22, ఆగస్టు 2017, మంగళవారం
Gaddar గద్దర్
గద్దర్
వికీపీడియా నుండి
గద్దర్
Gaddar.jpg
గద్దర్
వ్యక్తిగత వివరాలు
జననం 1949
తూఫ్రాన్, మెదర్, తెలంగాణ
రాజకీయ పార్టీ Telangana Praja Front
నివాసం హైదరాబాదు
గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన "గదర్ పార్టీ"కు గుర్తుగా తీసుకోవడం జరిగింది.
విషయ సూచిక [దాచు]
1 జీవిత విశేషాలు
2 తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో
3 ఇతర వివరాలు
4 రచనలు,పాటలు
5 సూచికలు
6 యితర లింకులు
జీవిత విశేషాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా Mahaboob Nagar లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట "ఆపర రిక్షా" రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాసారు. 1972 లో జన నాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు. దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ ఎక్షమ్ రాసారు. అయన కెనర బ్యాంకులో క్లార్క్ గా చేరారు, తర్వాత వివాహం చేసుకున్నారు, భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు) మరియు వెన్నెల.
మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసాడు.1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన మరియు ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సి డిలుగా రికార్డ్ అయ్యి అత్యదికంగా అమ్ముడుపోయాయి.
మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై ఆయన ఉదారంగా వ్యవహరించారు, వారిపై నిషేధం ఎత్తి వేయబడింది. 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.
1997 ఏప్రిల్ 6 న ఆయన పై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికి బుల్లెట్ ఉంది. ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు, విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, మరియు వరవర రావు లను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్కౌంటర్ లను ఆయన తీవ్రంగా నిరసించారు.
తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో[మూలపాఠ్యాన్ని సవరించు]
తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు మరియు నిమ్న కులాల యొక్క ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించారు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశం లోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకునే లేదు.
గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. మావోఇస్ట్ పార్టీ తెలంగాణాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టి నప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్. గద్దర్ పై దాడి జరిగినప్పుడు హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్. ఆయన ప్రస్తుత ఉద్యమంలో తెలంగాణా ప్రజా ఫ్రంట్ ద్వార ముందకు వెళ్తున్నారు.ఇతర వివరాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
ఆయన రాసిన పాటల్లో "అమ్మ తెలంగాణమా" అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డ్ ను తిరస్కరించారు.
ఇటివల ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. 'పొడుస్తున్న పొద్దూ' మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది.
"అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా" అనే పాటను "తెలంగాణా" రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం జరిగింది.
[1] [2] [3] [4] [5] [6] [7] [8]
రచనలు,పాటలు[మూలపాఠ్యాన్ని సవరించు]
అమ్మ తెలంగాణ
నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" (నంది అవార్డు వచ్చింది. కానీ ఆయన ఆ అవార్డ్ ను తిరస్కరించాడు)
పొడుస్తున్న పొద్దు మీద ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...
-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
గిద్దె, సోల, మానికలు ఇనుముతో వృత్తాకారంలో వుండే కొలత సాధనాలు. నాలుగు గిద్దెలు ఒక సోల. రెండు సోలలు ఒక తవ్వ. నాలుగు సోలలు ఒక మానిక. ఇలాంటి కొల...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి