4, సెప్టెంబర్ 2017, సోమవారం
Vedhire Sriram వెదిరె శ్రీరాం
వెదిరె శ్రీరాం Vedhire Sriram
శ్రీరామ్ ది బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని నేపథ్యం. వెదిరె శ్రీరామ్ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా హలియాకు చెందిన వారు. తండ్రి వెంకటరెడ్డి ఏపీఎస్ఈబీ లో చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని కిట్స్ లో శ్రీరామ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి ఫార్చ్యూన్ 500 జాబితాలోని ఎంఎన్సీ కంపెనీలో 15 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. 2009కి ముందు స్వదేశానికి తిరిగి వచ్చి బీజేపీకి సన్నిహితంగా మెలిగారు. 2009 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తనకు ఆసక్తి ఉన్న నీటి వనరులు- సమగ్ర వినియోగం పై దేశస్థాయిలో అధ్యయనం చేశారు. బీజేపీ వాటర్ మేనేజ్ మెంట్ సెల్ కన్వీనర్ గా పని చేశారు. రాజస్థాన్ లోని సరస్వతి నది పునరుద్ధరణ పథకంలో సలహాదారుగా పని చేశారు. రాజస్థాన్ నదీ జలాల అథారిటీ ఛైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగా పని చేస్తున్నారు. మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గంగానది ప్రక్షాళన కూడా శ్రీరామ్ కనుసన్నల్లోనే జరుగుతోంది. నదుల అనుసంధానం పై కూడా ఈయన అద్యయనం చేశారు. నదీ జలాల వినియోగం పై పలు పుస్తకాలు రాశారు. గుజరాత్ వాటర్ మేనేజ్ మెంట్ పై కూడా పుస్తకం రాశారు శ్రీరామ్. ఉద్యోగ నేపథ్యం ఉన్న ఆయన రాజకీయ వ్యూహకర్త కూడా కాదు. కాకపోతే సామాజిక కోణంలో పైగా కేంద్రం నదుల అనుసంధానం పై బృహత్తర పథకాన్ని ప్రారంభించే యోచనలో ఉంది. 5.5 లక్షల కోట్లతో దేశంలోని 60 నదులను అనుసంధానం చేయాలనుకుంటోంది. శ్రీరామ్ కు కేంద్ర జలవనరుల శాఖను కేటాయించే అవకాశం నదుల అనుసంధానం పై ఇతని సేవలు దేశానికి ఉయోగపడుతాయీ ... Nomula Prabhakar Goud
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...

-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
గిద్దె, సోల, మానికలు ఇనుముతో వృత్తాకారంలో వుండే కొలత సాధనాలు. నాలుగు గిద్దెలు ఒక సోల. రెండు సోలలు ఒక తవ్వ. నాలుగు సోలలు ఒక మానిక. ఇలాంటి కొల...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి