25, అక్టోబర్ 2017, బుధవారం
Aadhar-bank account integration ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం
*ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం చేయకపోతే మూసేస్తారు***
బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం తప్పనిసరేనని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) శనివారం స్పష్టం చేసింది. శుక్రవారం ప్రచారమైన మీడియా కథనాలపై స్పందిస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఓ సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానమిచ్చిన ఆర్బీఐ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యల అనుసంధానం తప్పనిసరి అని పేర్కొనే ఆదేశాలను జారీ చేయలేదని తెలిపింది. ఈ విషయాన్ని మీడియా శుక్రవారం ప్రసారం చేసింది. దీంతో ఆర్బీఐ ఈ వివరణను జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక (రికార్డుల నిర్వహణ) రెండవ సవరణ నిబంధనలు, 2017 ప్రకారం బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని తెలిపింది. అయితే బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్య అనుసంధానం చేయడం తప్పనిసరి అని పేర్కొంటూ ఇప్పటి వరకు తాను ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదని వివరించింది. జూన్ 1 నుంచి మనీలాండరింగ్ నిరోధక (రికార్డుల నిర్వహణ) రెండవ సవరణ నిబంధనలు, 2017 అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ నిబంధనలు వర్తించే కేసుల్లో ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం తప్పనిసరి అని తెలిపింది. ఈ నిబంధనలు చట్టపరమైనవని, బ్యాంకులు వీటిని అమలు చేసేందుకు తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూడనక్కర్లేదని పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం డిసెంబరు 31లోగా ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. లేనిపక్షంలో బ్యాంకు ఖాతాలు లావాదేవీల నిర్వహణకు తగినవి కాదని ప్రకటిస్తారు.
Metro మెట్రోరైలు
Metro మెట్రోరైలు
మెట్రోరైలు మొదటిదశ ప్రారంభంతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
మెట్రోరైలు ప్రారంభంతో నగర ప్రయాణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. మొదటి దశ ప్రారంభం కానున్న నాగోల్ నుంచి మియాపూర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ప్రస్తుతం రెండు నుంచి రెండున్నర గంటలు పడుతున్నది. వర్షం పడితే ట్రాఫిక్ జామ్ సమయం అదనం. అదే మెట్రోరైలులో ఈ 30 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. నవంబర్ నెలాఖరున ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రాజెక్టు మొదటిదశ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రోరైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు ప్రయాణపు అంచనాలు తయారుచేశారు.
ఐదు నిమిషాలకో రైలు
మెట్రో ఆపరేషన్స్‌లో ఒక్కో రైలు మధ్య వ్యవధి 3-5 నిమిషాలు ఉండనున్నది. ప్రారంభంలో మియాపూర్- అమీర్‌పేట మధ్య 7 నిమిషాలకు ఒక్కటి చొప్పున ప్రతిరోజు 8 రైళ్లు నడుస్తాయి. అమీర్‌పేట-నాగోల్ మధ్య 10 నుంచి 12 నిమిషాలకు ఒకరైలు చొప్పున 10 రైళ్లను నడిపిస్తారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా వీటిని పెంచుతారు. 30 కిలోమీటర్ల మెట్రో మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉన్నాయి. రైలు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు చేరడానికి ఒకటిన్నర నుంచి రెండు నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నది. మొదట్లో ప్రయాణ సమయం గంట వరకు ఉంటుందని, కొన్నాళ్ల తర్వాత 45 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రతిరోజు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉన్నదన్నారు.
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు అనుసంధానంగా..
నాగోల్-మియాపూర్ మార్గంలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేస్తూ మెట్రో ఆపరేషన్స్ చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను నగరంలోని గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు, నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు అనుసంధానంగా ఉన్న జేబీఎస్, రైల్వే ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అనుసంధానిస్తూ సమీప మెట్రో స్టేషన్ల నుంచి బస్సులు నడుపనున్నారు.
నాగోల్ - మియాపూర్
దూరం: 30 కిలోమీటర్లు
స్టేషన్లు: 24
ప్రయాణ సమయం: 45-60 నిమిషాలు
సామర్థ్యం: 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది
ప్రస్తుతం రైళ్ల ఫ్రీక్వెన్సీ:
మియాపూర్- అమీర్‌పేట: 7 నిమిషాలు, అమీర్‌పేట- నాగోల్: 10- 12 నిమిషాలు
నడిపే రైళ్లు: మియాపూర్-అమీర్‌పేట మార్గంలో 8, అమీర్‌పేట- నాగోల్ మార్గంలో 10 ప్రతిరోజు ...
మరే మెట్రో సాటిరాదు..
దేశంలోని మరే మెట్రోరైలు హైదరాబాద్‌కు సాటిరాదని కేటీఆర్ చెప్పారు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో పీపీపీలో ఇంత పెద్ద ప్రాజెక్టును ప్రపంచంలోని ఏ దేశంలో నిర్మించలేదని అన్నారు. విదేశీ నిర్మాణ సంస్థలు కాకుండా స్వదేశీ కంపెనీ ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఒలిఫెంటా వంతెన నిర్మాణం సంక్లిష్టమైనదని, ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ నియంత్రించినా రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడకుండా వంతెనను బిగించిన ఎల్‌అండ్‌టీకి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ స్టీలు బ్రిడ్జి వెరీవెరీ యునిక్ అని అభివర్ణించారు. రోడ్డు మధ్యలో హైట్ చేస్తున్నా ఇబ్బందేమీ ఉండదని, పబ్లిక్ ఫ్రీ మూమెంట్ ఉండేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రతి స్టేషన్‌లో స్టెయిర్‌కేస్‌లు, ఎస్కలేటర్లు ఉన్నాయని, స్టేషన్‌కు ఆనుకుని ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు కూడా నిర్మిస్తామని తెలిపారు. ప్రయాణికులు మెట్రోకారిడార్లకు అనుసంధానంగా ఏర్పాటు చేసే స్కైవాక్‌ల ద్వారా తమకు అవసరమైన చోటులో దిగి పోయే విధంగా ఏర్పాట్లు ఉంటాయని అన్నారు. నాగోల్-మియాపూర్ ప్రారంభమైతే 72 కిలో మీటర్ల ఈ ప్రాజెక్టులో 40 నుంచి 42 శాతం అందుబాటులోకి వచ్చినట్లేనని తెలిపారు. ప్రస్తుతం 34 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించామని, జీహెచ్‌ఎంసీ తోపాటు ప్రైవేటు పార్కింగ్‌ను కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు.
రైల్వే స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు స్కైవేలు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌నుంచి ప్రయాణికులు స్కైవేల ద్వారా నేరుగా మెట్రోరైలు స్టేషన్‌కు చేరుకోవచ్చని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ స్టేషన్లతో స్కైవేలను అనుసంధానం చేస్తున్నామన్నారు. మెట్రోరైలు నిర్మాణం, ఆపరేషన్‌లో స్మార్ట్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. స్టేషన్ల నుంచి కాలనీలకు చేర్చేందుకు ఎలక్ట్రికల్ వాహనాలు,15 నుంచి 20 సీట్ల సామర్ధ్యం గల మినీ వ్యాన్లను ఉపయోగిస్తామని చెప్పారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని 3,4 కిలోమీటర్లలోపు ప్రయాణికుల రాకపోకలకు వీటిని ఉపయోగిస్తామన్నారు. ఎంఎంటీఎస్, ఆర్టీసీ, మెట్రోరైలు టికెట్ల కోసం కామన్ కార్డు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఓలా, ఉబెర్ సంస్థలను కూడా దీనికిందకే తెచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎల్ అండ్‌టీ స్మార్ట్‌యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
రెండోదశపై అధ్యయనం పూర్తి
ఓల్డ్ సిటీ ప్రాజెక్టు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించి స్పష్టమైన ప్రణాళికతో దాన్ని చేపడుతామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఎంపీ దీనికి సానుకూలంగా ఉన్నారన్నారు. రెండవదశ మెట్రోరైలు నిర్మాణం కోసం టోక్యో వెళ్లివచ్చామని, వివిధ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఆర్థిక పరమైన అంశాలు, అంచనా వ్యయం, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టతకు వచ్చామని, దీనిపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దశలవారీగా ప్రారంభిస్తూ వచ్చే సంవత్సరం నవంబర్ 2018 నాటికి పూర్తి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామన్నారు.
Europe యూరప్
Europe యూరప్
Nomula Prabhakar Goud
యూరోపియన్ యూనియన్ జాతి రాజ్యాలపై ఆధారపడి ఉన్న కూటమి. జాతి రాజ్యాలపై ఆధారపడటమూ అంటే, విధానాల అమలు కోసం మాత్రమే కాదు. దీనివల్ల చట్టబద్ధత లభిస్తుంది. జాతి రాజ్యాల ప్రాతిపదిక మీదనే అందులోని సభ్య దేశాలు నడుస్తున్నాయి,యూరోపియన్ యూనియన్ కూడా నడుస్తున్నది. కానీ ఇటీవలి కాలంలో ఈ సభ్య దేశాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. ఈ సంక్షోభం ఒక్క స్పెయిన్‌కే పరిమితం కాలేదు. ఇతరదేశాలు కూడా అంతర్గత ఘర్షణల మూలంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
యూరప్ దేశాలలో ఈయూను వ్యతిరేకించే పార్టీలు అధికారం చేపట్టే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఈ రాజకీయ ధోరణులు ఈయూ భవితవ్యానికి మంచిది కాదు. యూరోపియన్ యూనియన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఈ దేశాలలో లేదు. కానీ యూరోపియన్ యూనియన్ పట్ల ఎటువంటి ఎవరికీ పట్టింపు లేదు. ప్రతి దేశంలో ఎవరికి వారు అంతర్గత సంక్షోభంలో మునిగి తేలుతున్నారు. ఈ గొడవలో ఈయూ మనుగడ అనేది వారికి పట్టకుండా పోయింది. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడం మినహా గత్యంతరం లేదనే వాదన ఆర్థిక సంక్షోభ కాలంలో వినబడింది. ఇంకా అదే వాదనతో నెట్టుకొచ్చే పరిస్థితి లేదు.
నాలుగు నెలల కిందట ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్‌కు మద్దతు దారైన ఇమాన్యూల్ మాక్రాన్ ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్ మూలంగా యూరోపియన్ యూనియన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మాక్రాన్ ఎన్నిక ఊరట కలిగించింది. ఇక యూరప్ యూనియన్ నిలబడాలని కోరుకునే వారు భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుందని భావించారు. కానీ అంతలోనే స్పెయిన్ నుంచి విడిపోవాలని క్యాటలోనియా ప్రజలు ఉద్యమం ప్రారంభించారు. క్యాటలోనియా రాజధాని బార్సెలోనాలో స్వాతంత్య్ర ప్రదర్శనలు యూరోపియన్ యూనియన్ సంక్షోభం నుంచి బయట పడలేదని హెచ్చరికలను పంపించాయి. క్యాటలోనియాలోని స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వం స్వాతంత్య్రంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని స్పెయిన్ ప్రభుత్వం నిరంకుశంగా అణచివేయ ప్రయత్నించింది. ఇం దుకు ప్రతిగా నిరసనలు భగ్గుమన్నాయి. క్యాటలోనియా ప్రజలు స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు.
స్పెయిన్ ఆంతరంగిక సంక్షోభం పెచ్చరిల్లే కొద్దీ యూరప్ సంక్షోభం లో కూరుకుపోవడం అనివార్యం అనిపిస్తున్నది. స్పెయిన్‌లో క్షేత్రస్థాయి లో ఏమి జరుగుతున్నదనేది గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతున్నది. యూరప్ ఆర్థికంగా బలపడుతున్నది. అయితే ఈయూ సాఫల్యతకు కూడా పరిమితి ఉన్నది. క్యాటలోనియా సంక్షోభం తలెత్తినప్పటికీ, ఫైనాన్షియల్ మార్కెట్ పెద్దగా స్పందించలేదు. దీనిని బట్టి యూరోపియన్ యూనియన్ ఆర్థికంగా ఎంత మెరుగుపడ్డదో తెలుస్తున్నది. ఇటువంటి పరిస్థితే గనుక కొన్నేండ్ల కింద తలెత్తితే స్పెయిన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయేది. కానీ ఇప్పుడు మార్కెట్లు రాజకీయ అనిశ్చితిని అధిగమిస్తున్నాయి. మొత్తం యూరోజోన్ ఆర్థిక రంగం గౌరవప్రదమైన స్థాయి లో పెరుగుతున్నది. యూరోజోన్ సగటు కన్నా కూడా స్పెయిన్ ఆర్థిక రంగం పురోభివృద్ధిలో ఉన్నది. విదేశీ పద్దులలో మిగులు చూపించుకోగలుగుతున్నది. స్పెయిన్ ఆర్థిక వ్యవస్థ దేశీయ డిమాండ్ మీద కాకుం డా, ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నది. గతంలో ఆర్థిక సంక్షోభానికి ముందు భవన నిర్మాణ రంగంలో బూమ్ ఏర్పడినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. యూరోపియన్ యూనియన్ సభ్య రాజ్యాలు లేదా బ్యాంకులు తాత్కాలిక సంకటాన్ని ఎదుర్కొన్నట్టయితే ఆదుకోవడానికి యూరోజోన్ వ్యవస్థలు ఉండనే ఉన్నాయి. అందువల్లనే స్పెయన్ రాజకీయ సంక్షోభంలో పడిపోయినా ఫైనాన్షియల్ మార్కెట్‌లో కుదుపులు సంభవించలేదు.
క్యాటలోనియా సంక్షోభం ప్రభావం ఈయూపై పడనప్పటికీ, ఒక వాస్తవాన్ని గుర్తించాలె. యూరోపియన్ యూనియన్ సమైక్యతా నమూనాలోనే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ యూనియన్ అంతిమంగా జాతి రాజ్యాల పునాదులపై ఏర్పడిందనేది గ్రహించాలె. ఇది అంతర్- ప్రభుత్వ నమూనా కాదు. పరోక్ష అమలు విధానం ప్రాతిపదికగా ఏర్పడ్డది. ఈయూ నిర్ణయాలు తీసుకుంటే వాటి అమలు బాధ్యత మాత్రం జాతీయ ప్రభుత్వాలది, అక్కడి పాలనా యంత్రాంగాలది. ద్రవ్య విధానంలో ఈ వైవిధ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు. ప్రభుత్వాలు చర్చించుకొని ఉమ్మడిగా ఈ నిర్ణయాలు తీసుకోవడం లేదు. యూరోపియన్ సెం ట్రల్ బ్యాంకు పాలక మండలి మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ అమలు అనేది పరోక్ష విధానంలో ఉంటుంది. ఈ సెం ట్రల్ బ్యాంకు నిర్ణయాలను జాతీయ సెంట్రల్ బ్యాంకులు అమలు చేయాలె. ఇక్కడే చిక్కులు తలెత్తుతున్నాయి. బాండ్ల కొనుగోలు కార్యకలాపాలను సాధారణంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చేపడుతుం ది. కానీ సొంత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసే జాతీయ సెంట్రల్ బ్యాంకులే ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తాయి. లగ్జెంబర్గ్‌లోని యూరోపియన్ న్యాయస్థానం ఎంతో ప్రాముఖ్యం గలది. ఈ వ్యవస్థ కూడా ప్రభుత్వాల మధ్య సమన్వయంతో నడిచేది కాదు. కేంద్రీకృతమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ దీనిలోని న్యాయమూర్తులను జాతీయ ప్రభుత్వా లు, జాతీయ న్యాయస్థానాలు నియమిస్తాయి. ఈ న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయవలసింది మాత్రం జాతీయ ప్రభుత్వాలు. అమెరికాలోని వ్యవస్థలతో పోల్చినప్పుడు, ఈయూలోని బలహీనత అర్థమవుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వుకు కూడా ప్రాంతీయ నిర్మాణ స్వరూపం ఉన్నది. కానీ డిస్ట్రిక్ట్ రిజర్వు బ్యాంకులు ఎన్నో రాష్ర్టాలకు విస్తరించి ఉంటాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వంతోనో, ఒక సంస్థతోనో అనుబంధమై ఉండవు. ఇదే విధంగా అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించవు. కేంద్రీయ వ్యవస్థ ద్వారానే నియామకాలు జరుగుతాయి. అధ్యక్షుడు నియమించిన వారిని సెనేట్ ఆమోదించవలసి ఉంటుంది.
చరిత్రలో యూరోపియన్ రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగా యి. ఈ దేశాల మధ్య పరస్పర అపనమ్మకాలు, వైషమ్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వ్యవస్థలను సభ్య దేశాలు ఉమ్మడిగా నిర్మించినప్పుడే సమైక్యత బలపడుతుంది. నిర్ణయాల అమలు కోసం మాత్రమే కాదు, న్యాయబద్ధత కోసం సభ్య దేశాల మీద ఆధారపడక తప్పదు. దీనివల్ల జాతీయ ప్రభుత్వాల మాదిరిగా, కేంద్రీయ పాలన సజావుగా సాగుతుంది. అయితే దీనికి కూడా పరిమితులు ఉన్నాయనేదే గుర్తించవలసి ఉన్నది. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అ పరిమితులకు చేరుకున్నది. గ్రీస్‌లో పరిపాలనా, న్యాయ వ్యవస్థలు బలహీనంగా ఉం డటం వల్ల ఆర్థిక పునరుజ్జీవనం వీలు కాలేదు. పొలాండ్, హంగరీ దేశాలలో ఉదారవాద ప్రభుత్వాలు ఉండక పోవడం వల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటున్నది. స్పెయిన్‌లో రాజకీయ వ్యవస్థ స్వయం నిర్ణయాధికారం కోరుతున్న క్యాటలోనియా ప్రాంతీయ ప్రభుత్వానికి, స్వతంత్రం గురించి కనీసం చర్చ జరుపడమే రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మధ్య వైరుధ్యాన్ని పరిష్కరించలేకపోయింది. జర్మనీ కూడా అంతర్గత రాజకీయ సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ఇటీవలి ఎన్నికల్లో చాన్సలర్ ఏంజిలా మెర్కెల్ ఐదోవంతు ఓటర్లను కోల్పోయారు. ఎటూ పొసగని మూడు పార్టీల కూటమితో ఆమె నెట్టుకు రావలసి వస్తున్నది. మెర్కెల్ నాలుగవ సారి అధికారం చేపట్టగలిగారు. ఇదే ఆమె చివరి ఎన్నిక కావచ్చు. ఇటలీలో అభిప్రాయ సేకరణ ద్వారా వెల్లడైన ఫలితాలను గమనిస్తే- ఎక్కువ మందికి యూరోపియన్ పట్ల వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తున్నది.
యూరప్ దేశాలలో ఈయూను వ్యతిరేకించే పార్టీలు అధికారం చేపట్టే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఈ రాజకీయ ధోరణులు ఈయూ భవితవ్యానికి మంచిది కాదు. యూరోపియన్ యూనియన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఈ దేశాలలో లేదు. కానీ యూరోపియన్ యూనియన్ పట్ల ఎటువంటి ఎవరికీ పట్టింపు లేదు. ప్రతి దేశంలో ఎవరికి వారు అంతర్గత సంక్షోభంలో మునిగి తేలుతున్నారు. ఈ గొడవలో ఈయూ మనుగడ అనేది వారికి పట్టకుండా పోయింది. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడం మినహా గత్యంతరం లేదనే వాదన ఆర్థిక సంక్షోభ కాలంలో వినబడింది. ఇంకా అదే వాదనతో నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. ఈయూకు మొదటి కొన్నేండ్ల పాటు కనిపించిన ఆమోదం ఇప్పుడు లేదు. ఈయూ బం ధాన్ని మరింత పటిష్ఠం చేయాలంటే, యూరప్ దేశాల నాయకులు పౌరుల ఆసక్తిని పెంచే కొత్త నమూనాను ఆవిష్కరించవలసి ఉంటుంది.
24, అక్టోబర్ 2017, మంగళవారం
Vishwakarma విశ్వకర్మ
విశ్వకర్మ భగవానుడు
మనిషి పుట్టకనుంచి
కాటికి చేరేదాక
విశ్వకర్మ నే అన్ని కర్మలకు బాధ్యుడు......
మనిషి పుట్టినప్పుడు బోడ్డును కత్తిరించడానికి
కత్తి చేసిన వాడు.అతని జీవకర్మలకు
పలుగు,పార,ఇంకా సమాజంలో అన్ని వృత్తులకు
సంబంధించిన ఎన్నో పనిముట్లను చేసినవాడు
కమ్మరి విశ్వకర్మ......
ఆ మనిషికి జీవనాధారమైన ఆహారాన్ని వండుకోవడానికి
వంట పాత్రలు ఇంకా ఎన్నో అవసరాలకు సంబంధించిన
పాత్రలు తయారు చేసినవాడు కంచరి విశ్వకర్మ........
మనిషి పుట్టిన తర్వాత నడవడానికి చిన్న
బండినుంచి వుండడానికి ఇల్లు వ్యవసాయం
చేయడానికి నాగలి గుంటుక ఇంకా ఎన్నో కర్ర
వస్తువులను తయారుచేసినవాడు వడ్రంగి
విశ్వకర్మ...
మనిషికి ఒక దైవం అంటే ఇ రూపాలలో వుంటారు అని
కృష్ణుడు రాముడు ఇంకా అనేక దైవాల రూపాలను
చెక్కినవాడు శిల్పి విశ్వకర్మ........
దేవుడు సృష్టించిన మనిషిని అందంగా
కన్పించేటట్టు ఆభరణాలను తయారు చేసి అందమంటే
ఇలా ఉంటది అని చూయించినవాడు కంసాలి
విశ్వకర్మ..
విశ్వకర్మ లేనిదే విశ్వంబు లేదు అని అనాటి చరిత్ర చెప్పతుంది.
విశ్వకర్మలందరు ఎక్కడ ఏ దీన స్థితిలో ఉన్నారో కూడ మాకు తెలవదు అని నేటి సమాజం చెప్పతుంది.
సృష్టికర్త మన విశ్వకర్మ అని గౌరవంగా ఆరోజుల్లో చెప్పకున్నాము ఇప్పడు సృష్టిలో విశ్వకర్మల దుస్థితిని చూసే వారే లేరు. నేటి సమాజంలో సృషికర్తలయైన ఐదు కులవృత్త్రుల వారు ( వడ్రంగి, కమ్మరి, కాంస్య, స్వర్ణ, శిల్పలు ) ఎవరికీ నేటి సమాజంలో సరైన గుర్తింపు లేదు.రెడిమేడ్ షాపుల వల్ల , ధరలు సరిగా లేక, చేసిన వస్తువులు, కళారూపలు కోనేవారు లేక, జీవన ఉపాది కష్టామై చాలా ఇబ్బందులు పడుతున్నారు.మన కులవృత్తుల వారు అందరు కలిసి పోరాడితే మనకు రావల్సిన పించన్లు, పథకాలు, సబ్సడీలు,కమ్యూనిటిహలు ,సదుపాయాలు మనం రాబట్టుకోలేమ . మన సాటి చేతివృత్తుల కార్మికులయైన గీతకార్మికులు, చేనేత కార్మికులు ముదిరాజ్ లు వారి వారి ఇబ్బందులను ప్రభుత్వనికీ తెలియజేసి పించన్ లను, పథకాలను, కమ్యూనిటిహల్ ను వారికి రావల్సిన సదుపాయాలను వారు పోందుతున్నారు. మనం ఎందుకు మన ఆర్థిక ఇబ్బందుల గురించి పోరాడకుండా ఉంటున్నాము. కలిసి కట్టుగా మన విశ్వకర్మలందరు కలిసి పోరాడితేనే మన విశ్వకర్మల భవిష్యత్తు బాగుపడుతుంది.
రాజకీయ నాయకులందరికీ మా విశ్వకర్మలందరి తరుపున విజ్ఞాప్తి విశ్వకర్మలను కూడా గుర్తించి మాకు రావల్సిన సదుపాయాలను, మాకు అందవలిసిన పథకాలు, కమ్యానిటిహల్ ల గురించి మేము అడగక ముందే విశ్వకర్మల గురించి మీరు ఆలోంచిస్తారు అనుకున్నాము. ఇప్పడు నాయకులయైన విశ్వకర్మ పెద్దలు యైన విశ్వకర భవిష్యత్తు ఎప్పుటికీ ఇలానే ఉంటుది అనే స్థితి తీసుకరాకండి. ఇకనైనా విశ్వకర్మలందరికి మేము ఉన్నాము మీము రావల్సిన ప్రతి సదుపాయాల గురించి పోరాడుతాము అనే నమ్మకాన్ని మాఅందరికీ కలిగీస్తారు అని ఆశిస్తున్నాము
The Hindu హిందూ
The Hindu హిందూ
పాము తన గుడ్లను తానే తింటుంది అనేది సామెత
*సర్పాలలో తాను వాసుకి అని శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు*
*23.10.2017 ,కార్తీక సోమవారం* మరియు కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి
నాగ పంచమి, నాగుల చవితి వస్తోందంటే చాలు, హిందూ సంప్రదాయాలు మూఢనమ్మకాలు, పాములు పాలు త్రాగుతాయ? వీళ్ళు పాములను హింసిస్తున్నారు, ఆదిమానవుడి కాలపు అలవాట్లను పాటిస్తున్నారు అంటూ మీడియా ఎంతసేపు దాడి చేసి, ధర్మాన్ని కించపరచాలని చూస్తోందే కానీ, నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఆచరణలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంప్రదాయాన్ని తప్పుగా అర్దం చేసుకున్నారా? ఒకవేళ పొరబడి ఉంటే, దాన్ని ఎలా సరిజేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయదు.
ఆంగ్లేయులు భారత్ మీదకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావం బాగా పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే ఎంతో విశాలమైన భాష అయిన సంస్కృతాన్ని, దాని నుండి వచ్చిన భారతీయ భాషలలోని పదాలకు ఇంగ్లీష్‌లో అర్దం వెతుక్కునే స్థితికి చేరుపోయాము.
అది ఇంకా దిగజారి ఏకంగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తూ, దాని అర్దాలనే సంస్కృతపదాలకు అంటగడుతున్నాము.
విషయంలోకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళకు Snake అనే పదం ఒక్కటే ఉంది.
---------------------------------------
కానీ మన ధర్మంలో *నాగులు, సర్పాలు అని రెండు ఉన్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు*.
---------------------------------------
*భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి*
🍀 ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
..........ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః|| 10-28 ||
నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మదుడిని, సర్పాలలో తాను వాసుకి అని చెబుతున్నాడు.
వాసుకి శివుని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది.
ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేసారు దేవదానవులు. వాసుకి కద్రువ తనయుడు.
🍀 అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
.......పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్|| 10-29 ||
నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పీత్రులలో ఆర్యముడిని, సంయమవంతులలో నిగ్రహాన్ని.
•ఈ శ్లోకంలో *శ్రీకృష్ణుడు తాను నాగులలో అనంతుడనని చెబుతున్నాడు*
అనంతుడు అనగా ఆదిశేషుడు.
అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, రెండవ వాడు వాసుకి. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు.
బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు.
పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు.
ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారం లో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా.
ఇప్పుడు మనకు ఒక సందేహం రాక మానదు.
పైన సర్పాలలో వాసుకి తానన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడనంటున్నాడు.
అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి తేడా? కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు.
కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు.
అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు.
మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు
. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం వుంది.
నాగులకు వాయువు ఆహరం, అనగా అవి గాలిని స్వీకరించి బ్రతుకుతాయి.
సర్పాలకు కప్పలు మొదలైన జీవరాశులు ఆహారం.
నాగుల్లో మళ్ళీ 9 జాతులు ఉంటాయి. అట్లాగే సర్పాల్లో కూడా దేవతాసర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి.
దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది.
కానీ ఇవి మానవసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు.
అలా చిక్కుతాయి అనుకోవడం సినిమాల ప్రభావం మాత్రమే.
పాములు పాలు త్రాగవన్నమాట నిజం.
అవి సరిసృపాలు కనుక వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు.
కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నం.
భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటారు, ఆరోగ్యాన్ని, సంతనాన్ని అనుగ్రహిస్తారు.
దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయి. అవి కూడా పాలు త్రాగుతాయి.
ఈ నాగపంచమి మొదలైన నాగదేవతారాధన తిధులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవారు.
అప్పటి మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. ఆ రోజులు వేరు.
కనుక అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు.
క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందు వలే మర్త్యలోకంలో సశరీరంతో సంచరించడం మానేశారు.
విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి, పూజించినవారికి సత్ఫలితాలను ఇస్తున్నారు.
అలాగే దేవతాసర్పాలు కూడా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగడం మానేశాయి.
ఒక 75 ఏళ్ళ క్రితం వరకు దేవతసర్పాలను చూసి, పూజించి, వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబసభ్యులకు ఇప్పటికి ఆ విషయాలు స్మరణలో ఉంటాయి.
కానీ ఇప్పుడు సదాచారం, శౌచం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారు, ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉన్నా, సక్రమంగా పాటించడం తక్కువ.
దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి.
ఆలయాల్లో వాటికి జరిగిన అపరాధం కారణంగా కొన్ని శరీరం విడిచిపెట్టాయి.
ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేము.
చాలామటుకు ఏదో మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి.
#నాగపంచమి, #నాగులచవితి కి నాగదేవతలకు పూజలు చేయాలి.
కానీ పైన చెప్పుకున్న విషయాలు అర్దంకాక ప్రజలందరూ మాములు పాములకు పాలు పోస్తున్నారు, పసుపు కుంకుమలు వేస్తున్నారు.
మామూలు పాములు పాలు త్రాగవు, వాటికి పసుపుకుంకుమలు పడవు.
అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటి ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది..
నాగపంచమి, నాగులు చవితి మూఢనమ్మకలు కాదు, నాగదేవతలనుఋ. ల పూజించి, సంతానం పొందిన దంపతులు కోకొల్లలు.
ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవాతానుగ్రహంతో కలిగిన సంతానంలో నాగదేవతల యొక్క వరప్రభావం, అంశను తల్లిదండ్రులు పసిగట్టగలుగుతారు.
కానీ అలా సంతానం కోసం పూజించవలసింది నాగులనే కానీ మామూలు పాములను కాదు.
ఈశ్వర సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది.
సాధారణ సర్పాలు జీవవైవిధ్యంలో, ఆహారచక్రంలో తమవంతు పాత్ర పోషిస్తాయి.
వాటి మనుగడతోనే మానవమనుగడ సాధ్యమవుతుంది.
మామూలు పాముల జోలికి వెళ్ళకుండా ఉండడం, వాటి మానాన వాటిని వదిలేయడం, వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చు.
సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు.
కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు.
కనీసం ఇప్పటికైనా హిందూసమాజం సంప్రదాయంలోని అసలు విషయాన్ని గమనించాలి.
విషయాన్ని సగం సగం చెప్పి, మూఢనమ్మకమంటూ కొట్టిపారేయకుండా, అసలు విషయాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పేందుకు మీడియా కూడా ముందురావాలి.
ఈ విషయాన్ని ఎక్కువగా షేర్ చేసి, అందరికి తెలియపరచండి,
హిందూసమాజాన్ని జాగృతం చేయండి.
హిందూ ధర్మచక్రం.☀
21, అక్టోబర్ 2017, శనివారం
Meals భోజనం
Meals భోజనం
జీవిత ఉపయెాగాలు
1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి
జ. గోరు వెచ్చనివి.
2.నీరు త్రాగేవిధానము
జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి
జ.32 సార్లు.
4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం.
5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.
6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice).
7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ.
8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు.
9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.
10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.
11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత.
12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు.
13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని.
14.రాత్రి పూట ఎంత తినాలి
జ. చాలా తక్కువగా, అసలు తిననట్టు.
15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు.
16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని.
17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు.
18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. పని.
19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.
20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి.
21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి.
22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 ని.
23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva ).
24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గం.
25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.
26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.
27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు.
28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .
29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .
30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.
31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు.
32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.
33. ఏ చికిత్సా విధానం మంచిది
జ. ఆయుర్వేదం.
34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).
35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).
36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).
37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.
38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.
Mango మాంగో
Mango మాంగో మ్యూజింగ్స్
నిరుడు ఎండల కాలంలో మా దగ్గరి మిత్రుని నాన్న మెదడు సంబంధిత అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అవి మంచి మామిడిపండ్లు దొరికే రోజులు కావటంతో బాటు ఆయనకు మధుమేహం వంటి ఇతర ఇబ్బందులు లేకపోవటంతో ఆసుపత్రిలో తాను అన్నం వద్దన్నప్పుడల్లా నూజివీడు చిన్న రసాలు మొదలు బంగినపల్లి వరకు పలు రకాల మామిడి పండ్లు తినిపించేవాళ్ళం. డిశ్చార్జ్ అయిన తర్వాతా ఈ అలవాటు కొనసాగింది. కొన్నాళ్ళకు నేరుగా పండ్లు తినటం తగ్గించారు. దీంతో పెరుగన్నంలో మామిడిగుజ్జు కలిపి పెడుతూ వచ్చాం. మన అలవాట్లు, అవసరాలతో ఋతువులకు నిమిత్తం ఉండదుగా.. చూస్తుండగానే తొలకరి వచ్చింది.
వానలు కురిశాక పురుగు కారణంగా మామిడి పండ్లు తినరు. కొనేవారు ఉండరు గనుక అమ్మకానికి కూడా పెట్టటం తక్కువే. అయినా మొజంజాహి మార్కెట్, కోఠీ, చేవెళ్ల వంటి చోట దొరికిన వాటితో ఆగస్టు వరకూ నెట్టుకొచ్చాం. కనిగిరి దగ్గర సాగు చేస్తున్న మా అన్నయ్య ఒకాయనకు సంగతి తెలిసి అక్కడినుంచి చిన్నకాయాలు 50 తెస్తే సెప్టెంబర్ కూడా గడిచింది. ఇక ఇక్కడ దొరక్క వేరే రాష్ట్రాల్లో ఎక్కడన్నా దొరకొచ్చని తెలిసిన వారి ద్వారా ఆరాం తీసాం. మహారాష్ట్ర అహ్మద్ నగర్ ప్రాంతంలో వినాయక చవితి వరకు చిన్న సైజు కాయలుంటాయని తెలిసి ఫోన్ (టైమ్స్ అఫ్ ఇండియా వారి పాత కథనం లో ఇచ్చిన నంబరు) చేసాం. ఉన్నవన్నీ కోసినా 7-8 కిలోలు కావచ్చనీ, అవీ కాస్త పుల్లగా ఉంటాయనీ, కావాలంటే నేరుగా వచ్చి తీసుకెళ్లమని ఆ పెద్దాయన చెప్పుకొచ్చారు. పోస్టులో పంపగలరా అని అడిగితే తనకు వయసైపోయిందనీ, కదలలేననీ అన్నారు. అంత దూరం వెళ్లాలా వద్దా? తీరా వెళ్ళాక లేకపోతే? అనుకొంటుండగానే ముంబై లో ఉండే మా బావ ఫోన్ చేస్తే ఈ సంగతి చెప్పుకొచ్చా. ఆయన అక్కడ ఊరిమీదబడి తిరగ్గా తిరగ్గా అతికష్టం మీద 10 పెద్ద పండ్లు దొరికాయి. దసరాకి వస్తూ తెచ్చిన ఆ పండ్లలో సగం పెట్టె తెరిచిన 2 రోజుల్లోనే పాడైపోగా మిగిలినవే, మొత్తం మీద మిగిలిన 5 పండ్లతో మరో వారం నెట్టుకొచ్చాం. ఇక ఇప్పుడేం చేయాలి?
ఈ నెల మొదటి వారం రోజులు చారులో చక్కెర వేసి పెట్టటం, బెల్లం చారు వంటివాటితో మేనేజ్ చేసాం. ఇంకెక్కడా మామిడి పండ్లు దొరికే ఛాన్స్ లేదనీ ఈ నాలుగు నెలలూ ఇలానే చేయాలని మా అమ్మతో చెప్పి ఇక మామిడి గుజ్జు కోసం ఇంటర్నెట్ లో గాలిస్తున్నా.
ట్రై చేసి చూద్దాం అని ఏడాదిపొడవునా దొరికే మామిడి, మాన్సూన్ మంగోస్, మంగోస్ ఆల్ ఓవర్ ది ఇయర్, ఐ వాంట్ మంగోస్ నౌ, మంగోస్ ఇన్ వింటర్ వంటి కీ వర్డ్స్ టైపు చేసి చూసా. ఇక వార్తల వరద మొదలయింది. 15 రోజులు రోజుకు 3 గంటలు ఇదే పని. ముందుగా సాక్షి పత్రిక పాత జిల్లా ఎడిషన్ లో వార్త...
నాంచారిమడూర్: గ్రామము మండలం: తొర్రూర్ జిల్లా:వరంగల్ మా ఇంటి ముందున్న మామిడి చెట్టు గురించి. కానీ ఆయన వివరాలేమీ లేకపోవటంతో అయ్యో అనుకున్నా. ఈలోపు పాత హిందూలో తమిళనాడులోని పీ.అల్లిముత్తు (రాశిపురం తాలూకా, మినకల్ పోస్ట్, నామక్కల్ జిల్లా, మొబైల్- 94435-11253, 94422-64273) తోటలో సీజన్లకతీతంగా విచ్చలవిడిగా కాస్తున్న మామిడి గురించి చదివి ఫోన్ చేశా. ఆ పేరు చూసాక ఆయన, ఆమె తేడా కూడా తెలీదు. అయినా ఫోన్ చేశా. ముందొక ఉషా ఊతుప్ లైన్లోకి వచ్చి నేను చెప్పేది అర్ధం కాకపోయినా తనకు తెలిసినవన్నీ చెప్పింది. చాలా సేపటి తర్వాత వాళ్ళాయనకిచ్చి పోయింది. ఆ తర్వాత అల్లిముత్తు గారు వస్తే (అయన కొద్దిగా ఇంగ్లీష్ అర్థం చేసుకొంటున్నట్లు ఉంది) విష్యం చెప్పా. అన్నీ విని చివరికి 'ఇల్లె' అంటూ పెట్టేసారు.
తర్వాత ఉత్తర భారతానికి మళ్ళా. అక్బర్ చక్రవర్తి నేటి యూపీ, బీహార్ లలో పెంచిన లక్షలాది మామిడి మొక్కల సంగతి గుర్తొచ్చి
మాన్సూన్ మాంగోస్ ఇన్ బీహార్ అంటూ టైపు చేయగానే గూగుల్ తల్లి బీహార్లోని ముజఫర్ పూర్ లోని జపాహా ఫార్మ్స్ ఆసామి భోలానాథ్ ఝా గారి మామిడి సాగు కథనం చూపింది. ఆరా తీస్తే పచ్చడికి తప్ప తినేవి దొరకలేదు.
ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లా మామిడి అభివృద్ధి, పరిశోధన సంస్థ వారు శీతాకాలంలో కాసే రకాలు పెంచుతున్నారని తెలిస్తే ఫోన్ చేసాం. మమతా బెనర్జీ పాలనలో ఉన్న రాజ్యం కాబట్టి ఏదో ఒక ఉపయోగం ఉండవచ్చనిపించింది. ఫోన్ చేసి వివరాలు చెబితే వాళ్ళు ' రామ్ గోపాల్ వర్మ సినిమా చూసిగానీ ఫోన్ చేసావా? అని మర్యాదగా విసుక్కొన్నారు. మళ్ళీ చేస్తే పేపర్ లో వచ్చేవన్నీ నిజమనుకొంటే ఎలా? అంటూ చిరాకు పడ్డారు. ఎంతైనా బెంగాలీలు కదా.. ఇంకా దుర్గాపూజ మూడ్ నుంచి బయటు రాలేదేమో అనుకొన్నా. ఆ పక్కనే బంగ్లాదేశ్ లో భాగమైన 'చాపై నవాబ్ గంజ్' లోని హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం సాధించిన అద్భుత మామిడి సాగు వివరాల కథనం మరోటి చూసా. వారికీ ఫోన్ చేద్దాం అనుకున్నా. కానీ జాకీర్ నాయక్ అనుచరుడనో, ప్రాణ భయంతో తలోదిక్కు పారిపోతున్న రోహింగ్యా మద్దతు దారంటారో అని భయం వేసి ఊరుకున్నా.
మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్.. అన్న గిరీశం మాటలు గుర్తుకొచ్చి ఇక్కడ లాభం లేదు.. ఏదైనా సీమ సరుకు సీమ సరుకే అనుకొని బయట చూద్దామని సెర్చ్ మొదలెట్టా. అప్పుడే 'హోమ థెరపీ ఇంటర్నేషనల్' వారి అదిరిపోయే సైట్ చూసా. రోజూ హోమం చేసే చోట ఏడాదిపొడవునా మామిడి కాస్తుందని చెబుతున్న సైట్ అది. గొప్ప గర్వంతో సైట్ వివరాలు చూస్తే (http://www.homatherapy.org/…/mango-trees-give-fruit-all-yea…). వాళ్ళు కేవలం పరిశోధనలే చేస్తారు తప్ప పెద్దగా పంటా పాడూ పండించరని. ఇదీ రాలే బేరం కాదనుకొనగానే ది మాంగో ఫ్యాక్టరీ https://www.themangofactory.com అనే సైట్ కనిపించింది . అందులోని మనుషులూ, ఆ కాయలు చూసి'రాంగ్ టర్న్' సినిమా పాత్రలు గుర్తుకొచ్చాయి. వెన్ను జలదరించి ఆ రోజుకు ఊరుకున్నా.
మరుసటి రోజు మళ్ళీ సెర్చ్ మొదలు పెట్టగానే 15 జనవరి 2016న విడుదలైన 'మాన్సూన్ మాంగోస్" ( అభి వర్గీస్ - దర్శకత్వం) వెక్కిరించింది. ఆ తర్వాతే జపాన్ దేశంలోని ఓ బుల్లి ద్వీపమైన ఇషిగాకి ద్వీపంలో సాగవుతున్న మామిడి వివరాలు చూసా. (http://www.eenadu.net/…/sunday-m…/sunday-magazineinner.aspx…). కాయలు దొరికేలా లేకపోయినా ఆర్టికల్ చదివి బాగుందనుకొన్నా.
ఇంతలో.. ఆఫీసులో నా పక్క సీటు అమ్మాయి (తను డాక్టర్)కి నేను కొన్ని రోజులుగా సీరియస్ గా పనిచేయటం చూసి భయపడిందేమో? అంతా బాగుందా? అని పరామర్శించింది. ( అప్రైజల్ సమయం కదా.. తనకి డౌట్ వచ్చిండొచ్చు) మామిడి గా(బా)ధలు చెప్పుకొచ్చా. ఓ ఇంతేనా.. అంటూ ఓ నవ్వు నవ్వి తన సొంతరాష్ట్రం జార్ఖండ్ లో మామిడి జూన్ లో కాపుకొస్తుందనీ, ఎంత లేదన్నా 3 నెలలు కాయలు ఉంటాయనీ చెప్పుకొచ్చింది. కోటికాంతులతో 18 చేతులూ అభయ ముద్రలోనే ఉన్న కనక దుర్గ కనిపించినంత రిలీఫ్ దొరికింది. అనవసరంగా గూగుల్ ని ఇబ్బంది పెట్టాననుకొని ఆ తల్లికి మనసులోనే క్షమాపణ చెప్పుకొన్నా. అప్పటికప్పుడే నా ముందే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రాంచీలో ఉన్న ఆయన మిత్రులైన పెద్ద ఎగుమతిదారులు పేర్లు చెప్పి కనుక్కొని ఏ సంగతీ చెప్పమంది.
ఉంటే ఫ్లైట్ పార్సిల్ సర్వీస్ లో కోల్ కతా పంపితే మా బ్రాంచ్ ఉద్యోగి వచ్చి తీసుకొంటాడని చెబితే ..రేపే మామిడి పళ్ళు వస్తున్న ఫీలింగ్. ఆ నవ్వులో కాన్ఫిడెన్స్ చూసి ఆరోజు హాయిగా ఇంటికి పొయ్యా. మర్నాడు తీరిగ్గా 10 గంటలకి వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగి పని చేస్తున్నట్టు నటించి అసలు సంగతి చల్లగా చెప్పుకొచ్చింది. ఈ ఏడాది వానలకి ముందే పంటంతా తుడిచిపెట్టుకు పోయిందనీ, అసలు సీజన్లోనే మంచి కాయలు దొరకలేదని, మామిడి రైతులు అప్పుల పాలయ్యారని..ఇంకేదో చెప్పుకొచ్చింది. అయినా కంగారు లేదు.. అమెజాన్ ఉందిగా.. కూల్ అంది.
అందులో పల్ప్ వివరాలు చూసి ఇక ఆర్డర్ చేద్దామని డౌటొచ్చి కింద ప్రోడక్ట్ రివ్యూలు చూసా. ఒక్కక్కడూ తిట్టిన బండబూతులు ఆసాంతం చదివి తెలివితక్కువ వెధవలు.. రివ్యూ చదివి కొనుక్కోకూడదూ? అనుకోని నవ్వుకున్నా.
ఇలా అక్టోబర్ 10 కూడా అయిపొయింది. 11న ఉదయాన్నే ఆఫీసుకు వచ్చి లుంగీ కట్టుకొన్న ఒక పెద్దాయన సోఫాలో కూర్చొని శ్రద్ధగా.. పద్దతిగా.. గోడకట్టినట్లు కన్ను చెదిరే మామిడి పండ్లు మట్టసంగా కోస్తున్నాడు. ఫోటో చూసే నోరూరింది. ఆపై డౌటొచ్చింది. (చేదు అనుభవాల వల్ల). పాత ఫోటో, పోస్ట్ కావచ్చని డౌటొచ్చి.. గుండమ్మ కథలో సావిత్రి కాలి పుట్టుమచ్చమీద పారాణి సీనులో డిటెక్టివ్ వేషం కట్టిన ఏఎన్నార్ చూసినట్లు చూసి మొత్తం చదివా. యురేకా... అని పెద్దగా కేక వేద్దామనుకొన్నా. కార్పొరేట్ ఆఫీసు కదా.. పర్సనల్ ఎమోషన్స్ చూపకూడదని గుర్తొచ్చింది. (అసలే అప్రైజల్ సమయం). వెంటనే విష్యం చెబుతూ ఫోన్ న్యూబర్ కోసం రిక్వెస్ట్ పెట్టా. మొత్తం ఇస్తానని చెప్పా. డబ్బు తీసుకోనని ఖండితంగా చెబుతూ ఫోన్ నెంబర్ పంపించారు.
అడగాలా వద్దా అనుకొంటూ ఫోన్ చేశా. గంభీరమైన గొంతు. అమ్మో అనుకొన్నా. పండ్ల ఆరా విషయంలో నా కొలీగ్ (రాంచీ అమ్మాయి) అనుభవం మట్టుకు చెప్పా. గట్టిగా మనసారా నవ్వారు. అప్పుడు ఇంకాస్త ధైర్యం చేసి మరో 2 మాటలు మాట్లాడితే సాగర్ రోడ్, హైదరాబాద్ లో ఉంటానన్నారు. వెంటనే మా తమ్ముడు ఆ పక్కనే ఉంటాడనీ, తాను రావటం సులువని చెబితే ఫోన్ నంబర్ ఇచ్చి మాట్లాడమన్నారు. మా వాడు ఆ రోజు క్లాసుల వల్ల పగలు పోలేకపోయి పొద్దుగూకినాక వెళ్లినా, ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. టార్చ్ వెలుతురులో 2 డజన్ల కాయలు కోసి ఇచ్చి పంపారు. ఇంటిమనుషుల్లా సాగనంపారు వాడిని. ఆ తర్వాత ఆ ఇంటివాతావరణం, వాళ్ళ పద్దతులు, కాయల గురించి మావాడు ఓ గంటసేపు సంతోషంగా చెప్పుకొచ్చాడు. కాయల గుజ్జు ఎలా నిల్వ చేయాలో వారి సహచరి చెప్పిన ఆదరపూర్వక సలహాలూ చెప్పి మురిసిపోయాడు. 'నీ మాట ప్రకారం పగలు వెళితే ఇంకా పండ్లు దొరికేవ'ని వాపోయాడు. భలే పండ్లు భలే పండ్లు అంటూ వీడియో కాలింగ్ చేసి మరీ చూపెట్టాడు. అలా.. ఆ రాత్రికే నాకంటే ముందు పండ్లు మా ఊరికి చేరాయి.
నవనవలాడే తియ్యని పండ్లు. రుచి ఎంతో బాగుందన్నారు మా నాన్న. ఇరుగూ పొరుగూ వచ్చి చూసి ఈ ఆకాలంలో ఇంత కండగల కాయలా అంటూ చూసి దవళ్లు నొక్కుకొన్నారు. మొత్తానికి సమస్య తీరింది. ఇంకో నెలరోజులు దిగులు లేదు.
ఇంతకీ మామిడిపళ్ళనిచ్చిన ఆసామి పేరు చెప్పలేదు కదా.. వారే శ్రీ వాసిరెడ్డి వేణుగోపాల్ గారు. విఖ్యాత పాత్రికేయులు. 'సార్.. నేనెవరో తెలీకపోయినా తక్షణం స్పందించి గొప్ప సాయం చేశారు. మీ, మీ సహచరి పెద్దమనసుకు, చూపిన ఆదరానికి, సౌజన్యానికి కోటి కోటి కృతఙ్ఞతలు. వీలుంటే 'మాయమై పోతున్నడమ్మా .. మనిషన్నవాడు' లాంటి పిచ్చి పాటలు రాయొద్దని గోరెటి వెంకన్నకు గట్టిగా చెప్తా అనుకోని నవ్వుకున్నా సార్.
మీవల్ల నాకు గొప్ప మేలు జరగటమే గాక గొప్ప మనుషులూ దొరికారు. మీకు రుణపడి ఉన్నా. అలాగే నోముల ప్రభాకర్ గౌడ్ గారికీ. ఇప్పటికి సెలవు సార్.. నమస్తే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...
-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
గిద్దె, సోల, మానికలు ఇనుముతో వృత్తాకారంలో వుండే కొలత సాధనాలు. నాలుగు గిద్దెలు ఒక సోల. రెండు సోలలు ఒక తవ్వ. నాలుగు సోలలు ఒక మానిక. ఇలాంటి కొల...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...



