22, ఆగస్టు 2017, మంగళవారం

Naxalights నక్సలైటు

వికీపీడియా నుండి నక్సలైటు ఉద్యమము యొక్క ప్రభావమున్న జిల్లాలను సూచించే భారత దేశ పటము నక్సలైటు లేదా నక్సలిజం భారత కమ్యూనిష్టు ఉద్యమములో వచ్చిన సైనో-సోవియట్ చీలికతో ఉద్భవించిన తీవ్రవాద, తరచూ హింసాత్మక, విప్లవాత్మక కమ్యూనిష్టు వర్గాల యొక్క వ్యవహారిక నామము. సైద్ధాంతికంగా వీరు అనేక అనేక రకాల మావోయిజానికి చెందుతారు. తొలుత, ఈ ఉద్యమం పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైనది. ఇటీవలి సంవత్సరాలలో, కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) వంటి గెరిల్లా అండర్ గ్రౌండు వర్గాల యొక్క కార్యకలాపాలతో, ఉద్యమం ఛత్తీస్‌ఘడ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ వంటి అంతగా అభివృద్ధి చెందని మధ్య మరియు తూర్పు భారతదేశ గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది.[1] సి.పి.ఐ(మావోయుస్టు) తదితర నక్సలైటు వర్గాలను భారత కేంద్ర ప్రభుత్వము మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రవాదులుగా పరిగణిస్తున్నాయి.[2] విషయ సూచిక [దాచు] 1 చరిత్ర 2 బెంగాల్ తిరుగుబాటు 3 ఇటీవలి కార్యకలాపాలు 4 సంస్కృతిలో 5 నక్సలిజానికి విరుగుడుగా రోడ్లు 6 మూలాలు 7 ఇవికూడా చూడండి 8 బయటి లింకులు చరిత్ర[మూలపాఠ్యాన్ని సవరించు] నక్సలైటు అన్న పదం పశ్చిమ బెంగాల్ రాష్ట్రములో నక్సల్‌బరి అనే ఒక చిన్న గ్రామము పేరు మీదుగా వచ్చింది. 1967లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సి.పి.ఐ (ఎం)) లోని ఒక వర్గము, అధికారిక సిపిఐ (ఎం) నాయకత్వానికి వ్యతిరేకముగా విప్లవాత్మక విపక్షాన్ని అభివృద్ధి పరచే ప్రయత్నంగా, చారు మజుందార్ మరియు కానూ సన్యాల్ నేతృత్వంలో ఒక హింసాయుత పోరాటం ప్రారంభించింది. ఈ తిరుగుబాటు మే 25, 1967న నక్సల్‌బరి గ్రామములో స్థానిక అధికారులు ఒక భూమి సమస్య విషయమై ఒక గిరిజనునిపై దాడి చేయడంతో ప్రారంభమైంది. గిరిజనులు వ్యతిరేకవర్గమైన భూస్వాములపై తిరుగుదాడి చేయటంతో హింస హెచ్చరిల్లింది.[2] మజుందార్ చైనా అధ్యక్షుడైన మావో జెడాంగ్ను ఎంతగానో అభిమానించేవాడు. ఈయన భారతీయ శ్రామికులు మరియు నిమ్న వర్గాల ప్రజలు తన అడుగుజాడలలో నడచి, వారి కష్టాలకు కారణమైన ఉన్నత వర్గాలను, ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రవచించాడు. మజుందార్ తన రచనల ద్వారా నక్సలైటు ఉద్యమానికి ఊపిరిపోశాడు. ఈయన రచనలలో అత్యంత ప్రధానమైన ఎనిమిది చారిత్రక పత్రాలు (Historic Eight Documents) నక్సలైటు భావజాలము యొక్క మూలం అయినది.[3]. 1967లో 'నక్సలైట్లు' అఖిల భారత కమ్యూనిస్టు క్రాంతికారుల సమన్వయ కమిటీ(ఏఐసిసిసిఆర్)ని నిర్వహించి, ఆ తరువాత కాలములో సి.పి.ఐ(ఎం) నుండి వేర్పడినారు. దేశములోని అనేక ప్రాంతాలలో తిరుగుబాట్లను నిర్వహించారు. 1969లో ఏఐసిసిసిఆర్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు)కు జన్మనిచ్చింది. భారతదేశములో తీవ్రవాదులుగా గుర్తింపబడిన సంస్థలు ఈశాన్య భారతదేశం నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఐసాక్-ముయివా (NSCN-IM) నాగా నేషనల్ కౌన్సిల్-ఫెడరల్ (NNCF) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఖప్లాంగ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కంగ్లెయి యావోల్ కన్న లుప్ (KYKL) జోమీ రెవల్యూషనరీ ఫ్రంట్ ఉత్తర భారతదేశం ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయుస్టు) భింద్రన్ వాలే టైగర్ ఫోర్స్ ఆఫ్ ఖలిస్తాన్ బబ్బర్ ఖాల్సా ఖలిస్తాన్ జిందాబార్ ఫోర్స్ కాశ్మీరు లష్కరే తోయిబా జైషే మొహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ హర్కతుల్ ముజాహిదీన్ ఫర్జందానే మిలత్ యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ అల్-ఖైదా మధ్య భారతదేశం పీపుల్స్ వార్ వర్గం బల్బీర్ మిలీషియా నక్సల్స్ రణవీర సేన v t e ఆచరణలో అన్ని నక్సలైటు వర్గాలు సి.పి.ఐ(ఎంఎల్) నుండే ఉద్భవించాయి. ప్రారంభము నుండి వీటిలో ఒక ప్రత్యేక ప్రవృత్తి కలది, దక్షిణ దేశ్ వర్గమునుండి పుట్టిన మావోయిస్టు కమ్యూనిష్టు సెంటర్ (ఎం.సి.సి). ఎం.సి.సి తర్వాత కాలములో పీపుల్స్ వార్ వర్గముతో కలసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) యేర్పాటైనది. మరో ప్రవృత్తి ఆంధ్రా రెవల్యూషనరీ కమ్యూనిస్టులది. దీనిని ముఖ్యంగా ప్రవేశపెట్టినది టి.నాగిరెడ్డి యొక్క మాస్ లైన్ను అనుసరించే యూ.సి.సి.ఆర్.ఐ(ఎంఎల్). ఈ ప్రవృత్తి ఏఐసిసిసిఆర్ తో ప్రారంభ దశలోనే విడువడినది. 1970లలో ఉద్యమము అనేక పరస్పరం విభేదించే చిన్న వర్గాలుగా చీలిపోయింది. 1980 నాటికి దాదాపు 30 క్రియాశీలక నక్సలైటు వర్గాలు మొత్తం 30,000 మంది సభ్యులతో పనిచేస్తున్నవని అంచనా.[4] 2004లో గృహమంత్రిత్వ శాఖా ఆప్పటికి "9,300 మంది అండర్ గ్రౌండు సభ్యవర్గము, 6,500 సాధారణ అయుధాలు అవేకాక పెద్దసంఖ్యలో లైసెన్సులేని దేశవాళీ తుపాకులు" ఉన్నాయని ఒక అంచనాలో వెల్లడించింది [5] జూడిత్ వీడల్-హాల్ (2006) ప్రకారం, "తాజా సంఖ్యలు నక్సలైట్ల బలగాన్ని 15,000గా అంచనావేస్తున్నాయి. భారతదేశములోని ఐదోవంతు అడవులు నక్సలైట్ల గెరిల్లా నియంత్రణలో ఉన్నదని చాటుకున్నారు. అదేకాక, దేశములోని మొత్తం 604 జిల్లాలలో 160లో నక్సలైట్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు."[6] నేడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్ వంటి కొన్ని నక్సలైటు వర్గాలు న్యాయబద్ధమైన సంస్థలుగా ఉద్భవించి పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొంటున్నాయి. ఇతర వర్గాలైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) మరియు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) జనశక్తి సాయుధ గెరిల్లా పోరాటము నిర్వహిస్తున్నవి. బెంగాల్ తిరుగుబాటు[మూలపాఠ్యాన్ని సవరించు] కలకత్తా విద్యార్థుల ఉద్యమంలోని అతివాద విభాగాలలో నక్సలైట్లు తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు.[7] పెద్దసంఖ్యలో విద్యార్థులు తమ చదువులు విడిచిపెట్టి ఉద్యమ కార్యకలాపాలలో చేరారు. మజుందార్ సి.పి.ఐ(ఎంల్) ఎత్తులకు సవరించి, సాయుధ పోరాటం గ్రామీణ ప్రాంతాలలోనే కాదూ అంతటా ఏకకాలంలో జరగాలని ప్రకటించాడు. ఈ విధంగా ఉద్యమకారులు ఉద్యమపోరాటంలో భాగంగా వర్గశత్రువులైన వ్యక్తులను హతమార్చాలనే ఆనిహిలేషన్ లైన్ సిద్ధాంతాన్ని భూస్వాములపైనే కాకుండా విశ్వవిద్యాలయ బోధకులు, పోలీసు అధికారులు, రాజకీయనాయకులు తదితరుల మీద కూడా ప్రయోగించడం ప్రారంభించారు. కలకత్తా వ్యాప్తంగా పాఠశాలలు మూసివేయబడినవి. నక్సలైటు విద్యార్థులు జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయమును చేజిక్కించుకొని, యంత్రసామాగ్రి షాపు సౌకర్యాలను పోలీసులతో పోరాడడానికి కావలసిన గొట్టపు తుపాకులను తయారుచేయటానికి వినియోగించుకున్నారు. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలను ప్రధాన స్థావరముగా చేసుకున్నారు. వీళ్ళు జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయ ఉపసంచాలకుడైన డా.గోపాల్ సేన్‌ను హతమార్చారని భావించారు.[8] వ్యక్తి వ్యతిరేక తీవ్రవాద విధానాలు త్వరలోనే బెడిసికొట్టాయి. అనతికాలంలోనే అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, సిద్ధార్ధ శంకర్ రే, నక్సలైట్లకు వ్యతిరేకముగా కఠినమైన ప్రతిచర్యలు ప్రారంభించాడు. కొద్ది నెలల్లోనే, నక్సలైట్ల తిరుగుబాటు చల్లారిపోయింది. తీవ్రమైన శక్తి ప్రయోగమే నక్సలైట్లకు అర్ధమయ్యే భాష అని ప్రభుత్వం మరియు పోలీసుల యొక్క ధృక్పథం. రాష్ట్రము నక్సలైట్లతో అంతర్గత యుద్ధములో ఉన్నదని, యుద్ధంలో ప్రజాస్వామ్య విధానాలకు తావులేదని, అందునా, ప్రజాస్వామ్య పరిధిలో పోరాడని ప్రత్యర్థిపై పోరాటంలో ఈ విధానల గురించి ఆలోచించడం అనవసరమని, ప్రభుత్వం తన వాదనను వినిపించింది. ఈ తిరుగుబాటు ప్రజల దృష్టిలో అతివాద మావోయిస్టుల ఇమేజును తీవ్రంగా నష్టపరిచింది. తత్ఫలితముగా వారికి మద్దతు సన్నగిల్లింది.[2] అంతేకాక, ఉద్యమం అంతర్గత కలహాలతో నీరసపడింది. పెద్ద ఎత్తున సభ్యులు మజుందార్ పోరాటశైలిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మజుందార్ నాయకత్వానికి వ్యతిరేకంగా సత్యనారాయణ సింగ్ తిరగబడటంతో 1971లో సి.పి.ఐ(ఎంఎల్) రెండుగా చీలింది. 1972లో పోలీసు దళాలు మజుందార్‌ను బంధించి, హింసించి చంపాయి. మజుందార్ మరణము తర్వాత ఉద్యమము యొక్క క్షీణత వేగవంతమయ్యింది.నక్సలైటులు రాను రాను అనేకరకాలుగ మరారు. ఇటీవలి కార్యకలాపాలు[మూలపాఠ్యాన్ని సవరించు] కలకత్తాలో నక్సలైట్ల ప్రచార పోస్టరు గతకొద్ది సంవత్సరాలలో తిరుగుబాటుదారులు నక్సల్ ప్రభావాన్ని తొమ్మిది రాష్ట్రాలలోని 76 జిల్లాల నుండి 12 రాష్ట్రాలలో 118 జిల్లాలకు వ్యాపింపజేశారు. రెండు ప్రముఖ నక్సలైటు వర్గాలైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) పీపుల్స్ వార్ (పి.డబ్లు.జి) మరియు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎం.సి.సి.ఐ) ఏకమై సెప్టెంబరు 21, 2004న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఏర్పడింది. భారత గూఢచారి సంస్థ అయిన రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, నక్సలైట్లు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం వంటి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో సంబంధాలు నెరపడానికి ప్రయత్నించారని ఆరోపణలు చేసినది. ఎల్.టి.టి.ఈతో ఆయుధ లావాదేవీలు చేసినట్లుగా ఆరోపించారు.[9][10][11]. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, రాజనాధ్ సింగ్, నక్సలైట్లకు పాకిస్తానీ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్ (ఐ.ఎస్.ఐ) కి సంబంధాలు ఉన్నట్లు ఆరోపించాడు.[12] సి.పి.ఐ(మావోయుస్టు)ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నిషేధించింది. ఈ నిషేధాన్ని వారు నిరసించారు.[13]. నక్సలైట్లు చత్తీస్‌ఘడ్‌లో క్రియాశీలకముగా పనిచేస్తున్న సల్వా జుడుం వంటి నక్సల్ వ్యతిరేక పారామిలటరీ వర్గాల నుండి కూడా దాడులు ఎదుర్కొంటున్నారు.[14] నక్సలైట్లు నేపాల్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీసుఘడ్‌లోని బస్తర్ జిల్లా గుండా ఆంధ్ర ప్రదేశ్ వరకు ఒక కాంపాక్ట్ రెవల్యూషనరీ జోన్ నెలకొల్పే యోచనలో ఉన్నట్లు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్ మరియు బీహార్లలో సమైక్యం కావటం ఈ సి.ఆర్.జి యోచన సాధనకు కీలకం. నక్సలైట్లు పశ్చిమ బెంగాల్‌ను, భారత మరియు నేపాల్ లోని తమ ఆధిపత్య ప్రాంతాలకు కారిడార్‌గా వాడుకోవాలని ప్రణాళిక చేశారు.[15] 2007లో నక్సలైట్లు తమ పోరాటాన్ని తీవ్రతరం చేసి భారతదేశంలోని సగం రాష్ట్రాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వీరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, పరిశ్రమలను ఆకట్టుకునేందుకు గాను ప్రత్యేక ఆర్థిక జోనులను సృష్టించే ప్రయత్నములో, తూర్పు భారతదేశంలో పెద్ద మొత్తంలో రైతుల భూమిని కైవసం చేసుకునే ప్రభుత్వ ప్రణాళికలకు వ్యతిరేకముగా, రైతాంగ తిరుగుబాట్లను ప్రోత్సహించే పయత్నము చేస్తున్నారు.[16] ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారత దేశ స్వాతంత్ర్యానంతరం అంతరంగిక భద్రతకు, నక్సలైట్లు అతి పెద్ద ముప్పు అని వ్యాఖ్యానించాడు.[17] మార్చి 5 2007న, నక్సలైటు తిరుగుబాటు దారులు భారత పార్లమెంటు సభ్యుడైన సునీల్ మహతోను ఝార్ఖండ్ రాష్ట్ర రాజధాని అయిన రాంచీ నుండి 160 కిలోమీటర్ల దూరములో ఉన్న కిషన్‌పూర్ వద్ద హోలీ పండగ సందర్భంగా ఒక ఫుట్ బాల్ ఆట తిలకిస్తుండగా కాల్చిచంపారు.[18] నక్సలైటు నాయకత్వం ఈ సంఘటనకు బాధ్యత వహించడానికి నిరాకరించింది. మార్చి 15, 2007న రడి బోడ్లి గ్రామములోని పోలీసు స్థావరముపై మావోయిస్టు తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో కనీసం 49మంది పోలీసు అధికారులు మరణించారని నివేదించబడింది.[19] చనిపోయినవారిలో 15 మంది ఛత్తీస్‌ఘడ్ సాయుధ దళాలకు చెందినవారు మరియు 34 మంది ప్రత్యేక పోలీసు అధికారులు. ఈ దాటిలో 12 మంది ఇతరులు కూడా మరణించారు.[20] దాడి జరిగినప్పుడు అక్కడ మొత్తం 23 మంది సాధారణ అధికారులు, 55 మంది ప్రత్యేక పోలీసు అధికారులు ఉన్నారు.[21] సంస్కృతిలో[మూలపాఠ్యాన్ని సవరించు] బ్రిటీషు సంగీతబృందము ఏషియన డబ్ ఫౌండేషన్ నక్సలైట్ అనే పాటను పాడారు. ఈ పాట 1999లో విడుదలైన బ్రోక్‌డౌన్ ప్యాలెస్ అనే సినిమా సౌండ్‌ట్రాక్‌లో భాగమైనది. నక్సలిజానికి విరుగుడుగా రోడ్లు[మూలపాఠ్యాన్ని సవరించు] దేశంలో నక్సలిజం బారిన పడిన జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించి తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రూ.410 కోట్లను వెచ్చించనున్నారు.వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న33 జిల్లాల్లో 2,573 కి.మీ మేర రహదారులు వేసేందుకు రూ.585.63 కోట్ల కేంద్ర సాయం కోరారు.చత్తీస్‌గఢ్, ఒరిస్సాతో సరిహద్దులతో ముడిపడిన ఖమ్మం జిల్లాను ప్రత్యేకమైనదిగా కేంద్రం గుర్తించినట్లు సమాచారం. ఒక రాష్ట్రంలో వి ధ్వంసం సృష్టించిన అనంతరం మావోయిస్టులు వేగంగా పొరుగు రాష్ట్రానికి తరలి వెళ్తున్నారు. గాలింపుల సమయంలోనూ ఇదే వ్యూహం అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల్లో రవాణా సదుపాయాలను మెరుగు పరచాలని నిర్ణయించారు. ఖమ్మంతోపాటు దంతెవాడ, కోరాపుట్ జిల్లాల్లో రహదారులను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.ఖమ్మం జిల్లాలోని 46 మండలాల్లో 29 మండలాలు గిరిజన ప్రాంతాల పరిధిలో ఉన్నాయి. చింతూరు-మల్కన్‌గిరి మార్గంలో సీలేరు నదిపైన, కుంట-మోటు దారిలో శబరి నదిపై వంతెన నిర్మిస్తే మూడు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరుగుతాయి.http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel17.htm తీవ్రవాదానికి విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు రహదారుల (రాజమండ్రి-భద్రాచలం, భద్రాచలం-చంద్రుపట్ల )అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. http://www.eenadu.net/story.asp?qry1=18&reccount=38

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...