8, అక్టోబర్ 2017, ఆదివారం

JAC జె.ఎ.సి

JAC జె.ఎ.సి
ప్రజలు నమ్మింది కేసీఆర్ నె కల కనంగనే అన్ని తెల్లారి లేవంగనే అన్నీ కావు టైం పడ్తది. సబ్బన్న వర్గాలు పాల్గొన్న మాట వాస్థవమే వాల్లని కెసీఆర్ తట్టి లేపింది అంతే నిజం . ఆ వాస్థవాలు ఎలా ఉంటయ్ ? 2001 మలిదశ ఉద్యమం ఎందుకుమోదలయ్యింది ! కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కడుగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఎందుకు స్థాపించిండు ? అప్పటికి తనకున్న mla పదవి కి రాజీనామాని ఆంద్రా పాలకుల మొకంపై అంత ధైర్యంగా ఎలా విసరగలిగిండు ? ఏమటి ఆయన ధైర్యం !? జనం తనవెంటే నడుస్తారని ఏమిటి ఈ తెలంగాణ ప్రజలపై ఆయనకు అంత గట్టినమ్మకం? పలుసార్లు రాజనామ చేసిన ప్రతీచోట మల్లీ మల్లీ ఆయనే తిరిగి గెలిచి ఉండక పోతె ? తెలంగాణ వాదం బలపడేదా ? నిలబడేదా ? బునాదినండి పార్టీని ఉద్యామాన్ని సమాంతరంగా ఒక్కొక్క ఇటుక పెర్చిన ఘనుడు ఎవ్వడు !? అయన ఉద్యమ సమయమంతా సాహస వంతమైన ఎత్తుగలతో సాగించిన మాట నిజంకాదా !? ఆయనకు ప్రతీ సారి ప్రతి ఎత్తుగడకు ప్రజలు సహరించిన మాట అబద్దమా !? సిద్దిపేట నుండి మోదలైన ఎత్తుల చదరంగంలొ కరీంనగర్ పాలమూరుకు విస్తరించింది అన్నింటా విజయాాలు సాదించి దేశానికి తెలంగాణ ఉద్యమం ఆకర్షింప జెసన విదానం అబద్దమా !? ప్రజల్ని చైతన్యం నింపిన అనేక బారీ బహిరంగ సభలు సమావేశాలు ఉద్యమ నాయకుని తూటాల్లాంటి మాటలు ఫిరంగులై గర్జించిన నినాదాలు అబద్దమా !? ఇవన్ని కేవలం తేరాస చెసిన పొరాటాలే కాదనగలమా !? పల్లే బాటలతో గ్రామ గ్రామాన తెలంగాణ వాదాన్ని తెరాసజండాల్ని పరిచయం చెసిన సమయంలో మరే ఇతర నాయకుడు పార్టీ సంఘం సహకారం పెద్దగా లేదన్నది నిజంకాదా !? .కేవలం తెరాసా అదినాయకుడు నాయకులు కార్యకర్తలు వీల్ల పున్యమే 2009 వరకు నిర్జీవంగా వాదం నెట్టుకు రావటం అబద్దమా !? పైగా రాజశేఖర్ రెడ్డి కబంద అస్థాలు తెరాసని చీల్చటానికి విశ్వప్రయత్నం చెసినప్పుడు ఏ ప్రతినిది ఏ సంఘం ఉసైనా ఉందా అప్పుడు !? తెరాస కేసీఆర్ రెండు జయశంకర్ సార్ బావజాల ఎత్తుగడలు పున్యం కాదనగలరా !? ఆయన నడిపించిన నావ తెరాస . ఆయన నమ్మన ఆ నావకు కెప్టన్ కేసీఆర్ ఇది తెలియని అమాయకులా మీరు !? ఇది 2009 తర్వాత చరిత్ర ! కేసీఆర్ దీక్షకు పునుకున్నప్పుడు మునుపుటికన్న వెయ్యిరెట్ల మొండితనం ప్రదర్షించింది కరక్ట్ కాదా !? అప్పటికే కేసీఆర్ ఆయా సమయాలలో పొల్టికల్ పార్టీలను చక్రబందంలో ఉంచిఉండటం తెలియని అమాయకులా మీరు !? అఖిలపక్షం మీటింగిలో మెజార్టీ పార్టీలు తెలంగాణకు సపొర్టే అని లేఖలు కూడా ఇచ్చెలా ఒత్తిడి నింపిన ఘనత నీదా కేసీఆర్ దా !? ప్రకటన వచ్చింది కెసీఆర్ సేఫ్ ఎడున్నవ్ నీవు? తదనంతరం కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొవటానికి సబన్న వర్గాలు సంఘాలుగా jac లు గా ఎర్పడ్డయ్ ! అందులో ఒకటి పొల్టికల్ జాక్ అవునా కాదా సారు ? అప్పటి ప్రతి jac లక్ష్యం తెలంగాణ సాదించిటం తెల్వదానీకు !? అందులో నీ పొల్టికల్ jac పాత్ర గొప్పదే కాదనం. ఆ పాత్ర నిర్వాహన పూర్తి బారం కేసీఆర్ trs పార్టీల పున్యమే కద సారు !? అన్ని పార్టీలు jac నుండి వెల్లిపొయినా తెరాస నిలబడింది ఎందుకంటే దాని లక్ష్యం తెలంగాణ రాష్ట్రం గుర్తుకు లేదా !? 32 జాతీయ్య పార్టీల ఆఫీసల చూట్టు తిరిగి తిరిగి తెలంగాణకు అనుకులంగ లేఖలు తెచ్చిన ఘనత తెరాసదా నీదా !? తెలంగాణ రాష్టం కొసరం అమరులైన 90% మంది తెరసా కార్యకర్తలు నాయకులే తెల్వనిదా నీకు!? డిల్లీ మెడలు వంచింది తెరాస నాయకుల లాబియింగ్ పున్యమే జనం ఎరగనిదా విషయం!? హైద్రాబాద్ రాయల తెలంగాణ పేచీలపై గట్టిగా ఎదుర్కొన్నది తెరాస నాయకత్వమే చెప్పాల్నా విప్పి !? చివరి దశలో బిల్లు ఆగకుండా ఆహోరాత్రులు శ్రమించింది కేసీఆర్ ఒక్కడే .రెండు సభలల్లో బిల్ పాస్ అవ్వగానే ఎగిరింది ఆడింది గెలింది తెరాస జండాలే ...... సబన్న వర్గాలే రాష్టం వచ్చిన తొలిఎన్నికల్లొ గెలిచింది నిలిచింది తెరాసనే //ప్రజలు నమ్మింది కేసీఆర్ నె // కొదండరాంగారు jacగా ఈద్యమ పార్టి తెరాసకు మద్దతన్న ఇవ్వవైతివి !? పైగా వ్యతిరేకంగనే పనిచెస్తివి ? ఆపినవా విజయాన్ని? తెరాస ఉద్యమ నెపద్యం నుండి రాజకీయ పార్టీగా అవతరిస్తున్నఅని చెప్పిమరీ ఎన్నికలకు పొయిన దమ్ము దైర్యం ఉన్న పార్టీ తెరాస !? మరి మనుగడలనే ఉండాలనుకునే jac కతెంది? పార్టి పెడ్తవా ఆలా పొక్కలు తొడుతునే ఉంటవా !? తన పుట్టుకకు కారనమైన తల్లి తండ్రి స్థానాన్నే ప్రశ్నస్తుంది నీవు ! సొంత గూటికే నిప్పుపట్టే పైత్యపు పనులకు నిత్యం చెస్తునే ఉంది నివ్వు !? ఏమిటీ నీ గొప్పతనం ఎందుకు ఈ దరిద్రం అవసరమా ఈ సమాజానికి ? సంసారంలో బిడ్డపుడుతే తల్లిదండ్రుల గొప్పతనం ఐతదికాని బిడ్డగొప్పతనం కాదు ప్రొఫెసర్ !? ఇప్పటికైన మీ స్థాయినెరిగి ఆకాశంవీడి నెలపై నడవండి మీ గుర్తింపు మీకు తప్పక ఉంటుంది ప్రజల దృష్టిలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...