30, ఆగస్టు 2017, బుధవారం
Dera Baba డేరా బాబా
డేరా బాబా చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.
వికీపీడియా నుండి
డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆధ్యాత్మిక గురువు అత్యాచార కేసులో సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించిన ‘బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్’ ‘డేరా సచ్చా సౌదా’ అనే సిక్కు మత సంస్ధ కి అధిపతి.
Dera Baba
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్
జననం. ఆగస్టు 15, 1967న
రాజస్థాన్ గంగానగర్ జిల్లా మోదియా గ్రామంలో
అలియాస్ డేరా బాబా
కార్యకలాపాలు హత్యలు
అత్యాచారాలు
సేవా కార్యక్రమాలు
వృత్తి వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు
భార్య / భర్త హుస్నమీత్ ఇన్సా
పిల్లలు చరణ్ ప్రీత్ ఇన్సా,మన్ ప్రీత్ ఇన్సా
కుటుంబ నేపథ్యం
గుర్మీత్ సింగ్ ఆగస్టు 15, 1967న రాజస్థాన్ గంగానగర్ జిల్లాలోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి భూస్వామి. అప్పుడప్పుడు వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. గుర్మీత్ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలేవాడు. పంజాబ్‌లోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ఆశ్రమ గురువు షా సత్నాం సింగ్ గుర్మీత్‌ను 7 సంవతర్సాల వయసులోనే చేరదీశాడు. ఆ సమయంలో గుర్మీత్ పేరును రామ్హ్రీమ్‌గా మార్చి మరింత ఆధ్యాత్మికతను నింపాడు.
డేరాసచ్చాసౌదా చీఫ్‌గా ఉన్న గుర్మీత్ రామ్ రహీమ్ స్వచ్చ సౌదాలో మూడో తరం వ్యక్తి….. డేరా స్వచ్చ సౌదాను స్థాపించిన బెలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన మస్తానా బలూచిస్తానీని అనుచరులు పునీత బెపరవాహ్ మస్తానా జీ మహరాజ్ అని పిలుస్తారు. 1960 ఏప్రిల్ 18న ఆయన చనిపోయాక షా సత్నాం స్వచ్చ సౌదా బాధ్యతలు స్వీకరించారు. మస్తానా నుంచి 41 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించిన షా సత్నాం 1990 వరకు ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించారు. 1991 డిసెంబర్ 13న ఆయన చనిపోయారు. ఆయన బతికుండగానే 1990 సెప్టెంబర్ 23న గుర్మీత్ రాం రహీమ్ సింగ్ డేరా చీఫ్ అయ్యారు[2].
బాబాకు నలుగురు సంతానం
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ భార్య పేరు హుస్నమీత్ ఇన్సా. హుస్నమీత్ మాజీ ఎమ్మెల్యే హర్మీందర్ సింగ్ కుమార్తె. గుర్మీత్-హుస్నమీత్ దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె పేరు చరణ్ ప్రీత్ ఇన్సా, చిన్న కుమార్తె పేరు మన్ ప్రీత్ ఇన్సా. కుమార్తెలిద్దరికి పెళ్లిళ్లయ్యాయి.
దత్తత కుమార్తె.. దర్శకురాలు
మరో అమ్మాయిని కూడా గుర్మీత్ దంపతులు దత్తత తీసుకున్నారు. దత్తత కుమార్తె పేరు హనీ ప్రీత్ ఇన్సా. గుర్ ప్రీత్ నటించిన సినిమాల్లో ఈమె కూడా నటించారు. నటించడమే కాదు, దర్శకత్వ బాధ్యతలు కూడా హనీ ప్రీతే చూసుకున్నారు. ఇక ఆయన కుమారుడు జస్ ప్రీత్ ఇన్సా ప్రస్తుతం డేరా సచ్చా సౌదా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.పంచకులలో తన కూతురుగా చెప్పుకున్న హనీప్రీత్ అలియాస్ ప్రియాంకతో అక్రమ సంబంధం నెరిపారట . ఈ విషయాన్ని స్వయంగా ఆయన అల్లుడు విశ్వాస్ గుప్తానే ఒక ప్రైవేట్ చానల్ తో చెప్పాడు. విశ్వాస్ గుప్త ఆరోపణ ప్రకారం ప్రియాంక.. ఆమెను తన దత్తత కూతురని డేరాలో పరిచయం చేసి ఆమె పేరును హనీప్రీత్ సింగ్ గా మార్చేశాడు్. విశ్వాస్ గుప్తాతో 28 ఫిబ్రవరి 1999 లో పెళ్ళి కూడా చేసాడు. 2011లో ఒకరోజు తెరిచున్న డేరాబాబా గదిలోకెళ్ళిన విశ్వాస్ గుప్త అక్కడ తన కళ్ళతో చూడరాని దృశ్యాన్ని చూసి షాకయ్యాడట. ఆ గదిలో తన భార్య, డేరా బాబాలు అత్యంత సన్నిహితంగా కనిపించారట. వెంటనే తేరుకున్న డేరాబాబా విశ్వాస్ గుప్తాను ( అల్లుణ్ణి ) బెదిరించాడట. ఈ విషయం బయటకు పొక్కితే నిన్నూ, నీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తానని బెదిరించేసరికి విశ్వాస్ ప్రాణభయంతో వణికిపోయాడు. తన అమ్మానాన్నలతో కలిసి హర్యాణాకు మాకాం మార్చాడు[3].
అనేక సేవా కార్యక్రమాలు
2003 నుంచి 2015 మధ్య 19 గిన్నిస్ బుక్ రికార్డులు రిజిస్టరై ఉన్నాయి. 15,432 మంది రక్తదాతలతో క్యాంప్ ఏర్పాటు చేసి 2003, డిసెంబర్ 3న గుర్మీత్ మొదటి గిన్నిస్ రికార్డు నమోదు చేశారు. 2004లో మళ్లీ రక్తదానంలో 17,921 దాతలతో పాత రికార్డును బ్రేక్ చేశారు. తర్వాత 2009లో 9,38,007 చెట్లు నాటించే కార్యక్రమంతో ద్వారా రెండు రికార్డులు, మళ్లీ 2010లో రక్తదానంలో 43,732 దాతలతో మరో రికార్డు, 4,603 మంది ఉచిత కంటి పరీక్షలు చేసే క్యాంపు ఏర్పాటు చేసి ఒక రికార్డు ఆయన పేరు మీద ఉన్నాయి.
వీటితో పాటు మొక్కలు నాటడం, నాణేలు గాల్లోకి ఎగురవేయడం, డాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్షల క్యాంప్ నిర్వహణ, బీపీ నమోదు క్యాంపు నిర్వహణ, సుగర్ వ్యాధి చెకప్ క్యాంపు నిర్వహణ, కొలెస్ట్రాల్ పరీక్షల క్యాంపు నిర్వహణ, చేతి పరిశుభ్రత క్యాంపు నిర్వహణ, ఫింగర్ పెయింటింగ్ పోటీ నిర్వహణ, అతిపెద్ద మానవహారం నిర్వహణ, కూరగాయలతో బొమ్మల పోటీ నిర్వహణ, అతిపెద్ద గ్రీటింగ్ కార్డు, పోస్టర్ వంటి 19 గిన్నిస్ రికార్డులు గుర్మీత్ సింగ్ పేరు మీద ఉన్నాయి.
పంజాబ్-హర్యాణా లాంటి రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల అక్కడ అగ్రకులాలు ఇప్పటికీ చాలా దారుణంగా వ్యవహరిస్తుంటాయి. హర్యానాలో కాప్ పంచాయితీల ఆగడాలకు అడ్డూ అదుపు లేదు. వారు చెప్పిందే వేదంలా పాటిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పడ్డ డేరాలు వెనుకబడిన వర్గాల వారిని అక్కున చేర్చుకున్నాయి. వారి సంక్షేమానికి భరోసానిచ్చాయి. ఆహారం, వైద్యం విషయంలో వారికి తోడ్పాటును అందించాయి. మధ్య యుగాల కాలంలో ఉత్తరభారతంలో ఈ డేరాలు ఏర్పాడ్డాయి.
మధ్య యుగాల నుంచి డేరాలు:
పంజాబ్-హర్యాణా లాంటి రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల అక్కడ అగ్రకులాలు ఇప్పటికీ చాలా దారుణంగా వ్యవహరిస్తుంటాయి. హర్యానాలో కాప్ పంచాయితీల ఆగడాలకు అడ్డూ అదుపు లేదు. వారు చెప్పిందే వేదంలా పాటిస్తుంటారు.
డేరా సచ్చాసౌదాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు తొలిసారిగా నెలకొల్పాడు. ఆయన బోధనలకు ఆకర్షితులైన లక్షలాది మంది ప్రజలు డేరాల్లో చేరారు. ఇక్కడ ఎలాంటి కుల వివక్ష వెంటాడకపోవడం వారికి సంతోషాన్నిచ్చింది. దీంతో డేరాల్లో చేరేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది.
ప్రార్థనల కోసం ఇక్కడ ఏర్పాటు చేసే నామ్ చర్చా ఘర్ లలో పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరిని సమానంగానే చూస్తారు. పంజాబ్, హర్యానాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో, సహజంగానే దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఇందులో అధిక సంఖ్యలో చేరారు.
డేరా సచ్చాసౌదాను కొన్ని యూనిట్లుగా విభజించారు. డేరా సచ్చాసౌదాలో భంగీదాస్ గా పరగణించబడే వ్యక్తి ఈ యూనిట్లను పర్యవేక్షిస్తుంటాడు. ఒక్కో యూనిట్ కు ఒక్కో భంగీదాస్ ఉంటారు. డేరా సభ్యుల కష్ట, నష్టాలను పైస్థాయిలో ఉన్న వ్యక్తులకు తెలియజేయడం ఇతని విధి. అలా అతని నుంచి వచ్చే వైద్య, ఇతరత్ర ఫిర్యాదులపై ట్రస్ట్ యాజమాన్యం స్పందిస్తుంటుంది. సిర్సాలోని వీరి ప్రధాన కార్యాలయంలో ఉచిత వైద్యం, ఉచిత ఆహారం అందిస్తుంటారు.
సంక్షేమానికి భరోసా
డేరాల్లో చేరే సభ్యులకు సబ్సిడీతో కూడిన ఆహారాన్ని ట్రస్ట్ అందిస్తుంటుంది. ఈ ఆహారం ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రేషన్ కన్నా నాణ్యతతో కూడి ఉంటాయి. అన్నింటికిమంచి ఇక్కడ ఎలాంటి అవినీతికి తావు ఉండదు. ఈ కారణంతోనే డేరాల్లో చేరడానికి ఎక్కువమంది మొగ్గుచూపుతుంటారు.
పంజాబ్‌లోని సంగ్రూర్, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్కోట్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంత వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్స చేస్తుంటారు. ఇవన్ని బలహీన వర్గాలకు అండగా ఉండటంతో డేరా స్వచ్చా సౌదాలో లక్షలాది జనం సభ్యులుగా చేరారు. డేరా సచ్చా సౌధ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు గుర్మీత్. పేద పిల్లలకు విద్యను అందించడం, రక్త దానం, అవయవ దానం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేవాడు. ఇతని ఉపన్యాసాలతో పలువురిని సేవా కార్యక్రమాలకు ప్రేరేపించేవాడు. గుర్మీత్ ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశాడు. అవి.. ఎంఎస్‌జీ(మెసెంజర్ ఆఫ్ గాడ్), ఎంఎస్‌జీ .
ఇక సిర్సాలోని గుర్మీత్‌కు ఒక పెద్ద టౌన్షిప్ ఉంది. 1000 ఎకరాల స్థలంలో నిర్మించిన టౌన్షిప్లో పాఠశాలలు, స్పోర్ట్స్ విలేజ్, ఆస్పత్రి, సినిమా హాలుతో పాటు ఇతర భవనాలు ఉన్నాయి అందులోనే షాహ్ సత్నామ్ సింగ్ బిజినెస్ స్కూల్, షాహ్ సత్నామ్ సింగ్ గర్ల్స్ స్కూల్, సత్నామ్ సింగ్ గర్ల్స్ కాలేజీ, బిజినెస్ కాలేజీ, డేరా పురాతన భవనం, ఏసీ మార్కెట్, క్రికెట్ స్టేడియం, ఫైవ్ స్టార్ హోటల్, డేరా బాబా అంతరాలయం, ఎంఎస్ జీ ఇంటర్నేషనల్ స్కూల్, షాహ్ సత్నామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వివిధ ఫ్యాక్టరీలు, ఎస్ఎంజీ ప్రొడక్ట్స్, ఫిల్మ్ సిటీ సెంటర్, మాహీ సినిమా, కషిష్ రెస్టారెంట్, ఆర్గానిక్ వ్యవసాయ పంటపొలాలు, డేరా శిక్షణ సంస్థలకు సంబంధించిన స్కూలు వ్యాను, ఇతర వాహనాలు, బాలికల హాస్టల్, నిర్మాణంలో ఉన్న పెద్ద క్రీడా గ్రామం. షాహ్ మస్తాన్ మహారాజ్‌తో ప్రారంభం: హర్యానాలో 1948లో షాహ్ మస్తాన్ మహారాజ్ డేరా సచ్చా సౌదాను ప్రారంభించారు. సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు మనుషుల మధ్య మానవతా విలువలు పరిరక్షించేందుకు దీన్ని స్థాపించారు. సిర్సా పట్టణ కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థ క్రమ క్రమంగా విస్తరించుకుంటూ వచ్చింది. డేరా సచ్చా సైదా వ్యవస్థాపకులైన షాహ్ మస్తాన్ మహారాజ్ తాను బెలూచిస్తాన్‌లో అవతరించానని చెప్పేవాడు.దేశంలోని మిగతా బాబాలకు గుర్మీత్ బాబా చాలా భిన్నం. ఆయన కేవలం ఆధ్యాత్మిక గురువే కాదు. యాక్టర్, డెరెక్టర్, సింగర్, కొరియాగ్రాఫర్. కార్లు అంటే ఆయనకు అమితమైన మోజు అని చెబుతారు. ప్రస్తుతం ఆయన వద్ద 100 దాకా విలాసవంతమైన కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్లలో చాలావాటిని ఆయనే స్వయంగా డిజైన్ చేయించుకోవడం విశేషం. ఈ కార్లలోనే ఆయన భక్తుల మధ్య తిరుగుతుంటారు .
ఆధ్మాత్మిక గురువు రాసలీలలు
వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు రాసలీలలను వివరిస్తూ ఓ బాధితురాలు రాసిన లేఖ సారాంశంతో ఓ వార్తాకథనం మీడియాలో వచ్చింది. ఆ లేఖనే 15 ఏళ్ల తర్వాత డేరా బాబా మెడకు ఉచ్చు బిగించి అతన్ని దోషిగా నిలబెట్టింది. 2002లో డేరా బాబా బాధితురాలైన ఓ సాధ్వి (బాబా భక్తురాలు) తన పేరు బయటపెట్టకుండా లేఖ రాసింది. ఆ లేఖలోని విషయాలు సిబిఐ దర్యాప్తునకు దారి తీసేలా చేశాయి.
అత్యాచారం, హత్య కేసులు
గుర్మీత్‌పై అత్యాచారం, హత్య కేసులు 2002లో నమోదు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదును సుమోటోగా అప్పటి పంజాబ్, హర్యానా హైకోర్టు జస్టిస్ట్ ఆదర్శ్ కుమార్ గోయెల్ స్వీకరించారు. డేరాను సందర్శించి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా, సెషన్స్ జడ్జిని ఆదేశించారు. ఆ నివేదిక రావడంతో 2002 సెప్టెంబర్ 24న సీబీఐ దర్యాప్తునకు జస్టిస్ గోయెల్ ఆదేశించారు.
చంఢీగఢ్: ఇద్దరు సాద్వీలపై అత్యాచార ఆరోపణల్లో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అత్యంత లగ్జరీ బాబాగా పేరొందిన ఈ బాబాపై అత్యాచార కేసు మాత్రమే కాక మరో ఐదు కేసులు కూడా గతంలో నమోదయ్యాయి. అత్యాచార కేసు వెలుగుచూడటానికి కారణమైన ఓ వ్యక్తిని హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దాంతో పాటు డేరా సచ్చా సౌదాలో జరుగుతున్న అసాంఘీక కార్యక్రమాలను బయటి ప్రపంచానికి తెలిసేలా చేసినందుకు ఛత్రపతి అనే జర్నలిస్టును హత్య చేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. అలాగే దైవత్వం పేరుతో చాలామంది శిష్యగణాన్ని వ్యంధత్వానికి ప్రోత్సహించడాన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
రంజిత్ సింగ్ హత్య: జులై, 2002లో జరిగిన డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ సింగ్‌పై ఆరోపణలున్నాయి. సాధ్వీలపై అత్యాచారం జరిగినట్లుగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలు కీలక శాఖలకు లేఖలు వెల్లడంలో రంజిత్ సింగ్‌దే ప్రధాన పాత్ర అని భావించిన గుర్మీత్.. ఆయనను హత్య చేసినట్లుగా చెబుతారు. ఈ హత్య ఘటనలో గుర్మీత్ సింగ్ పై కేసు నమోదు కాగా.. సీబీఐ ప్రత్యేక కోర్టులో దీనిపై విచారణ చివరి దశలో ఉంది.
రాంచందర్ ఛత్రపతి హత్య: సిర్సా కేంద్రంగా పనిచేస్తున్న డేరా సచ్చా సౌదాలో అసాంఘీక కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ స్థానిక జర్నలిస్ట్ ఛత్రపతి అప్పట్లో ఒక కథనం రాశారు. ఆ తర్వాత అక్టోబర్ 23,2002లో ఆయన హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక గుర్మీత్ సింగ్ ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ హత్య విషయంలో ఆయనతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈ కేసు బదిలీ చేయబడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ తుది దశలో ఉంది.
శిష్యగణానికి వ్యంధత్వం: శిష్యగణం వ్యంధత్వాన్ని పాటించేలా గుర్మీత్ ప్రోత్సహించారన్న ఆరోపణలున్నాయి. దాదాపు 400మంది గుర్మీత్ శిష్యులు వ్యంధత్వాన్ని పాటించినట్లుగా దీనిపై డిసెంబర్ 23,2014లో కేసు నమోదవగా, అక్కడి హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దైవానుగ్రహం పొందే మార్గమంటూ శిష్యులను వ్యంధత్వానికి ప్రోత్సహించినట్లుగా గుర్మీత్‌పై ఆరోపణలున్నాయి.
గోవింద్ సింగ్ వస్త్రధారణ అనుకరించినందుకు: 2007లో సిక్కుల గురువు గోవింద్ సింగ్ వస్త్రధారణను అనుకరించినందుకు గుర్మీత్ పై కేసు నమోదైంది. బతిండా పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదవగా.. పంజాబ్, హర్యానాల్లో దీన్ని నిరసిస్తూ ఆయన భక్తులు భారీ ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 2014లో పంజాబ్ ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంది.
మారణాయుధాల కేసు: డేరా సచ్చా సౌదా యాక్టివిస్టులకు మారణాయుధాల శిక్షణ ఇప్పిస్తున్నారని జాతీయ భద్రత సలహా కమిటీ డిసెంబర్,2010లో ఆరోపించింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ కేసుకు తెరపడింది.
దోషిగా
ఇప్పటికీ ఆయనను ప్రజలు దేవుడుగా కొలుస్తారు. అందువల్ల ఇదేం కొత్త కాదు' అంటూ తనను డేరా బాబా లొంగదీసుకున్నట్టు బాధితురాలు ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ లేఖను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి, అప్పటి పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది.ఆ లేఖనే 15 ఏళ్ల తర్వాత డేరా బాబా మెడకు ఉచ్చు బిగించి అతన్ని దోషిగా నిలబెట్టింది. 2002లో డేరా బాబా బాధితురాలైన ఓ సాధ్వి (బాబా భక్తురాలు) తన పేరు బయటపెట్టకుండా లేఖ రాసింది. ఆ లేఖలోని విషయాలు సిబిఐ దర్యాప్తునకు దారి తీసేలా చేశాయి.డేరా బాబాను దోషిగా తేల్చడంతో పంచకుల జిల్లాలో పరిస్థితి అదుపు పంజాబ్, హర్యానాల్లో తీవ్రమైన హింస చెలరేగి భారీ ఆస్తి నష్టంతో పాటు దాదాపు 33మంది దాకా ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో డేరా సంస్థకు చెందిన 2 ఆశ్రమాలను అధికారులు సీజ్ చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 340 రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది సీబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించగనే డేరా బాబా అనుచరులు రెచ్చిపోయి పలు కార్లు, బస్సులను ధ్వంసం చేసారు. సెక్యూరిటీ బారియర్లను కూలదోసి మీడియా బృందంపై, ఓబీ వ్యాన్లపై దాడి చేసారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారు[5].ఈ రెండు కేసుల్లో పదేళ్ల చొప్పున మొత్తం 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ.15 లక్షల చొప్పున రూ.30లక్షలు కోర్టు జరిమానా విధించింది.న్యాయ విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జగ్దీప్ సింగ్ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు.ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున న్యాయస్థానం మొత్తం 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిందని 376, 506 సెక్షన్ల ప్రకారం ఈ రెండు శిక్షలు ఏకకాలంలోనే అమలవుతాయని స్పష్టంచేశారు.సీబీఐ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని అన్నారు గుర్మీత్ తరఫు న్యాయవాది వెల్లడించారు.Nomula Prabhakar Goud
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...
-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
గిద్దె, సోల, మానికలు ఇనుముతో వృత్తాకారంలో వుండే కొలత సాధనాలు. నాలుగు గిద్దెలు ఒక సోల. రెండు సోలలు ఒక తవ్వ. నాలుగు సోలలు ఒక మానిక. ఇలాంటి కొల...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి