25, సెప్టెంబర్ 2017, సోమవారం

యోని Yoni

యోని Yoni
అత్యంత విశిష్ట దేవాలయాలలో కామాఖ్య ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో యోని ఆకారంలో గల ప్రతిమను అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు. ఈ సృష్టి సకలం శక్తి మూలంగానే నడుస్తోంది. ఆ శక్తి లేనిదే పరమేశ్వరుడైనా ముందుకు సాగలేడు. శివా అంతే శివానీ అని అర్థం. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులు 'శివశ్శక్త్యాయుక్తో'... అంటూ తన సౌందర్యలహరిని ప్రారంభించాడు. మహాకవి కాళిదాసు కూడా ఆదిదంపతులను వాక్కు, అర్థంతో పోల్చాడు. శక్తి స్వరూపుణి వెలసిన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. ఇది అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైంది. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, నీలాచల పర్వతాలపై ఉంది. ఈ ఆలయంలో వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కానీ కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని క్షణాల్లో మార్చుకోవడం అని అర్థం. కామాఖ్యా దేవిని త్రిశక్తిదాయినిగా కొలుస్తారు. ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా మారే రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినిగా, పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా మారుతుంది. పరమేశ్వరుణ్ణి యాగానికి ఆహ్వానించకుండా దక్షుడు అవమానించాడు. అవమానాన్ని తట్టుకోలేక సచీదేవి యజ్ఞ గుండంలో దూకి ఆహుతవుతుంది. సతీ వియోగాన్ని భరించలేని శివుడు ఆగ్రహంతో వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయిస్తాడు. తనలో అర్థభాగమైన సతి మరణంతో పరమేశ్వరుడు సాధారణ మానవుడిలా విరాగిలా మారతాడు. సతి మృతదేహాన్ని ఈశ్వరుడు భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతుంటే శ్రీమహా విష్ణువు ఆమె దేహాన్ని తన సుదర్శనంతో ఖండించాడు. అలా ఖండించినప్సుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. అందులో అమ్మ వారి ప్రధానమైన యోనిభాగం నీలాచలంపై పడింది. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతే కాదు ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకూ ఆధార స్థానంగా భావిస్తారు. దీన్ని మహాయోగ స్థలమని పిలుస్తారు. నీలాచలంపై దేవి యోని భాగం పడి ఈ పర్వతం నీలంగా మారింది. ఈ రాతి యోనిలోనే కామాఖ్యదేవి నివాసం ఉంటుందని అంటారు. ఒక్కసారి నీలాచలాన్ని తాకితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకం ప్రాప్తించి, చివరిలో మోక్షాన్ని పొందుతారు. తనను మోపరవశుణ్ణి చేయడానికి వచ్చిన దేవతలు పంపగా వచ్చిన మన్మథుడుని ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్థం చేశాడు. సకల దేవతలూ పర్వతరూపంలో ఉంటూ అమ్మను సేవిస్తారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్ఠాన దేవత నీల పార్వతి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...