10, అక్టోబర్ 2017, మంగళవారం
Exercise వ్యాయామం
Exercise వ్యాయామం
*"లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజీవ్. ఆ డాక్టర్ అదో టైపు.*
.
*సంజీవ్* :- సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?
.
*డాక్టర్:*- ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే !!
.
*సంజీవ్:*- వేపుళ్ళు మంచివి కావంటుంటారు..
.
*డాక్టర్:*- ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?
.
*సంజీవ్:*- వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.
.
*డాక్టర్:*- అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు?
*సంజీవ్:*- పోనీ మద్యం మానేయాలంటారా?
*డాక్టర్:*- ఎవరయ్యా నీ బుర్ర పాడు చేసింది? వైన్ వచ్చేది పళ్ళ నుంచి కాదా ? బీరు బార్లీ నుంచే కదా! దర్జాగా తాగు. పళ్ళు తిన్నంత ఆరోగ్యం.
*సంజీవ్:*- మరి ఐస్‌క్రీమ్‌స్, చాక్‌లెట్లు..
*డాక్టర్:*- లాభం లేదయ్యా! నేను చెప్పేది నీకు అర్ధం కావట్ళేదు. అవీ పాలు, కూరగాయల బై ప్రోడక్ట్సే కదా!
*సంజీవ్:*- వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బ్రతుకుతారంటారు. నిజమేనా?
*డాక్టర్:*-ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుస్షు ఎలాపెరుగుతుందయ్యా.ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువ కాలం ఉంటుందన్నట్లుంది !!
*సంజీవ్:*- అది కాదు. సిట్ అప్స్ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు ..
*డాక్టర్:*- చూడు.. వ్యాయామం చేయిస్తే చేతికండరాలు పెరుగుతాయి కదా. అలాంటాప్పుడు సిట్ అప్స్ చేస్తే పొట్ట పెరగదా? కోరి కోరి లావు అవుతానంటావేమయ్యా!
*సంజీవ్:*- పోనీ మంచి ఫిగర్ కోసం ఈత కొట్టొచ్చా?
.
*డాక్టర్:*- ఈత కొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం. అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు?
.
*సంజీవ్:*- మరి బాడీకి ఓ షేప్ ఎలా వస్తుందో చెప్పండి?
.
*డాక్టర్:*- రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది?
.
*సంజీవ్:*- ???????😃😃 ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...
-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
తెలంగాణ చరిత్ర వికీపీడియా నుండి తెలంగాణ - Telangana రాజముద్ర శ్రీశైలం, కాళేశ్వరం, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగంను కాకతీయులు ప...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి