25, సెప్టెంబర్ 2017, సోమవారం

ఇస్లాం Musalaman

ఇస్లాం Musalaman
శతాబ్దాల నాడు ఈ దేశంలోని మూలవాసులైన ద్రావిడులమీద ఆధిపత్యం సంపాదించిన ఆర్యులు ద్రావిడుల్నంతా అంటరానివాళ్లని చేసి పారేశారు. నడుముకి తాటాకు కట్టి మీ అడుగుల గుర్తులు కూడా కనబడొద్దన్నారు. మూతికి ముంత కట్టి మీ ఉమ్మి కూడా నేలమీద పడొద్దన్నారు. ఊరి కి,కాటికీ, ఆఖరికి మంచి నీళ్లకూ దూరం చేశారు. వాళ్లొస్తుంటే చెప్పులు విడిచి చేత పట్టుకొని పక్కకు నిలబడాలి. తలకు రుమాల ఉంటే తీసిపట్టుకోవాలి. బడికీ,గుడికీ కూడా అంటరానివాళ్లను చేశారు. అలాంటి ఎన్నో అవమానాలు, హింస అనుభవిస్తూ వచ్చిన ఎంతో కాలానికి సూఫీ ప్రవక్తలు వచ్చి మమ్మల్ని అక్కున చేర్చుకున్నారు. వాడు అసుంట అసుంట అంటే సూఫీలు మాకు అలాయిబలాయి ఇచ్చారు. మా గుండెకు గుండెను కలిపారు. మేము తాగిన గిలాసుల్లో వాళ్లు నీళ్లు తాగారు. మాతోపాటు కూచొని బువ్వ తిన్నారు. అగ్రహారాల వీధుల నుంచి మా శవాల్ని కూడా తీసుకెళ నివ్వని దుష్ట సంస్కృతిని బద్దలు చేస్తూ మా వాళ్ళ శవానికి వాళ్లు భుజం పట్టారు. మేం మజీదుకు వెళ్తే భుజం భుజం కలిపి నమాజు చదివించారు, మా గుండెలు చెరవులయ్యాయి.. మా మనసులు సముద్రాలయ్యాయి.. మేం వాళ్లలో ఒకరమైనాం. మాకు కష్టమొస్తే, నష్టమొస్తే వాళ్లు మంచి మాటల్తో మమ్మల్ని ఓదార్చే, ఆదరించే ప్రవక్తలయ్యారు. మేం అందరం ముసల్మానులమైనాం. మేం ఈ దేశ మూలవాసులం. ద్రావిడులం. రెండు నుంచి మూడు శాతం ముస్లింలు మాత్రమే ఈ దేశంలో బైటి దేశాల నుంచి వచ్చినవారు. మిగతా 97 శాతం ఈ దేశవాసులే. అందులో 90 శాతంమంది ‘అంటబడనివ్వని’ (SC) కులాల నుంచీ, ‘వెనకబడేయబడ్డ’(BC) కులాల నుంచీ ఇస్లాం స్వీకరించినవారే. ఈ దేశ మూలవాసులు దేశంలో అత్యంత దుర్భరమైన జీవితాలతో కడగొట్టు పనులను చేస్తూ.. హీనమైన జీవితాలను ముస్లింలు గడుపుతున్నారు. దేశ స్వాతంవూత్యానంతరం సంపన్న, ఉన్నత వర్గాలకు చెందిన ముస్లింలు పాకిస్తాన్, లండన్ తదితర దేశాలకు వలస వెళ్లారు. మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన ముస్లింలు ఇక్కడే ఉండిపోయారు. వీరు భారతదేశ మూలవాసులు. అంతకంటే మించి దళితులు. గుడికి, బడికి దూరం చేయబడ్డవారు. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన సూఫీతత్వం తో కొందరు ఇస్లాంను, మరికొందరు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. మతాలు మారినంత మాత్రాన వీరి పేదరికం వెనుకబాటు తనం పోలేదు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా దళితులకన్నా ఇంకా వెనుకబడి ఉన్నారు. క్రీ.శ.632లో జన్మించిన మహమ్మద్ ప్రవక్త, తన అసాధారణ ప్రతిభా పాటవాలతో ప్రపంచా న్ని మరొక్కసారి ఒక కుదుపు కుదిపాడు.ఆయన మరణానంతరం మహమ్మద్ స్థాపించిన ఇస్లాం మతం తిరుగులేని రీతిలో వేగం పుంజుకుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించి ఆయా దేశాల రాజకీయ, సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక రంగాలను తీవ్రంగా ప్ర భావితం చేసింది. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ ప్రకారం ఇస్లాం జైత్రయాత్ర పశ్చిమాసియాలో ప్రారంభమైఉత్తర ఆఫ్రికా గుండా స్పెయిన్ దాకా సాగింది.ఈ పరిణామ క్రమంలో భాగంగానే క్రీ.శ. 712లో అరబ్బులు మన దేశంలోని సింధు రాష్ట్రాన్ని జయించారు. దీంతో భారతదేశంలో అరబ్బుల రాజకీయాధికారానికి పునాదులు పడ్డాయి. మరోవైపు పశ్చిమ తీరంలో అరబ్బుల చేత అనేక వ్యాపారకేంద్రాలు నెలకొల్పబడ్డాయి. ఈ దరిమిలా ఇస్లాం మతం భారతదేశమంతటా వ్యాపించినఫలితంగా సమాజంలోని అన్ని రంగాల రూపురేఖలు మారిపోయాయి. భాష, కళలు, ఆర్థిక, రాజకీయ, మత రంగాలలో కొత్త భావనలు ప్రభవించాయి.క్రీ.శ. 1000 సం.లో గజనీ మహమ్మద్, 12వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ దండయాత్రతో ముస్లిం రాజులు రాజకీయ అధికారాన్ని పూర్తిస్థాయిలో కైవసం చేసుకున్నారు. దరిమిలా ఇస్లాం మత సాంస్కృతిక ఆచార సంప్రదాయాలు భారత సంస్కృతిలో విడదీయరాని భాగమైపోయాయి. పైగా ఇస్లాంమతంలోని సమానత్వం, సౌభ్రాతృత్వం భావనలు సమాజంలోని కింది కులాలను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కారణంగా ఇస్లాం మతంలోకివలసలు నానాటికీ పెరుగుతూపోతున్న నేపథ్యంలో ఆ మతంలోని ఛాందసవాదులు(Conservatives) మత భ్రష్టత్వనెపంతో ఈ మార్పులను వ్యతిరేకించారు. ఫలితంగా మతాన్ని సరళీకరించి, దేవుణ్ణి సామాన్యునికి చేరువ చేసే ఒక ఉదారవాదవర్గం (Liberals) పుట్టకొచ్చింది. ఈ రకంగా మత నియమాలు పాటించకుండానే దేవుణ్ణి ఆరాధించవచ్చుననే ఒక నమ్మకాన్ని కలిగిస్తూ మతాన్ని మసీదు నుంచి దర్గాకు ట్రాన్స్‌ఫార్మ్చేశారు. ఈ బోధనలే సూఫీ మతంగా చరిత్రలో విలసిల్లుతున్నాయి. ఇలా సూఫీ మత ప్రవక్తల బోధనల ప్రభావంతో నాటికి అమల్లో ఉన్న కుల వ్యవస్థ దాని అరాచకత్వం, మనువాదుల కఠోర హింసా ప్రవృత్తి, దండనలతో విసిగిపోయిన కింది కులాలు (శూద్రులు,అంటరానివారు,గిరిజనులు) సూఫీ మతంలోని స్వేచ్ఛ, సమానత్వం, ఏకేశ్వోరాపాసన మానవత విలువలకు ఆకర్షింపబడి ఈ మతంలో చేరారు. వారిలో కొందరు ధీమంతులు అంటరానితనం, ఎగుడు దిగుడువ్యవస్థ , అసమానత, అవమానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ క్రమంలో కొందరు ప్రవక్తలుగా మారిపోయారు. నరజాతి (ఆంత్రొపాలజి) అధ్యయనాల ప్రకారం దళితులు భారతీయ ముస్లింలు ఒకే నర వర్గానికి చెందినవారు. వీరి కపాలాలు ముక్కులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మెజారిటీ దళితులు -ముస్లింలు ఆర్యులైన సవర్ణుల కంటే భిన్నంగా ఉంటారు. జవహర్‌లాల్‌ నెహ్రూ 1951-52 సంవత్సరాల్లో ప్రఖ్యాత ఉర్దూకవి జోష్‌ మలిహాబాదీని వల్లభాయ్‌ పటేల్‌ను కలువమని కోరినాడు. నెహ్రూ మాట కాదనలేక పటేల్‌ను కలిసిన సందర్భంలో ‘మీరు ముస్లింలను ఎందుకు ద్వేషిస్తారు?’ అని జోష్‌ అడి గారు. దానికి పటేల్‌ సమాధానం ‘మీలాంటి నవాబులను ద్వేషించను, ఎవరైతే నిన్నటిదాకా మాదిగ,మాల వాండ్లుగా, పాకి వాండ్లుగాపని చేసి ముస్లిం మతాన్ని పుచ్చుకొని నేడు సమాన హక్కులు కావా లంటున్నారో…వారిని మాత్రమే…’ అని అన్నారు. సాధారణ ముస్లిం ప్రజల పట్ల హిందూ సవర్ణుల ద్వేషం వెనుకనున్న చిదంబర రహస్యం వాండ్ల పూర్వీకులు దళితులు కావడమే. ఇది కూడా దళితులు-ముస్లింలు సోదరులు అనే రహస్యాన్ని ఛేదించినది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...