విమోచన ఉత్సవాలను ఎందుకు నిర్వహించడం లేదంటూ నాటి ఆంధ్రప్రదేశ్‌ పాలకులను తప్పు పట్టారు. తెలంగాణ వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ తెలంగాణ ఏర్పడి, స్వయానా కె.చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఇచ్చిన హామీని నిలుపుకోవడానికి జంకుతున్నారు. అందుకు కారణం సుస్పష్టం. ఆనాటి రజాకార్ల పార్టీ మజ్లిస్‌తో కె.చంద్రశేఖర రావు పార్టీ టిఆర్‌ఎస్‌ స్నేహ బంధం మొదలు పెట్టింది. హైదరాబాద్‌ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తే వారు నొచ్చుకుంటారని టిఆర్‌ఎస్‌ భయం. అసలు తెలంగాణ విమోచన వేడుకలకు మతం రంగు పులమాల్సిన అవసరం ఏముంది? ఈ వేడుకలు ముస్లింలకు వ్యతిరేకం అని ఎవరన్నారు? హైదరాబాద్‌ విమోచన ఉద్యమం ముస్లింలకు వ్యతిరేకం అనే అపోహలను కల్పించిన పాపం కేవలం ఓట్ల రాజకీయాలకు పాల్పడే కొందరు రాజకీయ నాయకులది మాత్రమే. ముస్లింలు కూడా నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విషయాన్ని వారు మరచిపోతున్నారు. నిజాం, రజాకార్ల దాష్టీకాలు, దమన నీతిని తన ‘రయ్యత్‌’, ‘ఇమ్రోజ్‌’ పత్రికల ద్వారా ఎండగట్టిన ముస్లిం పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్‌. అందుకు అతను అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. కమ్యూనిస్టు నాయకుడు మగ్దుం మొహియుద్దీన్‌, దొరల అరాచకాలపై ధిక్కార స్వరం వినిపించిన షేక్‌ బందగీ తదితరులు ముస్లింలు కాదా? హైదరాబాద్‌ విమోచన వేడుకలను అధికారి కంగా నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతున్నట్లు? హైదరా బాద్‌ స్వాతంత్య్రాన్ని, ఆనాటి పోరాట యోధులను, త్యాగధనులను తలచుకునే అపూర్వ ఘడియల గురించి భావి తరాలు తెలుసుకోకుండా అడ్డంకులను ఎందుకు కల్పిస్తున్నట్లు? ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తమ సంకుచిత విధానాలు, మొండివైఖరిని పక్కనపెట్టాలి. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా, రాజకీయాలకతీతంగా ఘనంగా నిర్వహించాలి. Nomula Prabhakar Goud

4, సెప్టెంబర్ 2017, సోమవారం

Rani Rudrama Devi రుద్రమ దేవి

రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం
కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896-925 మొదటి బేతరాజు 946-955 నాల్గవ గుండయ 956-995 గరుడ బేతరాజు 996-1051 మొదటి ప్రోలరాజు 1052-1076 రెండవ బేతరాజు 1076-1108 దుర్గరాజు 1108-1115 రెండవ ప్రోలరాజు 1116-1157 గణపతి దేవుడు 1199-1262 రుద్రమ దేవి‡ 1262-1289 ప్రతాపరుద్రుడు 1289-1323 ‡ రాణి ఇతరులు మాలిక్ మక్బూల్ నిర్మాణాలు *వరంగల్ ఖిల్లా *వేయి స్తంభాల గుడి *రామప్ప దేవాలయం మార్చు హైదరాబాదులోని టాంకుబండుపై రుద్రమదేవి విగ్రహముశిలాఫలకం రుద్రమదేవి (ఆంగ్లం : Rudrama Devi) కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి[1]. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు[2]. గణపతిదేవుడు తన కుమర్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు ) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాపతి మరియు మహా ప్రధాని. జీవిత విశేషాలు కాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి ' రుద్రమహారాజు ' బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేసారు. అదేసమయంలో నెల్లూరు పాండ్యుల కింద, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడి కిందకి వెల్లినయి... పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేసారు. రుద్రమ తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్లనన్నిటినీ విజయవంతంగా అణచివేసింది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నిటిలోకీ దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది, కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు, అయితే రుద్రమ యాదవలను ఓడించి, దేవగిరి దుర్గం వరకూ తరిమి కొట్టింది. వేరేదారి లేని మహదేవుడు సంధికి దిగివచ్చి, యుద్ధ పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలు చెల్లించాడు. రుద్రమదేవి యొక్క శైవమత గురువు విశ్వేశ్వర శివశంబు. గణపతి దేవునికి, రెండవ ప్రతాపరుద్రునికి కూడా ఈయనే గురువు. రుద్రమ తానే స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. Chandupatla (నల్గొండ) శాసనం ఆధారంగా కాయస్త అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణిచినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. రుద్రమదేవికి గల ఇతర బిరుదులు: రాయగజకేసరి, ఘటోధృతి. ప్రఖ్యాత పథికుడు మార్కో పోలో ఛైనా దేశమునుండి తిరిగివెళ్ళుతూ దక్షిణభారతదేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి బహువిధముల పొగిడాడు. మోటుపల్లి రేవునుండి కాకతీయుల సముద్ర వ్యాపారము గురించి కూడా వివరముగా వ్రాశాడు[3]. అయితే ఇంకా...కాస్త విపులంగా చెప్పాలంటే ... రాణీ రుద్రమదేవి గురించి మనకు తెలిసింది రాణీ రుద్రమ దేవి గురించి మనకు తెలిసినదానికన్నా తెలియనిదే ఎక్కువ. ఆమె జన్మ సంవత్సరం తెలియదు. ఉజ్జాయింపుగా ఊహించడానికి వీలుంది అని కాకతీయ యుగము గ్రంథంలో లక్ష్మీరంజనం రాశారు. నిజమే! రుద్రమదేవి గురించి చరిత్రకారులకూ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. దిగ్విజయంగా పాలనా[మూలపాఠ్యాన్ని సవరించు] ఆమె తన శక్తిసామర్థ్యాలతో ప్రతి ఒక్కరినీ మెప్పించి దిగ్విజయంగా పాలనా వ్యవహారాలను నిర్వహించారు. ప్రఖ్యాత కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి ఓరుగల్లు (నేటి వరంగల్లు) రాజధానిగా పరిపాలించారు. క్రీ.శ.1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. మనదేశంలో మహిళాపాలకులు చాలా అరుదు. రాణీ రుద్రమదేవికి కొద్దికాలంముందే సుదూరంలో ఉన్న ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించారు. ప్రభువర్గాలకు చెందిన వారు స్త్రీపరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలిగా అంగీకరించక తుదముట్టించారు. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి, ఆమె పరిపాలన, ధైర్యసాహసాలను కొనియాడాడు. ఆమె పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా, సునాయాసంగా గుర్రాల స్వారీ చేసేవారని పేర్కొన్నాడు. నాటి శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది. రజియా సుల్తానా లాగా రుద్రమదేవి కూడా తన తండ్రి పాలనా కాలంలోని ముఖ్యమైన నాయకుల వ్యతిరేకతను విజయవంతంగా అణిచివేసింది. రుద్రమదేవి, ఆమె మనుమడైన ప్రతాపరుద్రుడి పాలనలో చెలరేగిన అనేక సామంత తిరుగుబాట్లను నియంత్రించడానికి పలు చర్యలు తీసుకున్నారు. రాజ్ఞి రుద్రమ దేవిని గూర్చి రాస్తూ ప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, డాక్టరు నేలటూరు వెంకటరమణయ్య ఇట్లా అభివర్ణించారు. తెలుగు వారిని పాలించిన దేశ పరిపాలకులలో రుద్రమదేవి నిస్సందేహంగా మహాఘనత చెందిన వ్యక్తి. రాజధర్మ విధులను ఆమె నిర్వహించిన తీరువలన తండ్రియామెకు ప్రసాదించిన పురుషనామము.. రుద్రదేవుడు అన్ని విధముల సార్థకమైనది. ప్రజలామెను రుద్రదేవ మహారాజు అని పిలుచుకునేవారు. దేశ పరిపాలనలో ఆమె చైతన్యవంతమైన పాత్ర వహించింది. ధైర్య సాహసములు విక్రమము కల యోధురాలు అవడమే కాక గొప్ప వ్యూహతంత్రజ్ఞురాలు. ఆమె రాజరికం చేసిన కాలంలో తరుచూ యుద్ధముల అలజడి కలిగినా ఆమె ప్రజలు సంతుష్టులు, సంప్రీతులు అయి సుఖించారు రుద్రమదేవి పాలన ప్రజారంజకమై రుద్రమదేవి పాలన ప్రజారంజకమై భాసిల్లింది. శాంతి సుస్థిరతలతో విరాజిల్లింది. క్రీ. శ. 1000 నుంచి 1323 వరకు దాదాపు మూడు శతాబ్దాల పాటు తెలుగు నేల నేలింది కాకతీయ వంశం. వీరికాలంలోనే త్రిలింగ, ఆంధ్ర పదాలకు అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. కాకతీయ వంశంలో సప్తమ చక్రవర్తి అయిన గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు తలొగ్గిన ఆయన తన కూతురు రుద్రమదేవిని కుమారుడిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు ఆమె వయసు పద్నాలుగేళ్లే. అప్పటి నుంచి ఆమె తండ్రి చాటుబిడ్డగా పాలన సాగించింది. రుద్రమదేవి 1261 ప్రాంతం నుంచీ స్వతంత్రంగా పరిపాలించినట్లు కనబడుతుంది. కొన్ని శాసనాల్లో 1279 వరకు పట్టాభిషక్తురాలు కాలేదేమో అనే భావం కలిగించే రాతలున్నాయి. పాలనాకాలమంతా యుద్ధాలతోనే రుద్రమ దేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి దాయాదుల నుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్టించగానే ఎదురు తిరిగారు. తిరుగుబాట్లు లేవదీశారు. అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. పరిపాలనా దక్షతలో నేర్పరి అయిన రాణీ రుద్రమ వారి అసూయను అణిచి వేసింది. దక్షిణాదిని పాలించే చోళులు, మరాఠా ప్రాంత యాదవులను సమర్థవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడిన యోధురాలు రాణీ రుద్రమ. దేవగిరి యాదవ మహాదేవుడు ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమపైకి దండెత్తి వచ్చాడు. మహదేవునిపై పదిరోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుడ్ని ఆ యుద్ధంలో మట్టికరిపించి మూడు కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మళ్లీ తలెత్తకుండా చేసింది. రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు. వీరభద్రునితో వివాహం పద్నాలుగవ యేటనే పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు ఇరవై ఐదో యేట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రునితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ముమ్మడమ్మ, రుయ్యమ్మ. తనకు మగ సంతానం లేకపోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడ్ని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. విధి ప్రాతికూల్యం చేత రుద్రమ దేవి భర్త చాళుక్య వీరభద్రుడు క్రీ.శ. 1266 నాటికే మృతిచెందినట్లు ఆయన తల్లి ఉదయ మహాదేవి పాలకొల్లు శాసనంలో ఉంది. భర్త మరణానికి సమీప కాలంలోనే రుద్రమదేవికి మరొక తీరని దుఃఖం కలిగింది. వృద్ధుడైన గణపతి దేవ చక్రవర్తి 1267లో శివసాయుజ్యం చెంది ఆమెను నిస్సహాయురాల్ని చేశాడు. రుద్రమకు ఇద్దరు కూతుళ్లే కాక మరో కూతురు కూడా ఉందా? అనే అనుమానం ఆ మధ్య ఒక శాసనం కలిగించింది. ప్రకృతశాసనంలోని ఎల్లన దేవుని భార్య కూడా రుద్రమదేవి తనయ అని ఆ శాసనం చెబుతోంది. రుద్రమదేవి పాలనలో రాణీ రుద్రమ తనదైన శైలిలో, అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్టుగా ఏ ఇతర రాజులూ అర్థం చేసుకోలేదు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ పట్టోధృతి అంటే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశమంతా కలియ తిరిగింది. ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒక చోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మూయడం చూసి రుద్రమ తల్లడిల్లింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మహామంత్రీ! గ్రామగ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇకపై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పడడానికి వీల్లేదు అని ప్రకటించింది. గొలుసు కట్టూ చెరువులు రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు.తెలంగాణలో ఇప్పుడు ఉన్న గొలుసు కట్టూ చెరువుల విధానం ప్రపంచం మొత్తం తిరిగి చూసిన మరెక్కడ కనిపించని శాస్త్రీయవిధానం రాణి రుద్రమా దేవి చూచించ వ్యవస్ధా విధానం 800 సం||లు దాటినా తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి ప్రదాన మూలాదారాం ప్రతి గ్రామానికీ ఊర చెరువులు మరియు కుంటలు లక్నవరం, పాకాల, రామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు ... వారి పరిపాలనదక్షతకు నిదర్శనం.వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం విస్తరించింది. విరాజిల్లింది. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు దీటైన పేరిణీ శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుపోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జాయప సేనాని పేరిణీ నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్ప కళ, నృత్యం కలగలిసిపోయి విరాజిల్లాయి. సువిశాల మహాసామ్రాజ్యాన్ని మన రుద్రమ అసమాన పరాక్రమశాలి. కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనం. రుద్రమ్మ భుజశక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహ స్వప్నమైంది. అంతఃశత్రువులు, బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణాన తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన చత్తీస్ఘడ్ బస్తర్ సీమ వరకు, పడమరన బెడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గంజాం.. అంటే అస్సోం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే రుద్రమ దక్షిణాపథంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. ఆమె సాహసానికీ, ధీరత్వానికీ, తెగువకూ, పాలనా దక్షతకూ మారు పేరుగా నిలిచింది. తెలంగాణ మహిళ పాలనా పటిమను, మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. ఎప్పుడు చనిపోయింది? రుద్రమ తన ప్రసిద్ధ సేనాని గోన గన్నారెడ్డితో కలిసి కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో పలు దుర్గాలు వశపరుచుకుంది. గోన గన్నారెడ్డి వారి రాజ్యరక్షామణియైన విఠలనాథ దండనాథుడు మాలువ, హాలువ మొదలైన దుర్గాలు సాధించిన తర్వాత సర్వరాష్ట్ర సమస్త ప్రజారక్షణ కోసం రాయచూరులో దుర్గం నిర్మించినట్లు అతని శాసనం (1294) చెబుతోంది. రాయచూరు విజయం రుద్రమ దేవి కడపటి విజయమని భావిస్తున్నారు. కావున 1295 ప్రాంతమున మహారాజ్ఞి రుద్రమ శివసాయుజ్యం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనంలో రుద్రమదేవి 1289 నవంబరు 27న మరణించినట్లు అవగతమవుతున్నది. దీనిని ఇతర శాసనముల సాక్ష్యముతో సమన్వయించి నిర్ధారించవలసి ఉంది. అంబదేవుని దొంగదెబ్బ అనేకసార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదునుకోసం చూస్తున్న అంబదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తి పట్టి కదన రంగాన దూకింది. అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్లు. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రి క్షేత్రానికి సమీపంలో గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు. కాకతీయ సామ్రాజ్యానికే వన్నెతెచ్చిన వీర ధీరనారి ఆమె. శత్రువుకు ఎదురొడ్డి నిలిచి.. రాజ్యాన్ని పాలించింది. గొప్ప పరిపాలనాధ్యక్షురాలిగా.. కీర్తికెక్కిన మహిళామణి. ఆమే కాకతీయ సామ్రాజ్యాన్ని దశదిశలా విస్తరింపజేసిన రాణీ రుద్రమదేవి. అయితే రుద్రమదేవి చర్రిత అందరికి తెలిసినప్పటికీ.. ఆమె జీవిత చరమాంకానికి సంబంధించిన విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ వివరాలు తెలియాలంటే నల్లగొండ జిల్లాకు వెళ్ళాల్సిందే. రాణి రుద్రమదేవి చరిత్ర కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా స్మరణకు వచ్చే రాణి రుద్రమదేవి చరిత్ర. కాకతీయుల్లోనే రాయగజకేసరి బిరుదాంకితురాలై కీర్తింపబడిన రుద్రమదేవి జీవిత చరమాంకం ఏ విధంగా ముగిసిందో చరిత్రలో ఎక్కడా రాయలేదు. కానీ నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామం రాణీ రుద్రమాదేవి జీవిత చరమాంకానికి సంబంధించిన చారిత్రక అవశేషాలను దాచుకొంది. రాణీ రుద్రమాదేవి ఇదే గ్రామంలో చనిపోయిందని తెలిపే శిలాశాసనాలు చాలాకాలం తర్వాత బయటపడ్డాయి. రుద్రమదేవి మరణశాసనం ఉస్మానియా యూనివర్శిటీలో.. తెలుగు రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తున్న సైదులు.. కాకతీయ రుద్రమాదేవి మరణానికి సంబంధించిన చారిత్రిక ఆధారాల కోసం అన్వేషించసాగాడు. ఇందులో భాగంగానే.. చందుపట్ల గ్రామంలో మట్టిలో కూరుకుపోయిన శాసనాన్ని గుర్తించి పురావస్తు శాఖాధికారుల సహాయంతో.. వెలికితీయించి అది రుద్రమదేవి మరణశాసనంగా గుర్తించారు. విరోధనామ సంవత్సరం ద్వాదశి రోజున అంటే.. 1289వ సంవత్సరం, నవంబరు 27వ తేదీన రాణీ రుద్రమదేవి వీరమరణం పొందినట్లుగా శాసనంపై లిఖించినట్లు వెల్లడైందని తేలింది[4]. అంబదేవుడి రుద్రమ చేతిలో వీరమరణం నల్లగొండ సమీపంలోని పానగల్లుకు వస్తోన్న క్రమంలోనే చందుపట్ల కాపర్తి అయిన అంబదేవుడి చేతిలో వీరమరణం పొందినట్లు శిలాశాసనం ద్వారా వెల్లడవుతోంది. రాణి రుద్రమతోపాటు.. ఆమె సైన్యాధ్యక్షుడు మల్లిఖార్జున నాయుడు కూడా అక్కడ చనిపోయినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఈ శాసనాన్ని రాణిరుద్రమ సేవకుడు పువ్వుల ముమ్మడి అనే వ్యక్తి వేయించినట్లు తెలుస్తోంది. ఈ శాసనం బైటపడేవరకు.,. రాణి రుద్రమదేవి మరణించిన తేదీల విషయం ప్రపంచానికి తెలియదు. ఈ శాసనం ఆధారంగా 1289 నవంబరు 27న రుద్రమదేవి చనిపోయినట్లుగా నిర్ధారణ అయ్యింది. శ్రీశైలం, శ్రీ కాళహస్తీ, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రీల్లింగ దేశం. టాంక్ బండ్‌పై విగ్రహాలు ఇది జాతి చైతన్యస్ఫూర్తికి కళాప్రాంగణం పట్టిన నీరాజనం తెలుగుజాతి బహుముఖ వికాసానికి దివిటీలెత్తిన మహనీయుల సంస్మరణం (సికింద్రాబాదు నుండి వరసగా) రుద్రమదేవి • మహబూబ్ అలీ ఖాన్ • సర్వేపల్లి రాధాకృష్ణన్ • సి.ఆర్.రెడ్డి • గురజాడ అప్పారావు • బళ్ళారి రాఘవ • అల్లూరి సీతారామరాజు • ఆర్థర్ కాటన్ • త్రిపురనేని రామస్వామిచౌదరి • పింగళి వెంకయ్య • మగ్దూం మొహియుద్దీన్ • సురవరం ప్రతాపరెడ్డి • జాషువ • ముట్నూరి కృష్ణారావు • శ్రీశ్రీ • రఘుపతి వెంకటరత్నం నాయుడు •త్యాగయ్య • రామదాసు • శ్రీకృష్ణదేవరాయలు • క్షేత్రయ్య • పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి • బ్రహ్మనాయుడు • మొల్ల • తానీషా • సిద్ధేంద్ర యోగి • వేమన • పోతనామాత్యుడు • అన్నమాచార్య • ఎర్రాప్రగడ • తిక్కన సోమయాజి • నన్నయభట్టు • శాలివాహనుడు సమర్పణ ఫలకం టాంకు బండ పై విగ్రహాలుమహారాణులుసుప్రసిద్ధ భారతీయులుకాకతీయ రాజులుసుప్రసిద్ధ ఆంధ్రులు.

Ministers Central కేంద్ర మంత్రులు

*కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు* *కేంద్ర కేబినెట్ మంత్రులు* రాజ్‌నాథ్ సింగ్ - కేంద్ర హోంశాఖ సుష్మా స్వరాజ్ - విదేశాంగ శాఖ అరుణ్ జైట్లీ - ఆర్థిక శాఖ నితిన్ గడ్కరీకి - రోడ్ రవాణా, హైవేస్, షిప్పింగ్ - అదనంగా జల వనరులు, గంగా ప్రక్షాళన సురేశ్ ప్రభు - కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సదానంద గౌడ - అర్థ గణాంకాల శాఖ ఉమా భారతి - త్రాగు నీరు, పారిశుద్ధ్యం రాంవిలాశ్ పాశ్వాన్ - కన్యూమర్ ఎఫైర్స్, ఆహారం మరియు ప్రజా పంపిణీ మేనకా గాంధీ - స్త్రీ శిశు సంక్షేమ శాఖ అనంత్ కుమార్ - ఎరువులు, రసాయనాలు, పార్లమెంటరీ వ్యవహారాలు రవిశంకర్ ప్రసాద్ - న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ జేపీ నడ్డా - వైద్యారోగ్య శాఖ అశోక్ గజపతి రాజు - పౌర విమానయాన శాఖ అనంత్ గీతే - భారీ పరిశ్రమల శాఖ హర్‌సిమ్రత్ కౌర్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, మైన్స్ చౌదరి బీరేంద్ర సింగ్ - ఉక్క శాఖ జువల్ ఓరం - గిరిజన శాఖ రాధామోహన్ సింగ్ - వ్యవసాయ శాఖ థావర్ చంద్ గెహ్లాట్ - సామాజిక న్యాయశాఖ స్మృతి ఇరానీ - సమాచార ప్రసారాలు, జౌళి శాఖ హర్షవర్దన్ - సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖలు ప్రకాశ్ జవడేకర్ - మానవ వనరుల అభివృద్ధి ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజ వనరులు, స్కిల్ డెవలప్మెంట్ పీయూష్ గోయల్ - రైల్వే మరియు బొగ్గు శాఖ నిర్మలా సీతారామన్ - రక్షణ శాఖ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాలు *కొత్తగా ప్రమాణం చేసిన కేంద్రమంత్రుల శాఖలివే* నిర్మలా సీతారామన్: రక్షణశాఖ పీయూష్ గోయల్: రైల్వేశాఖ ధర్మేంద్ర ప్రధాన్: పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి హర్దీప్ సింగ్ పూరీ: గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి రాజ్‌కుమార్ సింగ్: విద్యుత్ శాఖ ఆల్ఫాన్స్ కన్నంథనమ్: పర్యాటకం ముక్తార్ అబ్బాస్ నఖ్వీ: మైనార్టీ సంక్షేమం గజేంద్రసింగ్ షెకావత్: వ్యవసాయం అనంతకుమార్ హెగ్డే: నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవృద్ధి సత్యపాల్ సింగ్: మానవ వనరుల అభివృద్ధి, జలవనరులు, గంగా ప్రక్షాళన శివప్రతాప్ శుక్లా: ఆర్థికశాఖ సహాయమంత్రి అశ్వనీకుమార్ చౌబే: ఆరోగ్య, కుటుం సంక్షేమ సహాయ మంత్రి వీరేంద్రకుమార్: స్త్రీ, శిశు సంక్షేమ, మైనార్టీ సహాయమంత్రి.

Vedhire Sriram వెదిరె శ్రీరాం

వెదిరె శ్రీరాం Vedhire Sriram
శ్రీరామ్ ది బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని నేపథ్యం. వెదిరె శ్రీరామ్ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా హలియాకు చెందిన వారు. తండ్రి వెంకటరెడ్డి ఏపీఎస్ఈబీ లో చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని కిట్స్ లో శ్రీరామ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి ఫార్చ్యూన్ 500 జాబితాలోని ఎంఎన్సీ కంపెనీలో 15 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. 2009కి ముందు స్వదేశానికి తిరిగి వచ్చి బీజేపీకి సన్నిహితంగా మెలిగారు. 2009 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తనకు ఆసక్తి ఉన్న నీటి వనరులు- సమగ్ర వినియోగం పై దేశస్థాయిలో అధ్యయనం చేశారు. బీజేపీ వాటర్ మేనేజ్ మెంట్ సెల్ కన్వీనర్ గా పని చేశారు. రాజస్థాన్ లోని సరస్వతి నది పునరుద్ధరణ పథకంలో సలహాదారుగా పని చేశారు. రాజస్థాన్ నదీ జలాల అథారిటీ ఛైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగా పని చేస్తున్నారు. మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గంగానది ప్రక్షాళన కూడా శ్రీరామ్ కనుసన్నల్లోనే జరుగుతోంది. నదుల అనుసంధానం పై కూడా ఈయన అద్యయనం చేశారు. నదీ జలాల వినియోగం పై పలు పుస్తకాలు రాశారు. గుజరాత్ వాటర్ మేనేజ్ మెంట్ పై కూడా పుస్తకం రాశారు శ్రీరామ్. ఉద్యోగ నేపథ్యం ఉన్న ఆయన రాజకీయ వ్యూహకర్త కూడా కాదు. కాకపోతే సామాజిక కోణంలో పైగా కేంద్రం నదుల అనుసంధానం పై బృహత్తర పథకాన్ని ప్రారంభించే యోచనలో ఉంది. 5.5 లక్షల కోట్లతో దేశంలోని 60 నదులను అనుసంధానం చేయాలనుకుంటోంది. శ్రీరామ్ కు కేంద్ర జలవనరుల శాఖను కేటాయించే అవకాశం నదుల అనుసంధానం పై ఇతని సేవలు దేశానికి ఉయోగపడుతాయీ ... Nomula Prabhakar Goud

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...