11, అక్టోబర్ 2017, బుధవారం

Color కలర్ Chemical కెమికల్

ఏంటన్నయ్యా.. తలకు వుండాల్సిన రంగు మొహానికి, మొహానికి వుండాల్సిన రంగు తలకు వచ్చింది ఒకరి చాలా విలువైన కామెంటు. .....
మొన్నామధ్య టీవీ చూస్తున్నప్పుడు.. చిక్ ఎగ్ షాంపూ అనే ప్రకటన చూశాను. MNC కార్పొరేట్ సంస్థ ప్రకటన. .... అరవైలలో పుట్టి, ఎనభైలలో యంగేజ్ లోకి ప్రవేశించిన వాళ్లకు చిక్ షాంపూ సుపరిచితం. తమిళ సినిమాల్లాగే.. తమిళ తీరపు ఇన్నోవేటివ్ ఉత్పత్తులు కొన్ని వుంటాయి. అందులో చిక్ ఎగ్ షాంపూ ఒకటి. అంగుళం పరిమాణంలో వుంటుంది. నాటి యువతరపు తలంటు సాధనం. అప్పటిదాకా షాంపూ అనేది ఎగువ మధ్యతరగతి వినియోగ వస్తువు. ఏ రెండొందలో మూడొందలో పెడితే కానీ ఓ డబ్బాడు షాంపూ వుండేది కాదు. పూర్తిగా సంపన్నవర్గపు వినియోగ వస్తువుగా వుండేది. చిక్ షాంపూ వచ్చాక పరిస్థితి తారుమారయింది. కూలినాలి జనంకూడా చిక్ షాంపూతో తలంటుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత.. మల్టీ నేషనల్ కంపెనీలు భారతీయ రూరల్ మార్కెట్ పై దృష్టి సారించాయి. పావలాకు, పది పైసలకు షాంపూలు అమ్మడం మొదలెట్టాయి. సర్ఫ్... సర్ఫ్ అనేది బ్రాండ్ పేరు. కానీ ఒక డిటర్జెంట్ పౌడర్ పేరు జనం మదిలో సర్ఫ్ అయిపోయింది. సర్ఫతో బట్టలు ఉతుక్కోవడం అనేది ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలు మాత్రమే చేసుకోగల ఖరీదైన పని. నిర్మా వచ్చాక.. ఆ పటాటోపాలన్నీ మాయం అయ్యాయి. ఒక డిటర్జంట్ వాషింగ్.. ఒక కెమికల్ క్లీనింగ్ తో మనం మన తలలు, ఒళ్లు, గుడ్డలు ఉతుక్కోవడం చాలా ఖర్చుతక్కువ వ్యవహారంగా మారింది. చాలా ఈజీ ప్రాసెస్ గా మారిపోయింది. ... మనం.. కెమికల్ ప్రాసెస్ అయిన ఆహార పదార్ధాల గురించి, వాటివల్ల వచ్చే అనర్ధాల గురించి బోలెడంత గాబరా పడుతుంటాం. కానీ.. నిత్యం మనం కెమికల్ ప్రాసెస్ లో వుంటాం. ద్రాక్షపళ్లను రసాయనాల్లో ముంచి తీస్తారట అని బోలెడ్ హాచ్చర్యపోతాం. కానీ.. మనను మనం నిరంతరం రసాయనాల్లో ముంచెత్తుకోవడం మర్చిపోతాం. కనీసం ఏడాదికోసారైనా కుంకుడురసం స్నానం చేయం, సునిపిండితో ఒళ్లు రుద్దుకోం. కుంకుడురసం.. మనకొక విష రసాయనం. ..... వ్యక్తిగతంగా నేను పాతికేళ్ల క్రితం చిక్ షాంపూని.. దేవుడిచ్చిన వరం అనుకున్నాను. కుంకుడుకాయలతో తలంటుకుని, కళ్లు మంటలు మండే దరిద్రం తప్పింది. గడచిన పాతికేళ్లలో తలకు చమురు రాయడం కూడా మానేశాను. తలకు చమురు రాయడం అనాగరికం. అన్ సైంటిఫిక్ అయిపోయింది. మనం సైన్సుని ఫాలో అవ్వాలి కదా! ... నేనివాళ పొద్దున్నే ఎంచగ్గా రెండు ఇడ్డెన్లు తిన్నాను అని చెప్పుకోలేకపోతున్నాను. ఫలానా బ్రాండ్ హోటల్లో తిన్నానని మాత్రమే చెప్పుకోగలుగుతున్నాను. ... మొన్నామధ్య వానల్లో.. వాహనం మోకాలులోతు దిగింది. ఆగిపోయింది. ఎలాగోలా స్టార్ట్ అయింది. కానీ బ్రేకులు వేసినా వేయకపోయినా కర్రుకర్రుమని సౌండ్ వస్తోంది. ముదిమి వయసుకు చేరకుండానే వస్తున్న మోకాళ్ల, కీళ్ల నొప్పుల సౌండ్ వినిపించింది. టీవీ చానళ్లలో మధ్యాహ్నం వినిపించే రణగొణ డాక్టర్ల సొద కనిపించింది. ... మనిషి.. యంత్రంకంటే గొప్ప. యంత్రానికి కందెన తైలాలు (Lubricants అంటారు) ఎంత ముఖ్యమో.. మనిషికి కందెన తైలాలు అంతకన్నా ముఖ్యం. నూనె వాడండి. నెయ్యి వాడండి. వెన్న వాడండి. ఆముదం వాడండి... వాడితే పోయేదేమీ లేదు.. మీ అనారోగ్యం తప్ప..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...