12, అక్టోబర్ 2017, గురువారం

Rape అత్యాచారం

ఎదవ లాజిక్కులు.. ఎదవ తీర్పులు... మా ఊళ్లో రావిచెట్టుకింద రచ్చబండమీద కూర్చునే పెద్దలు ఇంతకన్నా విలువైన తీర్పు ఇవ్వగలరు.
మన డబ్బుతో పార్లమెంటులో మేపే గుడ్డి గుర్రాలకన్నా హీనంగా వుంది సుప్రీంకోర్టు జడ్జీల ఆలోచన. పార్లమెంటు గుడ్డిగుర్రాలు అనేక గుడ్డి చట్టాలను.. సామాజిక పర్యవసానాలు ఆలోచించకుండానే గుడ్డిగా ఆమోదిస్తుంటాయి. కానీ.. అది సర్వోన్నత న్యాయస్థానం కదా! సర్వోత్తమ న్యాయస్థానం కదా!! ది సుప్రీం కోర్టు కదా!!! ఇంత ముఖ్యమైన విషయంపై.. ఇంత ముఖ్యమైన, ఇంత చారిత్రక తీర్పు ఇచ్చిన రాజ్యాంగ బెంచిలో కనీసం ఒక మహిళా జడ్జి కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇలాంటి నేలవిడిచి సాము రాజ్యాంగ తీర్పుల వల్ల ఇప్పటికే భారతీయులు పడరాని పాట్లు పడుతున్నారు. బాలికా సంరక్షణ పేరిట ఇచ్చిన ఈ తీర్పు.. భారతీయ బాలికలకు ఏ మాత్రం మేలు చేసేది కాదు. ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో తీర్పు అంటే.. మీ చేతికి మట్టి అంటకుండా తీర్పు ఇవ్వడం కాదు. 1860నాటి భారత శిక్షాస్మృతిలో.. 15-18ఏళ్ల లోపు భార్యతో కలయిక అత్యాచారం కిందకు రాదని వుంది. దానిని ఎవడో ఇండిపెండెంట్ థాట్ అనే ఎన్జీవో సవాలు చేసింది. ఆడపిల్లలకు అన్ని విషయాల్లో 18 ఏళ్లు అనేది ప్రామాణికం అయినప్పుడు లైంగిక చర్య విషయంలో.. భార్య విషయంలో ఈ మినహాయింపు వుండడం గురించి పిటిషన్ వేసింది ఆ సంస్థ. కేసు పరిధిలో వున్న అంశం వరకే తీర్పు ఇచ్చి.. చేతులు దులుపుకోవడం కాదు. బాల్య వివాహంగా పరిగణించడానికి చట్టం వుంది. పురుషుడికి 21 సంవత్సరాలు, స్త్రీకి 18 సంవత్సరాలు. ఈ వయసు లోపు వివాహాలు బాల్య వివాహాల కింద లెక్క. ఈ ప్రమాణాలకు విరుద్ధమైన ప్రతి వివాహాన్ని రద్దయిన వివాహంగా న్యాయస్థానాలు సూమోటోగా ప్రకటించవచ్చు కదా! ఆ పని చేయవు. అసలు ప్యూబర్టీ, గర్భధారణ వయసు.. ఇత్యాది విషయాల్లో WHO నివేదికలు ఏం చెబుతున్నాయో పరిగణనలోకి తీసుకున్నారా? పౌష్టికాహారం, జీవన విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా లైంగిక జీవన విధానంలో వచ్చిన మార్పుల విషయం పరిగణనలోకి తీసుకున్నారా? అది బాల్య వివాహమో, వయోజన వివాహమో.. మరొకటో.. భార్యాభర్తల లైంగిక జీవితంలోకి టీవీ నైన్ లాగా రోతగా తొంగిచూసి తీర్పులిచ్చే అధికారం సుప్రీంకోర్టుకి ఎలా దఖలుపడింది? పద్దెనిమిది ఏళ్లలోపు యువతి ఐచ్ఛికంగా, ఇష్టపూర్వకంగా తన భర్తతో లైంగిక చర్యలో పాల్గొంటే.. భర్త చేసినది అత్యాచారం అనే ముద్రవేసి, కేసు నమోదు చేసి, బొక్కలో తోసే సర్వోన్నత అధికారం సుప్రీంకోర్టుకి ఎలా దఖలుపడింది?. ఇకనుంచి శోభనాలకు న్యాయస్థానాలనుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలా? వయోజన వయస్సుకి సంబంధించి ఈ ఒక్కదానికీ ఈ మినహాయింపు ఏమిటని ఏదో దిక్కుమాలిన స్వచ్ఛంద సంస్థ మిమ్మల్ని అడిగింది. సర్వోన్నతులైన మీరు మీ మకిలి బుర్రలను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించి అద్భుతమైన, చారిత్రకమైన తీర్పు ఇచ్చారు. పిల్లి గుడ్డిదయితే.. ఎలుకలు ఎకసెక్కాలాడతాయని సామెత. ఈ భారతదేశంలోని నూటా పాతికకోట్ల మందీ గుడ్డి జనాభా అని మీకు గట్టి నమ్మకం. అందుకే ఇలాంటి తీర్పులు ఇవ్వగలుగుతున్నారు. మి లార్డ్.. ఆ గబ్బిలాల కోట్లు వదిలేసి ఆలోచించండి. ఇంత చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన మీ దగ్గరకే.. అదే గబ్బిలాల గబ్బుకంపుతో, అదే స్వచ్ఛంద సంస్థ ఇంకో పిటిషన్ వేస్తుంది. ఆనందంగా స్వీకరించండి. సార్వజనీన వయోజన వయసు స్త్రీలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు. అన్ని విషయాల్లోనూ ఈ సూత్రం అమలు అవుతోంది. ఆ ఒక్క విషయంలోనే కదా మీ తీర్పు... కానీ ఓటు హక్కు విషయంలో అమలు కావడంలేదు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 సంవత్సరాలనుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. పురుషుడికి అన్ని వయోజన హక్కులు 21 సంవత్సరాలకు వస్తాయి. కానీ ఓటు హక్కు 18 ఏళ్లకే వస్తుంది. ఈ విషయాన్ని కొచెన్ చేస్తే కూడా ఇలాంటి తీర్పులే వస్తాయా?. ఆపండిక.. ఈ బ్యాండ్ మేళం తీర్పులు... సెడ్డ సిరాకేస్తోంది... ఈ చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన బ్యాండు మేళంలో కనీసం ఒక్కరంటే ఒక్కరు మహిళా జడ్జి వుండి వుంటే.. మినిమం 50 శాతం వివాహాలు బాల్యవివాహాలు అందులో చాల వరకూ ఆ పిల్ల ఇష్టాలతో ప్రమేయం లేకుండా జరిపేవి. అదెంత నరకమో మగవాళ్ళు మీకెలా తెలుస్తుంది ... ఆ పసిపిల్ల లతో మాట్లాడితే తెలుస్తుంది. ఎంతో మంది బాల్యవివాహాలు చేసుకున్న పిల్లలని కలిసాం ఓ ngo లో వర్క్ చేస్తున్నప్పుడు. కళ్ళలో నీళ్లు ఆగవు. మనిషిగా పుట్టినందుకు ఒక్కక్షణం అసహ్యం వేసి చచ్చిపోవాలి అనిపిస్తుంది. సామాజిక కోణాలు ఆర్ధిక కోణాలు తొక్కా తోలూ అంటూ సమర్ధించే ప్రయ్నతాలు చేయడం కాదు పెంచే స్థోమత లేనప్పుడు ఎందుకు కనడం పందులూ కంటాయి వాటికీ మనకీ తేడాలేదూ. ..మగపిల్లల కోసం హిందువుల్లో. అల్లాహ్ శపిస్తాడు అని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే అని ముస్లిం లూ సంతానం పెంచుకుంటూ పోవడం . తర్వాత పోషించే స్తోమత లేక ..వదిలించుకోడం. ఎలా సమర్ధిస్తాం ఇంత చెత్తని .ఇలాంటి తీర్పులు ఆలోచింపచేస్తాయి. మెంటల్ గా అలోచించి ..నిర్ణయాలు తీసుకునే వయసూ 18 ఏళ్ళకి వస్తుంది కనుక ఓటు హక్కు ,, పెళ్లి చేసుకొని ఆ తర్వాత పిల్లనీ సంరక్షించుకునే వయసూ వారిని చూసుకొని శారీరక శక్తి 21 ఏళ్ళకి వస్తుంది కనుక అలా రెండూ ఒకటే ఎందుకుండాలి. మార్పు కోసం జరిగే ప్రక్రియలో ఇలాంటివి అన్నీ ఉపయోగపడతాయి. ఇష్టప్రకారం జరిగితే ఆమె కోర్ట్ కి వెళ్ళదు కదా ..అలా జరగనప్పుడు భరించలేనప్పుడు ఎవరి సహాయంతో నైనా కోర్ట్ గడప తొక్కి బయటపడాలి అనుకున్నప్పుడు ..ఇలాంటి తీర్పులు ఆమెకి సహాయపడతాయి. ఆమె ఇష్టాయిష్టాలతో సంభధం లేకుండా పసిపిల్లను రమిచ్చేవాడు బతికినా చచ్చిన శవంతో సమానం ఆలాంటి వెధవలు నుండీ ఆమె కి రక్షణ అక్కర్లేదా ?.అంటారు. అది ఒక సామాజిక సమస్య మీద కేసు కాదు. అది ఒక సామాజిక సమస్యమీద బాధ్యతాయుత తీర్పు కాదు. కేవలం టెక్నికల్ కేసు. అన్ని విషయాల్లో స్త్రీల వయోజన వయసు 18 అయినప్పుడు.. ఆ ఒక్క విషయంలో 15-18 మినహాయింపు ఎందుకనే టెక్నికల్ అంశంపై కేసు. అసలు బాల్య వివాహమే చట్టవిరుద్ధం. బాల్యవివాహం కోర్టు దృష్టికి వచ్చినప్పుడు శిక్షలు వేయడం కాదు. ఆ వివాహాన్నే రద్దు చేయాలి.వివాహాాన్ని రద్దు చేయకుండా ఈ శిక్షలు ఏమిటి? వివాహం రద్దు కానంతవరకూ బాల్య వివాహాలు జరుగుతూనే వుంటాయి. మీరన్నట్టు 50 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు.. సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులు వాస్తవ పరిస్థితికి అనుగుణంగా, బాధ్యతాయుతంగా వుండాలి. పురుషుడినైన నా వయసు 18 ఏళ్లు... :P నేనొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ.. అది బాల్య వివాహం కింద లెక్కగట్టి.. పోలీసు స్టేషనులో రెండు చెంపలు వాయించి ఇంటికి పంపారు. పెళ్లయితే అయింది కానీ.. ఒక అచ్చటా ముచ్చటా లేకుండా.. 21వ ఏడాది వచ్చేదాకా ఎదురుచూపులతోనే సరిపోయింది.. ఈలోగా మా ఊళ్లో జమిలి ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యే ఎన్నిక, ఎంపీ ఎన్నికలు. పద్దెనిమిదేళ్ల పోరగాడినైన నాకు ఓటు హక్కు కూడా వచ్చింది. ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని ప్రత్యక్ష పద్ధతిలో.. తద్వారా ఒక రాష్ట్రపతిని, రాజ్యసభ సభ్యులను పరోక్షంగా గెలిపించుకునే అవకాశం నాకు పద్దెనిమిదేళ్ల పోరగాడిగా వున్నప్పుడే వచ్చింది. కానీ.. నా భార్యతో సంసారం చేసే అవకాశం మాత్రం దక్కలేదు. ఎందుకంటే నేను మైనర్ని. 21 ఏళ్లు రాకుండా పెళ్లే చేసుకోకూడదు. ఏదో దొంగచాటు పెళ్లి చేసుకున్నాం. కానీ 21 ఏళ్లు రాకుండా కాపురం చేయకూడదు. అది మన చట్టాలకు విరుద్ధం. మన దేశాన్నేలే ఎమ్మెల్యేలు, ఎంపీలను, మనకోసం చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలను మనం 18 ఏళ్లకే ఎన్నుకోవచ్చు. కానీ మనం గుట్టుగా సంసారం చేసుకోవడానికి 21ఏళ్లు రావాలి. మనకు ఓటు హక్కు వుంటుంది కానీ లైంగిక హక్కులు వుండవు. సామాజిక అభ్యుదయ సంస్థలకు ధిమాక్ ఖరాబ్ అయిందా? నేను.. 18 ఏళ్లకు వయోజన ఓటరుగా నా ఎమ్మెల్యేని, నా ఎంపీని.. నా దేశ నాయకుడిని ఓటు వేసి ఎన్నుకుంటున్నాను. కానీ.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25ఏళ్ల వయసు మినిమం వుండాలి. ఎంపీగా పోటీ చేసే వాడికి మినిమం 30 ఏళ్లు వుండాలి. ఈ వైరుధ్యాలేమీ మనకు కనిపించవా? దిమాఖ్ ఖరాబ్ స్వచ్ఛంద సంస్థలకు కొంత ఇంగితం వుండాలి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అవడానికి వుండాల్సిన కనీస వయసుతో పోల్చినప్పుడు.. ఓటేయడానికి వుండే వాడి కనీస వయసు ఎంత వుండాలి? ఇవన్నీ మనకు ఓకే.. యాక్సెప్టెడ్... స్త్రీజనోద్ధరణ పేరిట.. మరిన్ని క్రూర చట్టాలను మా మీద రుద్దమాకండి. మేము బాగానే వున్నాం. మమ్మల్ని బాగా వుండనివ్వండి. విన్ స్టన్ చర్చిల్ ఊరికే అనలేదు.. వీళ్లకు సొతంత్రం ఇస్తే వీళ్లను వీళ్లు పాలించుకోలేరు అని .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...